‘రోబో’ రికార్డ్‌ని ‘అన్న’ బద్దలు కొడతాడా? | Will 'Anna' Movie break records of Robo? | Sakshi
Sakshi News home page

‘రోబో’ రికార్డ్‌ని ‘అన్న’ బద్దలు కొడతాడా?

Published Wed, Aug 7 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

‘రోబో’ రికార్డ్‌ని ‘అన్న’ బద్దలు కొడతాడా?

‘రోబో’ రికార్డ్‌ని ‘అన్న’ బద్దలు కొడతాడా?

ముంబై వలస వెళ్లిన తమిళులకు కొండంత అండగా నిలిచి అక్కడ ఓ నాయకునిగా ఎదిగిన వ్యక్తి వరదరాజ మొదలియార్. ఆయన నిర్వర్తించిన ఆ బలీయమైన బాధ్యతను ఆయన తదనంతరం కొడుకు స్వీకరిస్తే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో తమిళంలో రూపొందించిన చిత్రం ‘తలైవా’. విజయ్ కథానాయకునిగా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్ ఓ శక్తిమంతమైన పాత్రను పోషించారు. అమలాపాల్ కథానాయిక. 
 
 ‘మదరాసీ పట్టణం’ఫేం ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘అన్న’ పేరుతో బి.కాశీవిశ్వనాథం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. వి.వి.వినాయక్, బెల్లంకొండ సురేష్, గౌతంరాజు, గోపిచంద్ మలినేని, శ్రీకాంత్ అడ్డాల ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. సినిమా విజయవంతం కావాలని అందరూ ఆకాంక్షించారు. 
 
 నిర్మాత మాట్లాడుతూ- ‘‘రజనీకాంత్ ‘ఎందిరిన్’ చిత్రం 150 కోట్ల రూపాయలు వసూలు చేసి దక్షిణాదిన రికార్డ్ హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం సృష్టించిన రికార్డ్‌ను అధిగమించే సినిమా ‘తలైవా’ అవుతుందని విడుదలకు ముందే... తమిళనాట ఓ టాక్. ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల థియేటర్లలో విడుదలవుతోందీ సినిమా. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సమర్పణ: సినీ గెలాక్సీ, 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాణం: శ్రీలక్ష్మినరసింహా విజువల్స్. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement