నాగోలు: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ.. దాడులకు గురైన మహిళలకు బాసటగా నిలిచేలా భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళ భద్రత కోసం ఈటీమ్స్ పనిచేస్తూన్నాయని తెలిపారు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఆదుకోవడానికి మేం ఉన్నాం అన్న భరోసా కలి్పస్తామని పేర్కొన్నారు. మహిళల సౌకర్యార్థం నగరంలోని కమిషనరేట్లలో పరిధిలో 26 సీడీఈబ్ల్యూ సెంటర్ ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ప్రధాన సబ్ డివిజన్‌లో సీడీఈడబ్ల్యూ సెంటర్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇప్పటి వరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో, భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించే వారని తెలిపారు. కౌన్సెలింగ్ చాలా ప్రొఫెనల్ సబ్జెక్ట్, వృత్తిపరమైన సహాయం పొందడానికి కౌన్సెలర్‌లను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన నేరాలలో గృహహింస ఒకటి అనిపేర్కొన్నారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత, మహిళా రక్షణ, మహిళల భద్రత, గృహ హింస, ఇతర వేధింపుల రక్షణ కల్పించేందుకు కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారన్నారు.
ఆన్‌లైన్, ఆన్‌రోడ్ ఈవ్‌టీజింగ్, వేధింపులను అరికట్టేందుకు సైబర్ స్టాకింగ్‌పై అవగాహన కార్యక్రమాలు, షార్ట్‌ఫిల్‌్మను రూపొదిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళల భద్రతకు, భరోసా ఇవ్వడానికి రాచకొండ పోలీస్‌లు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మహిళా భద్రత డీసీపీ శ్రీబాల, ఎల్‌బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, షీ టీమ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, సరూర్‌నగర్ మహిళా పీఎస్ సీఐ మంజుల, ఎల్‌బీనగర్ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment