payam venkateswarlu
-
మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష
సాక్షి, ఖమ్మం : పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలుశిక్ష పడింది. ఆయనకు 6 నెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువైనట్లు ప్రజా ప్రతినిధుల కోర్టు వెల్లడించింది. 2018లో అశ్వాపురం పీఎస్‌లో పాయం వెంకటేశ్వర్లుపై ఈ మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై కోర్టు గురువారం విచారణ జరిపి, తీర్పు నిచ్చింది. ఆయన రూ. 10 వేల జరిమానాను కట్టారు.. అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధపడటంతో కోర్టు జైలు శిక్ష నిలిపివేసింది. -
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం
సాక్షి,బూర్గంపాడు: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం అని పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు సతీమణి పాయం ప్రమీల అన్నారు. శుక్రవారం సారపాకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రూ.లక్ష ఆర్థిక చేయూతనందిస్తున్నామన్నారు. అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.8వేలు, రూ.5లక్షల బీమా, 24గంటల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో అమలు కావటం లేదన్నారు. కేసీఆర్ పథకాలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా గాంధీనగర్, భాస్కర్‌నగర్ గ్రా మాలకు చెందిన 200కుటుంబాలు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్పర్సన్ సూరపాక విజయనిర్మల, బిజ్జం శ్రీనివాసరెడ్డి, గొనె దారుగా, పాండవుల మధు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు గాయాలు
సాక్షి, బూర్గంపహాడ్ : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టి నగర్ వద్ద చోటుచేసుకుంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కారు, ఓ ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాయం వెంకటేశ్వర్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఎమ్మెల్యే వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కారులో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ ఎమ్మెల్యేను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
ప్రగతికి బాటలు వేస్తా
♦ పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే ♦ ప్రతి ఎకరాకూ సాగునీరే లక్ష్యం ♦ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి ♦ పాలనా సౌలభ్యం కోసమే ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలు ♦ మౌలిక సౌకర్యాలతో పాటు అన్నిరంగాల అభివృద్ధిపై ద్రుష్టి మణుగూరు : ‘అభివృద్ధిలో పినపాక నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతా. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో పనిచేస్తా. మణుగూరు పట్టణాభివృద్ధిపై దృష్టి సారిస్తా. అత్యంత వెనుకబడిన గుండాల మండలాన్ని రోడ్ల నిర్మాణంతో ప్రగతి పథం పట్టిస్తా. పాలనా సౌలభ్యం కోసమే నియోజకవర్గంలో ఆళ్లపల్లి, కరకగూడెంలను నూతన మండలాలుగా ఏర్పాటు చేసేందుకు సీఎంను ఒప్పించాం. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిలో భాగస్వామిగా ఉంటాను. మండలాల వారీగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతాను. ’ అని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శాసనసభ్యునిగా ఎన్నికై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రెండేళ్లలో అభివృద్ధిపై... మొదటి శాసనసభ సమావేశాల్లో భద్రాద్రి పవర్ ప్లాంట్ గురించి ప్రస్తావించాను. సీఎంతో అనేకసార్లు మాట్లాడి రూ.7,250 కోట్ల థర్మల్ ప్లాంటు సాధించా. ఇప్పటివరకు నియోజకవర్గంలోని 307 చెరువులను రూ.82 కోట్లతో అభివృద్ధి చేశా. మరో నెల రోజుల్లో బూర్గం పాడు మండలంలో 7,500 ఎకరాలకు సాగునీరు అందించే కిన్నెరసాని ఎడమ కాలువ పనులు పూర్తి కానున్నాయి. మణుగూరుకు 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. రూ.3కోట్ల సీడీపీ నిధులతో సీసీరోడ్లు,డ్రెయిన్లు, బోర్లు వేయించా. బూర్గంపాడు-ఏటూరునాగారం రహదారిని జాతీయ రహదారిగా మార్పించా. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. వైద్య, ఆరోగ్య మంత్రితో మాట్లాడి ఆళ్లపల్లి, పినపాక, బూర్గంపాడు పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు మంజూరు చేయించా. మణుగూరు మండలం పేరంటాలచెరువుకు రూ.కోటి మంజూరు చేయించా. టెండర్లు పిలి చారు. వర్షాకాలం తరువాత పనులు ప్రారం భమవుతాయి. మిషన్‌భగీరథ ద్వారా 2017 డిసెంబర్‌కు నియోజకవర్గంలో అన్ని ఇళ్లకు నల్లా నీరు వస్తుంది. మొండికుంట, ఆళ్లపల్లి విద్యుత్ ఉపకేంద్రాలు మంజూరు చేయించా. పినపాక మండలం మల్లారం, అశ్వాపురం, బూర్గం పాడు, గుండాల మండలం మర్కోడుల్లో రూ.5.5 కోట్లతో వ్యవసాయ గిడ్డంగులు మంజూరు చేయించా. రూ.2 కోట్లతో అంగన్వాడీ భవనాలు కట్టించా. రూ.8.50 కోట్లతో మణుగూరు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయిన్లు వేయించా. రూ.2.23 కోట్లతో మణుగూరులో మినీ ట్యాంక్‌బండ్ మంజూరు చేయించా. నీటిపారుదల, వ్యవసాయంపై..? నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. వచ్చే విడత మిషన్ కాకతీయలో అన్ని చెరువులు పూర్తి చేయిస్తా. పినపాక మండలంలో 28 గిరిజన గ్రామాల్లోని 10వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో రూ.90కోట్ల అంచనాతో పులుసుబొంత ప్రాజెక్టు నిర్మించేందుకు కృషి చేస్తున్నా. దీనిపై శాసనసభలో, సీఎంతోనూ మాట్లాడా. అటవీ, రెవెన్యూ, శాటిలైట్ సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది నిధులు మంజూరు అవుతాయి. పినపాక మండలం గొడుగుబండ వద్ద 900ఎకరాలకు సాగునీరు అందించే రూ.9కోట్ల వట్టివాగు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయి. గోదావరిపై పినపాక మండలం భూపతిరావుపేట, చింతలబయ్యారం, మణుగూరు మండలం అన్నారం లిఫ్ట్‌లకు ప్రతిపాదనలు పంపా. వీటితో ఆరువేల ఎకరాలు సాగులోకి వస్తాయి. సమితిసింగారం పరిధిలో 2వేల ఎకరాలకు నీరందించే రేగులగండికి రూ.1.10 కోట్లతో టెండర్లు పిలిచారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. ఏడీఏ కార్యాలయం నియోజకవర్గ కేంద్రం మణుగూరుకు మార్చడంతో పాటు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే ఫార్ములా అమలు అయ్యేలా చేశా. విద్య, వైద్యంపై...? నియోజకవర్గానికి ఒక ఎస్సీ, మరొక ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయించా. ఇందులో 5 నుంచి ఇంటర్ వరకు బోధిస్తారు. గిరిజన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, వృత్తివిద్యా కళాశాల, పాలి టెక్నిక్ కళాశాలలకు ప్రతిపాదనలు పంపా. ఇప్పటికే ఐటీఐ, డిగ్రీ కళాశాలలు సాధించా. సీహెచ్‌సీ వైద్యులు క్షేత్రస్థాయి శిబిరాలు పెట్టకుండా అంబులెన్స్‌లు ఆగిపోయాయి. మొండికుంట, బూర్గంపాడు, మణుగూరుల్లో కొత్త పీహెచ్‌సీలకు ప్రతిపాదనలు పంపా. రోడ్డు కమ్యూనికేషన్ల వ్యవస్థ అభివృద్ధిపై...? బూర్గంపాడు-ఏటూరునాగారం రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు కృషి చేశా. కిన్నెరసాని, మల్లన్నవాగు, జల్లేరువాగు, ఏడుమెలికలవాగులపై వంతెనలు, శాశ్వత రోడ్ల కోసం కృషి చేస్తున్నా. గుండాల-సాయనపల్లి-దామెరతోగు, చెట్టుపల్లి-కొమరారం రోడ్లు పీఆర్ నుంచి ఆర్‌అండ్‌బీకి బదలాయించాం. దీనికి మంత్రి తుమ్మల ఇచ్చిన సహకారం మరువలేనిది. గొల్లగూడెం-చొప్పాల వంతెనకు రూ.4.5 కోట్లు మంజూరు చేయించా. ఇక్కడ బ్రిడ్జి కమ్ చెక్‌డ్యాం నిర్మిస్తాం. మారుమూల ప్రాంతాలు..? మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నా. కొత్తగా గుండాల నుంచి ఆళ్లపల్లి, పినపాక నుంచి కరకగూడెం మండలాలు ఏర్పాటు చేయాలని భౌగోళిక వివరాలతో సీఎంను కోరాను. దీనికి ఆయన అంగీకరించారు. మణుగూరు పట్టణ అభివృద్ధిపై..? మణుగూరులో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి తుమ్మల సహకారంతో ప్రత్యేక కృషి చేస్తున్నా. ఇప్పటికే నాయుడుకుంట మినీ ట్యాంక్‌బండ్‌కు రూ.2.23కోట్లు మంజూరు చేయించా. మరో రూ.3.30కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చా. చినరావిగూడెం-పర్ణశాల మధ్య గోదావరిపై వంతెన కోసం రూ.150కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది. -
ఎంతకైనా తెగిస్తాం
