Sleep duration
-
రాగి పంట కుప్పపై నిద్ర.. యువకుడు దుర్మరణం
సాక్షి, దొడ్డబళ్లాపురం : కోత కోసిన రాగి పంటను ఎండబెట్టేందుకు రోడ్డుపై వేసి ఆ కుప్పలమీదే పడుకున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం తాలూకాలోని మెణసి గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతుడిని తాలూకాలోని మెణసి గ్రామానికి చెందిన యోగీష్ (19)గా గుర్తించారు. దొడ్డబళ్లాపురం-తుమకూరు రహదారిలో దొడ్డబెళవంగల వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. స్థానిక రైతులు తమ పొలాల్లో కోత కోసిన రాగి, జొన్న పంటలను ఎండబెట్టేందుకు, నూర్చేందుకు రోడ్డుపై వేస్తుండడం ఆనవాయితీ. ఇదేవిధంగా ఖాళీగా ఉన్న రోడ్డుపై శుక్రవారం రాత్రి తన పంట కుప్ప వేసి దానిపైనే యోగీష్ నిద్రించాడు. అర్ధరాత్రివేళ గుర్తుతెలియని వాహనం అదే రోడ్డుమీదుగా వెళ్లడంతో కుప్పలపై పడుకున్న యోగీష్ వాహనం కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కంటినిండా నిద్రతో పక్షవాతం దూరం!
పరిపరి శోధన కంటినిండా నిద్రపోవాలి. లేకపోతే ఒక్కోసారి అది పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కంటినిండా నిద్రించకపోతే అది మెదడును చురుగ్గా పనిచేయేనివ్వదని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఆ అధ్యయనం వివరాలివి... వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర వ్యవధి తగ్గుతుంటుంది. నిద్రపట్టే వ్యవధి తగ్గుతున్న కొద్దీ మెదడులోని కణాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందడమూ తగ్గుతుంది. దాంతో మెదడులో అప్పటికే మనం నేర్చుకున్న పరిజ్ఞానాల విషయంలోనూ లోపం ఏర్పడుతుందంటున్నారు కెనడాకు పరిశోధకులు. ఇది మన నైపుణ్యాలనే కాకుండా మన జ్ఞాపకశక్తినీ దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. సీనియర్ సిటిజెన్లలు కొందరిపై నిర్వహించిన ఈపరిశోధనల్లో సరిగా నిద్రపోలేని వారిలో మెదడుకు మంచి రక్తం అందించే రక్తనాళాలు తమ మృదుత్వాన్ని కోల్పోయి కాస్త గట్టిబారినట్లు కూడా గుర్తించారు. దాంతో ఒక్కోసారి పక్షవాతమూ రావచ్చు అని అధ్యయనవేత్తలు తెలుపుతున్నారు ఈ వివరాలన్నీ కెనడా చెందిన ‘స్ట్రోక్’ అనే మెడికల్ జర్నలో ప్రచురించారు. ‘పెద్ద వయసు వారిలో నిద్రపోయే సమయం తగ్గినా, నిద్ర నాణ్యత బాగుండేలా, ఆ వయసుకు తగిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం అవసరమని పరిశోధకులు సూచన.