ప్రతీకాత్మక చిత్రం
ముఖంలో ఒక పక్క పక్షవాతం వచ్చినట్లుగా వాలిపోయే పరిస్థితే ఫేషియల్ పెరాలసిస్. పక్షవాతంలో కనిపించే లక్షణాలైన దేహంలోని ఒక పక్క ఉండే భాగాలు అచేతనంగా మారిపోయినట్లే.... కొందరికి కేవలం ముఖం వరకే ఒక భాగం చచ్చుబడినట్లుగా అయిపోతుంది. దీన్నే సాధారణ భాషలో ‘ఫేషియల్ పెరాలసిస్’ అనీ, వైద్యపరభాషలో ‘బెల్స్‌పాల్సీ’ అని అంటారు. ఇది చాలా మందిలో కనిపించే సాధారణ జబ్బే. మన మెదడునుంచి బయల్దేరిన వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు.
ఇందులో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్ నర్వ్ అనే ముఖానికి సంబంధించిన నరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరం వాపు వచ్చి, అది అనుసంధానం చేసే ముఖ భాగాలు చచ్చుబడిపోతాయి.
లక్షణాలు : మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తుంటే ఒకవైపు నుంచే సమర్థంగా పుక్కిలించగలగడం... ఫలితంగా నోటికి ఒకవైపు నుంచే నీళ్లు చిమ్మినట్లుగా బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సగానూ ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తారు. ఇది కేవలం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గిపోయే ఈ సమస్యతో ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment