హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. వైరలవుతోన్న పోస్ట్! | Parineeti Chopra Post Goes Viral On Her Pregnancy Rrumours | Sakshi
Sakshi News home page

Parineeti Chopra: అంత మాత్రాన ప్రెగ్నెన్సీతో ఉన్నట్టా?.. పరిణీతి పోస్ట్ వైరల్!

Mar 28 2024 5:00 PM | Updated on Mar 28 2024 5:27 PM

Parineeti Chopra Post Goes Viral On Her Pregnancy Rrumours - Sakshi

బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ప్రస్తుతం చమ్కీలా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్జీత్‌ దోసాంజ్‌కు జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  అమర్ సింగ్ బయోపిక్‌గా తెరకెక్కించిన ఈ సినిమాతో అభిమానులను పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆప్‌ లీడర్ రాఘవ్‌ చద్ధాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. 

(ఇది చదవండి: ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ..!)

అయితే ఇటీవల పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్‌ వినిపించాయి. ఎయిర్‌పోర్ట్‌లో వైట్ కలర్ అవుట్‌ఫిట్‌లో కనిపించడంతో నెటిజన్స్‌ అలాంటి కామెంట్స్ చేశారు. తేలికైన దుస్తుల్లో ఎయిర్‌పోర్ట్‌కు రాగా ప్రెగ్నెన్సీ టాపిక్‌ కాస్తా వైరలైంది. తాజాగా ఈ వార్తలపై నటి పరిణీతి స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఎలాంటి డ్రెస్‌ వేసుకున్నా ప్రెగ్నెన్సీతోనే ఉన్నట్లేనా? అంటూ రాసుకొచ్చింది. అందులో తాను ధరించే మూడు రకాల డ్రెస్సులను ప్రస్తావిస్తూ ఫన్నీ ఎమోజీని జత చేసింది. అంటే తాను వేసుకునే డ్రెస్సును చూసి మీరు అలా అనుకుంటే కామెడీగా ఉందంటూ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement