Shikha
-
అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్ అరెస్ట్.. 27 మందిపై 2023 కేసులు
సాక్షి, హైదరాబాద్: తొలిసారి అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. వీరిని పట్టుకొవాడినికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని, రాజస్థాన్‌లో నాలుగు బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని చెప్పారు. రాజస్థాన్, జైపూర్, జోధ్పూర్లలో ఈ ఆపరేషన్ నిర్వహించామని. 15 రోజుల అపరేషన్‌లో భాగంగా 27 మంది సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు అందరూ విద్యావంతులేననని, మొత్తం ముప్పై ఏళ్ళ లోపు వారే ఉన్నారని తెలిపారు.ఒక్కొక్కరు పదుల కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఈ 27 మందిపై తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులు నమోదైనట్లు శిఖా గోయల్ చెప్పారు. దేశ వ్యాప్తంగా 2023 కేసులో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్ ఫోన్స్, 37 సిమ్ కార్డ్స్, చెక్ బుక్స్లను స్వాధీనం చేసుకున్నామని ెప్పారు. నిందితులు 29 మ్యూల్ అకౌంట్లను సైబర్ క్రైమ్స్ కోసం సేకరించారని తెలిపారు. 11 కోట్లు లావాదేవీలు 29 అకౌంట్ల ద్వారా నిందితులు చేశారని, విచారణలో లావాదేవీల జరిపిన మొత్తం అమౌంట్ పెరిగే అవకాశం ఉందన్నారు.‘సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు స్పెషల్ ఆపరేషన్ చేయలేదు. స్పెషల్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేశాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులు అందర్నీ పట్టుకోగలిగాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా టీమ్స్ బృందాలుగా డిస్పాచ్ అయ్యి నిందితులను అరెస్ట్ చేశారు. మా బృందాలు ఎప్పటికపుడు నేరస్తుల కదలికలు, లోకేషన్లపై నిఘా పెట్టీ అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది కమిషన్ కోసం ఉద్దేశ పూర్వకంగానే మ్యూల్ అకౌంట్ లను నేరస్తులకు ఇస్తున్నారునేరస్తులకు క్రిమినల్ కార్యకలాపాల కోసం అకౌంట్స్ ఇవ్వవద్దు. తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులో నిందితులు రూ. 9 కోట్లు కొల్ల గొట్టారు. నిందితులను అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీసుల సహకరించారు. సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ ఇది లాస్ట్ ఆపరేషన్ కాదు. మొదటిది. నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ దేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తాం. నేరగాళ్లు సిటీలు వదిలి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల కొల్లగొట్టిన రూ. 114 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం బాధితులకు తిరిగి ఇచ్చాం. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలి. మ్యూల్ అకౌంట్లను ఓపెన్ చేసేముందు క్రాస్ చెక్ చేయాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని తెలిపారు. -
మీ భద్రతకు మాది భరోసా
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు అతివలకు అన్ని వేళలా అండగా ఉంటామని మహిళా భద్రత విభాగం డీజీ శిఖాగోయల్ భరోసా ఇచ్చారు. సమస్య ఏదైనా డయల్ 100కు కాల్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వస్తారని హామీ ఇచ్చారు. రకరకాల వేధింపులు ఎదుర్కొంటున్న వారిలో కొందరు నేటికీ ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్న నేపథ్యంలో వారి సమస్యలను నేరుగా శిఖాగోయల్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘మీతో సాక్షి’ శీర్షికన ఆగస్టు 27 నుంచి 3 రోజులపాటు సాక్షి నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. మహిళలు పలు సమస్యలను ‘సాక్షి’ దృష్టికి తీసుకురాగా వాటికి శిఖాగోయల్ సమాధానాలిచ్చారు. పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలు, వాటికి శిఖాగోయల్ ఇచ్చిన సమాధానాలు..ప్రశ్న: కోల్‌కతాలో ఓ జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మహిళా డాక్టర్ల భద్రతతోపాటు మహిళా రోగులు, వారి సహాయకుల భద్రతకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? – (అనురాధరావు, బాలలహక్కుల సంఘం) జవాబు: ఆస్పత్రుల్లో భద్రతాపరమైన మౌలికవసతుల కల్ప నపై దృష్టి పెట్టాం. అన్ని ఆస్పత్రుల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయి ంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా తెలుసుకొనేందుకు స్థానిక పోలీసుల ద్వారా సెక్యూరిటీ ఆడిట్లు నిర్వహిస్తున్నాం. ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో భద్రత ప్రమాణాలు మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి మాకు సమాచారం అందింది. ఆ నిబంధనలు రాగానే ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వాటి అమలుకు చర్యలు తీసుకుంటాం.ఆస్పత్రుల వద్ద సెక్యూరిటీ సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చే లా యాజమాన్యాలతో సమన్వయం చేసుకుంటున్నాం. విమెన్ సేఫ్టీ వింగ్‌లో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే సాహస్ మాడ్యూల్ ద్వారా పోష్ యాక్ట్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెస్సల్)పై ప్రచారం కలి్పస్తున్నాం. ఆస్పత్రుల్లో లైంగిక వేధింపులను కట్టడిచేసేందుకు ‘సాహస్’ మాడ్యూల్ ద్వారా చర్యలు తీసుకుంటాం.ప్రశ్న: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరి«ధిలో గతంలో ఆటోలు, క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్ ఇచ్చి అది ఆ వాహనం వెనుక డిస్ప్లే అయ్యేలా చేశారు. ఈమధ్య అది కనిపించట్లేదు. ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్ల వివరాలు పోలీసుల దృష్టిలో ఉండేలా మహిళా భద్రత విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు? – (హిమజ, ఓ కార్పొరేట్ కంపెనీ ఎండీ హైదరాబాద్) జవాబు: రాష్ట్రంలోని అనేక జిల్లాలు, నగర యూనిట్లలో ‘మై ఆటో ఈజ్ సేఫ్’ ప్రచారం ఉంది. ఆటో డ్రైవర్ల వివరాలు పోలీసులు తనిఖీ చేసి ధ్రువీకరిస్తారు. ఆటోలలో పోలీసుల ఫోన్ నంబర్లు ఉండేలా చూస్తున్నాం. మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమం అంతటా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. మీరు మీ ప్రయాణ సమయంలో సురక్షితంగా ఉండేలా డయల్ 100కు కాల్ చేసి అందులో 8 నొక్కడం ద్వారా ‘టీ–సేఫ్’ను ఎంచుకుంటే మీ ప్రయాణం పూర్తయ్యే వరకు పోలీసు పర్యవేక్షణ ఉంటుంది. https://womensafetywing. telang ana. gov. in/ women& safety& apps/ tsafe/ వెబ్సైట్లో లేదా టీ–సేఫ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని అందులో మీ ప్రయాణ వివరాలు నమోదు చేసినా కూడా పోలీసులు మీ ప్రయాణం సురక్షితంగా పూర్తయ్యే వరకు పర్యవేక్షిస్తారు. ఏ సమస్య ఉన్నా వెంటనే రంగంలోకి దిగుతారు. టీ–సేఫ్ యాప్‌లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు.ప్రశ్న: ఆఫీసుల్లో మహిళా ఉద్యోగుల హక్కులు, వారి భద్రత వంటి అంశాలపై చర్చించేందుకు తరచూ సమావేశాలు నిర్వహించాలన్న నిబంధన ఉన్నా మా కార్యాలయంలో అలాంటి సమావేశాలు నిర్వహించట్లేదు. వర్క్ ప్లేస్‌లో వేధింపులు, టీజింగ్‌పై ఫిర్యాదు చేసేందుకు మహిళలు వెనకాడుతున్నారు. ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలి? – (నీలిమ, ఓ ఐటీ సంస్థ ప్రాజెక్టు మేనేజర్, గచ్చి»ౌలి) జవాబు: పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు తెచి్చన పోష్ యాక్ట్–2013 ప్రకారం ప్రతి కంపెనీలో ఇంటర్నల్ కమిటీ (ఐసీ) ఉండాలి. అందులో ప్రిసైడింగ్ అధికారి, ఆ కార్యాలయ సభ్యులు సహా బయటి నుంచి ఒక నిపుణుడితో కలిసి కమిటీ పనిచేయాలి. మీ కార్యాలయంలో ఆ కమిటీ పనిచేయకపోతే మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు. రాష్ట్రంలోని ఏ కార్యాలయంలోని సిబ్బంది అయినా ఫిర్యాదులు చేసేందుకు, శిక్షణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం మీరు మహిళా భద్రత విభాగంలోని సాహస్ మాడ్యూల్ సిబ్బందిని సంప్రదించొచ్చు. మీ అభ్యర్థన మేరకు నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రశ్న: ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో మాకు తెలిసిన వాళ్లు లోన్ తీసుకొని నా పేరు ష్యూరిటీగా పెట్టారు. ఆ డబ్బులు ఇప్పుడు మీరే కట్టాలని మూడు నంబర్ల నుంచి ఫోన్ చేసి విపరీతంగా వేధిస్తున్నారు. బూతులు మాట్లాడుతున్నారు. నాతోపాటు నా మరదలికి కూడా 928xxx2832, 630xxx3981, 630xxx9649 నంబర్ల నుంచి ప్రతిరోజూ కాల్స్ వస్తున్నాయి. మమ్మల్ని వేధిస్తున్న వ్యక్తులను కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని మనవి. – (ప్రియాంక) జవాబు: మీరు వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వాళ్లు మీకు తగిన సాయం చేస్తారు. ప్రశ్న: హైదరాబాద్‌లో స్వాగ్ అనే ఒక ఆఫీస్ (అది ఫేక్ కంపెనీ)లో జాబ్ ఉందని మా సిస్టర్ కాల్ చేస్తే ఉద్యోగం కోసం వెళ్లా. అక్కడ శ్యామ్ అనే వ్యక్తి నన్ను గదిలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఇప్పుడు నేను ఐదు నెలల గర్భవతిని. ఈ విషయం మా ఇంట్లో చెప్పాను. మా అమ్మ అతడితో మాట్లాడితే డబ్బిస్తా.. ప్రెగ్నెన్సీ తీయించాలని చెబుతున్నాడు. నన్ను మోసం చేసినట్లే శ్యామ్ ఎందరో ఆడపిలల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నాకు ఇప్పుడు చావు తప్ప వేరే దారి లేదు. నాకు న్యాయం చేయండి..? – (శ్రీజ) జవాబు: మీరు వెంటనే మీ దగ్గరిలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. మీకు మా నుంచి సహాయం కావాలంటే లక్డీకాపూల్‌లోని మహిళా భద్రత విభాగం కేంద్ర కార్యాలయంలో సంప్రదించండి. మీకు తగిన సూచనలతోపాటు న్యాయపరమైన అంశాల్లో సాయం అందిస్తాం. ప్రశ్న: నాకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమధ్య ఎవరో ఒక వ్యక్తి నా భర్త మొబైల్‌కు నా గురించి చెడుగా మెసేజ్‌లు పంపుతున్నాడు. వాటిని నమ్మి నా భర్త వారం నుంచి నాతో గొడవపడుతున్నాడు. అవతలి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. రోజూ గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి నా భర్తకు ఫోన్లు చేసి నా గురించి చెడుగా చెబుతున్నాడు. దయచేసి చర్యలు తీసుకోగలరు..? – (చందన, హనుమకొండ జిల్లా)జవాబు: మీ సమస్యను మా అధికారులు పరిశీలిస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: గుర్తుతెలియని ఈ–మెయిల్ ఐడీ ద్వారా నన్ను వేధిస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్‌కు కూడా పోస్టులు పెడుతున్నారు. తగిన చర్యలు తీసుకోగలరు. - (నిహారిక) జవాబు: మహిళా భద్రత విభాగం మీ ఫిర్యాదును తీసుకుంది. వివరాల కోసం మా షీ–టీమ్స్ అధికారి సంప్రదిస్తారు. ప్రశ్న: నాకు వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తుంటే నా భర్తపై జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. పోలీసులు నా భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినా ఏదో రకంగా వేధిస్తున్నాడు. మా ఇంట్లో హిడెన్ కెమెరాలు పెట్టినట్టు నా అనుమానం. ఈ సమస్యల నుంచి బయటపడేలా నాకు పరిష్కారం చూపగలరు. -(హరిణి)జవాబు..: మా టీం మిమ్మల్ని సంప్రదించినా హిడెన్ కెమెరాలకు సంబంధించి తగిన వివరాలు ఇవ్వలేకపోయారు. -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్‌లతో బ్లాక్‌మెయిలింగ్‌లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి. -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్ లతో బ్లాక్‌మెయిలింగ్‌లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి.నోట్: పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని కోరితే..వారి అభిప్రాయాలను ‘సాక్షి’ గౌరవిస్తుంది -
బాధితులకు భరోసా..
సాక్షి, హైదరాబాద్: ఎవరు అవునన్నా, కాదన్నా.. పురుషాధిక్య సమాజంలో మహిళలంటే చిన్నచూపే. లైంగిక దాడికి గురైన బాధితులంటే మరీనూ. బయటికొస్తే చాలు అవమానపు మాటలు, అనుమానపు చూపులతో బతకడమే వృథా అనే పరిస్థితులను అధిగమించి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే ఎంతో మనోధైర్యం, భరోసా అవసరం. ఇలాంటివారి జీవితాల్లో వసంతాన్ని నింపేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం సరికొత్త కార్యక్రమానికి ప్రణాళిక రచిస్తోంది. బాధిత మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్ వీ–హబ్‌తో చేతులు కలిపింది. బాధిత మహిళలకు జీవనోపాధికి అవసరమైన ఆర్ధిక భరోసా, సాంత్వన అందించనుంది. ఎంపిక ఎలా? ఎలాంటి వ్యాపారాలు? మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న భరోసా కేంద్రాల ద్వారా లైంగిక దాడికి గురైన బాధితులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పథకాలు గురించి వారికి అవగాహన కల్పిస్తారు. సొంతంగా వ్యాపారం, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆసక్తి, నైపుణ్యం ఉంటే.. వారితో మాట్లాడి, ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. వారి ఆర్ధిక వనరుల గురించి అధ్యయనం చేసి, చేయూతనిస్తారు. స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, బేకరి ఉత్పత్తులు వంటి తినుబండారాల వ్యాపారం, బ్యూటీపార్లర్, కుట్లు అల్లికలు, జ్యువెలరీ తయారీ వంటి చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేందుకు సహకరిస్తారు. వందకు పైగా బాధితులకు శిక్షణ.. తొలి దశలో మేడ్చల్, వరంగల్ వంటి ఏడు జిల్లాల నుంచి వందకు పైగా బాధిత మహిళలను ఎంపిక చేసినట్లు తెలిసింది. తొలి సెషన్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులతో చర్చించి, వారి వ్యాపార ఆలోచనల గురించి తెలుసుకున్నామని, ఆయా వ్యాపార అవకాశాలపై వారికి అవగాహన కల్పిచామని వీ–హబ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. త్వరలో రెండో సెషన్ నిర్వహించి, ఎవరు ఏ కేటగిరీ వ్యాపారాలకు సెట్ అవుతారో అధ్యయనం చేసి, ఎంపిక చేస్తామన్నారు. వీ–హబ్ ఏం చేస్తుందంటే? ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎదురయ్యే ప్రధాన ఇబ్బంది గుర్తింపు లేకపోవటమే. బాధిత ఎంటర్ప్రెన్యూర్లకు ఆ ఇబ్బంది ఉండదు. ఏ తరహా వ్యాపారానికి ఎలాంటి లైసెన్స్‌లు అవసరం దగ్గరి నుంచి డాక్యుమెంటేషన్, మార్కెటింగ్, పథకాలు, ఆర్ధిక వనరుల వరకూ అన్ని వైపుల నుంచి సహాయసహకారాలు అందిస్తారు. వీ–హబ్ మెంటార్షిప్తో పాటు క్రెడిట్ లింకేజ్ కోసం రుణ దాతలు, రుణ గ్రహీతలను కలుపుతారు. ప్రాథమిక దశలో ఉంది.. మహిళల భద్రతే షీ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ తొలి ప్రాధాన్యం. లైంగిక దాడి బాధితులకు కావాల్సిన సహాయం చేసేందుకు నిత్యం సిద్ధంగా ఉంటాం. బాధిత మహిళలకు అండగా నిలవడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. – శిఖా గోయల్, అదనపు డీజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ -
మహిళల భద్రతకు పెద్దపీట
నాగోలు: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ.. దాడులకు గురైన మహిళలకు బాసటగా నిలిచేలా భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళ భద్రత కోసం ఈటీమ్స్ పనిచేస్తూన్నాయని తెలిపారు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఆదుకోవడానికి మేం ఉన్నాం అన్న భరోసా కలి్పస్తామని పేర్కొన్నారు. మహిళల సౌకర్యార్థం నగరంలోని కమిషనరేట్లలో పరిధిలో 26 సీడీఈబ్ల్యూ సెంటర్ ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ప్రధాన సబ్ డివిజన్లో సీడీఈడబ్ల్యూ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు స్థానిక పోలీస్ స్టేషన్లో, భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించే వారని తెలిపారు. కౌన్సెలింగ్ చాలా ప్రొఫెనల్ సబ్జెక్ట్, వృత్తిపరమైన సహాయం పొందడానికి కౌన్సెలర్లను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన నేరాలలో గృహహింస ఒకటి అనిపేర్కొన్నారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత, మహిళా రక్షణ, మహిళల భద్రత, గృహ హింస, ఇతర వేధింపుల రక్షణ కల్పించేందుకు కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారన్నారు. ఆన్లైన్, ఆన్‌రోడ్ ఈవ్‌టీజింగ్, వేధింపులను అరికట్టేందుకు సైబర్ స్టాకింగ్‌పై అవగాహన కార్యక్రమాలు, షార్ట్ఫిల్్మను రూపొదిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళల భద్రతకు, భరోసా ఇవ్వడానికి రాచకొండ పోలీస్‌లు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మహిళా భద్రత డీసీపీ శ్రీబాల, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, షీ టీమ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, సరూర్‌నగర్ మహిళా పీఎస్ సీఐ మంజుల, ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Shikha Khanna: నూరు తల్లుల కథ
31 ఒక్క దేశాలు. 100 మంది తల్లులు. వారు టీచర్లు, సైంటిస్ట్‌లు, క్రీడాకారులు, సంగీతకారులు, మహిళా సైనికులు... రంగాలు వేరు. కాని మాతృత్వం ఒకటే. ఒక మహిళ నిర్వహించే అత్యుత్తమ కర్తవ్యం తల్లి కావడం. అందుకు ప్రతి తల్లీ ఒక భిన్న ప్రయాణం చేస్తోంది. ఆ తల్లుల గాధలు అందరికీ తెలియాలి అని భావించిన ప్రసిద్ధ పోర్ట్రయిట్ ఫొటోగ్రాఫర్ శిఖా ఖన్నా వందమంది తల్లుల ఫొటోలు, ఇంటర్వ్యూలతో ‘100 సెల్ఫ్పోర్ట్రయిట్స్ 100 డ్రీమ్స్’ పేరుతో పుస్తకం తెస్తోంది. ఈ సందర్భంగా వచ్చే వారం పూణెలో ఈ వందమంది తల్లులు ఒక వేదిక మీదకు రానున్నారు. ఈ ఘట్టం తల్లి గొప్పదనాన్ని చాటనుంది. ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసే ఒక తల్లికి లడాఖ్‌లో డ్యూటీ. ఆ సమయానికి ఆమెకు రెండేళ్ల పాప ఉంది. దూరాన వదల్లేదు. లడాఖ్‌లో ప్రతికూల వాతావరణంలో పెంచడం రిస్క్. ఉద్యోగమా... మాతృత్వమా? ఏం... రెండూ ఎందుకు చేయకూడదు. ఆమె తన రెండేళ్ల కూతురిని లడాఖ్ తీసుకెళ్లింది. ఒకవైపు డ్యూటీ చేస్తూనే మరోవైపు కూతురిని పెంచింది. ఆ తల్లి ఆ సవాలును ఎలా స్వీకరించి దాటిందో ఆ కథ తెలిస్తే ఎలా ఉంటుంది? ఒక తల్లి అంధురాలైన కళాకారిణి. అంధత్వంతో కళలో సాగడమే ఒక కష్టమైతే తల్లిగా బాధ్యతలు నెరవేర్చడం ఇంకా కష్టం. కాని ఆ తల్లి ఆ బాధ్యతను నెరవేర్చింది. అందుకు ఏ యే ఇక్కట్లను దాటింది? ఆమె నోటి గుండా వింటే ఎంత బాగుంటుంది? ఒక తల్లి క్రీడల్లో కొనసాగాలి. దేశాలు తిరగాలి. మరోవైపు పిల్లలు. ఆటల కోసం వ్యాయామానికి, ప్రాక్టీసుకు సమయం ఇవ్వాలి. మరోవైపు పిల్లలకూ ఇవ్వాలి. ఎంత ఒత్తిడి. ఏదో ఒకటి ఎంచుకొని రెండోది వదిలేయకుండా రెంటినీ నిర్వహించడంలోనే ఆ తల్లి గొప్పదనం ఉంది. ఆ కథ లోకంలో ఎందరికి తెలుసు? తల్లులు ఇంటి పట్టునే ఉన్నా, కెరీర్లో ఉన్నా పిల్లల పెంపకం కోసం ఎనలేని త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం స్వార్థమెరుగని అంకితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా వివిధ రంగాల్లో ఉంటూ ఆ రంగాల్లో తమదైన విజయాన్ని నమోదు చేస్తూ కూడా పిల్లల పెంపకంలో ఏ వంకా వదలని తల్లులు తమ జీవితాలను తమ మాటల్లో చెప్తే కచ్చితంగా ఈ కాలం తల్లులకు, కాబోయే తల్లులకు స్ఫూర్తిగా ఉంటుంది. మగవారు వాటిని వింటే తల్లులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మరింత విశదం అవుతుంది. ఆ ఆలోచనతోనే ఫొటోగ్రాఫర్ శిఖా ఖన్నా ‘ఎంయుఎం’ (మదర్స్ యునైటెడ్ మూవ్మెంట్) అనే ప్రాజెక్ట్ మొదలెట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ‘100 సెల్ఫ్ పోర్ట్రెయిట్స్ 100 డ్రీమ్స్’ అనే పుస్తకాన్ని తెచ్చింది. ఆ పుస్తకంలో తల్లుల జీవన గాథలు వారి మాటల్లోనే రికార్డు చేసింది. 31 దేశాల నుంచి 100 మంది తల్లులు– వారంతా తమ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నవారు... వృత్తిలో విజయం సాధిస్తూనే తల్లిగా కూడా విజయం సాధించినవారు– తమ అనుభవాలను ఈ పుస్తకంలో చెప్పారు. భారతదేశం నుంచి అథ్లెట్ అశ్వినీ నాచప్ప, పారా అథ్లెట్ దీపా మాలిక్ తదితరులు ఉన్నారు. ఇతర దేశాల నుంచి టీచర్లుగా, మ్యూజిక్ టీచర్లుగా, లైఫ్‌స్టయిల్ కోచ్‌లుగా, గాయనులుగా, హక్కుల ఉద్యమకారులుగా, చెఫ్‌లుగా, ఫొటోగ్రాఫర్లుగా వివిధ రంగాలలో కొనసాగుతున్న తల్లులు ఉన్నారు. ‘తల్లి గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే. ఈ పుస్తకం ఆమెను మరింత ఉన్నతంగా ఉంచుతుంది’ అంటుంది శిఖా ఖన్నా. స్వయంగా ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ అయిన శిఖా భారతదేశంలో న్యూబోర్న్ బేబీల ఫొటోగ్రఫీని తొలిగా ప్రవేశ పెట్టింది. దాదాపు 1000 ప్రముఖ కుటుంబాల ఫొటోలు తీసిందామె. అంతే కాదు యువతరం కోసం ఆన్లైన్లో ఫొటోగ్రఫీ క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. తను తల్లయ్యాక ఫొటోగ్రాఫర్/ తల్లిగా రెండు పాత్రలు పోషించడంలో తానెంత ఫోకస్డ్గా ఉండాల్సి వచ్చిందో అర్థమయ్యాక ఇలా పని చేసే తల్లుల కథలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి కదా అనిపించింది. పిల్లలు పుట్టగానే చాలామంది తల్లులు తమకు ఎంతో ఇష్టమైన వృత్తిని, ఉపాధిని, హాబీని వదిలేస్తుంటారు. అలాంటి వారు ఒక ధైర్యం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం తెచ్చిందామె. పూణెలో నవంబర్ 11 నుంచి 13 తేదీల మధ్య జరిగే ఈవెంట్లో ఈ 100 మంది తల్లులు వచ్చి నేరుగా ప్రేక్షకులతో మాట్లాడనున్నారు. స్త్రీల మాతృత్వానికి, జీవన రంగానికి సంబంధించిన అనేక సెషన్స్ జరగనున్నాయి. అలాగే ఈ పుస్తకం ఆవిష్కరణ కూడా జరగనుంది. ప్రధాని మెచ్చుకుని ఈ ఈవెంట్ విజయవంతం కావాలని సందేశం పంపారు. ఈ ఈవెంట్లో పాల్గొనే తల్లులకు శుభాకాంక్షలు. తల్లులు ఇంటి పట్టునే ఉన్నా, కెరీర్లో ఉన్నా పిల్లల పెంపకం కోసం ఎనలేని త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం స్వార్థమెరుగని అంకితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా వివిధ రంగాల్లో ఉంటూ ఆ రంగాల్లో తమదైన విజయాన్ని నమోదు చేస్తూ కూడా పిల్లల పెంపకంలో ఏ వంకా వదలని తల్లులు తమ జీవితాలను తమ మాటల్లో చెప్తే కచ్చితంగా ఈ కాలం తల్లులకు, కాబోయే తల్లులకు స్ఫూర్తిగా ఉంటుంది. మగవారు వాటిని వింటే తల్లులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మరింత విశదం అవుతుంది. -
కరోనా: పక్షవాతం బారినపడ్డ షారుక్ సహనటి
ముంబై: కోవిడ్ రోగులకు సేవలందిస్తూ కరోనా వైరస్ బారిన పడిన బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. మహమ్మారితో పోరాడి ఇంటికి వచ్చిన ఆమె తాజాగా పక్షవాతం బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ అశ్విన్ శుక్లా మంగళవారం ప్రకటించారు. ‘శిఖా పక్షవాతానికి గురయ్యారు. ఆమెకు కుడి వైపు స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం శిఖా కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’ అంటూ ఆమె ఫొటోను షేర్ చేశాడు. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు షాక్ గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు. (చదవండి: నటి ఆర్య బెనర్జీ మృతి: కీలక విషయాలు వెల్లడి) అయితే వైద్య విద్యార్థిని అయిన శిఖా నటనపై ఆసక్తితో ఇండస్త్రీలో అడుగుపెట్టారు. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఆమె సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’ చిత్రంలో కీలక పాత్ర పోషించి నటిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో కోవిడ్ బారిన పడిన వారికి సేవలందించేందుకు శిఖా మళ్లీ నర్సుగా మారి ఎంతోమంది కరోనా పెషేంట్స్‌కు ఆస్పత్రిలో సేవలు అందించారు. ఈ క్రమంలో ఆమెకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే మహమ్మారితో పోరాడి ఇటీవల ఆరోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె తాజాగా పక్షవాతం బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. (చదవండి: మా నాన్న జీవితం స్ఫూర్తిదాయకం) -
జయరాం,శిఖా చౌదరి మధ్య సంబంధాలపై విచారణ
-
శిఖాచౌదరిని విచారించనున్న తెలంగాణ పోలీసులు
-
సేఫ్ సిటీ కోసమే షీటీమ్స్
గన్‌ఫౌండ్రీ: హైదరాబాద్‌ను ప్రపంచంలోనే మహిళలకు అత్యంత భద్రతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సిటీ షీటీమ్స్ అడిషనల్ సీపీ షికాగోయల్ అన్నారు. ప్రజారవాణ వ్యవస్థలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల వేధింపులపై అవగాహన కల్పించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీస్, రేడియో మిర్చి సహకారంతో ‘నెక్ట్స్ స్టాప్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలి పారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను శుక్రవా రం ఆదర్శ్‌నగర్ హాకా భవన్‌లోని భరోసా కేం ద్రంలో ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళ లు, బాలికలు ధైర్యంగా తమకు సమాచారం అం దించాలని సూచించారు. ఇప్పటి వరకు షీటీమ్స్ బృందం 5వేల కేసులు నమోదు చేసిందన్నారు. ఇకపై మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులలో సైతం ప్రత్యే క దృష్టిసారిస్తామన్నారు. ఈవ్‌టీజింగ్, వివిధ రకాల వేధింపులపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, రేడియో మిర్చి సహకారంతో రేడియో జాకీలు శనివారం నుంచి వారం రోజుల పాటు ప్రజారవాణా వాహనాల్లో ప్రయాణిస్తారని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్ శ్రీధర్, ఆర్జే షేజీ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా కలెక్టర్‌పై చిందులు
► సీఎం ఆప్తుడు మరిగౌడపై చార్జ్‌షీట్ దాఖలు ► ఆరోపణలు నిజమేనని నిర్ధరణ మైసూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు, మాజీ జిల్లా పంచాయతీ అధ్యక్షుడు కె.మరిగౌడకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు. మైసూరు జిల్లా కలెక్టర్‌గా సి.శిఖా ఉన్న సమయంలో ఆమెను మరిగౌడ ఏకవచనంలో దూషించడంతో పాటు విధులకు అడ్డుపడినట్లు, బెదిరించినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఊపందుకుంది. పోలీసు విచారణలో ఆరోపణలు తేలడంతో మైసూరు నజరాబాద్ పోలీసులు మరిగౌడపైన 45 పేజీల చార్జిషీట్‌ను రూపొందించి మైసూరు కోర్టులో గురువారం సమర్పించారు. తహసిల్దార్ బదిలీపై కలెక్టర్‌తో గొడవ 2016 జులై 3వ తేదీన సీఎం సిద్ధరామయ్య మైసూరు గెస్ట్‌హౌస్‌లో బసచేసిన సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఉన్న సీ.శిఖా వచ్చి సీఎంను స్వాగతించారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సీఎంకు సన్నిహితుడైన మరిగౌడ మైసూరు జిల్లా నుంచి యాదగిరికి తహసిల్దార్ నవీన్ జోసెఫ్‌ను ఎందుకు బదిలీ చేశారని కలెక్టర్ శిఖాను ప్రశ్నించారు. అక్కడ చాలామంది అధికారులు ఉండగానే ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆమెను ఏకవచనంతో నిలదీశారు. ఈ ఘటన పైన కలెక్టర్ శిఖా నజరాబాద్ పోలీసులకు కే.మరిగౌడతో పాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పరారీలోనున్న మరిగౌడ ముందస్తు బెయిలు కోసం తీవ్రంగా యత్నించారు. నెలరోజుల తరువాత మరిగౌడ నజరాబాద్ పోలీసు స్టేషన్లో లొంగిపోవడంతో పాటు నెల రోజుల పాటు కస్టడీపై జైల్లో గడిపారు. తరువాత బెయిల్ దక్కింది. పోలీసులు విచారణ జరిపి మరిగౌడ, మైసూరు తాలూకా కో ఆపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు మంజునాథ్, బసవరాజులపై విధులకు అడ్డుపడడం, బెదిరింపు, దూషించడం తదితర సెక్షన్లతో అభియోగాలు మోపారు. మరో ఇద్దరు నిందితులు ఆనంద్, సిద్దరాజులు ఇంకా పరారీలో ఉన్నారు. -
ఆ ఐఏఎస్ నిజాయితీకి బదిలీ బహుమానం
మైసూరు జిల్లా కలెక్టర్ సి.శిఖాపై బదిలీ వేటు బెంగళూరు: నిజాయితీగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారిపై బదిలీ వేటు పడింది. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన మైసూరు జిల్లా కలెక్టర్ సి. శిఖాను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఆమెను సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూలై 3న విధి నిర్వహణలో ఉన్న కలెక్టర్ శిఖాపై సీఎం సిద్ధరామయ్యకు ఆప్తుడైన మైసూరు జిల్లా పంచాయతీ మాజీ అధ్యక్షుడు మరిగౌడ దుర్భాషలాడారు, బెదిరింపులకు పాల్పడ్డారు. అదే రోజున కలెక్టర్ శిఖా మైసూరులోని నజర్బాద్ పోలీస్‌స్టేషన్‌లో మరిగౌడపై ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణకు అడ్డుపడడంతో పాటు బెదిరింపులకు దిగారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై 3 నుంచి ఆగస్టు 3 వరకు నెల రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మరిగౌడ, కోర్టు జామీను ఇచ్చేందుకు నిరాకరించడంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. సీఎం ఆప్తుడిపై ఫిర్యాదు చేసినందుకే ఈ బదిలీ చోటు చేసుకుందని ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో మైసూరు దసరా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ శిఖాను బదిలీ చేయడం సరైన నిర్ణయం కాదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, మండ్య జిల్లా కలెక్టర్‌గా ఉన్న శిఖా భర్త డాక్టర్ ఎం.ఎన్.అజయ్ నాగభూషణ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా నాగభూషణ్‌ను బదిలీ చేసింది. వీరిద్దరితో పాటు ఐఏఎస్ అధికారులు ఎం.వి.సావిత్రి, మనోజ్ జైన్, డి.రణ్‌దీప్, ఖుష్బూగోయల్ చౌదరి, రమణ్‌దీప్ చౌదరి, హెచ్.ఆర్.మహదేవ్, ఎస్.జియాఉల్లా, కె.బి.శివకుమార్, ఎం.జి.హీరేమఠ్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
కట్నం కోసం భార్యను కడతేర్చాడు
ముజాప్ఫానగర్: కట్నం కోసం వేధిస్తూ భార్యను హత్యచేసాడో భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజాప్ఫానగర్, గయానా లో సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. చర్తావాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న షిఖా అనే మహిళ అనుమాన్పస్థితిలో ఊరేసుకుని మృతిచెందినట్టు పోలీస్ అధికారి అకుల్ అహ్మద్ తెలిపారు. కట్నం కోసం వేధిస్తూ తన కూతురున్ని ఆమె భర్త, మామ కలిసి ఇంటి గదిలో ఊరేసి చంపేశారంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేశారు. షిఖా భర్త నిఖిల్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, మామ మదన్‌లాల్ పరారీలో ఉన్నాడు. అయితే గతంలో మదన్‌లాల్ కట్నం వేధింపుల కేసులో అరెస్ట్ అయినట్టు పోలీసులు పేర్కొన్నారు. షిఖా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించినట్టు చెప్పారు.