తమ్ముడి చేతిలో అన్న హతం | To be, the decimation | Sakshi
Sakshi News home page

తమ్ముడి చేతిలో అన్న హతం

Published Fri, Jun 20 2014 12:37 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

తమ్ముడి చేతిలో అన్న హతం - Sakshi

తమ్ముడి చేతిలో అన్న హతం

వేధిస్తున్నాడని దారుణం
 
పహాడీషరీఫ్: తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్న అన్నను దారుణంగా హత్య చేశాడో యువకుడు. పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం...వెంకటాపూర్ ఫాతీమా కాలనీకి చెందిన అహ్మద్ ఖాన్ (29)  క్యాబ్  డ్రైవర్. ఇతనికి భార్య కతీజాబేగం,  ఇషాఖాన్, జ్యోత్స్న బేగం ఇద్దరు సంతానం. భార్యతో వివాదం తలెత్తడంతో ఎనిమిది నెలల క్రితం విడాకులిచ్చి, పిల్లలను కూడా ఆమె వెంటే పంపేశాడు. అప్పటి నుంచి తాగుడుకు బానిసైన అహ్మద్ ఖాన్ ఏ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బుల కోసం తల్లిదండ్రులను, సోదరుడిని వేధించసాగాడు.

బుధవారం రాత్రి చిత్తుగా తాగొచ్చిన అహ్మద్‌ఖాన్ తనకు రూ.లక్ష ఇవ్వాలని, సౌదీ వెళ్తానంటూ పక్షవాతంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను కొట్టాడు. ఇది గమనించిన తమ్ముడు అజ్మత్‌ఖాన్ (27) నిత్యం కుటుంబసభ్యులను వేధిస్తున్న అన్నను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.  శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో నిద్రిస్తున్న అన్న అహ్మద్‌ఖాన్ తలపై రెండు బండరాళ్లు వేసి హత్య చేశాడు.  గురువారం ఉదయం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ డి.భాస్కర్ రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement