కట్నం కోసం వేధిస్తూ భార్యను దారుణంగా హత్యచేసాడో భర్త. ఈ ఘటన ముజాప్ఫానగర్లోని గయానా గ్రామంలో సోమవారం వెలుగుచూసింది.
ముజాప్ఫానగర్: కట్నం కోసం వేధిస్తూ భార్యను హత్యచేసాడో భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజాప్ఫానగర్, గయానా లో సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. చర్తావాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న షిఖా అనే మహిళ అనుమాన్పస్థితిలో ఊరేసుకుని మృతిచెందినట్టు పోలీస్ అధికారి అకుల్ అహ్మద్ తెలిపారు. కట్నం కోసం వేధిస్తూ తన కూతురున్ని ఆమె భర్త, మామ కలిసి ఇంటి గదిలో ఊరేసి చంపేశారంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అతని ఫిర్యాదు మేరకు భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేశారు. షిఖా భర్త నిఖిల్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, మామ మదన్లాల్ పరారీలో ఉన్నాడు. అయితే గతంలో మదన్లాల్ కట్నం వేధింపుల కేసులో అరెస్ట్ అయినట్టు పోలీసులు పేర్కొన్నారు. షిఖా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించినట్టు చెప్పారు.