ప్రముఖ నటుడికి తీవ్ర అస్వస్థత | Tamil Film Actor Thennavan Critically Ill At Chennai | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడికి తీవ్ర అస్వస్థత

Published Sat, Nov 9 2019 5:34 PM | Last Updated on Sat, Nov 9 2019 5:34 PM

Tamil Film Actor Thennavan Critically Ill At Chennai - Sakshi

ప్రముఖ తమిళ నటుడు తెన్నవన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం తెల్లవారు జామున ఆయనకు పక్షవాతం రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అయనకు వచ్చిన పక్షవాత ప్రభావం ఎక్కువగా ఉండటంతో అత్యవసర చికిత్సా విభాగంలో వైద్యులు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. అయితే తెన్నవన్‌ పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సహాయ నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన తెన్నవన్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న వార్త తెలుసుకున్న కోలీవుడ్‌ వర్గాలు ఆస్పత్రికి చేరుకుని.. తెన్నవన్‌ను పరామర్శించి ఆయన కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపుతున్నారు. 

తెన్నవన్‌ను భారతీరాజా కోలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే తొలి సినిమాతో అంతగా పేరు రానప్పటికీ.. చియాన్‌ విక్రమ్‌ సినిమా ‘జెమిని’తో తెన్నవన్‌కు సహాయనటుడిగా మంచి గుర్తింపు లభించింది. అనంతరం ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కమల్‌ హాసన్‌ విరుమండి, జిగర్తాండా, సుందర పాండియన్, సండకోళి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రజనీ కాంత్‌ ‘పెట్టా’సినిమాలో మినిస్టర్‌ పాత్రలో తెన్నివన్‌ ఆకట్టుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement