ఈ–సిగరెట్‌తో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ!
సిగరెట్ మానాలనే ఉద్దేశంతో కొందరు ఈ–సిగరెట్ వాడుతుంటారు. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయం ఇప్పటికే పలు అధ్యయనాల్లో తెలిసింది. అంతేకాదు... దాని నుంచి వచ్చే రసాయన ఆవిర్ల వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఎలుకలపై నిర్వహించిన ఈ పరీక్షలో సాధారణ పొగాకుతో ఎన్ని అనర్థాలు వస్తాయో...
ఈ–సిగరెట్‌తో సైతం అన్ని అనర్థాలే ఉంటాయని తేలడంతో పాటు ఈ–సిగరెట్‌లో వెలవడే రసాయనాలు మెదడులోని రక్తనాళాల్లో అడ్డంకులు కలిగిస్తాయని తేలింది. టెక్సాక్–టెక్ యూనివర్సిటీలోని నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం తేటతెల్లమైంది. వారి పరిశోధనల్లో తేలిన అంశాలను హ్యూస్టన్‌లో నిర్వహించిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్‌లో ఇటీవలే పరిశోధకులు వెల్లడించారు.