
వెన్నెముక గాయంతో శరీరం చచ్చుబడిపోయిన వారికి అమెరికాలోని కాల్‌టెక్ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తీసుకొచ్చారు. మెదడులో ఓ కొన్ని ఎలక్ట్రోడ్‌లు జొప్పించి, వెన్నెముక గాయం కారణంగా పక్షవాతానికి గురైన వ్యక్తి చేతుల్లో కదలికలు తీసుకురాగలిగారు వీరు. భవిష్యత్తులో కృత్రిమ అవయవాలు అమర్చుకున్న వారికీ కొన్ని సెన్సర్ల ద్వారా స్పర్శ తాలూకు అనుభూతిని ఇచ్చేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అంచనా. మూడేళ్ల క్రితం వెన్నెముక గాయం కారణంగా ఓ వ్యక్తి భుజాల కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది.
ఈ వ్యక్తి మెదడులోని సొమాటో సెన్సిరీ కార్టెక్స్ భాగంలోకి కొన్ని ఎలక్ట్రోడ్‌లు జొప్పించారు. విద్యుత్తు ద్వారా ప్రేరణ కలిగించినప్పుడు ఆ ప్రాంతంలోని న్యూరాన్లు చైతన్యవంతమైనట్లు, తద్వారా తనకు గిల్లినట్లు.. తట్టినట్లు ఇలా అనేక రకరకాల అనుభూతులు కలిగినట్లు ఆ రోగి చెప్పారు. ఈ అనుభూతులు ఎలా కలుగుతున్నాయో తెలుసుకోవడం ద్వారా వాటిని నియంత్రించేందుకు, తద్వారా పక్షవాతం వచ్చిన వారిలోనూ కదలికలు తీసుకు రావచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment