ahmed khan
-
ఈ స్టార్ హీరో డబ్బు కోసం పని చేయడు: కొరియోగ్రాఫర్
చెప్పిన సమయానికల్లా రెడీ అయి ఉండటం కొందరికే సాధ్యమవుతుంది. కానీ ఓ హీరో చెప్పిన టైం కంటే అరగంటే ముందే సిద్ధంగా ఉంటాడని చెప్తున్నాడు కొరియోగ్రాఫర్, నిర్మాత అహ్మద్ ఖాన్. ఇంతకీ సమయపాలకు మారుపేరుగా నిలిచిన హీరో మరెవరో కాదు ఖిలాడీ అక్షయ్ కుమార్. తనకు పని చేయడమే తెలుసని, బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి పెద్దగా పట్టించుకోడని చెప్తున్నాడు.డబ్బు వెంట పరిగెత్తడుఅహ్మద్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అక్షయ్ ఎన్ని సినిమాలు చేస్తున్నాడో చూడండి. డబ్బు అవసరమై ఆయన పని చేస్తున్నారా? ఆయనకు డబ్బు వెంట పరిగెత్తాల్సిన అవసరం ఉందా? అయినా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? తనెప్పుడూ ఒక మాట అంటుంటాడు. మన చేతిదాకా వచ్చిన పనిని వదిలేయొద్దు. ఇదే చివరి అవకాశం అనుకుని చేస్తూ పోవాలి. అందుకోసం ఎంతైనా కష్టపడాలి అని చెప్తుంటాడు.దాని గురించి మాట్లాడడుచేసే పనిని చాలా గౌరవిస్తాడు. సినిమా కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆలోచిస్తాడే తప్ప కలెక్షన్స్ రాలేదేంటని ఎక్కువగా దిగులు చెందడు. ఫెయిల్యూర్స్ గురించి ఎవరితోనూ పంచుకోడు. కానీ సెట్లో ఉదయం 7 గంటలకల్లా ఉండాలంటే ఆరున్నరకే ఉండేవాడు. మేము ఆలస్యంగా వెళ్లినా సరే మాపై కోప్పడేవాడు కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా అక్షయ్ కుమార్ చివరగా బడే మియా చోటే మియా సినిమాలో నటించాడు. తను నటించిన సర్ఫిర (ఇది సూరరై పోట్రుకు రీమేక్‌గా తెరకెక్కింది) జూలై 12న విడుదల కానుంది. చదవండి: ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా? -
బైడెన్‌కు వ్యతిరేకంగా మరోవార్త!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడెన్ పాకిస్థాన్ మద్దతుదారుడని, పర్యవసానంగా భారత్‌కు ప్రత్యర్థి అంటూ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతిచ్చిన అమెరికన్ భారతీయులు తెగ ప్రచారం చేశారు. వాస్తవానికి ఆయన భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కు సానుకూలంగా ఎప్పుడు మాట్లాడలేదు. కశ్మీర్ ప్రాంతం ప్రజల విషయంలో తమ వైఖరి ఏమిటని చర్చాగోష్ఠుల సందర్భంగా ప్రశ్నించినప్పుడు తాను కశ్మీర్ ప్రజల పక్షమని మాత్రమే చెప్పారు. అలాగే ఇప్పుడు బైడెన్‌కు వ్యతిరేకంగా మరోవార్త ట్విటర్, ఫేస్బుక్లో చెలామణి అవుతోంది. భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన అహ్మద్‌ఖాన్‌ను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ తన రాజకీయ సలహాదారుడిగా నియమించారంటూ బైడెన్ దంపతులతో అహ్మద్‌ఖాన్ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరలవుతోంది. అహ్మద్ ఖాన్ చికాగోకు చెందిన అమెరికన్. ఆయన ఎప్పటి నుంచో బైడెన్ దగ్గర పలు హోదాల్లో పనిచేశారు. ఇలినాయి స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డ్రాఫ్ట్ బైడెన్‌గా పనిచేశారు. బైడెన్ దేశాధ్యక్షుడిగా విజయం సాధించిన నేపథ్యంలో అహ్మద్ ఖాన్ బైడెన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో దిగిన ఫొటోను తన బంధుమిత్రులకు ట్వీట్ చేశారు. ఆయన తన మేనమామ వరుసయిన అమ్జెద్ ఉల్లాహ్ ఖాన్‌కు కూడా ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని మజ్లీస్ బచావోకు ఉల్లాహ్ ఖాన్ అధికార ప్రతినిధి. బైడెన్ రాజకీయ సలహాదారుడిగా ఎంపికైనట్టు తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్న విషయం అహ్మద్ ఖాన్ దృష్టికి కూడా వెళ్లడంతో అలాంటిదేమీ లేదంటూ ఆయన ఖండించారు. చదవండి: నేనే గెలిచా.. ఓటమిని అంగీకరించేది లేదన్న ట్రంప్ -
‘పుల్వామా’ సూత్రధారి హతం
శ్రీనగర్: పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది ముదాసిర్ అహ్మద్ ఖాన్‌ను భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో సోమవారం మట్టుపెట్టాయి. ఈ ఘటనలో మరణించిన మరో ఉగ్రవాదిని పుల్వామా దాడిలో వాడిన మినీ వ్యానును కొనుగోలు చేసిన సజ్జద్ భట్ అని భావిస్తున్నారు. పుల్వామా జిల్లా పింగ్లిష్‌లో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఎన్కౌంటర్ సోమవారం వేకువజాము వరకు సాగింది. ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లో లభ్యమైన సామగ్రి, ఆధారాల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అందజేస్తామని కశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుదీర్ఘ ఎన్కౌంటర్.. పింగ్లిష్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం నుంచే భద్రతా బలగాలు అక్కడ సోదాలు ముమ్మరం చేశాయి. తొలుత ముష్కరులు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుదీర్ఘంగా కొనసాగిన ఎన్కౌంటర్ ముగిసిన తరువాత సంఘటనా స్థలంలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు. అందులో ఒకరు పుల్వామా మాస్టర్‌మైండ్ ముదాసిర్ అహ్మద్ ఖాన్ కాగా, రెండో వ్యక్తి వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. అతడిని పుల్వామా దాడికి 10 రోజుల ముందే, ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన సజ్జద్ భట్‌గా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో ఉగ్రవాదిగా భావిస్తున్న సజ్జద్ భట్ వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని, అతడు పాకిస్తానీయుడు అని భావిస్తున్నట్లు కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పాణి చెప్పారు. ఎలక్ట్రీ్టషియన్ నుంచి ఉగ్రవాదిగా పుల్వామా నివాసి అయిన 23 ఏళ్ల ముదాసిర్ అహ్మద్ ఖాన్ డిగ్రీ పూర్తిచేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. 2017లో జైషేలో సాధారణ కార్యకర్తగా చేరి తరువాత నూర్ మహ్మద్ తంత్రాయ్ ప్రేరణతో ఉగ్రవాదిగా మారాడు. అదే ఏడాది డిసెంబర్లో తంత్రాయ్ హతమయ్యాక 2018 జనవరిలో ఇంటి నుంచి పరారై క్రియాశీలకంగా మారాడు. 2018, ఫిబ్రవరిలో ఆరుగురు భద్రతా సిబ్బందిని బలితీసుకున్న సుంజవాన్ ఆర్మీపై దాడిలో అతని పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు నెల రోజుల ముందు ఐదుగురు సీఆర్పీఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన లీత్‌పురా దాడిలోనూ అతని ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. -
తిడతారని తెలుసు.. అయినా ఆ పాటను చేశాం!
సాక్షి, సినిమా : ఆణిముత్యాల్లాంటి సినిమాలనుగానీ, పాటలను గానీ రీమేక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాటిని చెడగొట్టారన్న విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తుంటాయి. ఈ మధ్య బాలీవుడ్లో అలాంటిదే ఒకటి జరిగింది. 1988లో తేజబ్ సినిమాలోని ఏక్ దో తీన్ సాంగ్‌ను తాజాగా బాఘీ-2 చిత్రం కోసం రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. క్లాసిక్ సాంగ్‌లో మాధురి దీక్షిత్ స్టెప్పులు ఇరగదీస్తే... ఇప్పుడీ కొత్త పాటలో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చిందులేసింది. అయితే పాట క్వాలిటీ పరంగానే కాదు.. విజువల్‌గా, డాన్సుల పరంగా కూడా అంత బాగోలేదని విమర్శకులు పెదవి విరిచేశారు. పైగా సోషల్ మీడియాలో ఈ ప్రయత్నంపై చిత్ర దర్శకుడు అహ్మద్ ఖాన్‌పై ప్రేక్షకులు కొందరు దుమ్మెత్తిపోశారు. దర్శకుడి వివరణ... ఈ నేపథ్యంలో దర్శకుడు అహ్మద్ ఖాన్ స్పందించాడు. పాటను సినిమాలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే విమర్శలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇక పాటకు డాన్సులు సమకూర్చుంది అహ్మదేనంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై కూడా ఆయన స్పందించారు. ‘ఆ పాటను ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య కంపోజ్ చేశారు. ఆ విషయంలో నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు. పైగా పాట చిత్రీకరణ జరుపుకున్న సమయంలో ఆ దరిదాపులకు కూడా నేను వెళ్లలేదు’ అని అహ్మద్ చెప్పుకొచ్చాడు. ‘పాటను నాశనం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. కేవలం క్లాసిక్ పాటకు ప్రేక్షకులకు మళ్లీ గుర్తు చేద్దామన్న ప్రయత్నం మాత్రమే మాది. అయినా ఈ పాటపై విమర్శించే వారిని మేం పట్టించుకోలేదల్చుకోలేదు. కాకపోతే ఈ పాటపై మాధురి దీక్షిత్ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. మరోవైపు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్‌తోపాటు ఈ పాట ఒరిజినల్ కంపోజర్(తేజబ్ చిత్రం) సరోజ్ ఖాన్ కూడా ఈ ప్రయత్నంపై అభినందనలు గుప్పిస్తూ.. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ జంటగా నటించిన భాఘీ తెలుగు క్షణం సినిమాకు రీమేక్. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
తమ్ముడి చేతిలో అన్న హతం
వేధిస్తున్నాడని దారుణం పహాడీషరీఫ్: తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్న అన్నను దారుణంగా హత్య చేశాడో యువకుడు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం...వెంకటాపూర్ ఫాతీమా కాలనీకి చెందిన అహ్మద్ ఖాన్ (29) క్యాబ్ డ్రైవర్. ఇతనికి భార్య కతీజాబేగం, ఇషాఖాన్, జ్యోత్స్న బేగం ఇద్దరు సంతానం. భార్యతో వివాదం తలెత్తడంతో ఎనిమిది నెలల క్రితం విడాకులిచ్చి, పిల్లలను కూడా ఆమె వెంటే పంపేశాడు. అప్పటి నుంచి తాగుడుకు బానిసైన అహ్మద్ ఖాన్ ఏ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బుల కోసం తల్లిదండ్రులను, సోదరుడిని వేధించసాగాడు. బుధవారం రాత్రి చిత్తుగా తాగొచ్చిన అహ్మద్‌ఖాన్ తనకు రూ.లక్ష ఇవ్వాలని, సౌదీ వెళ్తానంటూ పక్షవాతంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను కొట్టాడు. ఇది గమనించిన తమ్ముడు అజ్మత్‌ఖాన్ (27) నిత్యం కుటుంబసభ్యులను వేధిస్తున్న అన్నను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో నిద్రిస్తున్న అన్న అహ్మద్‌ఖాన్ తలపై రెండు బండరాళ్లు వేసి హత్య చేశాడు. గురువారం ఉదయం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ డి.భాస్కర్ రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. -
జవాబు పత్రాలు గల్లంతు
నిజామాబాద్ అర్బన్ న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల పీజీ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కళాశాలలో పరీక్ష రాసిన 69 మంది విద్యార్థుల జవాబు పత్రాలు మాయమయ్యాయి. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగింది కళాశాలలో ఇటీవల పీజీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల ఆరో తేదీన పరీక్షలు ముగిశాయి. ఆ రోజు గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ అంశాల పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని ఐదు పీజీ కళాశాలలకు చెందిన 69 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్ష ముగియగానే జవాబు పత్రాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా పరీక్షల విభాగానికి తరలించడానికి కళాశాల అధికారులు ఏర్పాట్లు చేశారు. వాటిని తీసుకొని కళాశాల రికార్డు అసిస్టెంట్ అహ్మద్‌ఖాన్ నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. హైదరాబాద్ రైలు ఎన్నిక తర్వాత గమనించే సరికి జవాబు పత్రాల సంచి కనిపించలేదు. దీంతో అహ్మద్‌ఖాన్ ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ లింబాగౌడ్కు సమాచారం అందించారు. ఆయన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ వచ్చి వెతికారు. అనంతరం రైల్వే ఎస్సైకి ఫిర్యాదు చేశారు. ఆయన స్టేషన్‌లోని సీసీ టీవీ పుటేజీలను గమనించగా.. అహ్మద్ ఖాన్ జవాబు పత్రాలను తీసుకొని రెలైక్కడం కనిపించింది. తర్వాత ఏం జరిగిందన్నది తేలియలేదు. జవాబు పత్రాలను తన సీట్లో పెట్టి మూత్రవిసర్జనకు వెళ్లి వచ్చానని, అప్పటికే జవాబు పత్రాల సంచి మాయమైందని అహ్మద్ ఖాన్ పోలీసులకు తెలిపారు. రికార్డు అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్లే జవాబు పత్రాలు గల్లంతయ్యాయని కళాశాల సిబ్బంది ఒకరు ఆరోపించారు. కళాశాల అధికారుల నిర్లక్ష్యం పరీక్షల నిర్వహణలో కొంతకాలంగా గిరిరాజ్ కళాశాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జవాబు పత్రాలను ఉస్మానియా పరీక్షల విభాగానికి తరలించాల్సిన బాధ్యత అకడమిక్ కోఆర్డినేటర్, చీఫ్ సూపరింటెండెంట్లపై ఉంటుంది. కానీ కొంతకాలంగా కళాశాలకు చెందిన రికార్డు అసిస్టెంట్, నాలుగో తరగతి ఉద్యోగులతో జవాబు పత్రాలను పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జవాబు పత్రాలు మాయమయ్యాయని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు జవాబు పత్రాల గల్లంతుకు సంబంధించి కళాశాల అధికారుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరో తేదీన హైదరాబాద్ వెళ్లే రైళ్లో ప్రయాణికుల వివరాలను, సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇతర స్టేషన్లలో కూడా ఆరా తీస్తున్నారు. గల్లంతు వాస్తవమే పీజీ కళాశాలకు చెందిన సప్లిమెంటరీ పీజీ పరీ క్షల జవాబు పత్రాలు గల్లంతయ్యాయి. రికార్డు అసిస్టెంట్ వీటిని ఉస్మానియా యూనివర్సిటికీ తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఈ విషయాన్ని ఉస్మానియా పరీక్షల విభాగానికి తెలియజేశాం. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -లింబాగౌడ్, గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ -
టమాటాల మాటున కలప రవాణా
ఇచ్చోడ, న్యూస్‌లైన్ : మండలంలోని సిరిచెల్మ చౌరస్తా బైపాస్ రోడ్డుపై టమాటాల మాటున అక్రమంగా కలప తరలిస్తున్న వ్యాన్‌ను అటవీ శాఖ అధికారులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. అటవీ అధికారుల కథనం ప్రకారం.. సిరిచెల్మ వైపు నుంచి టమాటాలు తరలిస్తున్న వాహనంలో అక్రమంగా కలప రవాణా చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు ముందస్తుగా సమాచారం అందింది. ఈ మేరకు అటవీ సిబ్బంది బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఇది గమనించిన స్మగ్లర్లు వాహనాన్ని జాతీయ రహదారిపైకి ఎక్కించి పరారవడానికి ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనాన్ని అడ్డగించారు. దీంతో వాహనం దిగి స్మగ్లర్లు పారిపోయారు. పట్టుకున్న వాహనాన్ని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అందులోని కలప విలువ రూ.లక్ష వరకు ఉంటుందని సిబ్బంది తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది చిన్నయ్య, అహ్మద్‌ఖాన్, ఆత్రం సుందర్ పాల్గొన్నారు.