anna
-
Anna Ben: కల్కి బ్యూటీ టాప్ లుక్స్.. ఓసారి చూసేయండి (ఫోటోలు)
-
ఇది 1950లో వచ్చిన చార్ అణా!
జహీరాబాద్: 1950లో 1/4 నాణెం (చార్ అణా) మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నాణేన్ని మార్కెట్లోకి విడుదల చేశారని, ప్రస్తుతం ఈ నాణేనికి 70 ఏళ్లు నిండాయని దీన్ని సేకరించిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన సంతోష్ కైలాశ్ చెబుతున్నాడు. ఇదే తరువాత కాలంలో పావలా (25 పైసలు)గా రూపాంతరం చెందిందట. ఈయనకు అరుదైన నోట్లు, నాణేలు సేకరించడం హాబీ. చదవండి: సికింద్రాబాద్ ఓ మంచి జ్ఞాపకం.. -
ఎయిర్ అమ్మాచ్చి
కంచికి వెళ్లలేకపోయినా, కంచికి వెళ్లొచ్చినవాళ్లను తాకితే బల్లి దోషం పోతుందని ఒక విశ్వాసం. కేరళ, ఇడుక్కి జిల్లాలోని కునింజి అనే చిన్న గ్రామంలో ఉంటున్న అన్నా కుట్టి సైమన్ (అన్నాకుట్టి) ని ఒక్కసారి కలిస్తే అంతవరకు మనల్ని ఆవహించి ఉన్న నీరసం, నిరాశ వంటివి ఆమడ దూరం పరుగులు తీసి మనలో భ్రమణకాంక్ష కలుగుతుంది! ఇది విశ్వాసం కాదు. వాస్తవం. అమ్మాచ్చిని కనుక బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకుంటే‘ఎయిర్ ఇండియా’కు కూడా కొత్తగా రెక్కలొచ్చేస్తాయేమో అనిపిస్తుంది!అన్నాకుట్టి వయసు 95 సంవత్సరాలు. ఇప్పుడు మూడోసారి విదేశీయానానికి సన్నద్ధులయ్యారు. ఆమెకు ప్రయాణాలన్నా, అదే పనిగా ప్రయాణించడమన్నా చాలా ఇష్టం. అది కూడా స్నేహితులు, సన్నిహితులతో కాదు, ఒంటరిగానే! ఆమె కుటుంబంలో పిల్లలు, మనుమలు, మునిమనుమలు కలిపి మొత్తం 70 మంది దాకా ఉన్నారు. వాళ్లను కూడా వెంట తీసుకెళ్లరు! నాకు భాష సమస్య లేదు. కేవలం మలయాళం మాత్రమే వచ్చు. ఆ భాషతోనే ఎక్కడకు వెళ్లినా చక్కగా నా పనులన్నీ చేసుకుంటాను. నా భాషలో నేను అడుగుతాను, వారి భాషలో వారు చెబుతారు. బాగానే అర్థం చేసుకుంటాను’’ అంటారు అన్నా కుట్టి.. ఎంతో ఆత్మవిశ్వాసంతో! కల్వరికి వెళ్లలేకపోయారు తన మొట్టమొదటి విదేశీ యాత్ర ప్రారంభించినప్పుడు అన్నాకుట్టి వయసు 75 సంవత్సరాలు.అప్పటికి ముప్పై ఏళ్ల క్రితమే ఆమె తన భర్తను కోల్పోయారు. అన్నాకుట్టి ఇప్పటి వరకు ఇటలీ, జర్మనీ, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, యుఏఈ పర్యటించారు. ‘జెరూసలేంలోని కల్వరి వెళ్లాలని కోరికగా ఉంది. కాని నా వయసురీత్యా వారు వీసా అనుమతి నిరాకరించారు’’ అని నిరుత్సాహంగా చెబుతారు అన్నాకుట్టి. అన్నాకుట్టిని ఇరుగుపొరుగు అంతా ఆప్యాయంగా అమ్మాచ్చి (మలయాళంలో నానమ్మ) అని పిలుచుకుంటారు. ‘‘నేను చాలా ఫిట్‌గా ఉన్నాను. ఒంటరిగా ఎంత దూరమైనా ప్రయాణించగలను. నాకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, మతిమరుపు వంటి ఏ అనారోగ్యమూ లేదు’’ అని అంటున్నప్పుడు ఆమెలో తన ఆరోగ్యం గురించి «ధీమా కనిపిస్తుంది. ఇటలీ వెళ్లినా ఇడుక్కి మహిళే అన్నాకుట్టి ఏ దేశం వెళ్లినా, తన సంప్రదాయ దుస్తులను మార్చుకోవడానికి కూడా ఇష్టపడరు. ‘‘మా పిల్లలు, మనుమలు నన్ను పైజమా, కుర్తీ వేసుకోమంటారు. నేను సంప్రదాయ దుస్తులే (ఛట్టా, ముండు) ధరిస్తాను. ఫ్రాన్స్‌లో ఉన్నా, ఇడుక్కిలో ఉన్నా నా వేషధారణలో మార్పు ఉండదు. చెవులకు కూడా సంప్రదాయంగా వచ్చే తోడాలే ధరిస్తాను’’ అంటారు. అన్నాకుట్టికి భారతీయ సంప్రదాయమంటే గౌరవం. బెరుకు, భయం లేనే లేవు! అన్నాకుట్టి తొలిసారి 1997లో జర్మనీ టూర్ వెళ్లారు. తిరువనంతపురంలో మొట్టమొదటిసారి విమానం ఎక్కినప్పుడు కూడా అన్నాకుట్టి బెరుగ్గా ఏమీ లేరు. ధైర్యంగా ఎక్కి కూర్చున్నారు. ‘‘మా పిల్లలంతా నా గురించి భయపడ్డారు. నేను ఏమాత్రం భయపడలేదు’’ అంటారామె నవ్వుతూ. అన్నాకుట్టి ఎక్కువ చదువుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఆవిడ నిరక్షరాస్యురాలితో సమానం. ‘‘నేను శ్రీలంక, దుబాయ్ మీదుగా జర్మనీ వరకు ప్రయాణించాను. అది అంత సులువైన ప్రయాణం కాదు. ముఖ్యంగా నా వంటి చదువురాని వారికి ఈ ప్రయాణం కష్టంతో కూడినదే’’ అంటున్న అన్నాకుట్టి చాలా క్షేమంగా, ప్రశాంతంగా జర్మనీ వెళ్లివచ్చారు. ఆరోగ్యం వెనుక రహస్యం అమ్మాచ్చి సమాజాన్ని మెరుగు పరిచే కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు! రోడ్డు పాడయితే తనే స్వయంగా నడుం బిగించి, రోడ్డు బాగు చేయడం ప్రారంభిస్తారు. ఎవరికైనా పొలంలో విత్తనాలు చల్లాలంటే తనే ముందుంటారు. ఇక్కడొక విశేషం చెప్పాలి. ఇటీవల వచ్చిన ‘అబీ’ మలయాళ చిత్రంలో అన్నాకుట్టి నటించారు కూడా! అయితే.. ‘‘నేను నటించలేదు. నాకు అసలు నటించడం రాదు, నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో అలాగే ఉన్నాను’ అంటూ చిరునవ్వులు చిందిస్తూ చెబుతారు అన్నాకుట్టి. ఇంతకీ.. అన్నాకుట్టి ఆరోగ్యం వెనుక రహస్యం ఏమిటి? ’’నేను ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండను. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. అదే నాకు పరమౌషధం’’ అంటారు అన్నాకుట్టి. చెల్లెలొక్కరే మిగిలారు! కొట్టాయంలోని కాడనాడు నుంచి అన్నాకుట్టి కుటుంబం తిరువనంతపురానికి వలస వచ్చింది. తల్లిదండ్రులకు ఆమె పదో సంతానం. 1936లో తన పద్నాల్గవ ఏట అన్నాకుట్టి పెందనాథు సైమన్ను వివాహం చేసుకున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిపి పది మందికి పైగా సంతానం. పెద్ద కుమారుడి స్నేహితుడిని కూడా అన్నాకుట్టీనే పెంచి పెద్ద చేశారు. ఆ పిల్లవాడు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అన్నాకుట్టికి మొత్తం అక్కచెల్లెళ్లు 12 మంది. ‘‘మా ఆఖరి చెల్లాయి మరియాకుట్టి మాత్రమే జీవించి ఉంది. ప్రస్తుతం తను కోళికోడ్‌లో ఉంటోంది. అప్పుడప్పుడు వెళ్లి, ఆమెను చూసి వస్తుంటాను’’ అని ఎంతో సంతోషంగా చెబుతుంటారు అన్నా కుట్టి. – రోహిణి -
తెలుగు పదానికి ఇంటర్ నేషనల్ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: 'అన్న' అంటే తెలుగులో, తమిళంలో సోదరుడు అని అర్థం. ఈ పదానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రముఖ ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో ఈ పదానికి చోటు దక్కింది. గత నెల అప్డేట్ చేసిన ఈ నిఘంటువులో తాజాగా తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ తదితర భాషలకు చెందిన 70 భారతీయ పదాలను చేర్చారు. రూపాయిలో ఆరో వంతుకు సూచికగా ఇంతకుమును 'అణా' ( Anna) అనే పదం ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఉండేది. ఇప్పుడు అదే ఆంగ్ల పదాల స్పెల్లింత్ అన్న, అన్నన్ పదాలను నిఘంటువులో చేర్చారు. ఉర్దూ పదం 'అబ్బా' (తండ్రి)ను నిఘంటువులో పొందుపర్చారు. అచ్చా, బాపు, బాడా దిన్, బచ్చా, సూర్య నమస్కార్ వంటి పదాలు ఈ నిఘంటువులో చోటు సంపాదించాయి. -
అన్న రిక్త హస్తం
ఆసక్తి చూపని బాలింతలు, గర్భిణులు అమలు చేయలేమంటున్న అంగన్వాడీలు ఆలమూరు : అన్న అమృత హస్తం పథకం అన్న రిక్తహస్తంగా మారింది. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా అమల్లోకి తీసుకురావడంతో జిల్లాలో ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. జిల్లాలోని కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టులతో అన్న అమృత హస్తం అరకొరగా అమలు చేస్తుంటే మరికొన్ని ప్రాజెక్టుల్లో సౌకర్యాలు లేవంటూ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ పథకంపై సరైన పర్యవేక్షణ లేకపోవడమూ నిరాదరణకు కారణమైంది. ప్రభుత్వానికి సరిౖయెన ప్రణాళిక లేకపోవడం, కనీస వసతుల లేమి, అధికారుల నిర్లిప్తత వల్ల పథకం ప్రారంభించిన నెలరోజులకే అభాసుపాలైంది. అంగన్వాడీ కేంద్రాల వద్ద వండించిన నాసిరకం సరకులతో తయారు చేసిన పౌష్టికాహారాన్ని తినలేమని మహిళలు చెప్తున్నారు. జూలై ఒకటిన అట్టహాసంగా ప్రారంభమైన పథకం అంతలోనే విఫలమైంది. జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా 5546 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 3.46 లక్షల మంది చిన్నారులు, 33,184 మంది బాలింతలు, 39,657 మంది గర్భిణులు ఉన్నారు. తొలి రోజు ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో గర్భిణులు, బాలింతలు ఆ మరుసటి రోజు నుంచి రావడం, తినడం మానేశారు. ఈ పరిస్థితిపై ఐసీడీఎస్ ఆందోళనలో పడింది. ఎలా వండాలి–ఎలా భుజించాలి? సుదూర ప్రాంతాల్లో ఉండే అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి రోజు నడిచి వెళ్లి అక్కడ ఆహారాన్ని భుజించలేమని గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు చెబుతున్నారు. అయితే బాలింతలు కూడా నాసిరకమైన ముతక బియ్యం, వంటనూనెలతో వండుతున్న అహారం తినలేమంటున్నారు. అంగన్వాడీల సహాయ నిరాకరణ జిల్లాలోని అంగన్వాడీలు ఈ పథకం అమలులో సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 15 సెక్టార్ల పరిధిలోని అంగన్వాడీలు తమకు కనీస సౌకర్యాలు, నిధులు మంజూరు చేయకుండా విధి విధానాలు ఖరారు కాకుండా పథకాన్ని కొనసాగించలేమంటూ నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు. వంట పాత్రలు, గ్యాస్ కనెక్షన్, గ్లాసులు, ప్లేట్లు లేకుండా పథకాన్ని అమలు చేయలేమంటూ తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఇదే డిమాండుతో కలెక్టరేట్, ఐసీడీఎస్ ప్రాజెక్టులను మట్టడించినా ఫలితం లేకపోయింది. రేషన్ లేదు–పౌష్టికాహారం లేదు అన్న అమృత హస్తం పథకం కింద కొన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పౌష్టికాహార పంపిణీ అమలు చేయడం కాని, రేషన్ సరకుల పంపిణీ కాని జరగడం లేదు. దీనిపై ఐసీడీఎస్ శాఖ ఏవిధమైన చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటం వల్ల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో అన్న అమృత హస్తం అమలులోని కేంద్రాల్లో రేషన్ పంపిణీకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం సత్వరమే స్పందించి గతంలో మాదిరిగా రేషన్‌ను పంపిణీ చేయాలని బాలింతలు, గర్భిణులు కోరుతున్నారు. సౌకర్యాలు కల్పించాకే అమలు చేస్తాం అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు అమలు చేస్తే అన్న అమృత హస్తం పథకాన్ని అమలు చేసేందుకు ఇబ్బంది లేదు. బాలింతలు, గర్భిణులకు ముందుగా ఈ పథకంపై అవగాహన కల్పించి పౌష్టికాహారానికి అవసరమైన సరుకులను సమకూర్చాలి. యు.సుశీల, మండల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అధ్యక్షురాలు, ఆలమూరు. సమర్థంగా అమలు చేస్తాం అన్న అమృత హస్తం పథకం సక్రమంగా అమలయ్యేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో తగిన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. జిల్లాలో కొన్నిచోట్ల పథకం అమలు కాని విషయం దృష్టికి వచ్చింది. అలాంటి చోట్ల తప్పని పరిస్థితుల్లో రేషన్ పంపిణీకి చర్యలు చేపడతాం. తొలి వారంలో అన్ని ప్రాజెక్టుల అధికారులు, యూనియన్లతో సమావేశం నిర్వహిస్తాం టి.శారదాదేవి, ఐసీడీఎస్ పీడీ, కాకినాడ -
వండి వార్చింది.. ఒక్క రోజే..
-అసలుకే ఎసరు - ఆరంభ శూరత్వంగా ‘అన్న అమృతహస్తం’ - రెండు వారాలుగా అందని పౌష్టికాహారం - గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఇక్కట్లు - రూ.23.6 కోట్ల బిల్లులు చెల్లించని సర్కారు - ఇలాగైతే వండి పెట్టేదెలాగని ప్రశ్నిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు - ఏదోలా వండాలంటున్న అధికారులు ‘అన్న అమృతహస్తం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అసలుకే ఎసరు పెట్టినట్టుంది. ఇప్పటివరకూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నేరుగా ఇళ్లకే పోషకాహార దినుసులను అందించేవారు. వాటిని వారు ఇళ్లవద్దనే వండుకొని తినేవారు. ‘అన్న అమృతహస్తం’ పథకం ఆరంభించాక ఇళ్లకు కాకుండా.. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారం వండి వారికి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపింది. ఫలితంగా అటు ఇళ్లకు పోషకాహార దినుసులు రాక.. ఇటు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందక.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కట్లు పడుతున్నారు. మండపేట : ‘అన్న అమృతహస్తం’ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఇచే్చందుకు ఉద్దేశించిన ఈ పథకం ఒక్క రోజుతోనే ముగిసిపోయి ఆరంభశూరత్వంగా మిగిలింది. ‘వండి పెట్టేందుకు గిన్నెలు లేవు. కూరగాయలు కొనేందుకు డబ్బులు లేవు. పాత బిల్లుల విడుదల లేదు. ఇలాగైతే ఎలా వండిపెట్టేది?’ అని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.23.6 కోట్ల మేర బిల్లు బకాయిలున్నట్టు వారు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ పథకాన్ని అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించిన పాలకులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పథకం అమలు మాట ఎలా ఉన్నా నెలవారీ ఇచ్చే పౌష్టికాహారం పంపిణీకే ప్రభుత్వం ఎసరు పెట్టిందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. హడావుడి.. ఒక్క రోజుతో సరి! జిల్లాలో 5,546 అంగన్వాడీ కేంద్రాలుండగా.. వీటిలో 3,46,876 మంది చిన్నారులు, గర్భిణులు 38,281 మంది, బాలింతలు 35,563 మంది ఉన్నారు. చిన్నారులకు కేంద్రాల్లోనే పౌష్టికాహారం అందిస్తుండగా, గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్లు, నెలకు మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అరలీటరు నూనె చొప్పున ఇప్పటివరకూ పంపిణీ చేసేవారు. ఆ దినుసులను రెండు మూడు రోజుల్లోనే కుటుంబమంతా వినియోగించేస్తున్నారని, ఫలితంగా బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందడం లేదన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో వారికి అంగన్వాడీ కేంద్రాల్లోనే వండి పెట్టాలని, అదనంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా, ఇప్పటికే ఏజెన్సీ పరిధిలోని ఎనిమిది ప్రాజెక్టులతో పాటు కోరుకొండ, శంఖవరం, తుని ప్రాజెక్టుల పరిధిలో ఈ విధానం అమలులో ఉంది. దీనినే ఈ నెల 1 నుంచి ‘అన్న అమృతహస్తం’ పేరిట కాకినాడ, రాజమహేంద్రవరం, తాళ్లరేవు, కపిలేశ్వరపురం, కోనసీమ తదితర ప్రాంతాల్లోని 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 3,934 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 30,304 మంది గర్భిణులు, 25,331 మంది బాలింతలకు ఈ పథకం కింద పౌష్టికాహారం అందించనున్నట్టు పాలకులు ప్రకటించారు. ప్రతి రోజూ అన్నం, గుడ్డు, పాలతోపాటు వారంలో రెండు రోజులు పప్పు, కాయగూరలతో కూర, రెండు రోజులు కాయగూరలతో సాంబారు, రెండు రోజులు ఆకుకూర పప్పు వండి పెడతామని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పథకం అమలుకు అవసరమైన వంట సామగ్రి, కిరాణా, కూరగాయలు, గ్యాస్, గర్భిణులు, బాలింతలు కూర్చుకునేందుకు వీలుగా కుర్చీలు, టేబుళ్లు తదితర వాటిని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందజేయలేదు. పైగా నిధులు కూడా కేటాయించ లేదు. పథకం ప్రారంభం సందర్భంగా అధికారుల ఒత్తిళ్లతో తొలి రోజు సొంత ఖర్చులతో వండి పెట్టిన అంగన్వాడీ కార్యకర్తలు మరుసటి రోజే చేతులెత్తేశారు. దీంతో అధిక శాతం కేంద్రాల్లో ఈ పథకం అమలు ఒక్క రోజుకే పరిమితమైంది. అంగన్వాడీలకు అన్నీ బకాయిలే.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం రెండు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. జిల్లాలో ఈ బకాయి సుమారు రూ.12 కోట్లు ఉంది. దీనికితోడు అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిలు దాదాపు రూ.1.8 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. మరోపక్క చిన్నారులకు వండుతున్న పౌష్టికాహారానికిగాను కార్యకర్తలకు దాదాపు రూ.9.8 కోట్ల మేర ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంది. మొత్తం అన్నీ కలిపితే బకాయిలు రూ.23.6 కోట్లకు చేరాయి. అయినప్పటికీ ఏదోవిధంగా వండి పెట్టాలంటూ అంగన్వాడీ కార్యకర్తలపై ప్రాజెక్టు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైపోయమని, ఆ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించకపోతే కొత్తగా వండిపెట్టేదెలాగని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నిలిచిపోయిన రేషన్ పంపిణీ ప్రస్తుత పరిస్థితితో ప్రతి నెలా గర్భిణులు, బాలింతలకు ఇంటికి పంపిణీ చేసే రేషన్ సరఫరా నిలిచిపోయింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సరుకులను ఆయా కేంద్రాల్లోనే ఉంచాలని ప్రాజెక్టు అధికారులు చెబుతుండటంతో.. సరుకులు పంపిణీ చేయడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ‘అన్న అమృతహస్తం’ అమలుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న కేంద్రానికి ఆహారం కోసం గర్భిణులు, బాలింతలు ఎంతవరకూ వస్తారన్నది ప్రశ్నార్థకంగా తయారైంది. సాధారణంగా బాలింతలకు పాత బియ్యంతో అన్నం, గానుగ నూనెతో కూరలు వండుతుంటారు. కాగా కేంద్రాల్లో వంటకు మామూలు బియ్యం, పామాయిల్ నూనె వినియోగిస్తుంటారు. దీనిని బాలింతలు ఎంతవరకు తింటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాత బిల్లులు విడుదల చేయాలి అద్దెలు, జీతాలు, కూరగాయలు, ఇతర ఖర్చులకు సంబంధించి సుమారు రూ.23.6 కోట్ల మేర బకాయిలు విడుదల కావాల్సి ఉంది. వాటిని విడుదల చేయకుండా ఏదోవిధంగా వండి పెట్టాలంటూ అధికారులు ఒత్తిడి చేయడం సరికాదు. - కె.కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సదుపాయాలు కల్పించాలి ఇప్పటికే పాత బిల్లులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం వండి పెట్టేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. వంట సామగ్రి, కూరగాయలను కేంద్రాలకు అందజేయాలి. - రాణి, అంగన్వాడీ కార్యకర్త -
'అన్నా' హజారే పోస్టర్ విడుదల!
సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'అన్నా' ఫస్ట్ లుక్ విడుదలైంది. శశాంక్ ఉదపుర్కర్ దర్శకత్వంలో వెలువడుతున్న చిత్రం పోస్టర్ ను ముంబైలోని ఓ కార్యక్రమంలో అన్నా హజారే స్వయంగా విడుదల చేశారు. 25 ఏళ్ళ వయసులో దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న తనకు ప్రస్తుతం 79 సంవత్సరాలని, ఇప్పటికీ అదే మార్గంలో తాను నడుస్తున్నానని హజారే పోస్టర్ రిలీజ్ సందర్భంలో తెలిపారు. దేశంలో ఉన్నవారంతా తన కుటుంబ సభ్యులేనన్నారు. ద రైజ్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో వెలువడనున్న 'అన్నా' చిత్రానికి మహేంద్ర జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోవింద్ నమ్ దేవ్, శతాత్ సక్సేనా, కిషోర్ కదమ్ చిత్రంలో నటిస్తుండగా... దర్శకుడు శశాంక్ ఉదపుర్కర్ అన్నా పాత్రను పోషిస్తున్నారు. కాజోల్ సోదరి తనీషా ముఖర్జీ ఈ సినిమాలో జర్నలిస్టు రోల్ లో కనిపించనుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా హజారే.. 2011 లో జన్ లోక్ పాల్ బిల్లు తీసుకురావాలంటూ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. -
ఒకే బాయ్ ఫ్రెండ్‌తో తల్లులవ్వాలని ఉందంట!
ఆస్ట్రేలియా: సాధారణంగా ట్విన్స్ అంటే రూపాలే కాదు అలవాట్లలో కూడా చాలా సారూప్యాలు ఉంటాయి. ఒకేలా వస్త్రాలంకరణ చేసుకోవడం, ఒకేలా ఆలోచించడం, ఒకే అనుభూతులు వ్యక్తపరచడం లాంటి వింతలు ఉంటాయి. కానీ, ఎంత కవలలయినా వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం కొంత తేడా ఉండటం తప్పనిసరి. ట్విన్స్‌గా పుట్టిన యువతులు ట్విన్స్‌గా ఉన్న యువకులను భర్తగా కోరుకుంటే తప్పులేదుగానీ, ఒక్కడినే ఇద్దరు బాయ్ ఫ్రెండ్‌గా, భర్తగా పొందాలని కోరుకుంటే ఎలా అనిపిస్తుంది. ఆస్ట్రేలియాలో ఇదే జరిగింది. అన్నా, ల్యూసీ అనే ఇద్దరు ఒకే బాయ్ ఫ్రెండ్‌ను కొనసాగించాలని అనుకుంటున్నారు. అతడితోనే ఇద్దరు తల్లిగా మారాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా చెబుతూ 'మేం కారును, ఉద్యోగాన్ని, దుస్తులను పంచుకుంటున్నాం. అలాగే బాయ్ ఫ్రెండ్ ను కూడా పంచుకుంటాం. అతడితోనే ఇద్దరం తల్లులమవుతాం. ఎందుకంటే గతంలో మాకు చెరొక బాయ్ ఫ్రెండ్ వుండేవారు. కానీ, వారితో మాకు సర్దుబాటుకాలేదు. అందుకే మేం ఒకే బాయ్ ఫ్రెండ్‌ను కొనసాగించాలనుకుంటున్నాం' అని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. -
హజారే చనిపోవాలని కేజ్రీవాల్ కోరుకున్నారా?
న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హజారే చేపట్టిన ఆమరణ దీక్ష ఎక్కువ రోజులు కొనసాగి ఆయన చనిపోతే తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరతాయని కేజ్రీవాల్ ఆశించారన్నారు. ఉజ్జయిని జిల్లాలో ఆర్యసమాజ్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అగ్నివేశ్ ఈ ఆరోపణలు చేశారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష సందర్భంగా హజారే చనిపోతే బావుండని కేజ్రీవాల్ కోరుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. హజారే ఆమరణ నిరాహారదీక్షను నిరవధిక నిరాహార దీక్షగా మార్చాలనే పార్టీ ప్రతిపాదనకు కేజ్రీవాల్ గట్టిగా అడ్డు తగిలారనీ, పైగా ఉద్యమం ఇపుడు త్యాగాలను కోరుతోందంటూ వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనమన్నారు. హజారే చనిపో్తే తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చనే కేజ్రీవాల్ దురుద్దేశం స్పష్టమవుతోందన్నారు. అయితే అప్పటి ప్రభుత్వం ఆయన డిమాండ్లకు అంగీకరించి, హజారే ఉద్యమాన్ని విరమింపజేసింది కానీ, లేకపోతే ఇంకో పది రోజులు హాజారే దీక్ష కొనసాగాలని కేజ్రీవాల్ కోరుకున్నారని స్వామి అగ్నివేశ్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలిపై తాను ఆనాడే యోగేంద్ర యాదవ్‌ని హెచ్చరించానన్నారు. ఢిల్లీలో మెజార్జీ సాధించి ప్రభుత్వాన్ని స్థాపించిన అనతికాలంలోనే ఆప్‌లో వివాదాలు రగులుకున్నాయి. అసంతృప్త నేతలమధ్య సయోధ్యకు చేసిన ప్రయత్నాలు ఫలించలేద. చివరకు ఆ నేతల బహిష్కరణకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
అన్నను చంపిన తమ్ముడు
* చెడు అలవాట్లను అడ్డుకున్నందుకు.. * కాల్ రికార్డ్స్ ఆధారంగా హత్య కేసు ఛేదింపు బాన్సువాడ : తనకు ఉన్న చెడు అలవాట్లను అడ్డుకుంటున్న అన్ననే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. అన్నపై గడ్డపారతో దారుణంగా దాడి చేసి హతమార్చిన తమ్ముడు, శవాన్ని తన స్నేహితుని సహాయంతో స్కూటర్‌పై తీసుకెళ్ళి పాడుబడ్డ బావిలో పడేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా, పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని ఎర్రమన్నుకుచ్చలో నివసించే ఉల్లెపు సాయిలుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఉల్లెపు సాయిలు (24) దినసరి కూలీగా పని చేయగా, చిన్న కుమారుడు ఉల్లెపు పాపయ్య (22) జులాయిగా తిరిగేవాడు. తనకు ఆటో కొనివ్వాలని తండ్రిని పలుమార్లు కోరాడు. అయితే అతని అన్న సాయిలు అడ్డుకొని, ఆటో కొని ఇచ్చినా సంపాదించడని, జులాయిగానే తిరుగుతాడని తండ్రికి చెప్పాడు. ప్రతి పనిలో తనను తన అన్న అడ్డుకొంటున్నాడని కోపోద్రిక్తుడైన పాపయ్య, అన్నను హతమార్చడానికి పథకం పన్నాడు. గత నెల 30న తండ్రి సాయిలు, వ్యక్తిగత పని నిమిత్తం భార్యతో కలిసి ఆర్మూర్‌కు వెళ్ళగా, ఇంట్లో కేవలం అన్నదమ్ములు మాత్రమే ఉన్నారు. దీంతో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో పాపయ్య గడ్డపారతో అన్న వీపుపై, వృషణాలపై తీవ్రంగా చితకబాదాడు. అనంతరం ఉరి వేసి హతమార్చాడు. శవాన్ని బీడీవర్కర్స్ కాల నీలో ఉన్న పాడుబడ్డ బావిలో తన స్నేహితుడైన నాగరాజు సహాయంతో పడేసి ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు మరుసటి రోజు ఇంటికి రాగా, సాయిలు లేకపోవడంతో ఆందోళన చెందారు. నాలుగురోజుల తరువాత తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొడుకు కోసం ఎంత వెతికినా కనబడకపోవడంతో, నిందితుడైన చిన్న కొడుకు , అన్నయ్య శవం బీడీవర్కర్స్ కాలనీలోని బావిలో ఉందని చెప్పాడు. దీంతో లబోదిబోమంటూ తల్లిదండ్రులు ఈనెల 9న శవాన్ని కనుగొని, పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చా కచక్యంగా కేసు ను విచారించారు. తమ్ముడైన పాపయ్యపైనే అనుమానాలు రావడంతో అతని కాల్రికార్డ్స్ను పరిశీలించారు. అలాగే మృతుడి సెల్‌ఫోన్‌ను చంపిన మరుసటిరోజే రియాజ్ అనే వ్యక్తికి పాపయ్య విక్రయించినట్లు తేలింది. దీంతో హత్య ఇతనే చేశాడనే కోణంలో విచారణ జరుపగా, వాస్తవాలు బయటపడ్డా యి. నిందితుడైన పాపయ్యను, అతని మిత్రుడైన నాగరాజును అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా, తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ప్రతీ పనిలోనూ తనను అడ్డుకొంటున్నందుకే హత్య చేశానంటూ పాపయ్య పేర్కొన్నాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
నేడు రాఖీ పౌర్ణమి
అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. వినడానికైనా.. పిలవడానికైనా.. నాలుగే వరసలు.. కానీ ఇవి నాలుగు తరాలపాటు ఒకరికి ఒకరు ఉన్నాం అనే ధీమానిచ్చే బంధాలు. బతికున్నంత కాలం ఆ బతుకుకు భరోసానిచ్చే అనుబంధాలు. అడుగడుగునా సంరక్ష ణనిచ్చే నమ్మకాలు. దేవుడే దిగొచ్చి ముచ్చటపడేలా చేసే ఆశ్చర్యాల సాక్ష్యాలు. అందుకే అంటారు... అన్నా చెల్లెల్ల అనుబంధానికి.. అక్కా, తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.. నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. కష్టసుఖాల్లో ఒకరికొకరం సంరక్ష.. అనే అభయాన్ని తోబుట్టువులకిచ్చే పండుగే రాఖీ. కులమతాలకు అతీతంగా.. ఆప్యాయతలకు అతి దగ్గరగా.. సోదర, సోదరీమణులు అపురూపంగా జరుపుకుంటారు ఈ ఉత్సవాన్ని. ఈ నేపథ్యంలో ఈ రోజంతా ఇంటింటా రాఖీ ఆనందోత్సాహాలు వెల్లివిరియనున్నాయి. రక్షానుబంధాలు పరస్పరం మనసులను తడుమనున్నాయి. ఎక్కడున్నా సోదరుల ఇంటికి.. ఆదిలాబాద్ కల్చరల్ : పెళ్లయి అత్తారింటికి వెళ్లిన అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టేందుకు పండుగ రోజున సోదరుల ఇంటికి వస్తారు. ఎంత దూరన ఉన్నా పండుగ రోజు రావడం ఆనవాయితీ. ఎవరైన రాలేని పక్షంలో కొరియర్, పోస్టు ద్వారా రాఖీలు పంపి అనుబంధాన్ని పంచుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో స్థిరపడిన వారు కొరియర్ ద్వారా రాఖీలు పంపి ఆనవాయితీని కొనసాగిస్తారు. ఈ పండుగను వేర్వేరు చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తారు. మన రాష్ట్రంలో జంధ్యాల పూర్ణిమగా, కేరళలో వేదాధ్యయనంగా ప్రారంభించే అవని అవిక్టంగా, తమిళనాడులో పూనూల్ పర్వగా జరుపుకుంటారు. మార్కెట్లో సందడే సందడి ఆదిలాబాద్ కల్చరల్ : రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని సోదరులకు కట్టేందుకు అందమైన రాఖీలను మనసుకునచ్చిన పలు రకాల రాఖీలు కొనుగోలు చేసేందుకు మహిళలు, యువతులు, బాలికలు శనివారం బిజిబిజీగా గడిపారు. జిల్లాలోని రాఖీ దుకాణాలు, స్టాళ్లు జనాలతో కిటకిటలాడాయి. మహిళల అభివృద్ధికి అనుగుణంగా వైవిధ్యమైన రాఖీలు వ్యాపారులు అందుబాటులో ఉంచారు. ఫ్యాన్సీ రాఖీలు కుందల్తో చేసిన డిజైన్ల రాఖీల అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. రూ.10 నుంచి మొదలుకొని రూ.500 వరకు ధరల్లో అందుబాటుల్లో లభిస్తున్నాయి. చిన్నపిల్లలను ఆకర్షించే విధంగా మిక్మౌస్, స్ప్రెడర్మన్, కార్టూన్ బొమ్మలతో కూడిన రాఖీలను అమ్ముతున్నారు. రాఖీ కట్టిన తర్వాత మిఠాయి తినపించడం ఆచారం. దీంతో మిఠాయి దుకాణాల్లో సందడి నెలకొంది. -
తమ్ముడి చేతిలో అన్న హతం
వేధిస్తున్నాడని దారుణం పహాడీషరీఫ్: తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్న అన్నను దారుణంగా హత్య చేశాడో యువకుడు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం...వెంకటాపూర్ ఫాతీమా కాలనీకి చెందిన అహ్మద్ ఖాన్ (29) క్యాబ్ డ్రైవర్. ఇతనికి భార్య కతీజాబేగం, ఇషాఖాన్, జ్యోత్స్న బేగం ఇద్దరు సంతానం. భార్యతో వివాదం తలెత్తడంతో ఎనిమిది నెలల క్రితం విడాకులిచ్చి, పిల్లలను కూడా ఆమె వెంటే పంపేశాడు. అప్పటి నుంచి తాగుడుకు బానిసైన అహ్మద్ ఖాన్ ఏ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బుల కోసం తల్లిదండ్రులను, సోదరుడిని వేధించసాగాడు. బుధవారం రాత్రి చిత్తుగా తాగొచ్చిన అహ్మద్‌ఖాన్ తనకు రూ.లక్ష ఇవ్వాలని, సౌదీ వెళ్తానంటూ పక్షవాతంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను కొట్టాడు. ఇది గమనించిన తమ్ముడు అజ్మత్‌ఖాన్ (27) నిత్యం కుటుంబసభ్యులను వేధిస్తున్న అన్నను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో నిద్రిస్తున్న అన్న అహ్మద్‌ఖాన్ తలపై రెండు బండరాళ్లు వేసి హత్య చేశాడు. గురువారం ఉదయం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ డి.భాస్కర్ రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. -
'అన్న' చూడలేకపోయానని యువకుడి ఆత్మహత్య
తమిళ హీరో విజయ్ నటించిన 'అన్న' సినిమా చూడలేకపోయానన్న ఆవేదనతో తమిళనాడులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ వీరాభిమాని అయిన విష్ణు (20) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుంటాడు. అతడు కోయంబత్తూరు శివార్లలోని తుడియాలూరు ప్రాంతంలో నివసిస్తుంటాడు. 'అన్న' సినిమా శుక్రవారమే విడుదల కావాల్సి ఉండగా, అది వాయిదా పడింది. దీంతో విష్ణు చాలా ఆవేదన చెందాడు. ఎలాగైనా సినిమా చూడాలన్న ఉద్దేశంతో అతడు ఇక్కడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళ రాష్ట్రంలోని వేలాంతవాళం అనే ఊరు వెళ్లాడు. కానీ, అక్కడ అతడికి టికెట్ దొరకలేదు. దాంతో తీవ్రంగా నిరాశ చెంది, కోయంబత్తూరు తిరిగి వచ్చేశాడు. కానీ తిరిగొచ్చాక, తెల్లవారు జామున తన ఇంట్లోని సీలింగ్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నిర్మాతలకు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం నుంచి బెదిరింపులు రావడంతో 'అన్న' సినిమా విడుదల తమిళనాడులో నిలిచిపోయింది. -
‘రోబో’ రికార్డ్‌ని ‘అన్న’ బద్దలు కొడతాడా?
ముంబై వలస వెళ్లిన తమిళులకు కొండంత అండగా నిలిచి అక్కడ ఓ నాయకునిగా ఎదిగిన వ్యక్తి వరదరాజ మొదలియార్. ఆయన నిర్వర్తించిన ఆ బలీయమైన బాధ్యతను ఆయన తదనంతరం కొడుకు స్వీకరిస్తే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో తమిళంలో రూపొందించిన చిత్రం ‘తలైవా’. విజయ్ కథానాయకునిగా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్ ఓ శక్తిమంతమైన పాత్రను పోషించారు. అమలాపాల్ కథానాయిక. ‘మదరాసీ పట్టణం’ఫేం ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘అన్న’ పేరుతో బి.కాశీవిశ్వనాథం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. వి.వి.వినాయక్, బెల్లంకొండ సురేష్, గౌతంరాజు, గోపిచంద్ మలినేని, శ్రీకాంత్ అడ్డాల ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. సినిమా విజయవంతం కావాలని అందరూ ఆకాంక్షించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘రజనీకాంత్ ‘ఎందిరిన్’ చిత్రం 150 కోట్ల రూపాయలు వసూలు చేసి దక్షిణాదిన రికార్డ్ హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం సృష్టించిన రికార్డ్‌ను అధిగమించే సినిమా ‘తలైవా’ అవుతుందని విడుదలకు ముందే... తమిళనాట ఓ టాక్. ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల థియేటర్లలో విడుదలవుతోందీ సినిమా. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సమర్పణ: సినీ గెలాక్సీ, 3కె ఎంటర్టైన్మెంట్స్, నిర్మాణం: శ్రీలక్ష్మినరసింహా విజువల్స్. -
ఒకే ఒక్కడు