'మేం ఎప్పటికీ వైఎస్సార్ సీపీ లోనే ఉంటాం' | we would never change ysrcp party, mla's of khammam district | Sakshi
Sakshi News home page

'మేం ఎప్పటికీ వైఎస్సార్ సీపీ లోనే ఉంటాం'

Published Sun, May 18 2014 9:03 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

తాము పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజంలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, మదన్ లాల్ లు స్పష్టం చేశారు.

ఖమ్మం: తాము పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజంలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, మదన్ లాల్ లు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన తాము ఎప్పటికీ ఆ పార్టీలోనే ఉంటామని తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆ ఎమ్మెల్యేలు.. పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ సీపీ విజయాన్ని జీర్ణించుకోలేక కొంతమంది కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది కొన్ని రాజకీయ శక్తుల చేస్తున్న కుట్ర మాత్రమేనని వారు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement