madanlal
-
కత్తిదూసిన ఉన్మాదం
చెన్నారావుపేట: ఓ ఉన్మాది చేతిలో భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. యువతి, ఆమె సోదరుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని పదహారుచింతల్తండా గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. తండాకు చెందిన భానోతు శ్రీనివాస్(40), సుగుణ(35) దంపతులకు కూతురు దీపిక, కుమారుడు మదన్‌లాల్ ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. దీపిక డిగ్రీ సెకండియర్, కుమారుడు మదన్‌లాల్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కాగా.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు(బన్ని)తో దీపిక ప్రేమలో పడింది. నాగరాజు తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వెళ్లగా నాగరాజు గ్రామంలోనే ఉంటున్నాడు. గత నవంబర్‌లో నాగరాజు, దీపిక వెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జనవరిలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడమే కాకుండా.. చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యా దులు చేసుకున్నారు. అనేక మార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది. ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలని తీర్మానం చేశారు. అప్పటి నుంచి దీపిక కుటుంబంపై కక్ష పెంచుకున్న నాగరాజు.. బుధవారం అర్ధరాత్రి పదహారుచింతల్తండాకు చేరుకున్నాడు. ఆరు బయట నిద్రిస్తున్న దీపిక, ఆమె తల్లిదండ్రులు భానోతు శ్రీనివాస్, సుగుణపై వేట కొడవలితో దాడి చేశాడు. ఆ అలజడికి ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు మదన్‌లాల్ బయటికి రాగా అతడిపైనా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు శ్రీనివాస్‌ను నర్సంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. తీవ్రంగా గాయపడిన దీపిక, మదన్‌లాల్‌ను హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు! నిందితుడు నాగరాజు గుండెంగ ప్రభుత్వ పాఠశాల వరండాలో తెల్లవారు వరకు ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అతడితోపాటు హత్యకు ఉపయోగించిన వేటకొడవలి, ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నర్సంపేటలో పోలీస్‌స్టేషన్ వద్ద, వరంగల్ రోడ్డ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఘటనస్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. ఫోన్లో కలెక్టర్ సత్యశారదాదేవితో మాట్లాడించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, గురువారం రాత్రి నాగరాజును అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రవీందర్ తెలిపారు. కాగా గురువారం పొద్దుపోయాక మృతులిద్దరి అంత్యక్రియలను స్వగ్రామంలో పూర్తి చేశారు. కూతురు దీపిక తల్లిదండ్రుల మృతదేహాలకు తలకొరివి పెట్టారు.పక్కా వ్యూహంతోనే హత్యలకు ప్లాన్ ఇద్దరూ విడిపోయాక హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిన నాగరాజు నెల రోజుల క్రితం మళ్లీ గుండెంగ గ్రామంలో అమ్మమ్మ ఇంటికి చేరుకుని ఆటోను అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దీపికకు వివాహ సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న నాగరాజు ఆమె కుటుంబంపై పగ తీర్చుకోవాలని పక్కా వ్యూహంతోనే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: సీతక్క హన్మకొండ: జంట హత్యలపై మంత్రి సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దాడిలో గాయపడిన యువతికి, ఆమె సోదరుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపిన సీతక్క, బాధిత కుటుంబానికి రక్షణ కలి్పస్తామని వివరించారు. బతిమిలాడినా వినలేదు.. నాగరాజును చంపేయాలి: దీపిక నాకు తల్లిదండ్రులను లేకుండా చేసిన నాగరాజును చంపేయాలి.. మాకు వాటర్‌ప్లాంట్ నుంచి వాటర్ పోసేందుకు తండాకు వచ్చేవాడు. అలా పరిచయం అయిన తర్వాత నెక్కొండకు వెళ్లే క్రమంలో వెంటపడేవాడు. నన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఏడు నెలలైనా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరికీ కుదరలేదు. హైదరాబాద్ నుంచి వచ్చాక తల్లిదండ్రులతో ఉంటున్నా. బుధవారం రాత్రి అమ్మా, నేను, నాన్న బయట పడుకున్నాం. నాపై ఉన్న దుప్పటి తొలగించగా అరవడంతో అమ్మ లేచింది. బతిమిలాడుతున్నా కత్తితో దాడికి పాల్పడ్డాడు. నేను భయంతో నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ స్పృహ తప్పి కిందపడిపోయా. ఆ తర్వాత లేచి సమీపంలో ఉన్న వదిన వాళ్ల ఇంటికి వెళ్లాను.. అక్కడికి సైతం వచ్చి పిలిచాడు. వాళ్లు నన్ను బయటకు రానివ్వలేదు. అందరు లేచి అరవడంతో పరారయ్యాడు. -
TS Election 2023: బీఆర్ఎస్లో నివురు గప్పిన నిప్పులా.. అంతర్గత కలహాలు!
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కలహాలు ఎంతకూ చల్లారడం లేదు. అసమ్మతి వాదులు, అభ్యర్థుల మధ్య సయోధ్య కుదరకపోగా.. సమన్వయం కోసం అధిష్టానం నియమించిన ఇన్చార్జిలు పూర్తిస్థాయిలో పని మొదలుపెట్టలేదు. దీంతో ఇరువర్గాల నడుమ దూరం కొనసాగుతోంది. ఇక వైరా నియోజకవర్గంలో మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామాలపై బీఆర్ఎస్ అధి ష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది. పార్టీలోని జిల్లాస్థాయి నాయకులు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో విభేదాలు సమసిపోకపోగా... పార్టీ కేడర్‌లో ఆందోళన నెలకొంది. కలిసి రాక.. చొరవ లేక.. బీఆర్ఎస్ అధిష్టానం గత 21న అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ప్రచారానికి సమయం లభించడమే కాక అసమ్మతి నేతలను సమన్వయం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని భావించారు. కానీ ప్రకటన వచ్చి ఇరవై రోజులు గడుస్తున్నా.. అసమ్మతి చల్లారకపోగా శృతి మించుతోంది. వ్యతిరేకిస్తున్న వారితో కలిసిపోయేందుకు అభ్యర్థులు చొరవ తీసుకోకపోవడం, అసమ్మతివాదులు కూడా పట్టు వీడకపోవడంతో రోజురోజుకూ విభేదాలు ముదిరి పాకాన పడి కొత్త వివాదాలకు దారి తీస్తున్నాయి. వైరా తీరే వేరు.. వైరా నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ అధిష్టానానికి ఆగ్రహం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, పార్టీ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ మధ్య విభేదాలు రచ్చకెక్కడంపై పార్టీ అధినేత సీరియస్ అయినట్లు సమాచారం. బీఆర్ఎస్ అభ్యర్థిగా మదన్‌లాల్‌ను ప్రకటించాక రాములునాయక్ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయకపోగా, సహకరిస్తానని పేర్కొన్నారు. కానీ ఆతర్వాత దళితబంధు జాబితా ఇరువురి నడుమ దూరాన్ని పెంచడంతో తాము నలిగిపోతున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాములునాయక్, పార్టీ అభ్యర్థి మదన్‌లాల్ నిర్వహించే కార్యక్రమాల్లో ఎక్కడకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. కాగా, ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించిన ఎంపీ నామ నాగేశ్వరరావు ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. ఇల్లెందుపై వద్దిరాజు నజర్.. రాజ్యసభ్య సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పటికే కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించగా.. ఇల్లెందులో హరిప్రియ నాయక్‌తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఎడముఖం, పెడముఖంగానే ఉంటుండగా, పలుమార్లు చర్చలు జరిపినా ఏకతాటిపైకి రాలేదు. కానీ సోమవారం నాటి ర్యాలీలో మాత్రం నేతలు భారీగానే పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే పార్టీ అభ్యర్థి విజయానికి పనిచేయాలని వద్దిరాజు సదరు నేతలకు చెప్పినట్టు సమాచారం. ఇన్చార్జిగా రెండు నియోజకవర్గాల్లో పర్యటించిన వద్దిరాజు... అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కొలిక్కిరాని భద్రాద్రి పంచాయితీ.. భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్లో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. తెల్లం వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడంతో టికెట్ ఆశించిన బోదెబోయిన బుచ్చయ్యకు చుక్కెదురైంది. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అనుచరుడిగా ఉన్న బుచ్చయ్యకు టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు నైరాశ్యంలో ఉన్నారు. ఆతర్వాత నియోజకవర్గ ఇన్చార్జిగా బాలసానిని తప్పించి ఎమ్మెల్సీ తాతా మధుకు అప్పగించడంతో మరింత అసహనంతో రగిలిపోతున్నారు. ఇరువర్గాల మధ్య ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చర్చలు జరగకపోగా.. సయోధ్య కోసం ఎమ్మెల్సీ తాతా మధు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, ఉమ్మ డి జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర, కొత్తగూడెం, పినపాక,అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచార దూకుడు పెంచారు. ఇక భద్రాచలం, ఇల్లెందు, వైరాలో నేతల కీచులాటలు సమసిపోతేనే ఎన్నికల హడావుడి మొదలుకానుంది. -
సీఏసీలో మదన్‌లాల్, గంభీర్, సులక్షణ!
