ముఖంలో ఒక పక్క పక్షవాతం వచ్చినట్లుగా వాలిపోయే కండిషన్‌ను ఫేషియల్ పెరాలసిస్ అంటారు. పక్షవాతంలో ఒకవైపు దేహభాగం అచేతనమై పోయినట్టే... ఫేషియల్ పెరాలసిస్‌లో కేవలం ముఖం వరకే చచ్చుబడినట్లుగా అయిపోతుంది. నిజానికి లక్షణాల పరంగా ఇది చాలా ఆందోళనకరంగా అనిపించినా ..చాలా వరకు సాధారణ సమస్యగానే పరిగణించవచ్చు.
కారణాలు: మెదడు నుంచి బయల్దేరిన వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇందులో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకర దనం ఎక్కువగా కనిపిస్తుంది.
ఇది కూడా హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్ నర్వ్ అనే ముఖానికి సంబంధించిన నరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరంతో కనెక్ట్ అయిన ముఖ భాగాలు చచ్చుబడి΄ోయినట్లు కనిపిస్తాయి.
వచ్చే లక్షణాలు: మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు ఒకవైపు నుంచే పుక్కిలించగలగడం... దాంతో నోటికి ఒకవైపు నుంచే నీళ్లు బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప వాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స: డాక్టర్లు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తారు. ఇది కేవలం కొద్ది రోజుల్లోనే తగ్గుతుంది. పూర్తిగా తగ్గిపోయే ఈ సమస్యతో ఆందోళన అవసరం లేదు.
(చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!)
Comments
Please login to add a commentAdd a comment