ఇటలీలో రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రాల వివాహం! | Rani Mukherji, Aditya Chopra exchanged vows in a "beautiful" ceremony in Italy | Sakshi
Sakshi News home page

ఇటలీలో రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రాల వివాహం!

Published Tue, Apr 22 2014 12:26 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

ఇటలీలో రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రాల వివాహం!

ఇటలీలో రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రాల వివాహం!

ఇటలీలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ, ప్రముఖ దర్శకుడు, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాల వివాహం నిరాడంబరంగా జరిగింది. రాణి, ఆదిత్యల వివాహానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. గత కొద్దికాలంగా తమ మధ్య ఉన్న సంబంధాన్ని రాణీ, ఆదిత్యలు గోప్యంగా ఉంచారు. 
 
'ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అని రాణీ ముఖర్జీ అన్నారు. అయితే ఇలాంటి ఆనంద సమయంలో తన మామ యాష్ చోప్రా లేకపోవడం విచారంగా ఉందన్నారు. ఐనా తమకు యష్ అంకుల్ దీవెనలుంటాయి' రాణి ఓ ప్రకటనలో తెలిపారు. 
 
వివాహం తన జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటన అని రాణి అన్నారు. రాజ్ కి ఆయేగి బరాత్ తో బాలీవుడ్ లో ప్రవేశించిన రాణి ముఖర్జీ గులాం, కుచ్ కుచ్ హోతా హై, బంటీ ఔర్ బబ్లీ, కభీ అల్విదా నా కెహ్నా చిత్రాల్లో నటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement