ఒకే బాయ్ ఫ్రెండ్తో తల్లులవ్వాలని ఉందంట!
ఆస్ట్రేలియా: సాధారణంగా ట్విన్స్ అంటే రూపాలే కాదు అలవాట్లలో కూడా చాలా సారూప్యాలు ఉంటాయి. ఒకేలా వస్త్రాలంకరణ చేసుకోవడం, ఒకేలా ఆలోచించడం, ఒకే అనుభూతులు వ్యక్తపరచడం లాంటి వింతలు ఉంటాయి. కానీ, ఎంత కవలలయినా వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం కొంత తేడా ఉండటం తప్పనిసరి.
ట్విన్స్గా పుట్టిన యువతులు ట్విన్స్గా ఉన్న యువకులను భర్తగా కోరుకుంటే తప్పులేదుగానీ, ఒక్కడినే ఇద్దరు బాయ్ ఫ్రెండ్గా, భర్తగా పొందాలని కోరుకుంటే ఎలా అనిపిస్తుంది. ఆస్ట్రేలియాలో ఇదే జరిగింది. అన్నా, ల్యూసీ అనే ఇద్దరు ఒకే బాయ్ ఫ్రెండ్ను కొనసాగించాలని అనుకుంటున్నారు. అతడితోనే ఇద్దరు తల్లిగా మారాలని అనుకుంటున్నారు.
ఈ విషయాన్ని వారే స్వయంగా చెబుతూ 'మేం కారును, ఉద్యోగాన్ని, దుస్తులను పంచుకుంటున్నాం. అలాగే బాయ్ ఫ్రెండ్ ను కూడా పంచుకుంటాం. అతడితోనే ఇద్దరం తల్లులమవుతాం. ఎందుకంటే గతంలో మాకు చెరొక బాయ్ ఫ్రెండ్ వుండేవారు. కానీ, వారితో మాకు సర్దుబాటుకాలేదు. అందుకే మేం ఒకే బాయ్ ఫ్రెండ్ను కొనసాగించాలనుకుంటున్నాం' అని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు.