అంతర్రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌.. 27 మందిపై 2023 కేసులు | Telangana Cyber Security Bureau Arrested Interstate gang of 27 Criminals | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌.. 27 మందిపై 2023 కేసులు

Published Tue, Oct 1 2024 4:36 PM | Last Updated on Tue, Oct 1 2024 4:49 PM

Telangana Cyber Security Bureau Arrested Interstate gang of 27 Criminals

సాక్షి, హైదరాబాద్‌: తొలిసారి అంతర్రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. వీరిని పట్టుకొవాడినికి స్పెషల్‌ ఆపరేషన్‌ నిర్వహించామని, రాజస్థాన్‌లో నాలుగు బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని చెప్పారు. రాజస్థాన్, జైపూర్, జోధ్‌పూర్‌లలో ఈ ఆపరేషన్ నిర్వహించామని. 15 రోజుల అపరేషన్‌లో  భాగంగా 27 మంది సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు అందరూ విద్యావంతులేననని, మొత్తం ముప్పై ఏళ్ళ లోపు వారే ఉన్నారని తెలిపారు.

ఒక్కొక్కరు పదుల కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఈ 27 మందిపై తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులు నమోదైనట్లు శిఖా గోయల్‌ చెప్పారు. దేశ వ్యాప్తంగా 2023 కేసులో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్ ఫోన్స్, 37 సిమ్ కార్డ్స్, చెక్ బుక్స్‌లను స్వాధీనం చేసుకున్నామని ెప్పారు. నిందితులు 29 మ్యూల్ అకౌంట్‌లను  సైబర్ క్రైమ్స్ కోసం సేకరించారని తెలిపారు. 11 కోట్లు లావాదేవీలు 29 అకౌంట్ల ద్వారా నిందితులు చేశారని, విచారణలో లావాదేవీల జరిపిన మొత్తం అమౌంట్ పెరిగే అవకాశం ఉందన్నారు.

‘సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు స్పెషల్ ఆపరేషన్ చేయలేదు. స్పెషల్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేశాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులు అందర్నీ పట్టుకోగలిగాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా టీమ్స్ బృందాలుగా డిస్పాచ్ అయ్యి నిందితులను అరెస్ట్ చేశారు. మా బృందాలు ఎప్పటికపుడు నేరస్తుల కదలికలు, లోకేషన్‌లపై  నిఘా పెట్టీ అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది కమిషన్  కోసం ఉద్దేశ పూర్వకంగానే మ్యూల్ అకౌంట్ లను నేరస్తులకు ఇస్తున్నారు

నేరస్తులకు క్రిమినల్ కార్యకలాపాల కోసం అకౌంట్స్ ఇవ్వవద్దు. తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులో నిందితులు రూ. 9 కోట్లు కొల్ల గొట్టారు. నిందితులను అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీసుల సహకరించారు. సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ ఇది లాస్ట్ ఆపరేషన్ కాదు. మొదటిది. నేరాలకు పాల్పడిన క్రిమినల్స్  

దేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తాం. నేరగాళ్లు సిటీలు వదిలి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల కొల్లగొట్టిన రూ. 114  కోట్ల రూపాయలను ఈ సంవత్సరం బాధితులకు తిరిగి ఇచ్చాం. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలి. మ్యూల్ అకౌంట్‌లను ఓపెన్ చేసేముందు క్రాస్ చెక్ చేయాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement