
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగవెల్లి రాజలింగమూర్తి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన భర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకేసులో బీఆర్‌ఎస్ పెద్దల హస్తం ఉందని బాధితుడి భార్య సరళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజలింగమూర్తి హత్యపై ఆయన భార్య సరళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా భర్త హత్యలో బీఆర్‌ఎస్ పెద్దల హస్తం ఉంది. గండ్ర వెంకట రమణా రెడ్డి నా భర్త హత్యలో సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన అనుచరుడే హత్యకు సూత్రదారుడిగా ఉన్నారు.
దీన్ని బట్టే అర్థమవుతోంది.. హత్య వెనుక ఎవరెవరి హస్తాలు ఉన్నాయో. హత్యకు గల కారణం ఏంటో. చిన్న భూమి తగాద విషయంలో ఈ హత్య జరగలేదు. భూమి విషయంలో హత్య జరిగితే ఎలాంటి సంబంధం లేని కొత్త హరిబాబు ప్రమేయం ఇందులో ఎందుకు ఉంది.
మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై కేసు వేసినందుకే నా భర్తను హత్య చేశారు.రేణికుంట్ల కొమురయ్యకు భూమి తగదాలో నా భర్త వారికి సహాయం చేశారు. నా భర్త హత్య కేసు నమోదు సమయంలో నేను ఇచ్చిన సంచారం వేరు, పోలీసులు నమోదు చేసుకున్నది వేరుగా వుంది. సీబిసిఐడి దర్యాప్తు బృందం చేత హత్య కేసు విచారణ జరిపించాలి. గండ్ర వెంకటరమణా రెడ్డి, కొత్త హరిబాబులను శిక్షించి మా కుటుంబానికి న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment