రాగి పంట కుప్పపై నిద్ర.. యువకుడు దుర్మరణం | person sleep on the crop.. died in accident | Sakshi
Sakshi News home page

రాగి పంట కుప్పపై నిద్ర.. యువకుడు దుర్మరణం

Published Sat, Jan 13 2018 7:19 PM | Last Updated on Sat, Aug 25 2018 4:52 PM

person sleep on the crop.. died in accident

సాక్షి, దొడ్డబళ్లాపురం : కోత కోసిన రాగి పంటను ఎండబెట్టేందుకు రోడ్డుపై వేసి ఆ కుప్పలమీదే పడుకున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం తాలూకాలోని మెణసి గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతుడిని తాలూకాలోని మెణసి గ్రామానికి చెందిన యోగీష్‌ (19)గా గుర్తించారు. దొడ్డబళ్లాపురం-తుమకూరు రహదారిలో దొడ్డబెళవంగల వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. స్థానిక రైతులు తమ పొలాల్లో కోత కోసిన రాగి, జొన్న పంటలను ఎండబెట్టేందుకు, నూర్చేందుకు రోడ్డుపై వేస్తుండడం ఆనవాయితీ. ఇదేవిధంగా ఖాళీగా ఉన్న రోడ్డుపై శుక్రవారం రాత్రి తన పంట కుప్ప వేసి దానిపైనే యోగీష్‌ నిద్రించాడు. అర్ధరాత్రివేళ గుర్తుతెలియని వాహనం అదే రోడ్డుమీదుగా వెళ్లడంతో కుప్పలపై పడుకున్న యోగీష్‌ వాహనం కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement