కరోనా: పక్షవాతం బారినపడ్డ షారుక్‌ సహనటి | Actress Shikha Malhotra Suffering Paralysis After Battling With Covid 19 | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్..‌ నటికి పక్షవాతం

Published Tue, Dec 15 2020 10:48 AM | Last Updated on Tue, Dec 15 2020 6:49 PM

Actress Shikha Malhotra Suffering Paralysis After Battling With Covid 19 - Sakshi

ముంబై: కోవిడ్‌ రోగులకు సేవలందిస్తూ కరోనా వైరస్‌ బారిన పడిన బాలీవుడ్‌ నటి శిఖా మల్హోత్రా ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. మహమ్మారితో పోరాడి ఇంటికి వచ్చిన ఆమె తాజాగా పక్షవాతం బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్‌ అశ్విన్‌ శుక్లా మంగళవారం ప్రకటించారు. ‘శిఖా పక్షవాతానికి గురయ్యారు. ఆమెకు కుడి వైపు స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం శిఖా కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’ అంటూ ఆమె ఫొటోను షేర్‌ చేశాడు. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు షాక్‌ గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు. (చదవండి: నటి ఆర్య బెనర్జీ మృతి: కీలక విషయాలు వెల్లడి)

అయితే వైద్య విద్యార్థిని అయిన శిఖా నటనపై ఆసక్తితో ఇండస్త్రీలో అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన ఆమె సూపర్‌ స్టార్‌ షారుక్‌‌ ఖాన్‌ ‘ఫ్యాన్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి నటిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ బారిన పడిన వారికి సేవలందించేందుకు శిఖా మళ్లీ నర్సుగా మారి ఎంతోమంది కరోనా పెషేంట్స్‌కు ఆస్పత్రిలో సేవలు అందించారు. ఈ క్రమంలో ఆమెకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే మహమ్మారితో పోరాడి ఇటీవల ఆరోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె తాజాగా పక్షవాతం బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. (చదవండి: మా నాన్న జీవితం స్ఫూర్తిదాయకం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement