కూర్చునేవారూ... కుర్చీ వదలండి!
సిట్ రైట్ అండ్ స్టాండ్ స్ట్రైట్
కుదురుగా కుర్చీలో కూర్చొని పనిచేసేవారు అదేపనిగా గంటలు గంటలు కూర్చోవద్దని చెబుతున్నారు రోచెస్టర్, మిన్నెసోటాకు చెందిన మయో వైద్య పరిశోధక బృందం అధ్యయనవేత్తలు. ఇలా రెండుగంటల పాటు అదేపనిగా కూర్చొని ఉండటం వల్ల 20 నిమిషాల సేపు వ్యాయామం చేయడం వల్ల ఒనగూరిన ఆరోగ్యాన్ని మనం నష్టపోతామని చెబుతున్నారా పరిశోధకులు.
కూర్చుని చేసే ఉద్యోగాలలో ఉన్న 2,223 మందిపై నిర్వహించిన ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కనీసం రెండు గంటలకోసారి అయినా లేవకుండా పనిచేసేవారిలో గుండెజబ్బులు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే మధ్యాన్న భోజనం తర్వాత వెంటనే కుర్చీని అంటిపెట్టుకోకుండా కొద్దిగా అటు ఇటు తిరగాలని కూడా వారు సలహా ఇస్తున్నారు.