♦ మీరు ఇటుకతో కొడితే.. మేం రాయితో కొడతాం ♦ చంద్రబాబు సర్కారు తీరుపై సీఎం కేసీఆర్ ఫైర్ ♦ ఏపీలో చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలపై యుద్ధమా? ♦ లేచికూర్చున్న బెబ్బులిని కదిలించొద్దు.. తీరు మార్చుకోకుంటే మీకే నష్టం ♦ గోదావరిలో నీళ్లు తీసుకునే దమ్ము, వివేకం, తెలివి ఏపీకి లేవు ♦ మీ ఆటలు ఇక సాగవు.. ఉన్న విలువ పోగొట్టుకోవద్దు.. ♦ తెలంగాణ రైతాంగం బోర్లు వేసి బోర్లా పడింది.. బోర్ల కోసం రూ.38 వేల కోట్లు ఖర్చు చేసిన దుస్థితి తెలంగాణది ♦ టీఆర్ఎస్లో చేరిన ఖమ్మం ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం సాక్షి, హైదరాబాద్: తాము న్యాయంగా ప్రాజెక్టులు కట్టుకుంటుంటే ఏపీ సర్కారు చిల్లరమల్లర రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని కుండబద్దలు కొట్టారు. ఏపీ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని.. లేచి కూర్చున్న బెబ్బులిని కదిలించవద్దని హెచ్చరించారు. అది వారికే నష్టమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ కేబినెట్ చేసిన తీర్మానం, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్మోహన్రెడ్డి దీక్ష ప్రకటనపై మండిపడ్డారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు, సాగునీటి మంత్రులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే కృష్ణా నదిలో 368 టీఎంసీలు, గోదావరిలో 950 టీఎంసీలను తెలంగాణకు కేటాయించారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. పాలమూరు ప్రాజెక్టు పనులకు రూ.7కోట్లు కూడా మంజూరు చేశారు. ఆ కేటాయింపుల మేరకే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటామంటుంటే ఏపీ రాజకీయ నేతలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు, జగన్ మనపై యుద్ధం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతాం. న్యాయంగా పోరాడుతాం. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ సర్కారుకు దమ్ము లేదు! ఏపీకి గోదావరిలో నీటిని తీసుకునే దమ్ము లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘నేను యాగం చేసినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు అమరావతి వెళ్లాను. కనీసం గంట పాటు గోదావరి జలాల గురించి మాట్లాడిన. మూడు నాలుగు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్లిపోతోందని... తెలంగాణ వాటా తీసుకున్నాక, ఏపీ బాగా తీసుకోవచ్చని చెప్పిన. అసెంబ్లీ వేదికగా అధికారికంగా సీఎం హోదాలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోనూ లెక్కలు చెప్పిన. వాస్తవానికి గోదావరి నుంచి నీళ్లు తీసుకోవడం తెలంగాణకే కష్టం. 500 మీటర్లు ఎత్తిపోయాలి. అదే ఏపీ అయితే 50 మీటర్ల నుంచి 250 మీటర్లు లిఫ్టు చేస్తే చాలు. అయినా ప్రతీ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు. మేం బతుకుతం.. మీరు బతుకొద్దనడం దుర్మార్గం. అయినా గోదావరిలో నీటిని తీసుకునే దమ్ము మీకు లేదు. వివేకం, తెలివి లేదు. తెలంగాణపై ఎందుకు ఏడుస్తున్నరు. తెలంగాణ ఇప్పుడు స్వతంత్ర రాష్ట్రం. మీ బెదిరింపులకు భయపడం. మీరు ఇటుకతో కొడితే మేం రాయితో కొడతం. మీ ఆటలు ఇక సాగవు. ఉన్న విలువ పోగొట్టుకోవద్దు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యంగనే ఉంటం. ఏపీ, తెలంగాణ పరస్పరం సహకరించుకోవాలె. కుతంత్రాలు మానండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను బలిపెట్టొద్దు. చంద్రబాబు నీతేమిటో, వైఎస్సార్సీపీ నీతేమిటో మాకు తెలుసు. కడుపులో కత్తులు పెట్టుకుని, నోట్లో బెల్లం పెట్టుకుని మాట్లడుతరు..’’ అని విమర్శించారు. తెలంగాణది వలసల దుస్థితి.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నిధులు-నీళ్లు-నియామకాల్లో అన్యాయం జరుగుతోందనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గత 58 ఏళ్లలో బోర్లు వేసి తెలంగాణ రైతాంగం బోర్లా పడిందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ 24 లక్షల పంపుసెట్లు ఉన్నాయని చెప్పారు. సుమారు రూ.30వేల కోట్ల నుంచి రూ.38వేల కోట్ల దాకా బోర్ల కోసం ఖర్చు చేశారన్నారు. తెలంగాణది వలస బతుకని, 37 లక్షల జనాభా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 18 లక్షల మంది వలస పోయారని చెప్పారు. అలాంటి ప్రాంతానికి నీళ్లివ్వొద్దంటూ దాడి చేస్తున్నరని మండిపడ్డారు. దుమ్ముగూడెం దగ్గర ఇప్పటికీ వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్లిపోతోందన్నారు. సరిహద్దుగా గోదావరి నది ఉన్నా ఖమ్మం జిల్లా కరువు, తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నది సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం వల్లేనని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్కు నిబద్ధత ఉంది తెలంగాణ సమాజమంతా ఏకం కావాల్సిన సందర్భమిదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘వైఎస్సార్సీపీ నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరడానికి కారణం ఉంది.. ఇవి చిల్లర మల్లర చేరికలు కావు. రాజకీయ ఏకీకరణలో భాగం. టీఆర్ఎస్లో కొత్త వారికి కూడా పాత వారితో సమాన స్థాయి గౌరవం ఉంటుంది.. టీఆర్ఎస్ నిబద్ధత ఉన్న పార్టీ. ఉద్యమంలో అనేక బాధలు పడ్డాం. అందుకే ప్రజలు అధికారం ఇచ్చారు. మంత్రి తుమ్మలను ఒకటే కోరుతున్నా... పాలు నీళ్లలా అందరినీ కలుపుకొని వెళ్లాలి..’’ అని సూచించారు. అవకాశాలు అందరికీ వస్తాయని, సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, పువ్వాడ అజయ్, తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వాదులుగానే చేరాం: పొంగులేటి, పాయం వెంకటేశ్వర్లు తెలంగాణవాదులుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకే తాము టీఆర్ఎస్లో చే రినట్లు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కృష్ణా నీటి విషయంలో, పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దీక్ష చేస్తానన్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చూసి తట్టుకోలేక పోయానని చెప్పారు. ఏపీ విషయంలో ఆయన పోరాటంలో న్యాయం ఉందని, కానీ తెలంగాణ విషయంలో అది ఏకపక్ష నిర్ణయమని పేర్కొన్నారు. తెలంగాణలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిసినా జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని... ఇది ఏపీ విషయంలో సరైనదే అయినా, తెలంగాణ విషయంలో అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇక బంగారు తెలంగాణలో భాగస్వామి కావడానికి టీఆర్ఎస్లో చేరానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
అంతులేని ప్రలోభాలు
- ఫిరాయింపులకు తెలంగాణ, ఏపీ అధికార పక్షాల ప్రోత్సాహం - టీడీపీ, టీఆర్ఎస్ల తీరుపై ఆందోళన - ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనంటున్న రాజకీయ విశ్లేషకులు - దిగజారుడు రాజకీయాలు మంచివి కావనే అభిప్రాయాలు - పార్టీని వీడేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన కారణాలపై ఆశ్చర్యం సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థి పార్టీల ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురి చేయడం, నయానో భయానో లొంగదీసుకోవడం వంటి అనైతిక చర్యలకు పాల్పడడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికార పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ అక్కడి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రికార్డు స్థాయిలో బేరాలకు దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేస్తోంది. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయాందోళనకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించిన తీరు చూసి రాజకీయ పరిశీలకులే నివ్వెరపోతున్నారు. ఓ రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఉన్నపళంగా పార్టీ ఫిరాయించడం చూసి విస్తుపోతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు విపక్ష పార్టీల చట్టసభ సభ్యులను ప్రలోభపెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని... దేశంలో ఎక్కడా ఇంత దిగజారుడు రాజకీయా లు లేవని రాజకీయ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అవసరం లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహించే సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని పరి హాసం చేస్తోందన్నారు. ఇక పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన కారణాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దీక్ష చేస్తానని ప్రకటించినందుకే తాను పార్టీ వీడుతున్నానని చెప్పిన మాటలు విస్తుగొలిపే రీతిలో ఉన్నాయంటున్నారు. ‘పాలమూరు’ కారణంగా పొంగులేటి ప్రాతినిధ్యం వహించే ఖమ్మం జిల్లాకు కూడా నీరు అందక ఇబ్బంది ఏర్పడుతుందని జగన్ తన దీక్ష ఉద్దేశాల్లో స్పష్టంగా చెప్పారని... ఆ లెక్కన చూస్తే పొంగులేటి పార్టీ వీడటానికి జగన్ దీక్ష కారణం కానే కాదని రాజకీయ పరి శీలకులు అంటున్నారు. పాలమూరు ప్రాజెక్టు వల్ల దిగువన నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, రాయలసీమకు ఇబ్బందికరంగా మారుతుందని జగన్ చెప్పారు. జగన్ ప్రకటనలోని వాస్తవ విషయాలను విస్మరించి ‘పాలమూరు’ను వ్యతిరేకిస్తున్నందునే పార్టీ వీడుతున్నానంటూ పొంగులేటి ప్రకటించడం కేవలం ఓ సాకు మాత్రమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పాలేరు ఎన్నికల కోసమే.. ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్... అక్కడ లబ్ధి పొందేందుకే వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఆగమేఘాలపై పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పాలేరు ఉప ఎన్నిక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి కేటీఆర్ ఆదివారమే ఎంపీ పొంగులేటిని వెంటబెట్టుకుని వెళ్లి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దీంతో పొంగులేటి పార్టీ వీడుతున్నారంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రచారమైంది. సోమవారం ఉదయం పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను కలసిన పొంగులేటి... తాను పార్టీ మారడం లేదని చెప్పినట్లు సమాచారం. అయితే మధ్యాహ్నానికే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు పొంగులేటి ప్రకటించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
ఖమ్మం: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పినపాక నియోజకవర్గంలో పర్యటించారు. అశ్వాపురం మండలంలో మిషన్ భగీరథ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేయడంతో పాటు మణుగూరు మండలంలో దీపం పథకం కింద 847 మంది లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
మేడారంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి
వరంగల్: మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మరోరెండు రోజుల్లో ప్రారంభం కానున్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శిచుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిలువెత్తు ‘బంగారం’తో పొంగులేటి మొక్కు తీర్చుకున్నారు. అమ్మ వార్లను దర్శించుకున్న వారిలో ఆయనతో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. -
'రుణమాఫీపై ప్రభుత్వం సమాధానం దాటవేస్తోంది'
హైదరాబాద్ : రుణమాఫీ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సమాధానం దాటవేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. శాసనసభలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన పట్టుబట్టారు. ఒకే దఫాలో రైతుల రుణమాఫీ చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కరవు మండలాలను ప్రభుత్వం కచ్చితంగా ప్రకటించాల్సిందేనని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. -
'మేలు జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి'
-
'మేలు జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి'
హైదరాబాద్: రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో కూడా రైతు ఆత్మహత్యలు జరిగాయని, అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయంలో ప్రత్యారోపణలకు పోకుండా ఆత్మహత్యలు నివారించే చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల ఆత్మహత్యల అంశంపై మంగళవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా పాయం మాట్లాడారు. సరైన వర్షాలు లేక రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని, మనోధైర్యం కోల్పోయారని చెప్పారు. ప్రభుత్వం వారికి భరోసాగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో 400కు పైగా కరువు మండలాలు ఉన్నా.. వాటి గురించి కేంద్రానికి నివేదించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కరువు మండలాల ప్రకటన విషయంలో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. ఇక పంటల బీమా విషయంలో మరింత ఉదారంగా ఉండాలని, వారికి చెల్లించే బీమా ప్రస్తుతం రుణంలో 50శాతం ఉందని, దానిని 75శాతం పెంచాలని కోరారు. బీమా చెల్లిస్తే డబ్బు తిరిగి రాదనే భావన రైతుల్లో ఉందని, అందుకే పంటల బీమాకు వెనుకాడుతున్నారని చెప్పారు. ఇక ఎరువుల నిల్వకు, పంట నిల్వలకు గోదాముల కరువు తీవ్రంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో భూసార పరీక్ష కేంద్రాలు నాలుగు ఉండగా అందులో రెండే పనిచేస్తున్నాయని, వాటికి పరీక్షల కోసం మట్టిని పంపిస్తే సరైన సమయంలో నివేదిక రావడం లేదని తెలిపారు. గ్రామంలో విత్తన ఉత్పత్తి చేస్తే రైతులు నమ్మడం లేదని, అందుకే గ్రామంలో శుద్ధి చేసిన విత్తనాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయిస్తే రైతులకు భరోసాగా ఉంటుందని తెలిపారు. స్వామినాథన్ కమిటీతోపాటు పలు కమిటీలు చేసిన సిఫారసులు గమనించి అమలు చేయాలని, ఆత్మహత్యలు నివారించాలని కోరారు. -
'అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం'
-
'అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం'
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలు, కరువు, రుణమాఫీ అంశాలపై పోరాడుతామని టీవైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పోడుభూములు, దళితులు, గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో లెవనెత్తుతామన్నారు. రైతులు, రైతుల సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. కరువు ప్రాంతాలను గుర్తించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు ఇప్పటికీ మంజూరు కాలేదన్నారు. మొదటి విడత రుణమాఫీ కూడా అమలు కాని దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. ఈ విషయాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. -
ఖమ్మంలో అర్చకుల నిరవధిక సమ్మె
హైదరాబాద్ సిటీ: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మంలోని జలాంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు నిరవధిక సమ్మెకు దిగారు. నిరవధిక దీక్షకు చేస్తున్న అర్చకులను పినపాక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిసి వారికి మద్ధతు తెలిపారు. అర్చకులు కోరుతున్న కోరికలు చాలా చిన్నవని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. -
పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే పాయం
ఖమ్మం: తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఖమ్మం జిల్లా పినపాక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తాను పార్టీ మారతానంటూ ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనపై పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పాయం మండిపడ్డారు. అయితే ఇంతకముందు ఎల్లో మీడియాలో వచ్చిన ఈ కథనాలను చాలాసార్లు తాను ఖండించానని చెప్పారు. అయినా పదేపదే ఎల్లో మీడియాలు పనిగట్టుకొని తనపై ఇలా దుష్ర్పచారం చేయడం తననెంతో బాధించిందంటూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇది అంకెల గారడీ బడ్జెట్: పాయం
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ మొత్తం అంకెల గారడీలా ఉందని, వాస్తవానికి విరుద్ధమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గత ఏడాది సవరించిన బడ్జెట్ ఎంతో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదాయ మార్గాలను ప్రభుత్వం వివరించాలని కోరారు. హామీలు బారెడు.. నిధులు మూరెడుగా బడ్జెట్ ఉందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టులకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడంతో పాటు నిధులు కేటాయించకపోవడం వల్ల రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, కిన్నెరసాని ప్రాజెక్టులు ఆగిపోయయాయని చెప్పారు. గత ఏడాది గృహనిర్మానానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి కనీసం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. బిల్లులు కూడా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టి లబ్ధిదారులను ఇబ్బందులు పాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రుణాల మాఫీ పరిధికిరాని రైతులకు నాటి సీఎం వైఎస్ ఆర్ రూ.ఐదువేలు ఇచ్చి ప్రోత్సహించారని, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే ఆదుకోవాలని కోరారు. -
బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టుల ఊసులేదు: పాయం
-
పథకాలను పక్కదోవ పట్టించొద్దు
మణుగూరు: ప్రభుత్వ పథకాలను అధికారులు పక్కదోవ పట్టించొద్దని మహబూబాద్ పార్లమెంట్ సభ్యుడు అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. గురువారం మణుగూరు ఏరియాలో పర్యటించిన అయన ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్ జీసీసీస్టోర్‌లో ఆహర భద్రతా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు పౌష్టిక ఆహారం అందించాలనే లక్ష్యంతోనే ఈ ఆహార భద్రత పథకాన్ని, సమితిసింగారం హస్టల్లోని సన్నబియ్యం పథకం ప్రారంభించారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు నష్ట పరిహరం చెల్లిస్తామన్నారు. మణుగూరు ఒపెన్‌కాస్టు నిర్వాసిత ప్రాంతంలోని 181మంది గిరిజనులకు ఉద్యోగాఅవకాశాలు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే పాయం ప్రభుత్వం ప్రవేశపెడుత్ను పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు మండలంలోని భగత్‌సింగ్‌నగర్, సమితిసింగారం పంచాయతీల్లో ఆహార భద్రత పథకాలను ప్రారంభించారు. నిజయమైన లభ్ధిదారులకు పథకాలు అందేలా చూడాలని అదికారులను సూచించారు. నియోజకవర్గ అబివృద్ది కోసం తాను నిరంతరం పాటుపడతానన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోకవర్గ ఇన్చార్జి శంకర్‌నాయకు, పాయం నర్సింహారావు, వైఎస్సార్సీపీ నేతలు ఆవుల నర్సింహారావు, కృష్ణ, తిరుమలేష్, పెద్దినాగకృష్ణ, సురేష్, రంజిత్, శ్రీనివాస్, శివయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు ‘ఆసరా’ కోసం..ఎమ్మెల్యే పాయం ధర్నా
పినపాక: మండలంలోని అర్హులందరికీ ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలన్న డిమాండుతో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు శుక్రవారం గంటపాటు ధర్నా నిర్వహించారు. ‘అర్హులకు ఏదీ ‘ఆసరా’’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి ఈ కార్యక్రమం చేపట్టారు. ధర్నానుద్దేశించి ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. మండలంలోని అనేకమంది అర్హులకు పింఛన్లు మంజూరవలేదని, అదే సమయంలో కనీసార్హత కూడా లేని వారికి ఇచ్చారని అన్నారు. అర్హులైన అనేకమంది అధికారుల తప్పిదంతో తీవ్రంగా ఇబ్బందులపాలవుతున్నారని అన్నారు. 90 శాతం వికలాంగత్వమున్న వారికి కూడా ఫింఛన్ మంజూరు చేయలేదని, ‘ఆసరా’ అవకతవకలకు ఇదొక నిదర్శనమని చెప్పారు. గతంలో పింఛన్లు పొందిన వికలాంగులకు, వృద్ధులకు ఇప్పుడు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. అధికారుల సర్వేలో నిర్లక్ష్యం కారణంగా అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. ‘ఆసరా’ అర్హులలో కేవలం 40 శాతం మందికే పింఛన్లు అందుతున్నాయని, ఈ పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మిగిలిన వారికి కూడా పింఛన్లు ఇవ్వకపోతే వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ఎమ్మెల్యే వద్దకు పాల్వంచ ఆర్డీవో వచ్చి, అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే పాయం ధర్నా విరమించారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆర్డీవోకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, కీసర సుధాకర్‌రెడ్డి, మద్దెల సమ్మయ్య, ఉడుముల రవీందర్‌రెడ్డి, తోలెం కృష్ణ, యాంపాటి తిరుపతిరెడ్డి, వనమాల రాంబాబు, ఎండి.ఝంఘీర్, వికలాంగుల పోరాట సమితి పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు జలగం కృష్ణ, నాయకుడు జాడీ నాగరాజు, సర్పంచులు ఇర్పా సారమ్మ, వాగుబోయిన చందర్రావు, తోలోం అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మారే ప్రసక్తేలేదు
మణుగూరు : తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పాయం వెంకటేశ్వర్లును టీఆర్ఎస్లోకి రావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను అనూహ్య రీతిలో విజయ దుందిబి మోగించానని, అప్పటి నుంచి నేటి వరకు తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కావాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కొన్ని పత్రికలు సైతం కావాలని దుష్ర్ఫచారం చేయడం ప్రారంభించాయన్నారు. లేని పోని అభూత కల్పనలతో తనను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాను వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఏ ఉద్దేశంతో గెలిపించారో వారి ఆశయ సాధనకు పని చేస్తానే తప్ప పూటకో పార్టీ మారుతూ వారి విశ్వాసాన్ని కోల్పోనని అన్నారు. నియోజకవర్గ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చూసి ఓర్వలేని కొందరు ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పూనుకున్నారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్న తనను రాజకీయంగా ఎదుర్కొనలేని వారు ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రజలు తను ఆదరించిన తీరును చూసి వారికి రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తన అభిమానులంటూ ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఏమోస్తుందని అన్నారు. నిజమైన అభిమానులైతే నేరుగా తనతో మాట్లాడాలే కానీ ఈ విధంగా ఫ్లెక్సీలు కట్టి తన మనస్సును ఏ విధంగా మారుస్తారని అన్నారు. కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైఎస్ ఆశయ సాధన కోసం జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో, పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో శక్తివంచన లేకుండా పని చేస్తానని అన్నారు. ఇదే మాట తాను గతంలోను పత్రికా ముఖంగా చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నానని అన్నారు. ఇప్పటికైనా తనపై ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. -
విఐపి రిపోర్టర్ - పాయం వెంకటేశ్వర్లు
-
ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేస్తా..
మీకు తోడుంటా. మీ కష్టాల్లో పాలుపంచుకుంటా. ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో మీ కాలనీలను అభివృద్ధి చేస్తా. తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయించి గోదావరి నుంచి తాగునీరు సక్రమంగా అందేలా చూస్తా. అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కోసం నిధులు కేటాయించేలా చూస్తా. అధికారులతో మాట్లాడి పింఛన్లు అందేలా కృషి చేస్తా. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. త్వరలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశుధ్య పనులపై పంచాయతీ అధికారులతో మాట్లాడుతా. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలను శుభ్రంగా తీర్చిదిద్దుతా. - పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే అక్కడికి వెళ్లాలంటే దుర్గంధం.. రోడ్లమీదే మురుగు నీరు.. వీధుల వెంట ముక్కుమూసుకొని నడక సాగించాలి.. రాత్రైందంటే దోమల స్వైరవిహారం..అక్కడ ఉండే వారు నిత్యం రోగాలతో అల్లాడుతున్న వైనం..ఇంతేనా.., తాగునీరు, పక్కాఇళ్లు, పింఛన్లు, ఉపాధి...ఇలా ఎన్నో సమస్యలు ఆ కాలనీలను వేధిస్తున్నాయి. నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మణుగూరు మండలం సమితిసింగారం పంచాయతీలోని వెంకటపతినగర్, అరుంధతీ నగర్, బీసీ కాలనీ, బుడిగజంగాల కాలనీలను పినపాక ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తోడుంటానని హామీ ఇచ్చారు. పాయం వెంకటేశ్వర్లు : అమ్మా బాగున్నారా? మీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మీ సమస్యలేంటో చెప్పండమ్మా? చిరిగిరి సబ్బుమ్మ : వెంకటపతినగర్‌లో ఎంతో కాలంగా ఉంటున్నానయ్యా. నాకు వృద్ధాప్య పింఛన్ రావడం లేదయ్యా. పాయం: పోషయ్య బాగున్నారా? మీ వాడలో ఉన్న సమస్యలేంటి? పోషయ్య : బాగానే ఉన్నాము సారు..మా వాడలో అంతర్గతరోడ్లు లేక ఇబ్బంది పడతున్నాం. తాగునీరు లేదు సారు. నల్లాలు వారానికి ఓసారి కూడా రావట్లేదయ్యా. పాయం: ఏమ్మా బాగున్నావా? మీ కాలనీలో ఏమైనా ఇబ్బందులున్నాయా? పచ్చిపులుసు అన్నపూర్ణ : మా వాడలో సరైన రోడ్లు లేవయ్యా. ఇండ్ల మధ్యనే మురికి నీరు ఉంటోంది. దోమలు విపరీతంగా ఉన్నాయయ్యా. పిల్లపెద్దలకు రోగాలొస్తన్నాయ్. లెట్రిన్గదుల్లేక ఆడోళ్లం ఇబ్బంది పడతాన్నం. మా పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని ఉపాధిలేక ఖాళీగా ఉంటుండ్రు. వారికి ఉపాధి చూపించడయ్యా. పాయం: ఏం తాతా బాగున్నావా? పింఛన్ వస్తుందా? గంగయ్య: రావడం లేదయ్యా. ఆఫీసుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేద య్యా. మీరైనా పింఛన్ ఇప్పించడయ్యా. పాయం: ఏమి బాబూ? నీ సమస్య ఏమిటీ? దాసరి పెంటయ్య: మాకు పక్కా ఇళ్లు లేక గుడిసెలు వేసుకొని ఉంటున్నామండి. సైడ్‌కాల్వలు సక్రమంగా లేవు. పక్కా ఇళ్లు ఇప్పించండి. పాయం : దుకాణం ఎట్ల నడుస్తుందమ్మా? మీ ప్రాంత సమస్యలు చెప్పండమ్మా? దుకాణం కోసం అవసరమైతే ఐటీడీఏ లోన్ తీసుకోమ్మా.. కారం సీత: దుకాణం బాగనే నడస్తందయ్యా. మాకు ఇందిరమ్మ ఇల్లు బిల్లులు పూర్తి రాలేదయ్యా. మరుగుదొడ్ల బిల్లులు ఇవ్వడం లేదు. సంతోషమయ్యా అవసరమైనప్పుడు ఐటీడీఏ లోన్ తీసుకుంటనయ్యా. పాయం: బాగున్నారామ్మా మన బీసీ కాలనీలో ఏమైనా సమస్యలున్నాయా? వీరమ్మ: గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప ఇప్పటి వరకు ఎవరూ రోడ్డు వేయలేదు సారు. సైడు కాల్వలు లేక రోడ్డుమీద మురికి నీరు నిల్వ ఉంటోంది సారు. సైడ్‌కాల్వలు, రోడ్లు వేయించండి సారు. పాయం: మీ ప్రాంతానికి అధికారులు వచ్చి ఎప్పుడైనా మీ సమస్యలు అడిగారామ్మా? భద్రమ్మ : మా బాధలు పట్టించుకునేటోరు ఎవరు లేరయ్యా. అధికారులు అప్పుడప్పుడు వచ్చినా పరిష్కారం చూపడం లేదు సారు. ఇట్ల వచ్చి అట్ల పోతున్నరు. మరుగుదొడ్ల బిల్లులు రాలేదు. సైడుకాల్వలో నీరు నిల్వ ఉంటాంది. దోమలు విపరీతంగా ఉన్నాయి. పాయం: ఏమిటమ్మా బాధపడుతున్నావు.. ఏమైంది? పెంటమ్మ: అయ్యా నాకు ముసలోళ్ల పింఛన్ రావట్లేదయ్యా. రెండునెలలు అయిందయ్యా. వస్తదో రాదో తెల్వడం లేదయ్యా. ఎన్నిసార్లో సార్ల చుట్టూ తిరిగినా..ఎవరూ పట్టించుకోలేదయ్యా. పాయం: బాబూ నీ సమస్య ఏమిటి? చిన్నారావు: నాకు వికలాంగుల పింఛన్ రావడం లేదు. దరఖాస్తు పెట్టినాను. నెలరోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతాన్న. ఎవరూ పట్టించుకోవడం లేదు. పాయం: ఏం చిన్న నీ ప్రాబ్లమ్ ఏమిటి? ఆంజనేయులు: సర్ నేను ఐటీఐ పూర్తి చేశాను. ఎక్కడా ఉపాధిలేక నిరుద్యోగిగా తిరుగుతున్నా. మాకు ఉపాధి మార్గం చూపండి సారు. పాయం: ఏంటమ్మా..ఏమి చదువుతున్నావ్? ఏమైనా సమస్యలున్నాయా? జరిపెటి చిన్నారి : సారు నే ను మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. మాకు ఇప్పటివరకు స్కాలర్షిప్లు రావడంలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వట్లేదు. పాయం: ఏమ్మా అందరూ బాగున్నారా? పిల్లలు మంచిగున్నరా? సువార్త, గంగ, రాణి: పిల్లలు బాగనే ఉన్నరన్న. బంగారుతల్లి పథకం మా పిల్లలకు ఇవ్వడంలేదన్న. జర వచ్చేలాగా చూడండి. పాయం: బాగున్నావా ఆనందరావు? అరుంధతీనగర్ సమస్యలు ఏమిటి? చెన్నం ఆనందరావు: సారు బాగున్నాను. మా ప్రాంతంలో తాగునీటి సమస్య బాగా ఉంది. అంతర్గత రోడ్లు లేవు. వీధి లైట్లు లేవు. మా ప్రాంతానికి రోడ్లు వేయిస్తామన్నారు..సంతోషంగా ఉంది. వృద్ధుల పింఛన్ల విషయంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. పాయం: అమ్మా నీ సమస్య ఏమిటి? చిలక శిరోమణి: అరుంధతీ నగర్లో ఎంతోకాలంగా ఉంటున్నానయ్యా. వృద్ధాప్య పింఛన్ రావడం లేదు. ఆఫీసులచుట్టూ తిరుగుతన్నా. ఏదైనా ఆధారం చూపండయ్యా. -
గని కార్మికులకు వారసత్వ ఉద్యోగాలివ్వాలి
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు(ఖమ్మం) : సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సెంబ్లీ సమావేశం జీరో అవర్‌లో ఈసమస్యపై చర్చించినట్లు ఆయన ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలి పారు. 1998లో కోల్ఇండియా వ్యాప్తంగా సింగరేణిలో సైతం కార్మికులను కుదించాలనే నిర్ణయంతో వారసత్వ ఉద్యోగాలను రద్దు చేయడంతోపాటు డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌పై నిషేధం విధించారని అన్నారు. అప్పటినుంచి సింగరేణిలో రిక్రూట్ మెంట్ సైతం సక్రమంగా జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సింగరేణిలో కార్మికుల సంఖ్య రోజురోజుకూ భారీగా తగ్గిపోతోందని, ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతున్న యాజమాన్యం కార్మికుల సంఖ్యను పెంచడం లేదని చెప్పారు. గుర్తింపు ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం(టీబీజీకేఎస్) డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని వాగ్దానం చేసిందని, అసెంబీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుకు చేశారు. తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించి త్వరలో ఉద్యోగ విరమణ పొందే కార్మిక కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి హరీష్‌రావు వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట వాస్తవమేనని, దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హమీఇచ్చినట్లు పేర్కొన్నారు. -
పవర్ ప్లాంట్‌తో అభివృద్ధి
మణుగూరు : మణుగూరులో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనే ప్రజల చిరకాల కల నెరవేరబోతోందని, ఈ ప్రాజెక్టు వల్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొండికుంట ప్రాంతంలో ఎప్పుడో ఏర్పాటు చేయాల్సిన ఎన్టీపీసీ ఇతర ప్రాంతాలకు తరలిపోయిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లో తాను మణుగూరులో విద్యుత్ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని రకాల వసతులు బొగ్గు, రైలు మార్గం, నీటి వసతి ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మణుగూరులో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దుల్లో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పనులు యుద్ధప్రాతిపదిక జరుగుతున్నాయని అన్నారు. ఎక్కడ లేని విధంగా ప్రత్యేక జీఓతో ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ప్రతి కుటుంబంలో 18సంవత్సరాలు నిండినవారందరికి ప్యాకేజీ ఇస్తారని, పరిహారం రూ. 5లక్షలు ఇస్తారని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను రైతులందరికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. కొందరు కావాలనే రాజకీయాలు చేస్తూ ప్రాజెక్టును విచ్చిన్నం చేసేందుకు యత్నిస్తున్నారని, ప్రజలు అటువంటి వారి మాటలను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, మండల నాయకులు ఆవుల నర్సింహారాావు, మేడ నాగేశ్వరరావు, గాండ్ల సురేష్, కంచర్ల గురునాధం, ఎంపీటీసీ ఈసాల ఏడుకొండలు, శ్రీనివాస్, తిరుమలేష్, రంజిత్ పాల్గొన్నారు. -
'ఏపీ శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించండి'
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య (భద్రాచలం) మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కమిషనర్ ను కోరారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లాయని తెలిపారు. 2019 వరకు తమకు ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఈనెల 14న గవర్నర్ నరసింహన్ ను కలిశారు. -
పోలవరం బాధితులను ఆదుకోండి: తాటి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని వైసీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజనులు, అక్కడి ఉద్యోగులు తీవ్ర ఆందోళన లో ఉన్నారని, శాసనసభ వేదికగా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. వారందరికీ తెలంగాణలోనే పునరావాసం కల్పించాలని కోరారు. ఏడుమండలాలు ఆంధ్రప్రదేశలో విలీనమయ్యాయనే సాకుతో బూర్గంపాడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని.. జెడ్పీటీసీకి అర్హత లేకుండా చేయటం అన్యాయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రస్తావిం చారు. ఆ ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచేందుకు గత సమావేశాల్లో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతామని చెప్పిన ముఖ్యమంత్రి.. అది ముగిసిన అధ్యాయమని చేతులు దులుపుకొన్నారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వమే విలీన మండలాల్లోని ప్రజల సంక్షేమ బాధ్యతలను పట్టించుకోవాలని.. పథకాలను అమలు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, టీడీపీలు కుట్ర పూరితంగా ఏడు మండలాలను కబళించాయని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. స్పందించిన మంత్రి ఈటెల మాట్లాడుతూ ఆంధ్రలో విలీనం చేసిన ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ విషయమై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. -
'వాళ్లు...తెలంగాణ ప్రజలు కాదా? పాకిస్తాన్ వాళ్లా?'
హైదరాబాద్ : తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయంగా కలిపారని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ శాసనసభా పక్ష నాయకుడు తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఏడు మండలాల్లో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు కూడా పోటీ చేశారని, కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చినందున తమకు సంబంధం లేదనటం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. తాటి వెంకటేశ్వర్లు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ "తొలి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ఆప్రాంత ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. అఖిలపక్షంతో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇప్పుడు 7 మండలాలకు మేమే కరెంట్ ఇస్తున్నామని చెప్పటం ఎంతవరకు సబబు. ఆ ఏడు మండలాల వారికి ఉచితంగా కరెంట్ ఇస్తామనడం ఏంటి... వారు తెలంగాణ ప్రజలు కాదా? పాకిస్తాన్ వాళ్లా?, రేషన్ కార్డులు, ఫించన్ల పథకంపై ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. 7 మండలాల విషయంపై అసెంబ్లీలో చర్చించి న్యాయం జరిగేలా కేసీఆర్ చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు. పినపాక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముంపుకు గురైన 7 మండలాలకు పునరావాసం కల్పించాలంటే ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిస్తోందని అన్నారు. '10 జిల్లాల తెలంగాణలో అంగుళం కూడా వదలమంటూ ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పారని, తొలి తీర్మానం ఏర్పాటు చేసి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్తామన్నారు. 7 మండలాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొంది. మా నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లడంతో పాటు భవిష్యత్‌లో పలు సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుంది. సాధ్యమైనంత త్వరలో ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం కావాలి. పోలవరం ముంపు ప్రజలు, ఉద్యోగుల భద్రతకు సంబంధించి ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలి' అని పాయం కోరారు. -
3 ఎకరాల భూపంపిణీ ప్రస్తావన ఏది?: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ విస్మరిస్తోందని ఖమ్మం జిల్లా పినపాక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం అసెంబ్లీలో గిరిజనులు, దళితులకు భూ కేటాయింపులపై వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ భూమి లేని పేద దళితులకు, గిరిజనులు మూడు ఎకరాలు కేటాయిస్తామన్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. భూపంపిణీ వివరాలను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆగస్ట్ 15న టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా దళితులకు భూపంపిణీ ప్రారంభించిందని, అయితే ఎంతమందికి పంపిణీ చేశారో చెప్పాలరన్నారు. అలాగే భూములతో పాటు సాగునీరు, కరెంట్, సాగునీరు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 3 ఎకరాల భూ పంపిణీపై ప్రస్తావన లేదన్నారు. మరోవైపు భూమి కోసం దళితులు, గిరిజనులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారని పాయం వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై సభలో ప్రభుత్వం నుంచి సమాధానం రాబడతామని చెప్పారు. -
ప్రభుత్వాన్ని నిలదీస్తాం: పొంగులేటి
హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, విద్యుత్ సంక్షోభంపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, ప్రజా సమస్యలపై తమ గళం విన్పిస్తుందని తెలంగాణ శాసనసభ పక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, ఉప నాయకుడు పాయం వెంకటేశ్వర్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
కట్టుకథల రూపంలో వార్తలా?
-
కట్టుకథల రూపంలో వార్తలా?
హైదరాబాద్: తాము గెలిచిన రోజు నుంచి కొన్ని వార్తా చానళ్లు, పత్రికలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వార్లు, పాయం వెంకటేశ్వర్లు అన్నారు. తాము పార్టీ మారతామంటూ కట్టుకథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్ ను కలుస్తున్నామని స్పష్టం చేశారు. పినపాకలో పవర్ ప్లాంట్ ఏర్పాటు, స్థానికుల ఉపాధి గురించి ముఖ్యమంత్రిని కలిసినట్టు వివరించారు. తాము పార్టీ మారతామన్నది ఊహాజనిత కథనమని కొట్టిపారేశారు. ఆదివాసీ ఎమ్మెల్యేలమైన తమపై కట్టుకథల రూపంలో వార్తలు రావడం బాధాకరమని వాపోయారు. -
'మేనిఫెస్టోలో చెప్పినట్టు రుణమాఫీ చేయాలి'
హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో మరణించిన విద్యార్థులు, తెలంగాణ అమరవీరులకు అసెంబ్లీలో సంతాపం తీర్మానం పెట్టాలని వారు సూచించారు. నవ తెలంగాణ నిర్మాణంలో, బంగారు తెలంగాణ సాధనలో తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేలుగా సోమవారం వీరు ప్రమాణస్వీకారం చేశారు. -
బంగారు తెలంగాణ నిర్మాణంలోభాగస్వాములమవుతాం
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు, న్యూస్‌లైన్ : బంగారు తెలంగాణ నిర్మాణంలో వైఎస్సార్ సీపీ భాగ్యస్వామ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులోని పార్టీ మండల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ శాసన సభా ఉప నేతగా తనను ఎంపిక చేసిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం అసెంబ్లీ లోపల, బయట నిర్మాణాత్మకంగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టే ్రపజా సంక్షేమ కార్యక్రమాలను స్వాగతిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పుతామన్నారు. అసెంబ్లీలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై చర్చిస్తూ పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ముందుంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. గతంలో తాను తీసుకొచ్చిన కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి వాటిని త్వరిత గతిన పూర్తిచేయడానికి కృషిచేస్తానని అన్నారు. నియోజకవర్గంలోని తాగునీరు, సాగునీరు.బొగ్గుగనుల ఏర్పాటు, బొగ్గు ఆదారిత పరిశ్రమల ఏర్పాటుకు పాటుపడాతనన్నారు. నియోజకవ ర్గంలో ప్రవిహ స్తున్న గోదావరి జాలాలను సాగునీరు, తాగునీటి కోసం సద్వినియోగం చేసుకొని ప్రజల దాహంతోపాటు నియోజవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. నియోజకవర్గంలోని బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నందున కొత్త గనుల, ఎన్టీపీసీ, 500ల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న రెగులగండి కాల్వలు, రూ. 5 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు, పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం, సింగిరెడ్డిపల్లి లిఫ్టు, కిన్నేరసాని కాల్వల నిర్మాణం పూర్తి చేయడానికి పాటుపడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే నియోజకర్గంలోని వివిధ విభాగాల అధికారులతో చర్చించి సమస్యలను తెలుసుకుంటానన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు సరైన ప్యాకేజీ అందడంతోపాటు ఆ గ్రామాలను జిల్లాలోనే కొనసాగేలా కేంద్రపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. మణుగూరులోని సింగరేణి గనుల్లో పంచ్‌ఎంట్రీ ఏర్పాటు కోసం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా కేంద్రాన్ని కలిసి అనుమతి తీసుకొస్తామన్నారు. పంచ్‌ఎంట్రీ ఏర్పాటు వల్ల ఇటీవల మణుగూరు ఏరియా నుంచి బదిలీ అయిన కార్మికులు మళ్లీ ఇక్కడే పనులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏరియాలో కొత్తగనులు ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అందుకు తన వంతు సహాయ సహాకారాలు ఉంటాయన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పాలకాలపాటి చంద్రశేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ఆవుల నర్సింహారావు, మండల నాయకులు పెద్ది నాగకృష్ణ, గాండ్ల సురేష్, హరగోపాల్, మెడ నాగేశ్వరరావు, ముసలి శ్రీనివాస్, ఈసాల ఏడుకొండలు, మిట్టపల్లి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ నిర్మాణాత్మక పాత్ర'
హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ఆపార్టీ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీలోని బలోపేతం చేస్తామని ఆయన శనివారమిక్కడ తెలిపారు. లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము వైఎస్ జగన్ నేతృత్వంలో పని చేస్తామని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. -
ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే..
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: తాము ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని, జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామని పినపాక ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్‌లాల్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్సార్సీపీకి జిల్లాలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కొన్ని శక్తులు, పత్రికలు కావాలనే ఊహాజనిత కథనాలతో గందరగోళం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జిల్లాలో అత్యధికంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని పెద్ద పార్టీగా నిలవడంతో జీర్ణించుకోలేని శక్తులు ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని, తాము టీఆర్ఎస్లోకి వెళ్తున్నామంటూ ప్రచురించిన అసత్య కథనాలను ఖండిస్తున్నామని తెలిపారు. తమకు పార్టీ మారే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. తాము విజయం సాధించిన తరువాత నియోజకవర్గ ప్రజలను కలువకముందే, కొన్ని గంటల్లోనే ఇలాంటి దుష్ర్పచారం చేయడం దిగజారుడుతనమన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులమైన తమను కించపరిచేలా, కనీస మర్యాద లేకుండా అగౌరవంగా వ్యవహరించడం సరికాదన్నారు. మైండ్‌గేమ్ ఆడే ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచరించే సంస్కృతిని మానుకోవాలన్నారు. కష్టకాలంలో జగన్‌తో ఉన్న తాము ఎప్పటికీ జగన్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జిల్లాలో, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు నవ తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకుంటామన్నారు. సమావేశంలో ఖమ్మం, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు కూరాకుల నాగభూషణం, రవిబాబు నాయక్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, ఆకుల మూర్తి, వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొండల్రావు, దుర్గాప్రసాద్, ఎస్.వెంకటేశ్వర్లు, మార్కం లింగయ్యగౌడ్, ఎంఏ.సమద్ పాల్గొన్నారు. -
'మేం ఎప్పటికీ వైఎస్సార్ సీపీ లోనే ఉంటాం'
ఖమ్మం: తాము పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజంలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, మదన్ లాల్ లు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన తాము ఎప్పటికీ ఆ పార్టీలోనే ఉంటామని తెలిపారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆ ఎమ్మెల్యేలు.. పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ సీపీ విజయాన్ని జీర్ణించుకోలేక కొంతమంది కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది కొన్ని రాజకీయ శక్తుల చేస్తున్న కుట్ర మాత్రమేనని వారు మండిపడ్డారు. -
వైఎస్ఆర్ సీపీ గెలుపునకు సహకరించిన..అందరికీ కృతజ్ఞతలు
మణుగూరు, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్ఆర్ సీపీని గెలిపించిన అందరికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన శనివారం మణుగూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన సహాయ సహకారాలతో నవ తెలంగాణ నిర్మాణంలో వైఎస్ఆర్ సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు వైఎస్ఆర్ సీపీని అమితంగా ఆదరించారని అన్నారు. జిల్లాలో సీపీఎం, వైఎస్ఆర్ సీపీ పొత్తు మంచి ఫలితాన్నిచ్చిందని అన్నారు. ఈ రెండు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేశారని, ఫలితంగానే పినపాక నియోజకవర్గంలో ఊహించినదానికంటే ఎక్కువ మెజార్టీ తనకు వచ్చిందనిఅన్నారు. తనను గెలిపించిన ప్రజలకు, సహకరించిన వైఎస్ఆర్ సీపీ, సీపీఎం శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి, విజయమ్మ, షర్మిలమ్మ పర్యటనతో పార్టీకి మరింతగా కలిసొచ్చిందని అన్నారు. ప్రధానంగా పినపాక నియోజకవర్గంలో తన గెలుపునకు షర్మిలమ్మ పర్యటన నాంది పలికిందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. రెండున్నర దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ, ప్రజల మధ్యన ఉంటున్న తనకు నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. వీటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తానని అన్నారు. ఖమ్మాన్ని ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో వైఎస్ఆర్ సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తన విజయానికి అన్నివిధాల సహాయ సహకారాలందించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, పినపాక నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించిన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యు లు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, ఉడుముల లక్ష్మారెడ్డి, వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు భూపల్లి నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరా వు, మాదినేని రాంబాబు, గంగిరెడ్డి వెంకటరెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పినపాక,వైరాలో వైఎస్ఆర్ సీపీ విజయం
ఖమ్మం : ఖమ్మం జిల్లా పినపాక, వైరా అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు. అలాగే వైరా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బోనోతు మదన్ లాల్ ఏడువేల మెజార్టీతో గెలుపొందారు. కాగా భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలుపొందారు. కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు విజయం సాధించారు. -
వైఎస్ఆర్ సీపీ-సీపీఎం కూటమికే.. అత్యధిక స్థానాలు
వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు మణుగూరు, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్ఆర్ సీపీ-సీపీఎం కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పినపాక అసెంబ్లీ అభ్యర్థి పాయం వెంకటేశ్వరు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఐదు స్థానాలు, సీపీఎం రెండు స్థానాలు కైవసం చేసుకుంటాయని చెప్పారు. పినపాక నియోజకవర్గంలో తాను కనీసం పదివేల ఓట్ల మెజార్జీతో గెలుస్తానని అన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ సీపీ-సీపీఎం కూటమి మంచి సమన్వయంతో పనిచేసిందన్నారు. ఎన్నికల్లో నిరంతరం శ్రమించిన ఈ రెండు పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలి పారు. జిల్లాలో వైఎస్ఆర్ సీపీ బలమైన శక్తిగా అవతరించబోతోందని అన్నారు. వైఎస్ సంక్షేమ పథకాలను అమలుచేయించడంలో తాము ముందుంటామని, ప్రజాసంక్షేమం కోసం నిర్విరామ కృషి చేస్తామని అన్నారు. పినపాక నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని, వారికి అండగా ఉంటానని అన్నారు. నియోజకవర్గంలోని తాగునీరు సాగునీటి సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. నియోజకవర్గంలోని సింగరేణి, బీపీఎల్, భారజల కర్మాగారం ఉద్యోగులకు, కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. -
జనభేరి సక్సెస్
సాక్షి, ఖమ్మం: పేదల గుండెల్లో గూడుకట్టుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్రెడ్డిని ఖమ్మం గుమ్మం అక్కున చేర్చుకుంది. జనభేరి సభకు వచ్చిన జగన్‌కు జిల్లా ప్రజలు ఆప్యాయత, ఆత్మీయత, ఆదరణతో నీరాజనం పలికారు. జిల్లా సరిహద్దు పాకలగూడెం నుంచి ఖమ్మం వరకు ఎక్కడ చూసినా కనుచూపు మేర జనసంద్రమే. జిల్లా ప్రజలతో పాటు నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి భారీ ఎత్తున జనప్రవాహం కదలడంతో పెవిలియన్‌గ్రౌండ్ పోటెత్తింది. జిల్లాలో సుమారు ఎనిమిది గంటల పాటు సాగిన జననేత పర్యటన ఆద్యంతం జైజగన్ నినాదాల నడుమ ముందుకు కదిలింది. పాకలగూడెంలో అపూర్వ స్వాగతం.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం గురుభట్లగూడెం మీదుగా జిల్లాలోని సత్తుపల్లి మండలం పాకలగూడెంలోకి జగన్ మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రవేశించారు. ఉదయం 9 గంటల నుంచే జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో గురుభట్లగూడెం చేరుకొని ముందస్తుగా అభిమాన నేతకు స్వాగతం పలికేందుకు బారులు తీరారు. పాకలగూడెంలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లుతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు ఆయనకు స్వాగతం పలకడంతో జిల్లాలో ఆయన పర్యటన ప్రారంభమైంది. తొలుత పాకలగూడెంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కూలీలు, గ్రామ ప్రజలు జేజేలు పలుకుతూ జగన్‌ను జిల్లాలోకి స్వాగతించారు. అనంతరం గంగరాంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నంబూరి రామలింగేశ్వరరావు జగన్‌కు సింగరేణి ల్యాంప్ క్యాప్ పెట్టి చమ్మాస్ చేతికిచ్చారు. ఇక్కడి నుంచి సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా, కొణిజర్ల, తనికెళ్ల వరకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా బారులుతీరి జగన్‌కు స్వాగతం పలికారు. పోటెత్తిన పెవిలియన్ గ్రౌండ్.. జనభేరి సభతో ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ పోటెత్తింది. రాత్రి ఏడు గంటలకు తనికెళ్ల మీదుగా జగన్ పర్యటన ఖమ్మం చేరుకుంది. అప్పటికే శ్రీశ్రీ సెంటర్ నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ఎటు చూసినా జనమేజనం. ఇల్లెందు క్రాస్‌రోడ్డు, రాపర్తినగర్ మీదుగా జగన్ వాహన శ్రేణి రాత్రి ఏడున్నర గంటలకు పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకుంది. అప్పటికే గ్రౌండ్ జనసంద్రంతో కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచే జిల్లాలోని నలుమూలల నుంచి జనం సభకు తరలివచ్చారు. జగన్ వేదిక పైకి రాగానే ..‘ జై జగన్.. వైఎస్ఆర్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభావేదిక నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. గ్రౌండ్‌తో పాటు ఆర్అండ్బీ అతిథిగృహం, భక్తరామదాసు కళాక్షేత్రం, మయూరిసెంటర్, బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా.. జనం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి జగన్ ఒక్కొక్కటిగా వివరిస్తుండగా జనం ఉత్సాహంతో జేజేలు పలికారు. సుమారు అర్ధగంట పాటు జగన్ ప్రసంగం కొనసాగింది. భారీగా సభకు జనం తరలిరావడంతో ఎల్ఈడీ స్క్రీన్‌ను సభ వేదిక పైన ఏర్పాటు చేశారు. ఆకట్టుకున్న జగన్.. జగన్ తన ప్రసంగంలో మహానేత పాలనలో సువర్ణయుగం, పేదోడికి జరగిన లబ్ధి, ప్రస్తుత స్వార్థ రాజకీయాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ‘ఖమ్మం ప్రజలు చూపిస్తున్న ఆప్యాయత, ఆదరణ, అభిమానం.. ఎప్పటికీ మరువలేనంటూ’ ఆయన ప్రసంగించడంతో జనం ఒక్కసారిగా రెట్టింపు ఉత్సాహంతో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, సబ్‌ప్లాన్ పథకాల గురించి వివరిస్తూ పేద ప్రజల గుండెలను తట్టి మరోమారు జనభేరి సాక్షిగా మహానేతను గుర్తు చేశారు. పేదోడికి కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత మహానేతకే దక్కిందని, అందుకే ప్రతి పేదవాడు ఇప్పటికీ, ఎప్పటికీ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తమ గుండెల్లో పదిలంగా నిలుపుకున్నారన్నారు. దీనికి నిదర్శనం.. జిల్లాలో జనభేరి సభ అన్నారు. ప్రతి పేదోడి గుండెల్లో వైఎస్ బతికిఉన్నారనడానికి జిల్లా ప్రజలే నిదర్శనమని జగన్ ప్రసంగించడంతో గ్రౌండ్ అంతా వైఎస్ నినాదాలు మిన్నంటాయి. ఆలస్యంగా వచ్చినా అక్కున చేర్చుకొని.. ఉదయం 11 గంటలకే జిల్లాలోకి జగన్ ప్రవేశించాల్సి ఉండగా.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఆయనకు ఘన స్వాగతం పలకడంతో జిల్లా సరిహద్దులోకి మధ్యాహ్నం 1.45 గంటలకు వచ్చారు. సత్తుపల్లి మండలం పాకలగూడెం నుంచి మొదలైన పర్యటన ఖమ్మం వరకు 95 కిలోమీటర్లు ఐదున్నర గంటల పాటు సాగింది. అడుగడుగునా మహిళలు, వృద్ధులు, కూలీలు, యువకులు, విద్యార్థులు జగన్ కాన్వాయ్‌ను ఆపి ఆయనకు ఎదురొచ్చి స్వాగతం పలకడంలో పోటీపడ్డారు. ప్రతిచోటా ప్రతి ఒక్కరికి కరచాలనం చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. పెవిలియన్ గ్రౌండ్‌కు సాయంత్రం 4 గంటలకే రావలసి ఉండగా ఎక్కడికక్కడ ప్రజలను పలకరిస్తూ రాత్రి ఏడున్నర గంటలకు చేరుకున్నారు. జగన్‌ను చూడాలని, ప్రసంగం వినాలని ఆలస్యమైనా అశేషజనవాహిని వేయి కళ్లతో ఎదురుచూసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయంవెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయ కర్తలు బాణోతు మదన్‌లాల్, ఎడవల్లి కృష్ణ, సామాన్యకిరణ్, నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, డాక్టర్. తెల్లం వెంకట్రావ్, నేతలు సాధు రమేష్‌రెడ్డి, తోట రామారావు, భుక్యా దళ్‌సింగ్, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మెండెం జయరాజు, ఎండీ ముస్తఫా, చాగంటి వసంత, చాగంటి రవీందర్‌రెడ్డి, కూరాకుల నాగభూషణంతో పాటు రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు గట్టు రామచంద్రారావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావు, ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడు జనక్‌ప్రసాద్, పార్టీ సీఈ సభ్యులు రెహ్మాన్, విజయారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, జిల్లా పరిశీలకుడు గున్నం నాగిరెడ్డి , వీఎల్‌ఎన్‌రెడ్డి , వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్రావు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఆ జిల్లా నేతలు పాదూరి కరుణ, యర్నేనేని బాబు, బీరవోలు సోమిరెడ్డి, ఇంజం నర్సిరెడ్డిలతో పాటు లక్షలాది మంది వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
5న ఖమ్మంలో వైఎస్సార్సీపీ బహిరంగసభ
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారని చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం బహిరంగసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హైదరబాద్‌లో ఇటీవల జరిగిన సమన్వయకర్తల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు వివరించారు. తెలంగాణలో పార్టీకి ఉన్న బలాన్ని పరిగణనలోకి తీసుకుని ఇక్కడ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాలకు ఈ సభ స్ఫూర్తిగా నిలవాలని, ఇందుకోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామాలింగేశ్వరరావు (సత్తుపల్లి), ఎడవల్లి కృష్ణ(కొత్తగూడెం), తెల్లం వెంకట్రావు(భద్రాచలం), బానోత్ మదన్‌లాల్(వైరా), తాటి వెంకటేశ్వర్లు(అశ్వారరావుపేట), సామాన్యకిరణ్(మధిర), నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మార్కం లింగయ్యగౌడ్, ముస్తాఫా, మూర్తి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలి
అశ్వాపురం, న్యూస్‌లైన్: పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని, కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గిరిజనులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే గిరిజనుల జీవనం దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలన్నిటినీ జిల్లాలోనే ఉంచాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పేరుతో గిరిజనులకు ఏమాత్రం అన్యాయం జరిగినా ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నిర్వాసిత కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా భూమికి బదులు భూమి చూపించాలని, వారికి ఎక్కడ పునరావాసం ఇచ్చేదీ ముందే చెప్పాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాలు 134 కాదు.. 200 పైనే.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో భద్రాచలం, పాల్వంచ డివిజన్లో ప్రభుత్వం 134 గ్రామాలు మునిగిపోతాయని ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో వాస్తవం లేదన్నారు. సంఖ్య సుమారు 200కు పైనే ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో అటవీ సంపద కూడా కనుమరుగవుతుందని అన్నారు. అనాదిగా అడవులతో అనుబంధాన్ని కలిగిన, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులను అక్కడి నుంచి వెళ్లగొడితే వారి జీవనం చాలా కష్టమవుతుందని, దీనిని పూడ్చడం దాదాపు అసాధ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మాదినేని రాంబాబు, నాయకులు గజ్జల లక్ష్మారెడ్డి, ఓరుగంటి రమేష్, ఎస్కె.ఖదీర్, చిటికెన భాస్కరరావు, సోవలం నారాయణ, నర్సింహారావు, ఎస్కె.గౌస్ పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా పాయం
ప్లీనరీలో ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు జగన్ ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మణుగూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేశారు. పార్టీ రెండు ప్లీనరీ ఆదివారం కడప జిల్లా ఇడుపులపాయలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, పది నియోజకవర్గాల ఇన్చార్జిలు, ఇతర అనుబంధ సంఘాల నాయకులు భారీ ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి వారితో జగన్ సమీక్షించారు. అనంతరం ప్రస్తుతం పార్టీ జిల్లా కన్వీనర్‌గా ఉన్న పాయం వెంకటేశ్వర్లును అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. పాయం నియామకం పట్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు. -
ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటా
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకుని, జిల్లాలోని అన్ని స్థానాలలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పార్టీ జిల్లా కన్వీనర్ పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజాభిమానం నుంచి ఆవిర్భవించిన ఈ పార్టీలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. సోమవారం ఆయన స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ చైతన్యం గల జిల్లాలో ఎన్నికల సమయంలో తనపై అతిపెద్ద భాద్యత పెట్టడం గర్వంగా ఉందని చెప్పారు. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఆదివాసీలకు జిల్లా బాధ్యతలు అప్పగించలేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే ఆ స్థానం కల్పించారని అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దివంగత మహానేత వైఎస్ ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాలు పాటిస్తూ జిల్లాలో పార్టీని అగ్రస్థానంలో ఉంచుతామన్నారు. తనకు విద్యార్థి దశనుంచే రాజకీయ అనుభవం ఉందని, ఎన్నికలు తనకు కొత్త కాదని చెప్పారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ బలమైన పార్టీ అని, గత పంచాయతీ ఎన్నికల్లో తాము బలపరిచిన వారు అధిక స్థానాల్లో గెలుపొందడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇటీవల దమ్మపేటలో జరిగిన ఎన్నికల్లో సైతం సర్పంచ్ స్థానం గెలుపొందామన్నారు. వైఎస్ సంక్షేమ పథకాలు పటిష్టంగా అమలు కావాలంటే వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని, పార్టీపై ఎవరెన్ని దుష్ర్పచారాలు చేసినా ప్రజల నుంచి తమను ఎవరూ దూరం చేయలేరని స్పష్టం చేశారు. క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నాం : పొంగులేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ అయినా వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్, 30 సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీ కంటే భిన్నంగా.. క్రమశిక్షణ తో ముందుకు సాగుతున్నామని పార్టీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జిల్లాలో ఇతర పార్టీల కంటే తాము ఎంతో బలంగా ఉన్నామన్నారు. పార్టీలోకి ముఖ్య నాయకులు రావడం, టికెట్లు ఆశించడం సహజమని, అయితే ప్రజలతో మమేకమయ్యేవారికి, ప్రజలు కోరుకునేవారికి జగనే పిలిచి టికెట్లు ఇస్తారని చెప్పారు. జిల్లాలో అతి త్వరలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలిపారు. జిల్లాలో పార్టీకి ఉన్న ప్రజాబలం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు. మిగిలి ఉన్న నియోజకవర్గాలకు ఈనెలాఖరు నాటికి కన్వీనర్లను నియమిస్తామన్నారు. ప్రతి ఒక్కరు జగన్‌కు అండగా నిలిచి వచ్చే సార్వత్రక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలని, వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందుకోవడానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. సమావేశంలో పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త యడవల్లి కృష్ణ, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోటా రామారావు, అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాయకులు కొదమసింహం పాండురంగాచార్యులు, ఎండీ. ముస్తాఫా, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, ఆకుల మూర్తి, చాగంటి రవీంద్రరెడ్డి, మార్కం లింగయ్య, చాగంటి వసంత, కీసర పద్మజారెడ్డి, కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, షర్మిలా సంపత్, తుమ్మా అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.