న్యూఢిల్లీ: భారత వన్డే ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన మదన్‌లాల్ (1983), గౌతమ్ గంభీర్ (2011)లు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులుగా నియమితులు కానున్నారు. సెలక్షన్ కమిటీల ఎంపిక కోసం బీసీసీఐ కొత్త సీఏసీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో మాజీ మహిళా క్రికెటర్ సులక్షణ నాయక్‌ను మూడో సభ్యురాలిగా చేర్చే అవకాశాలున్నాయి. భారత్ నెగ్గిన తొలి వన్డే ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన మదన్‌లాల్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. వచ్చే నాలుగేళ్ల పాటు పదవిలో ఉండే రెండు సెలక్షన్ కమిటీ (సీనియర్, జూనియర్)లను మదన్ లాల్ కమిటీ ఎంపిక చేయనుంది. ప్రస్తుత సీనియర్ సెలక్షన్ కమిటీలో చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్‌జోన్), గగన్ ఖొడా (సెంట్రల్)ల పదవీ కాలం ముగియగా.... ఇతర సభ్యులైన శరణ్‌దీప్ సింగ్ (నార్త్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్), జతిన్ పరంజపే (వెస్ట్)లకు మరో ఏడాది కాలం గడువుంది. -
ఖమ్మం జిల్లా వైరాలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం
-
రాజస్తాన్ బీజేపీ చీఫ్‌గా సైనీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ మదన్‌లాల్ సైనీ రాజస్తాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ నియామకాన్ని ఖరారు చేశారు. సీఎం వసుంధరా రాజే, అమిత్ మధ్య చర్చలు జరిగాక జాట్లు, రాజ్‌పుత్ వర్గాల మధ్య విభేదాలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మాలీ వర్గానికి చెందిన సైనీకి ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఇదే సామాజిక వర్గానికి చెందిన అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్ నేత, మాజీ సీఎం)కు చెక్ పెట్టవచ్చని బీజేపీ భావిస్తోంది. ‘రాష్ట్రంలోని 200 అసెంబ్లీ సీట్లలో 180, మొత్తం 25 లోక్‌సభ స్థానాలు గెలవడంపైనే దృష్టి పెడతాను’ అని సైనీ అన్నారు. ఇన్నాళ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తున్నందుకే సైనీకి ఈ అవకాశం వచ్చిందని పలువురు రాజస్తాన్ బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అధ్యక్షుడిగా తన అనుచరుడే ఉండాలని పట్టుబడుతున్న సీఎం వసుంధర రాజే కొంతమేర విజయం సాధించారనే చెప్పవచ్చు. గజేంద్రసింగ్ షెకావత్‌కు రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానం భావించినా.. దీనికి వసుంధర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏ వర్గానికీ చెందని, సంఘ్ పరివార్‌తో సంబంధమున్న సైనీని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు చేయడంతో ఒక రకంగా వసుంధరా తన ప్రత్యర్థులను నిలువరించినట్లే. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
-
కట్నం కోసం భార్యను కడతేర్చాడు
ముజాప్ఫానగర్: కట్నం కోసం వేధిస్తూ భార్యను హత్యచేసాడో భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజాప్ఫానగర్, గయానా లో సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. చర్తావాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న షిఖా అనే మహిళ అనుమాన్పస్థితిలో ఊరేసుకుని మృతిచెందినట్టు పోలీస్ అధికారి అకుల్ అహ్మద్ తెలిపారు. కట్నం కోసం వేధిస్తూ తన కూతురున్ని ఆమె భర్త, మామ కలిసి ఇంటి గదిలో ఊరేసి చంపేశారంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేశారు. షిఖా భర్త నిఖిల్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, మామ మదన్‌లాల్ పరారీలో ఉన్నాడు. అయితే గతంలో మదన్‌లాల్ కట్నం వేధింపుల కేసులో అరెస్ట్ అయినట్టు పోలీసులు పేర్కొన్నారు. షిఖా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించినట్టు చెప్పారు. -
పాలేరులా పనిచేస్తా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ర్ట రోడ్లు, భవనాలు, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కామేపల్లి, కారేపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సతుపల్లిలో జరిగిన అభినందన సభలో మాట్లాడుతూ.. ప్రజలకు పాలేరుగా పనిచేస్తానని అన్నారు. సత్తుపల్లి : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యానికి.. సహసానికి మెచ్చి.. తెలంగాణ పునర్నిర్మాణంలో జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించాలనే కాంక్షతో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లో చేరిన నాకు మీ ఆదరాభిమానాలతో.. ఆశీర్వదించారు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని మీ సేవకుడిగా.. పాలేరులా పని చేస్తా.’ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం తుమ్మల అభినందన సభ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితం సత్తుపల్లి ప్రజలు ఇచ్చిన భిక్షఅని అన్నారు. మీ ఆశీర్వాద బలంతో ఎన్నో పదవులు వచ్చాయని భావోద్వేగానికి లోనయ్యారు. 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో కష్టాలలో.. సుఖాలలో నా వెంట నడిచిన వారికి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తానన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను జిల్లాకు తీసుకొస్తా జిల్లాలోని పాల్వంచ, మణుగూరులో నిర్మించనున్న థర్మల్ పవర్ప్లాంట్ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జిల్లాకు తీసుకొస్తానని తుమ్మల చెప్పారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులతో తెలంగాణకు రవాణా సంబంధాలు పెంపొందించి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గుజరాత్ కంటే అభివృద్ధిలో ముందుంచేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రచించారనిమ అన్నారు. 44వేల చెరువులను బాగుచేస్తున్నామన్నారు. తెలంగాణలో రహదారులు లేని గ్రామాలు ఇకపై ఉండవన్నారు. జిల్లాకు కనీస మౌలిక వసతులతో పాటు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బయ్యారం ఖనిజాలతో జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధించి తీరుతామన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా భరించానని అన్నారు. అగ్రగామిగా జిల్లా కామేపల్లి: అభివృద్ధిలో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలబెడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పండితాపురం సంత నుంచి మున్సిబ్జంజర వరకు 14.26 కిలోమీటర్ల మేర పీఎంజీఎస్‌వై నిధులు రూ. 8.62 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు, ముచ్చర్ల రామస్వామి గుట్ట వద్ద సీపీడబ్ల్యుఎస్ నిధులు రూ. 20 కోట్లతో చేపట్టే సమగ్ర మంచినీటి సరఫరా పథకానికి పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ముచ్చర్లలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో కామేపల్లి మండలాన్ని అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. మీ జీతగాడిలా 30 ఏళ్ళు పని చేశా కారేపల్లి: ‘మీ జీతగాడిలా 30 ఏళ్ళు పని చేశా. ఇప్పుడు మళ్ళీ మంత్రిని అయ్యా..మీ కోసం ఇంకా కష్ట పడుతా.’ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కారేపల్లి మండలం రొట్టమాకురేవు నుంచి మంగళితండా వరకు పీఎంజీఎస్‌వై నిధులు రూ.7.31 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.200 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ.200 కోట్లు, గోదావరి పుష్కరాల నిమిత్తం రోడ్లకు మరో రూ.200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జై జగన్ అని నినదించిన వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ సభలో వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ మాట్లాడుతూ జై జగన్ అని నినదించారు. దీంతో సభా వేదిక పై ఉన్న వారు, సభా ప్రాంగణంలో ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఎమ్మెల్యే వెంటనే తేరుకుని సారీ.. సారీ.. అంటూ ముగించారు. కార్యక్రమాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, బాణోతు మదన్‌లాల్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, నలమల వెంకటేశ్వరరావు, పాలడుగు శ్రీనివాస్, మదార్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
'మేం ఎప్పటికీ వైఎస్సార్ సీపీ లోనే ఉంటాం'
ఖమ్మం: తాము పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజంలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, మదన్ లాల్ లు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన తాము ఎప్పటికీ ఆ పార్టీలోనే ఉంటామని తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆ ఎమ్మెల్యేలు.. పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ సీపీ విజయాన్ని జీర్ణించుకోలేక కొంతమంది కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది కొన్ని రాజకీయ శక్తుల చేస్తున్న కుట్ర మాత్రమేనని వారు మండిపడ్డారు.