Lucy
-
భూమికి రక్షణ.. ‘గురు’తర బాధ్యతే..
సుమారు ఆరు కోట్ల ఏళ్ల కింద భూమిని ఢీకొన్న ఓ ఆస్టరాయిడ్.. డైనోసార్లు సహా 90 శాతం జీవాన్ని తుడిచిపెట్టేసింది. అలాంటి ఆస్టరాయిడ్లు ఎన్నో భూమివైపు దూసుకొస్తూనే ఉంటాయి. కానీ గురుగ్రహం వాటిని మధ్యలోనే పట్టేసుకుని.. భూమిని కాపాడుతోంది. అలా గురుగ్రహం పట్టేసుకున్న ‘ట్రోజాన్ ఆస్టరాయిడ్ల’పై పరిశోధన కోసమే నాసా తాజాగా ‘ల్యూసీ’ వ్యోమనౌకను ప్రయోగించింది. సూర్యుడు, గ్రహాల పుట్టుక నుంచి భూమ్మీద జీవానికి మూలం దాకా.. ఎన్నో రహస్యాలను వాటి నుంచి తెలుసుకోవచ్చని చెబుతోంది. మరి ఆ ఆస్టరాయిడ్లు ఏంటి, గురుగ్రహం పట్టేసుకోవడం, భూమిని కాపాడుతుండటం ఏమిటో తెలుసుకుందామా? సైజు, బలం పెద్దవే.. మన సౌర కుటుంబంలో అతిపెద్దది గురుగ్రహం. ఇంచుమించు 1,300 భూగ్రహాలను కలిపితే.. గురుగ్రహం అవుతుంది. అంత పెద్ద గ్రహానికి గురుత్వాకర్షణ శక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే తనకు దగ్గరగా వచ్చే ఆస్టరాయిడ్లు, తోక చుక్కలను ఆకర్షించేస్తుంది. అందులో కాస్త పెద్దవి, దూరం నుంచి వెళ్తున్నవి అయితే వాటి కక్ష్యలను మార్చేసుకుని గురుగ్రహం ఆకర్షణకు లోబడి తిరుగుతుంటాయి. మిగతావన్నీ వెళ్లి ఆ గ్రహాన్ని ఢీకొని దానిలో కలిసిపోతాయి. ఈ క్రమంలోనే సౌర కుటుంబం అంచుల నుంచి దూసుకొచ్చే ఆస్టరాయిడ్లను గురుగ్రహం మధ్యలోనే అటకాయిస్తుంది. ఎక్కడివీ ఆస్టరాయిడ్లు.. సౌర కుటుంబం ఏర్పడిన కొత్తలో పదార్థమంతా అక్కడక్కడా గుమిగూడి గ్రహాలుగా ఏర్పడింది. అలా ఆకర్షణకు లోనుకాని శకలాలు, తోకచుక్కలు వంటివి అలాగే మిగిలిపోయాయి. వాటితోపాటు కొత్తలో చిన్నాపెద్ద గ్రహాలు, ఆస్టరాయిడ్లు ఢీకొట్టుకోవడంతో ఏర్పడిన శకలాలూ ఉన్నాయి. అవన్నీ సూర్యుడి చుట్టూ వివిధ కక్ష్యల్లో పరిభ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ఆస్టరాయిడ్లు.. గ్రహాల కక్ష్యలను దాటుకుంటూ ప్రయాణిస్తుంటాయి. ఒక్కోసారి గ్రహాలను ఢీకొడుతుంటాయి. అలా సుమారు ఆరు కోట్ల ఏళ్ల కింద ఓ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టడంతోనే.. డైనోసార్లు సహా చాలా రకాల జీవులు అంతరించిపోయాయి. భూమికి రక్షణగా.. సౌర కుటుంబం అంచుల నుంచి దూసుకొచ్చిన ఆస్టరాయిడ్లు గురుగ్రహం ఆకర్షణకు లోనై.. దాని కక్ష్యలో చేరిపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎక్కడో బయటి నుంచి వచ్చి చిక్కుకుపోయిన వీటిని ట్రోజాన్ ఆస్టరాయిడ్లుగా పిలుస్తున్నారు. ఇవి గురుగ్రహ కక్ష్యలోనే ఆ గ్రహానికి ముందు ఒక గుంపుగా, వెనుక మరో గుంపుగా తిరుగుతున్నాయి. ఇవి నేరుగా దూసుకొచ్చి ఉంటే.. వాటిలో కొన్ని అయినా భూమిని ఢీకొట్టి ఉండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలా జరగకుండా గురుగ్రహం భూమికి రక్షణ కల్పిస్తోందని అంటున్నారు. ► 1994 జూలైలో నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన గురుగ్రహం చిత్రమిది. షూమేకర్–లెవీ9 తోకచుక్కకు చెందిన పెద్ద పెద్ద శకలాలు గురుగ్రహం ఆకర్షణకులోనై దానిపై పడిపోవడాన్ని (ముదురు గోధుమ రంగులో ఉన్న ప్రాంతం) హబుల్ చిత్రీకరించింది. ఆ తర్వాత కూడా చాలా ఆస్టరాయిడ్లు గురుగ్రహాన్ని ఢీకొట్టాయి. ► తాజాగా గత నెల 13న ఓ ఆస్టరాయిడ్ గురుగ్రహాన్ని ఢీకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ఓ పెద్ద ఆస్టరాయిడ్ గురుగ్రహం ఆకర్షణకు లోనై ముక్కలై, ఆ గ్రహంపై పడిపోయి ఉంటుందని జపాన్‌కు చెందిన ఎన్టీటీ కమ్యూనికేషన్ సైన్స్ ల్యాబ్ పరిశోధకుడు మార్క్ డెల్క్రోక్స్ వెల్లడించారు.(గత నెలలో గురుగ్రహాన్ని ఆస్టరాయిడ్ ఢీకొన్నప్పుడు వెలువడిన కాంతి ఇది) శనిగ్రహంతోనూ రక్షణ సౌర కుటుంబంలో రెండో పెద్ద గ్రహమైన శనిగ్రహం కూడా ఆస్టరాయిడ్లను ఆకర్షించి, భూమికి రక్షణ కల్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుడి తరహాలోనే శనిగ్రహానికి ముందు, వెనుక కూడా కొన్ని ఆస్టరాయిడ్లు పరిభ్రమిస్తున్నాయని చెప్తున్నారు. నాసా ‘ల్యూసీ’ మిషన్ ఎందుకు? సౌర కుటుంబం అంచుల్లో యురేనస్ గ్రహానికి అవతల కోట్ల సంఖ్యలో ఆస్టరాయిడ్లు పరిభ్రమిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని క్యూపియర్ బెల్ట్ అంటారు. సూర్యుడు, గ్రహాలు రూపొందిన కొత్తలోనే ఆ ఆస్టరాయిడ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అంచనా. వాటిపై సూర్యుడి ప్రభావం చాలా తక్కువగా ఉండటంతో.. సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్ల నాటి ఆధారాలు అలాగే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనితోపాటు భూమిపై జీవం ఆవిర్భావానికి ఆస్టరాయిడ్ల నుంచి వచ్చిన పదార్థాలే కారణం కావొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. అటు సౌర కుటుంబం గుట్టును, ఇటు జీవం ఆవిర్భావానికి మూలాలను తెలుసుకోవడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ‘ల్యూసీ’ మిషన్‌ను చేపట్టింది. ► గురుడి ముందు, వెనకాల కలిపి ఇప్పటివరకు 6,500కుపైగా ట్రోజాన్ ఆస్టరాయిడ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో ముందు పరిభ్రమిస్తున్న నాలుగింటిని, వెనకాల పరిభ్రమిస్తున్న మూడింటిని నాసా శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. ►ల్యూసీ వ్యోమనౌక భూమి నుంచి ప్రయాణం ప్రారంభించి సూర్యుడిని చుట్టేసి.. తిరిగి భూమికి దగ్గరగా వస్తుంది. తర్వాత భూమి గ్రావిటీతో వేగం పెంచుకుని.. 2027లో గురు డి ముందున్న ఆస్టరాయిడ్ గ్రూప్‌కు చేరుకుంటుంది. అక్కడ 4 ఆస్టరాయిడ్లపై పరిశోధన చేశాక 2028లో భూమివైపు ప్రయాణిస్తుంది. ► రెండోసారి భూమి గ్రావిటీ నుంచి బలం పుంజుకుని.. 2032లో గురుగ్రహం వెనుక ఉన్న ఆస్టరాయిడ్ గ్రూప్‌కు చేరుకుని ఏడాదిపాటు పరిశోధన చేస్తుంది. ఒకవైపు ఆరేళ్లు, మరోవైపు ఆరేళ్లు.. కలిపి 12 ఏళ్లపాటు ప్రయాణం, పరిశోధన జరుగనున్నాయి. -
ఒకే బాయ్ ఫ్రెండ్‌తో తల్లులవ్వాలని ఉందంట!
ఆస్ట్రేలియా: సాధారణంగా ట్విన్స్ అంటే రూపాలే కాదు అలవాట్లలో కూడా చాలా సారూప్యాలు ఉంటాయి. ఒకేలా వస్త్రాలంకరణ చేసుకోవడం, ఒకేలా ఆలోచించడం, ఒకే అనుభూతులు వ్యక్తపరచడం లాంటి వింతలు ఉంటాయి. కానీ, ఎంత కవలలయినా వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం కొంత తేడా ఉండటం తప్పనిసరి. ట్విన్స్‌గా పుట్టిన యువతులు ట్విన్స్‌గా ఉన్న యువకులను భర్తగా కోరుకుంటే తప్పులేదుగానీ, ఒక్కడినే ఇద్దరు బాయ్ ఫ్రెండ్‌గా, భర్తగా పొందాలని కోరుకుంటే ఎలా అనిపిస్తుంది. ఆస్ట్రేలియాలో ఇదే జరిగింది. అన్నా, ల్యూసీ అనే ఇద్దరు ఒకే బాయ్ ఫ్రెండ్‌ను కొనసాగించాలని అనుకుంటున్నారు. అతడితోనే ఇద్దరు తల్లిగా మారాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా చెబుతూ 'మేం కారును, ఉద్యోగాన్ని, దుస్తులను పంచుకుంటున్నాం. అలాగే బాయ్ ఫ్రెండ్ ను కూడా పంచుకుంటాం. అతడితోనే ఇద్దరం తల్లులమవుతాం. ఎందుకంటే గతంలో మాకు చెరొక బాయ్ ఫ్రెండ్ వుండేవారు. కానీ, వారితో మాకు సర్దుబాటుకాలేదు. అందుకే మేం ఒకే బాయ్ ఫ్రెండ్‌ను కొనసాగించాలనుకుంటున్నాం' అని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. -
హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం!
శిక్ష మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 37 ఆ హత్యకి కారణం వైవాహిక జీవిత వ్యవస్థ పుట్టాక కొన్ని కోట్ల సార్లు జరిగిన హత్యలకి గల కారణమే, వివాహేతర సంబంధం! తన భార్య లూసీకి, తన ఫ్రెండ్ లేన్సింగ్‌తో గల సంబంధం గురించి హెన్రీకి తెలిసి నమ్మలేకపో యాడు. కానీ తను నియమించిన డిటెక్టివ్ ఋజువు సంపాదించి తెచ్చి చూపించాక నిర్ఘాంతపోయాడు. లేన్సింగ్ని చంపాలని నిర్ణ యించుకున్నాడు. లూసీ కోసం చంపు తున్నాడు కాబట్టి ఆమె కళ్ల ముందే అతణ్ని చంపదలచుకున్నాడు. తనని పోలీసులకి పట్టిస్తే తనమీద కన్నా లేన్సింగ్ మీదే ఆమెకి అధిక ప్రేమ ఉన్నట్లు లేదా తనని గాఢంగా ప్రేమిస్తున్నట్లు అని భావిం చాడు. తగిన అవకాశం కోసం ఓపికగా వేచి ఉన్నాడు.ఆ శనివారం రాత్రి తన ఇంటికి వచ్చిన లేన్సింగ్‌తో కలిసి ఎప్పటిలా హెన్రీ డ్రింక్ తీసుకున్నాడు. ఇద్దరూ పిట్ట గోడ దగ్గర నిలబడి ఉండగా హెన్రీ తన భార్యతో చెప్పాడు. ‘‘ఇటు చూడు లూసీ.’’ ఆమె తల తిప్పి చూడగానే లేన్సింగ్ రెండు కాళ్లూ పట్టుకుని ఎత్తి అతన్ని కింద పడేసాడు. ఏడో అంతస్థు నించి తలకిందు లుగా పడ్డ లేన్సింగ్ తల పగిలి పుర్రెలోని మెదడు కూడా బయటికి వచ్చేసింది. ఆడవాళ్లు ఎమోషనల్‌గా ప్రవర్తిస్తారు. ఆ ఎదురు చూడని దుర్ఘటనకి లూసీ సరిగ్గా అలాగే ప్రవర్తించింది. అయితే హెన్రీ పోలీసులు వచ్చేలోగా లూసీని తన అధీనంలోకి తీసుకోగలిగాడు. ‘‘లేన్సింగ్ తాగిన మత్తులో జారి కిందపడ్డాడని నేను పోలీసులతో చెప్తాను. నువ్వూ అదే చెప్పడం మంచిది. నువ్వు నిజం చెప్పినా అందుకు ఋజువు లేదు. ఋజువు లేని సాక్ష్యాన్ని కోర్టులో కొట్టే స్తారు. మనిద్దరి మీదా పత్రికల్లో అవా కులు, చెవాకులు రాస్తారు. వాటిలో ఒకటి లేన్సింగ్‌తో నీకు గల సంబంధం. ఆ ఋజువు కోర్టుకిస్తే, నాకు శిక్షపడే పక్షంలో నా ఆస్తిలోంచి నీకు పెన్నీ కూడా రాదు. కాబట్టి లేన్సింగ్ మరణం ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పడం నాకన్నా నీకే మంచిది. నేను అన్నిటికీ తెగించినవాణ్ని.’’ లూసీ పోలీసులు వచ్చేసరికి షాక్‌లోనే ఉంది. తన భర్త చెప్పిందే వారికి చెప్పింది. ఆమె మానసిక స్థితిని గమనించిన పోలీసులు కూడా లూసీని గుచ్చి గుచ్చి ప్రశ్నించలేదు. ‘‘లేన్సింగ్ డిప్రెస్డ్గా కనిపించాడు. ఒంటరిగా ఉండలేనని ఫోన్‌చేసి ఇంటికి వచ్చాడు. భోజనానికి మునుపు, తర్వాత చాలా తాగాడు. లాయర్‌గా లేన్సింగ్ ఆదాయం ఈ మధ్య బాగా తగ్గడం అందుకు కారణం’’ హెన్రీ పోలీసులకి చెప్పాడు. చివరగా లేన్సింగ్ టై పిట్టగోడ దగ్గరికి చేరుకున్నాక అతని కదలికల్ని గురించి కూడా చెప్పాడు. వాళ్లకి ఆ దంపతులు అబద్ధం ఆడుతున్నా రన్న అనుమానం కలగలేదు. లేన్సింగ్ ఆదాయం తగ్గిందన్న సంగతి వారి విచారణలో నిర్ధారణయ్యాక ఆ కేసుని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా మూసేసారు. తనకి వచ్చిన కేన్సర్.. మూలాల నించి తొలగిపోయిందని తెలిసిన రోగిలా ఆనందించాడు హెన్రీ. ‘‘లూసీ! లేన్సింగ్ చేసిన ద్రోహానికి అతన్ని నేను చంపాను. నేనిక ఎన్నటికీ వాడి మొహం చూడాల్సిన అవసరం లేదు’’ కొద్ది రోజుల తర్వాత హెన్రీ తన భార్యతో చెప్పాడు. ఆ హత్య జరిగాక మొదటిసారి లూసీ తన భర్త మొహం వంక కొద్దిసేపు దీర్ఘంగా చూసింది. ఆ మొహంలో పగ కాని, బాధ కాని, క్రోధం కాని, జాలి కాని... అసలెలాంటి భావాలు కనిపించలేదు. ‘‘ఏమిటా చూపు?’’ అడిగాడు. లూసీ జవాబు చెప్పలేదు. ఓ ప్రశ్న అడిగింది. ‘‘ఏం జరగనట్లే మానసిక క్షోభ లేకుండా జీవించగలరా? మీ ప్రియ మిత్రుడ్ని చంపాననే బాధ లేదా? మీరు శిక్షకి అర్హులని మీకు అనిపించడం లేదా?’’ ‘‘నా మీదకి దాడి చేసిన క్రూర మృగాన్ని చంపినట్లుగానే నీ ప్రియుడ్ని చంపాను. ఇది అతి పాత న్యాయం. కన్నుకి కన్ను. చేతికి చెయ్యి. శిక్ష దేనికి?’’ వారిద్దరి మధ్యా లేన్సింగ్ గురించి జరిగిన ఆఖరి సంభాషణ అది. హెన్రీ ఆమెకి ఇంకో ప్రియుడు లభించే అవకాశం కల్పించదలచుకోలేదు. తన భార్య పూర్తిగా తనకే దక్కాలనే స్వార్థంతో తన పన్నెండు మంది మగ మిత్రులకి దూరం అయ్యాడు. కాని ఆమె పెట్టెలో అడుగున వెదికి ఉంటే లూసీ లేన్సింగ్ని మర్చిపో లేకపోతోందని అతని ఫోటోని చూసి గ్రహించేవాడు. ఆఫీస్ పనిమీద హెన్రీ చికాగోకి కారులో బయదేరాడు. అకస్మాత్తుగా మంచు కురవసాగింది. కార్ రేడియోని ఆన్ చేస్తే మంచు తుఫాను అని తెలిసింది. ఇంకో అరగంటలో గమ్యానికి చేరతాడు కాబట్టి హెన్రీ కారుని మధ్యలో ఆపదలచు కోలేదు. కారుని జాగత్తగా, వేగం పరిమితి మించకుండా పోనివ్వసాగాడు. పొగ మంచు వల్ల రోడ్డు ఐదారు అడుగుల మేర దూరమే కనిపించసాగింది. పక్క రోడ్లోంచి వచ్చిన కలప లారీ డ్రైవర్‌కి హెన్రీ కారు కనపడలేదు. రెండు లైట్ల కాంతి హెన్రీ కంట్లో గుచ్చుకుంది. సరిగ్గా నాలుగైదు క్షణాల్లో అతని కారు ఆ పద హారు చక్రాల లారీ కిందికి వెళ్లిపోయింది. హెన్రీ మరణించలేదు. లూసీ హాస్పి టల్‌కి హెన్రీని చూడడానికి వచ్చినప్పుడు చెప్పింది. ‘‘డాక్టర్ ఇది అద్భుతం అని చెప్పాడు. మీ మొహానికి తప్ప శరీరంలోని ఇంకే భాగానికీ దెబ్బ తగల్లేదుట.’’ అతను ఆరు వారాలు హాస్పిటల్లోనే గడిపాడు. ఆరో వారం డాక్టర్ హెన్రీతో చెప్పాడు. ‘‘కట్లు విప్పాక తెలిసింది. మీ మొహం బాగా దెబ్బతింది. పిల్లలు చూస్తే జడుకునేలా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. కాని అది మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ కాదు. మీరు వ్యక్తిగతంగా బిల్ చెల్లిస్తే ప్లాస్టిక్ సర్జన్ వచ్చి మిమ్మల్ని చూస్తాడు.’’ కట్లు విప్పిన అతని మొహాన్ని చూడ గానే లూసీ మొహం వివర్ణమైంది. ‘‘అంత భయంకరంగా ఉందా?’’ అడిగాడు. ‘‘అవును. మన ఇల్లు అమ్మయినా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి.’’ ‘‘ఇది నువ్వు కోరిన శిక్ష అనుకుంటు న్నావా? కాదు’’ చెప్పాడు. ఎనిమిది వారాల తర్వాత కట్లు విప్పారు. భర్తకి అద్దం ఇచ్చి చెప్పింది లూసీ... ‘‘చూసుకోండి.’’ అద్దంలోకి చూసిన హెన్రీ కెవ్వున అరిచాడు. ఎదురుగా లేన్సింగ్ ప్రతిబింబం కనిపించింది. ‘‘ప్లాస్టిక్ సర్జన్ ఆపరేషన్‌కి ముందు మీ ఫోటో అడిగితే లేన్సింగ్ ఫోటోని ఇచ్చాను. ఇది మీ నేరానికి తగిన శిక్ష’’ లూసీ నెమ్మదిగా చెప్పింది. (మిరియం లించ్ కథకి స్వేచ్ఛానువాదం) -
ఇద్దరు కవలల ముద్దుల బాయ్ ఫ్రెండ్
సిడ్నీ: వారిద్దరు కవలలు. అచ్చుగుద్దినట్టుగా ఒకేలా ఉంటారు. జుట్టు నుంచి పాదాల వరకు ఇద్దరి మధ్య అణువంత కూడా తేడా ఉండదు. ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. ఒకే రకమైన మేకప్ వేసుకుంటారు. మాట తీరులో కూడా తేడా ఉండదు. ఒక నిమిషం తేడాతో పుట్టడం వల్ల వారిలో ఒకరు అక్కయ్యారు. ఒకరు చెల్లయ్యారు. వారిలో ఎవరు అక్కో, ఎవరు చెల్లెలో మిత్రులే కాదు, వారిని కన్న తల్లి కూడా గుర్తుపట్టలేదు. వారి వయస్సు 28 ఏళ్లు. వారి బరువు కూడా ఒకటే. తినే తిండి దగ్గరి నుంచి పడుకునే పక్క వరకు వారివి ఒకే రకమైన అభిరుచులు. అందుకే వారికి బాయ్ ఫ్రెండ్ కూడా ఒక్కరే. అతడినే ఇద్దరు పంచుకుంటున్నారు. వారు ఒకరిని విడిచి ఒకరు ఒక క్షణం కూడా ఉండరు. వారి గురించి యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న ఓ జపాన్ టెలివిజన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవలలను ఇటీవల పిలిపించి ఓ పోటీ నిర్వహించింది. కంప్యూటర్ కూడా వారి మధ్యనున్న తేడాను గుర్తించలేక పోయిందట. దానితో ప్రపంచంలోనే అచ్చుగుద్దినట్టు ఒకే పోలికల్లో ఉన్న కవలలుగా టైటిల్ ఇచ్చి వారిని సత్కరించింది. ఆ కవలల పేర్లు అన్నా, లూసీ డీ సింక్యూ. అస్ట్రేలియాలోని పెర్త్‌లో జన్మించిన ఈ కవలలు ఇప్పుడు అక్కడే తల్లితో కలసి జీవిస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ మాత్రం వచ్చిపోతుంటాడు. అతని పేరు బెన్ బైర్న్. ఎలక్ట్రికల్ మెకానిక్. అన్నా, లూసీలు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ప్రాథమిక, మాధ్యమిక చదువులు ఒకే పాఠశాలలో చదివారు. ఒకే కాలేజీలో ఒకే కోర్సు చేశారు. బ్యూటీషియన్లుగా ఒకే వృత్తి చేపట్టారు. చిన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య పోలికలు ఎక్కువనే ఉన్నా కను రెప్పల్లో, కనుబొమ్మల తీరులో, పెదవుల్లో, బ్రెస్టులో కొన్ని తేడాలు ఉండేవట. వాటిని సరిచేసుకోవడం కోసం పలు మార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వాటి కోసం దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టారట. వారు బయటకు ఎక్కడికెళ్లాలన్నా కలిసేపోతారు. కలిసే వస్తారు. సరదాగా అప్పుడప్పుడు మిత్రులను పేర్లు మార్చి బురడీ కొట్టిస్తారు. ఇటీవల జపాన్ టీవీ పోటీలో, అంతకుముందు చానెల్-7 టీవీలో ఎవరు, ఎవరో కనుక్కోకుండా జడ్జీలను, ప్రేక్షకులను బురిడి కొట్టించారు. ప్రేమికులను బురిడీ కొట్టించొద్దన్న ఉద్దేశంతోనేమో ఒకే బాయ్ ఫ్రెండ్‌తో సెటిలయ్యారు.