
పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే పాయం
ఖమ్మం: తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఖమ్మం జిల్లా పినపాక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తాను పార్టీ మారతానంటూ ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనపై పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పాయం మండిపడ్డారు.
అయితే ఇంతకముందు ఎల్లో మీడియాలో వచ్చిన ఈ కథనాలను చాలాసార్లు తాను ఖండించానని చెప్పారు. అయినా పదేపదే ఎల్లో మీడియాలు పనిగట్టుకొని తనపై ఇలా దుష్ర్పచారం చేయడం తననెంతో బాధించిందంటూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.