రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు గాయాలు | MLA Payam Venkateswarlu injured in a accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు గాయాలు

Published Fri, Sep 15 2017 8:45 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

MLA Payam Venkateswarlu injured in a accident



సాక్షి, బూర్గంపహాడ్‌ :
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టి నగర్ వద్ద చోటుచేసుకుంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కారు, ఓ ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి.

ఈ ఘటనలో పాయం వెంకటేశ్వర్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఎమ్మెల్యే వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కారులో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ ఎమ్మెల్యేను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement