కంటినిండా నిద్రతో పక్షవాతం దూరం! | Eye Full Distance sleep paralysis! | Sakshi
Sakshi News home page

కంటినిండా నిద్రతో పక్షవాతం దూరం!

Published Mon, Feb 15 2016 10:41 PM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

కంటినిండా నిద్రతో పక్షవాతం దూరం!

కంటినిండా నిద్రతో పక్షవాతం దూరం!

పరిపరి  శోధన
కంటినిండా నిద్రపోవాలి. లేకపోతే ఒక్కోసారి అది పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కంటినిండా నిద్రించకపోతే అది మెదడును చురుగ్గా పనిచేయేనివ్వదని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఆ అధ్యయనం వివరాలివి... వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర వ్యవధి తగ్గుతుంటుంది. నిద్రపట్టే వ్యవధి తగ్గుతున్న కొద్దీ మెదడులోని కణాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందడమూ తగ్గుతుంది. దాంతో మెదడులో అప్పటికే మనం నేర్చుకున్న పరిజ్ఞానాల విషయంలోనూ లోపం ఏర్పడుతుందంటున్నారు కెనడాకు పరిశోధకులు.

ఇది మన నైపుణ్యాలనే కాకుండా మన జ్ఞాపకశక్తినీ దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. సీనియర్ సిటిజెన్‌లలు కొందరిపై నిర్వహించిన ఈపరిశోధనల్లో సరిగా నిద్రపోలేని వారిలో మెదడుకు మంచి రక్తం అందించే రక్తనాళాలు తమ మృదుత్వాన్ని కోల్పోయి కాస్త గట్టిబారినట్లు కూడా గుర్తించారు. దాంతో ఒక్కోసారి పక్షవాతమూ రావచ్చు అని అధ్యయనవేత్తలు తెలుపుతున్నారు ఈ వివరాలన్నీ కెనడా చెందిన ‘స్ట్రోక్’ అనే  మెడికల్ జర్నలో ప్రచురించారు. ‘పెద్ద వయసు వారిలో నిద్రపోయే సమయం తగ్గినా, నిద్ర నాణ్యత బాగుండేలా, ఆ వయసుకు తగిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం అవసరమని పరిశోధకులు సూచన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement