
అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా సిగరెట్ తాగుతుంటారు. బిగ్‌బాస్ హౌస్‌లోనూ అంతే! ఈ సీజన్‌లో పృథ్వీ, నిఖిల్ దమ్ముకొడుతుంటారు. నాలుగువారాలపాటు చీఫ్‌గా కొనసాగిన నిఖిల్ అయితే ఒత్తిడి తట్టుకోలేక ప్యాకెట్ల మీద ప్యాకెట్లను సునాయాసంగా కాల్చేశాడు. ఈ వ్యసనం నుంచి అతడిని బయటపడేసేందుకు సోనియా బాగానే ప్రయత్నించింది.
అమ్మాయిలు కూడా..
సిగరెట్ మానేస్తే ఏదడిగినా ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ క్లిప్పింగ్ తెగ వైరలయింది. అయితే బయటకు వచ్చిన సోనియా ఈ విషయంపై కాస్త సీరియస్ అయింది. నిఖిల్ సిగరెట్ తాగడాన్నే చూపించారు కానీ హౌస్‌లో చాలామంది తాగుతారు. అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తున్నారు. కానీ, వాళ్లను చూపించట్లేదు. ఒక లేడీ కంటెస్టెంట్ అయితే ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్ తాగుతా అంటే.. నేనే మంచిది కాదని చెప్పి మరీ ఆపేశాను. ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం చెప్పను అనేసింది.

వీడియో వైరల్
అప్పటినుంచి మొదలైంది అసలు రచ్చ.. హౌస్‌లో దమ్ము లాగే లేడీస్ ఎవరబ్బా అని ఆరా తీస్తున్నారు. కిర్రాక్ సీత కావచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇంతలో విష్ణుప్రియ సిగరెట్ తాగిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. విష్ణుప్రియ దమ్ము కొడుతుందని శేఖర్ బాషా సైతం ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అమ్మాయిలు తాగితే తప్పేం లేదని కాకపోతే ఎవరైనా సరే ఈ అలవాటుకు దూరంగా ఉండటమే మంచిదన్నాడు. ఇకపోతే వీడియో చూసిన విష్ణు ఫ్యాన్స్.. ఆమె సిగరెట్ తాగితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
#VishnuPriya smoking 🚬 in the corner 👀?#BiggBossTelugu8 pic.twitter.com/bnW62aYQZ5
— BIG BOSS S8 (@Mrunalqueen) October 8, 2024