Family counseling center
-
మహిళల భద్రతకు పెద్దపీట
నాగోలు: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ.. దాడులకు గురైన మహిళలకు బాసటగా నిలిచేలా భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళ భద్రత కోసం ఈటీమ్స్ పనిచేస్తూన్నాయని తెలిపారు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఆదుకోవడానికి మేం ఉన్నాం అన్న భరోసా కలి్పస్తామని పేర్కొన్నారు. మహిళల సౌకర్యార్థం నగరంలోని కమిషనరేట్లలో పరిధిలో 26 సీడీఈబ్ల్యూ సెంటర్ ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ప్రధాన సబ్ డివిజన్లో సీడీఈడబ్ల్యూ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు స్థానిక పోలీస్ స్టేషన్లో, భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించే వారని తెలిపారు. కౌన్సెలింగ్ చాలా ప్రొఫెనల్ సబ్జెక్ట్, వృత్తిపరమైన సహాయం పొందడానికి కౌన్సెలర్లను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన నేరాలలో గృహహింస ఒకటి అనిపేర్కొన్నారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత, మహిళా రక్షణ, మహిళల భద్రత, గృహ హింస, ఇతర వేధింపుల రక్షణ కల్పించేందుకు కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారన్నారు. ఆన్లైన్, ఆన్‌రోడ్ ఈవ్‌టీజింగ్, వేధింపులను అరికట్టేందుకు సైబర్ స్టాకింగ్‌పై అవగాహన కార్యక్రమాలు, షార్ట్ఫిల్్మను రూపొదిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళల భద్రతకు, భరోసా ఇవ్వడానికి రాచకొండ పోలీస్‌లు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మహిళా భద్రత డీసీపీ శ్రీబాల, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, షీ టీమ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, సరూర్‌నగర్ మహిళా పీఎస్ సీఐ మంజుల, ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తొందరొద్దు.. సరిదిద్దుకుందాం!
నేరేడ్మెట్: వివాహ సంబంధాల్లో తలెత్తే వివాదాలు, పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి రాచకొండ కమిషనరేట్‌లో ప్రత్యేక ఫ్యామిటీ కౌన్సిలింగ్ కేంద్రం అందుటులోకి వచ్చింది. ఈ కేంద్రానికి భూమిక విమెన్ సెల్ (ఎన్జీఓ) నోడల్ ఏజెన్సీగా వ్యవహారిస్తుంది. గురువారం నేరేడ్మెట్లోని డీసీపీ కార్యాలయం వెనుక ఏర్పాటు చేసిన ‘స్పెషల్ సెల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్స్ ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సెలింగ్ సెంటర్’ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ లాంఛనంగా ప్రారంభించారు. గృహహింస నుంచి స్త్రీలకు రక్షణ కల్పించడంతో పాటు బాధిత మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం అందిస్తూ అండగా నిలుస్తుందీ సెంటర్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, షీ–టీమ్ అడిషనల్ డీసీపీ సలీమ, అడ్మిన్ డీసీపీ శిల్పవల్లి, ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సిలింగ్ సెంటర్ ముఖ్య నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి, ఇన్ఫోసిస్ ప్రతినిధి విష్ణుప్రియ, రజిని, సీసీఎండీ శాస్త్రవేత్త లత, ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సిలింగ్ కేంద్రం కౌన్సిలర్లు, పలువురు మహిళలు పాల్గొన్నారు. బాధిత మహిళలకు తోడ్పాటు ఇలా.. ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో భువనగిరి, సరూర్‌నగర్ మహిళా ఠాణాల్లో, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో మొత్తం మూడు కౌన్సిలింగ్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. నేరేడ్మెట్లోని ప్రత్యేక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో కమిషనరేట్ పరిధిలోని అన్ని ఠాణాల్లో నమోదయ్యే పెళ్లి వివాదాలు, గృహహింస కేసులు, బాధితులకు న్యాయ సహాయం, చిన్నారుల సంరక్షణ, ప్రతివాది నుంచి రక్షణ కల్పించడం, వైద్య సహాయం, ఆర్థిక సహకారం వంటివి కల్పిస్తారు. గృహహింస చట్టం ప్రకారం వారిలో మానసిక స్థైర్యాన్ని నింపి భరోసానివ్వడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్ఆర్ఐ కేసులపై ప్రత్యేక దృష్టి.. ఎన్ఆర్ఐ, ఇతర రాష్ట్రాల, పోలీస్ కమిషనరేట్ల, జిల్లాలకు చెందిన గృహహింస కేసుల పరిష్కారం కోసమే స్పెషల్ సెల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్స్ ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సిలింగ్ సెంటర్‌ను భూమిక ఎన్జీఓ సంస్థ ద్వారా సీపీ మహేష్ భగవత్ అందుబాటులోకి తెచ్చారు. పెళ్లయిన నెల రోజులకే విడాకుల కోసం బాధిత మహిళలు రాచకొండ సీపీ కార్యాలయానికి వస్తున్నారు. వీటిలో అధికంగా ఎన్ఆర్ఐ కేసులే ఉంటున్నాయి. ప్రత్యేక ఫ్యామిలీ కేంద్రం ద్వారా మొదట వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. విడాకుల వరకు వెళ్లకుండా నచ్చజెబుతారు. బాధిత మహిళలకు రక్షణ, ఆర్థిక సాయం, చిన్నారులకు విద్య, సంరక్షణకు తోడ్పాటునందిస్తారు. -
కలహాలు తుడిపి...కాపురాలు కలిపి
కామారెడ్డి, న్యూస్‌లైన్: 2004లో కామారెడ్డి డీఎస్పీగా పనిచేసిన పరిమళ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. డీఎస్పీ కార్యాలయ ఆవరణలో దీనికి ప్రత్యేక గదిని కేటాయించారు. భార్య, భర్త మధ్య తలెత్తే విభేదాలతోపాటు, సంతానం ద్వారా నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల సమస్యలకూ ఈ కేంద్రం పరిష్కారం చూపుతోంది. గడిచిన పదేళ్ల కాలం లో ఇందుకు సంబంధించిన నాలుగు వందలకు పైగా కేసులను పరిష్కరించారు. విడిపోవాలనుకున్న ఎన్నో జంటలు కౌన్సెలింగ్ ద్వారా కలహాలు వదిలి అన్యోన్యంగా ఉంటున్నాయి. ఇది తమకెంతో సంతృప్తినిస్తుందని కేంద్రం నిర్వాహకులు బీఎంఎస్వీ భద్రయ్య అంటున్నారు. స్వచ్ఛందంగా డీఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కౌన్సెలింగ్ కేంద్రంలో విశ్రాంత ఉపవిద్యాధికారి బీఎంఎస్వీ భద్రయ్య, విశ్రాంత తహశీల్దార్ పి.విశ్వనాథం, విశ్రాం త ఉద్యోగులు కుసుమ నర్సయ్య, నిట్టు విఠల్‌రావు, కుసుమ బాల్‌చంద్రం సభ్యులు. ప్రతి శనివారం వీరు కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడతారు. వారి సమస్యలను వింటారు. ఒకటి, రెండు పర్యాయాలు నచ్చజెప్పి, కలహాలను తొలగించి కాపురాలను చక్కదిద్దుతున్నారు. ఎలాంటి రుసుము తీసుకోకుండా వీరంతా కౌన్సెలింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 2013లో 65 కేసులు రాగా 54 కేసులు పరిష్కారమయ్యాయని, 11 కేసులు పెండింగులో ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు కేసులు రాగా, మూడు కేసులు పరిష్కారమయ్యాయని, మరో మూడు ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు. వివాదాలకు కారణాలు భర్త ఆదర్శంగా ఉండాలని కోరుకునే భార్య మనసును అర్థం చేసుకోలేకపోవడం. అతిగా మద్యం సేవించడం, పేకాటకు అలవాటుపడి డబ్బులు పోగొట్టి అప్పులపాలవడం. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు. అత్తామామలను కోడలు గౌరవించకుండా, వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినపుడు భర్త చికాకుపడడం. కొన్ని సందర్భాలలో భార్య ప్రవర్తన సరిగా లేదని భర్త ఫిర్యాదు. కని పెంచిన తల్లిదండ్రుల పోషణభారాన్ని సంతానం విస్మరించడం. వీటన్నిటికీ ‘కౌన్సెలింగ్’ ద్వారా పరిష్కారం లభిస్తోంది. దంపతులను విడివిడిగా, ఒకరి ముందు ఒకరిని, కుటుంబ సభ్యుల ముందు పిలిచి రకరకాలుగా కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా వారి మధ్యన కలహాలు రూపుమాపే ప్రయత్నం చే స్తున్నారు. అత్తారింట సమస్యలతో కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ ఎస్ఐ కూతురికి అత్తారింట సమస్యలు ఎదురుకావడంతో పోలీసులను ఆశ్రయించింది. దంపతులను కౌన్సెలింగ్ కేంద్రానికి పిలిపించి సమస్యలు తెలుసుకున్నారు. ఇద్దరూ కామారెడ్డిలో కలిసి ఉండాలని, ఇక్కడే ఏదైనా జాబ్ చేసుకోవాలని సూచించారు. రెండు, మూడు పర్యాయాలు మాట్లాడిన తరువాత ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. దీంతో వారిద్దరూ ఇప్పుడు కామారెడ్డిలోనే కాపురం పెట్టి అన్యోన్యంగా ఉంటున్నారు. పెద్దలకు న్యాయం జరిగింది కామారెడ్డి పట్టణానికి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. తరువాత ఓ ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఒక అల్లుడు వారిని బాగానే చూసుకునేవారు. మరో అల్లుడు పట్టించుకునేవాడు కాదు. పైగా ఆస్తి పంచి ఇవ్వమని వేధించాడు. తమ మరణానంతరం ఆస్తి ఇద్దరు కూతుళ్లకే దక్కుతుందని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆ వృద్ధ దంపతులు కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఆశ్రయించారు. నిర్వాహకులు కూతుళ్లు, అల్లుళ్లను పిలిపించి మాట్లాడారు.పెద్దవారిని బాగా చూసు కుంటే వారే ఆస్తి ఇస్తారని నచ్చజెప్పడంతో వారు కలిసిపోయారు.