pinapaka
-
కాంగ్రెస్ తుపాన్లో కేసీఆర్, బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది: రాహుల్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పదేళ్లు తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంతం పలికే రోజు వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎన్ని లక్షల కోట్లను కేసీఆర్ అవినీతి చేశారో.. అంత డబ్బును పేదల అకౌంట్లలో వేస్తామని తెలిపారు. పినపాకలో రాహుల్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తానే స్వయంగా వెళ్లి చూశానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ కేవలం కేసీఆర్ ఇంట్లోమాత్రమే వస్తుందని రాహుల్ విమర్శించారు. కేసీఆర్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తాను చెబుతానని అన్నారు. మీరు చదివిన స్కూల్, నడిచే రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీ వేసిందేనని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ 500 కే ఇవ్వబోతున్నామని, ప్రతి నెల మహిళల అకౌంట్లో నెలకు 2.500 వేస్తామని అన్నారు. ‘కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ సీఎం అమలు చేస్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేరుస్తుంది. తెలంగాణలో కులగణనను జరిపిస్తాం. స్థానిక సంస్థల్లోనూ బీసీల రిజర్వేషన్లు పెంచుతాం. కాంగ్రెస్ అంటే కుటుంబ పాలన కాదు ప్రజా ప్రభుత్వం. 20 లక్షల మంది రైతులను ధరణి పేరుతో మోసం చేశారు. ధరణితో మోసపోయిన రైతులకు మీ భూములు మీకు ఇప్పిస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ తుపాన్ మొదలైందని కేసీఆర్‌కు అర్థమైంది. కాంగ్రెస్ తుపాన్లో కేసీఆర్, బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది. తెలంగాణ ఒక కుటుంబం కోసం ఏర్పడలేదు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒక్కటే. ఎక్కడ కాంగ్రెస్, బీజేపీ పోటీ ఉంటుందో అక్కడ కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికి ఎంఐఎం ఉంటుంది. ఇక్కడ కేసీఆర్, కేంద్రంలో మోదీని అధికారంలో నుంచి దించేస్తాం’ అని పినపాక సభలో రాహుల్ వ్యాఖ్యానించారు. చదవండి: Tandur: ఓ పార్టీ నుంచి అడ్వాన్స్ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్ -
TS Election 2023: పినపాక ఎమ్మెల్యేపై ఓటర్ల అసంతృప్తి..!
భద్రాద్రి: పినపాక నియోజక వర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసేది డబ్బు, కమ్మ కులం, రెడ్డి కులం. నియోజకవర్గంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నపటికీ నిరుద్యోగ యువతకు ఐటీసీ, సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నా స్థానిక నిరుద్యోగ యువతకు ఎటువంటి అవకాశాలు కల్పించలేదని, ఈ నియోజకవర్గం దాదాపుగా 80 శాతం గోదావరి పరివాహక ప్రాంతం కావటం ప్రతి సంవత్సరం సుమారు 60 గ్రామాల వరకు నీట మునిగి పోతాయి. ఇండ్లు, పంట పొలాలు, రోడ్లు, పూర్తిగా జలమయమై పోతాయి. ఎన్నో సంత్సరాల నుంచి ఎంతో మంది అధికారులకు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు మొరపెట్టిన వారిని మైదాన ప్రాంతాలకు తరలించి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని వేడుకున్న వాళ్ల మొర ఆలకించే నాథుడే కరువయ్యాడు. వెరసి యువత, గోదావరీ పరివాహక ప్రాంత ప్రజలు స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలతో.. రేగ కాంతారావు ఈ నియోజవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుటికి ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవటం, ఇసుక ర్యాంపులలో కమిషన్లు, అధికార పార్టీ నేతలు భూ కబ్జాలు, ఇక ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. గతంలో సీపీఐ పార్టీలో పనిచేయడం గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్తతో నేరుగా సంబంధాలు ఉండటం.. అయన ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పెత్తనం మొత్తం అయన భార్యదే. ఎమ్మెల్యే నామ్‌కే వాస్తు అనే అప నింద నేటి వరకు అయన మోయటం, సీపీఐ పార్టీ నుంచి వైఎస్సార్సీపీ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చేరటం, పొంగులేటికి చెప్పకుండా ఏ పని చేయడు అని ప్రజలో బలంగా వినిపిస్తున్న మాట. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పది మంది వరకు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపకపోవటం, గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కేడర్ బలంగా ఉండటం, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నపటికీ ఇక్కడ సుమారు 50 వేల వరకు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా ఉందని చెప్పవచ్చు. -
ఆ విషాదానికి 23 ఏళ్లు.. ఇప్పటికీ మర్చిపోలేం..
సాక్షి, కరకగూడెం(ఖమ్మం): కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు మెరుపు దాడి చేసి 16 మంది పోలీసులను బలిగొన్న విషాద సంఘటనకు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఏపీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక మండలం పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది. 1997, జనవరి 9న అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో సుమారు 100 మంది మావోయిస్టులు సాయుధులై కరకగూడెం(అప్పుడు పినపాక మండలంలో ఉండేది) ఠాణాపై దాడికి పాల్పడ్డారు. బాంబులతో స్టేషన్‌ను పేల్చివేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 16 మంది పోలీసులను బలిగొన్నారు. మందుగుండు, తుపాకులను అపహరించారు. పోలీస్ సిబ్బంది బీహెచ్ఎఫ్ సెట్ ద్వారా సమీపంలోని ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌కు అదనపు సాయం కావాలని సమాచారం అందించి ప్రతిదాడి చేసేలోపే మావోయిస్టులు పోలీస్ స్టేషన్‌ను లూటీ చేసి వెళ్లిపోయారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేసరికే ఠాణాలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పాండవ, కిన్నెర, ఏటూరునాగారానికి చెందిన జంపన్న దళాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. మృతిచెందిన 16 మందిలో 8 మంది సివిల్ పోలీసులు, ఏపీఎస్పీకి చెందిన 5వ బెటాలియన్ (విజయ నగరం)కు చెందిన 8 మంది పోలీసులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ పేల్చివేత ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఆ నాటి సీఎం చంద్రబాబు నాయుడు అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి, మరో మంత్రి తుమ్మలతో కలిసి కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఏజెన్సీ ప్రజలతో సత్ససంబంధాలు కొనసాగిస్తూ... మావోయిస్టు కార్యకలాపాలకు క్రమంగా చెక్ పెడుతూ వచ్చారు. కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను అత్యంత ఆధునికంగా దాడులను ప్రతిఘటించేలా నిర్మించారు. జంపన్న మార్గదర్శకత్వంలో.. కరకగూడెం పోలీస్ స్టేషన్ పేల్చివేతలో ప్రధాన సూత్రధారి, మావోయిస్టు అగ్రనేత జంపన్న అలియాస్ జి నర్సింహారెడ్డి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో పోలీసుల సమక్షంలో తన భార్యతో కలిసి లొంగిపోయాడు. ఇప్పటికీ మర్చిపోలేం.. 23 యేళ్ల క్రితం మావోయిస్టులు కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై దాడి సంఘటనను ఇప్పటికీ మరువలేకపోతున్నాం. ఆ రోజూ రాత్రి మా గ్రామాన్ని పూర్తిగా మావోయిస్టులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మేము భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపాం. –సయ్యద్ ఖాజా హుస్సేన్, కరకగూడెం మరుభూమిలా.. అర్ధరాత్రి వేళ బాంబులు, తూటాల శబ్దాలతో గ్రామం దద్ధరిల్లింది. ఇంట్లో నుంచి బయకొస్తుండగా.. బయటకు రావద్దని మావోయిస్టులు హెచ్చరిక చేశారు. దీంతో గ్రామస్తులెవరూ బయటకు రాలేదు. తెల్లారి చూస్తే పోలీస్ స్టేషన్ మరుభూమిలా కన్పించింది. – సార భిక్షం, కరకగూడెం గ్రామస్తుడు అమరుల ఆశయ సాధనే లక్ష్యం పోలీస్ అమరుల ఆశయ సాధనే మా లక్ష్యం. ప్రజా రక్షణ కోసం ప్రాణాలు వదిలిన వారి ఆశయాలను స్మరించుకుంటూ విధులు నిర్వహిస్తున్నాం. పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. – సునీల్‌దత్, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం -
‘రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి పోటీచేస్తా’
సాక్షి, ఖమ్మం: తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఇంకా ఏ పార్టీలో చేరలేదని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు స్పష్టం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని, త్వరలోనే టీఆర్ఎస్లో చేరడం కాయమన్నారు. టీఆర్ఎస్లో చేరేముందు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తానని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ బీ ఫాం మీద తిరిగి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తనపై ఆంక్షలు విధించడం తనకు నచ్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు రేగా, ఆత్రం సక్కులు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి భారీషాకిచ్చిన విషయం తెలిసిందే. వీరితో పాటు నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య కూడా పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. -
కొత్తగూడెం ఎన్నికల్లో కార్మికులే కీలకం
సాక్షి, కొత్తగూడెం: ఏజెన్సీలో ఉన్నప్పటికీ పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన భద్రాద్రి జిల్లాలో ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల ఓట్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాలు ఉండగా, ఇందులో పినపాక, కొత్తగూడెం, ఇల్లెందులో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో మొత్తం 35, 647 ఉద్యోగ, కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో సింగరేణి, అశ్వాపురం మండలంలో భారజల కర్మాగారం, బూర్గంపాడు మండలంలో ఐటీసీ పేపర్ బోర్డ్ ఉన్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో కేటీపీఎస్, నవభారత్, ఎన్ఎండీసీ, కొత్తగూడెంలో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీలు తమ అనుబంధ కార్మిక సంఘాల సహకారంతో కార్మిక వాడల్లో విస్తృతంగా చారం చేస్తున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1.20 లక్షలకు పైగా కార్మిక కుటుంబాల ఓట్లు ఉండడంతో వాటిని రాబట్టేందుకు యూనియన్ల అగ్ర నాయకులను సైతం ప్రచార పర్వంలోకి దింపుతున్నారు. కార్మిక హక్కులు, సౌకర్యాలు, భద్రత, కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలు, సింగరేణిలో హైపవర్ వేతనాలు తదితర అంశాలు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. మణుగూరు మండలంలో ఉన్న సింగరేణి కార్మిక వాడల్లో 2, 819 కార్మిక, అధికారుల కుటుంబాలు ఉంటున్నాయి. మరో 2 వేల మంది సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. అశ్వాపురం మండలంలోని హెవీవాటర్ ప్లాంట్‌లో 1,500 మంది ఉద్యోగులు, మరో 300 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్‌బోర్డు కర్మాగారంలో 1,600 మంది ఉద్యోగులు, 800 మంది అధికారులు, మరో 8 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. నియోజకవర్గంలో అన్నీ కలిపి 17,019 కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ కార్మికు కుటుంబాల ఓట్లు గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. ఇక్కడ 1,023 సింగరేణి కార్మిక, అధికారుల కుటుంబాలు ఉంటున్నాయి. మరో వెయ్యి మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల ఓట్లు స్వల్ప ప్రభావం చూపించనున్నాయి. త్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, నవభారత్, ఎన్ఎండీసీ, సింగరేణి కార్మిక కాలనీలు ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా సింగరేణిలో 3, 667 కార్మిక కుటుంబాలు ఉండగా, కొత్తగూడెం కార్పొరేట్లో 2,418 ఉద్యోగుల కుటుంబాలు ఉన్నా యి. మరో 3,500 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. పాల్వంచ మండలంలోని నవభారత్‌లో 1,550 మంది కార్మికులు, ఎన్ఎండీసీలో 270 మంది ఉన్నారు. ఇక కేటీపీఎస్‌లో అన్ని యూనిట్లలో కలిపి 5,700 మంది కార్మికులు ఉన్నారు. మొత్తం కలిపి కొత్తగూడెం నియోజకవర్గంలో 16,605 మంది కార్మికులు ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కార్మిక కుటుంబాల ఓట్లు గెలుపోటములను బాగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల ఓట్ల కోసం కార్మిక ఆవాసాల్లో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. -
అబద్ధాలు కాదు.. అభివృద్ధిని చూసి ఓటు వేయండి
సాక్షి,కరకగూడెం: గడిచిన నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటర్లు టీఆర్ఎస్కు ఓటేయాలని పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన కరకగూడెం కొత్తగూడెం, పాయంవారి గుంపు, గొల్లగూడెం, అనంతారం, తుమ్మలగూడెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాకముందు సీమాంద్రుల పాలనలో రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు సువర్ణపాలన అందించారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు ఆయుధాలతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారని, ప్రజల అవసరాల మేరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. విపక్షాలు కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొలేక కూటమి కట్టి ప్రజలను మోసం చేయడానికి గ్రామాల్లోకి వస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే ఓటర్లు టీఆర్ఎస్ను మరోమారు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయా గ్రామస్తులకు టీఆర్ఎస్ కరపత్రాలను అందజేసారు. కార్యక్రమాల్లో సార సాంబశివరావు, ఎర్ర సురేష్, భవానీ శంకర్, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, వట్టం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
సందేశం..లక్ష్యం
పినపాక ఖమ్మం : అల్లరిచిల్లరిగా తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా..సమాజానికి ఏదైనా సం దేశం ఇవ్వాలనే లక్ష్యంతో షార్ట్‌ఫిల్మ్‌లు రూ పొందిస్తూ.. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం, సీతంపేట గ్రామాలకు చెందిన సుమారు 20 మంది యువకులు ఆకట్టుకున్నారు. వీరంతా ఓ బృందం గా ఏర్పడి..లఘు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. సమాజంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలనే ధ్యేయంతో భిన్నంగా ఆలోచిస్తూ..శెభాష్ అనిపించుకుంటున్నారు. ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన పులివర్తి పెద్దాచారి, సీతంపేటకు చెందిన ఆర్.రాజశేఖర్‌లు టీం లీడర్లుగా ఉంటూ మరో 20మంది యువకులతో ప్రత్యేకం గా బృందాన్ని ఏర్పరుచుకుని..తొలినాళ్లలో కేవ లం కామెడీ అంశాలను ఆధారంగా చేసుకొని షార్ట్‌ఫిల్మ్‌లు తీశారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న పరిసరాలను, పొలాలను, పాఠశాలలను, రైతుల నే ఇతివృత్తంగా చేసుకుని చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆర్ఎస్ క్రియేషన్స్ పేరుతో 25షార్ట్‌ఫిల్మ్‌లు చిత్రీకరించే వరకు వీరి ప్రయాణం సాగింది. రైతులకు పెట్టుబడి ధరలు రావాలని, పంటల సాగుకు ప్రోత్సాహమివ్వాలని, ఊర్లను బాగు చేయాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని, సర్కారు బడులను ప్రోత్సహించాలని..సందేశమిచ్చేలా షార్ట్‌ఫిల్మ్‌లు తీశారు. యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేస్తుం డడంతో వేలామంది వీక్షకులు వాటిని చూశారు. ఈ లఘుచిత్రాలన్నీ సెల్‌ఫోన్ ద్వారానే తీశామని ఆనందంగా అంటున్నారు. వీడియో కెమెరా కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదని, మొబైల్లోనే ఎడిటింగ్ ప్రక్రియను కూడా పూర్తిచేస్తున్నామని వివరించారు. దాతలు సహకరించాలి.. సమాజంలో ప్రజలను చైతన్యపరిచేందుకు షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మిస్తున్నాం. ముందుగా ఐదుగురితో మొదలైన మా ప్రయాణం ఇప్పుడు 20 మందికి చేరుకుంది. ఆర్థిక పరిస్థితి చాలక..వీడియో కెమెరా కొనలేదు. సెల్‌ఫోన్‌తోనే చిత్రాలు నిర్మిస్తున్నాం. దాతలు సహకరిస్తే సమాజంలో సమస్యల పరిష్కారానికి, మార్పు కోసం మా వంతుగా కృషి చేస్తాం. –పి.పెద్దాచారి, ఏడూళ్లబయ్యారం, పినపాక మండలం యూట్యూబ్‌లో చూడండి.. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కృషి చేస్తున్న మా యువకులకు చెందిన ఆర్ఎస్ క్రియేషన్స్ పేరిట ఉన్న యూబ్యూబ్ చానెల్‌ను ప్రజలు ఆదరిస్తున్నారు. మరింతగా ఆదరిస్తే మాకు వచ్చే పాయింట్ల మూలంగా మరింత ఉత్సాహంగా షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మిస్తాం. – ఆర్.రాజశేఖర్, సీతంపేట, పినపాక మండలం -
అర్ధరాత్రి మావోయిస్టుల ఘాతుకం ఇద్దరి హత్య
-
అర్ధరాత్రి మావోయిస్టుల ఘాతుకం
సాక్షి, భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపతిరావుపేట సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు హల్చల్ చేశారు. ఇన్ఫార్మర్ల నెపంతో ఒకరిపై కాల్పులు జరపగా, మరొకరిని గొడ్డలితో నరికి చంపారు. గ్రామ శివారు గోదావరి ఒడ్డున గిరిజన సొసైటీ పేరుతో ఇసుక క్వారీ నడుస్తోంది. ఇక్కడికి వచ్చిన మావోయిస్టులు నాలుగు లారీలు, మూడు జేసీబీలు, ఒక డోజర్, ఒక ట్రాక్టర్‌ను దహనం చేశారు. అనంతరం జానంపేట పంచాయతీ సుందరయ్యనగర్‌కు (వలస గొత్తికోయ గ్రామం) చెందిన మడివి రమేష్, జోగయ్యలను పోలీస్ ఇన్ ఫార్మర్లుగా భావించారు. వీరిలో రమేష్‌పై కాల్పులు జరిపారు. జోగయ్య(42)ను గొడ్డలితో నరికి చంపారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ మణుగూరు కమిటీ పేరుతో లేఖలు వదిలారు. 45 మంది మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే మణుగూరు డీఎస్పీ సాయి బాబా ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సమాచారాన్ని సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
హెవీ వాటర్ ప్లాంట్‌లో ప్రమాదం: కార్మికుడు మృతి
సాక్షి, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడిని సీనియర్ టెక్నీషియన్ వేల్పుల వెంకటరమణ(34) అనే కార్మికుడిగా గుర్తించారు. ఇతనిది అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం. మృతదేహాన్ని హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ ఆస్పత్రికి తరలించారు. కాగా, గ్యాస్ లీకేజీ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించిన వివరాలు తెలిపేందుకు ప్లాంట్ అధికారులు నిరాకరిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు గాయాలు
సాక్షి, బూర్గంపహాడ్ : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టి నగర్ వద్ద చోటుచేసుకుంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కారు, ఓ ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాయం వెంకటేశ్వర్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఎమ్మెల్యే వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కారులో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డ ఎమ్మెల్యేను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు
పినపాక(భద్రాద్రి కొత్తగూడెం): మహాశివరాత్రిని పురస్కరించుకొని పుణ్య స్నానాలు ఆచరిచండానికి గోదావరిలో దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చింతలబయ్యారం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామ శివారులోని గోదావరి ఒడ్డు పై ఉన్న శివాలయంలో పూజలు చేయడానికి వచ్చిన తంతరపల్లి మురళి(18), అల్లు నాగేంద్రబాబు(19), గూడె ప్రేమ్ కుమార్(22), పవన్(18), అనే నలుగురు యువకులు పవిత్ర స్నానమాచరించడానికి గోదావరిలో దిగి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజఈతగాళ్ల సాహయంతో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
ఖమ్మం: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పినపాక నియోజకవర్గంలో పర్యటించారు. అశ్వాపురం మండలంలో మిషన్ భగీరథ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేయడంతో పాటు మణుగూరు మండలంలో దీపం పథకం కింద 847 మంది లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
కారు,బైక్ ఢీ: ముగ్గురికి తీవ్రగాయాలు
పినపాక (ఖమ్మం జిల్లా) : పినపాక మండలం మోతె గ్రామం వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని పినపాక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బోల్తాపడిన ఆటో: 10 మందికి గాయాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పినపాక మండలం గొట్టేళ్ల వద్ద ఆదివారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కూలీలను ఎక్కించుకుని వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్రామీణ వికాస్ బ్యాంక్ లో లాకర్ ధ్వంసం
ఖమ్మం: ఖమ్మం జిల్లా పినపాక మండలం కరకగూడెంలో బ్యాంక్ చోరి యత్నం జరిగింది. మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ లో దుండుగులు చోరీకి విఫల యత్నం చేశారు. బుధవారం అర్థరాత్రి బ్యాంక్ లోకి ప్రవేశించిన దొంగలు లాకర్ ను పగులకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే లాకర్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
పినపాక : ఖమ్మం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన అశ్విని (22) సోమవారం ఉదయం పురుగుల మందు సేవించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి అశ్విని సాయంత్రం మృతి చెందింది. ఆమె రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ప్రేమ విఫలం కావడమే ఘటనకు కారణంగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. -
కట్టుకథల రూపంలో వార్తలా?
-
కట్టుకథల రూపంలో వార్తలా?
హైదరాబాద్: తాము గెలిచిన రోజు నుంచి కొన్ని వార్తా చానళ్లు, పత్రికలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వార్లు, పాయం వెంకటేశ్వర్లు అన్నారు. తాము పార్టీ మారతామంటూ కట్టుకథలు అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్ ను కలుస్తున్నామని స్పష్టం చేశారు. పినపాకలో పవర్ ప్లాంట్ ఏర్పాటు, స్థానికుల ఉపాధి గురించి ముఖ్యమంత్రిని కలిసినట్టు వివరించారు. తాము పార్టీ మారతామన్నది ఊహాజనిత కథనమని కొట్టిపారేశారు. ఆదివాసీ ఎమ్మెల్యేలమైన తమపై కట్టుకథల రూపంలో వార్తలు రావడం బాధాకరమని వాపోయారు. -
పినపాక,వైరాలో వైఎస్ఆర్ సీపీ విజయం
ఖమ్మం : ఖమ్మం జిల్లా పినపాక, వైరా అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు. అలాగే వైరా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి బోనోతు మదన్ లాల్ ఏడువేల మెజార్టీతో గెలుపొందారు. కాగా భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలుపొందారు. కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు విజయం సాధించారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
పినపాక, న్యూస్‌లైన్: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సీతంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సీతంపేటకు చెందిన సంతపురి సతీష్(27) మంగళవారం ఇంట్లో నీటి కోసం విద్యుత్ మోటార్ స్విచ్ వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పైన ఉన్న వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిచంగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. టాటా ఏస్ వాహనం నడిపి కుటుంబాన్ని పోషించుకుంటున్న సతీష్‌కు భార్య నళిని, కుమార్తె నందిని, కుమారుడు సాయిలు ఉన్నారు. సతీష్ మృతితో ఆ కుటుంబం వీధినపడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏడూళ్లబయ్యారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారేపల్లిలో మహిళ.. కారేపల్లి : విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కారేపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కారేపల్లి మంజులవాడకు చెందిన బాస శాంతమ్మ(60) స్థానిక బస్టాండ్ సెంటర్లో ఓ హోటల్లో పని చేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి విద్యుత్ మోటార్ వేసేందుకు వెళ్లగా తీగెలు తగిలి విద్యుదాఘాతంతో స్పృహ కోల్పోయింది. హోటల్ నిర్వాహకులు, స్థానికులు ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు శాంతమ్మకు భర్త రాములు, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిగాయి. -
మాజీ నక్సలైట్ దారుణ హత్య
పినపాక, న్యూస్‌లైన్: మండల పరిధిలోని జానంపేటలో శనివారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. కరీంనగర్ జిల్లా మహముత్తారం మండలం బోర్లగూడెం గ్రామానికి చెందిన గండ్ర శ్రీనివాసరావు(35)ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. ఏడూళ్ల బయ్యారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహముత్తారం గ్రామానికి చెందిన గండ్ర రంగారావు, సరోజ పెద్ద కుమారుడు శ్రీనివాసరావు. జానంపేటకు చెందిన దుగ్యాల నర్సింహరావు కూతురు సంధ్యతో తొమ్మిదేళ్ల క్రితం ఇతడితో వివాహం జరిగింది. కొంత కాలం కరీంగనర్‌లో నివాసం ఉన్న వీరు గత ఏడాది వరంగల్ జిల్లా హన్మకొండలోని సుబేదారి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. కుటుంబ సమేతంగా గురువారం అత్తగారిల్లు జానంపేటకు వచ్చిన శ్రీనివాసరావు రెండురోజులుగా బంధువుల ఇళ్లకు తిరిగాడు. జానంపేట నుంచి ముకుందాపురం వెళ్లే మార్గంలో భార్య అమ్మమ్మ ఇంటి వద్ద శుక్రవారం రాత్రి భార్య, కుమారుడితో కలిసి బస చేశాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు వీరు నిద్రిస్తు గదిలోకి ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. భార్యను పక్కకు తోసేసి శ్రీనివాసరావు గొంతు కోశారు. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు యత్నించగా దుండగులు వారిని అడ్డుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని ఇంటి నుంచి రోడ్డుపైకి లాక్కొచ్చి పడేశారు. అనంతరం కేరింతలు కొడుతూ కారు ఎక్కి పరారయ్యారు. హత్యకు కారణమేమిటి..? శ్రీనివాసరావు హత్యపై పను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2000 నుంచి 2008 వరకు శ్రీనివాసరావు కరీంనగర్ జిల్లాలో ప్రతిఘటన గ్రూపు ఏరియా ఆర్గనైజర్‌గా పనిచేసినట్లు సమాచారం. ప్రసాదన్న రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ప్రతిఘటన గ్రూపులో బక్కన్న దళంలో పని చేసినట్లు తెలిసింది. 2008లో కరీంగనర్ పోలీసులకు శ్రీనివాసరావు లొంగిపోయాడు. అనంతరం కరీంనగర్ జిల్లాలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. భూ సెటిల్మెంట్లు కూడా చేసేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఘర్షణలు చోటుచేసుకోవడంతో వరంగల్‌కు మకాం మార్చాడు. అక్కడా రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వరంగల్‌లో లిక్కర్ వ్యాపారం కూడా చేసే వాడని సమాచారం. శ్రీనివాసరావుపై కరీంనగర్, వరంగల్ జిల్లాలో పలు కేసులు ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు, భూసెటిల్మెంట్ వివాదాలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణ శ్రీనివాసరావు హత్యపై ఏడూళ్ల బయ్యారం పోలీసులు పలు కోణాల్లో విచారణ నిర్వహిస్తున్నారు. మణుగూరు, అశ్వాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్లు నర్సయ్య, డి.వేణుచందర్, ఏడూళ్ల బయ్యారం ఎస్సై కొండ్ర శ్రీనివాస్ సంఘనా స్థలానికి చేరుకుని వివరాలు, ఆధారాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పిం చి విచారణ చేపట్టారు. -
అశ్వాపురంపాడులో డయేరియా
పినపాక, న్యూస్‌లైన్: వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురంపాడులో ఆదివారం వలస గొత్తికోయలు డయేరియాతో 10 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కరకగూడెం పంచాయతీ మోతె గ్రామంలో నివసిస్తున్న వలస గొత్తికోయల గ్రామం అశ్వాపురంపాడులో తాగునీరు కలుషితం కావడంతో 10 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. మడకం రాజయ్య, మడకం ఐతమ్మ, కొవ్వాసీ సునీత, మడివి ఉంగయ్య, కొవ్వాసీ బాలకృష్ణ, కొవ్వాసీ నందయ్య తదితరులు అస్వస్థతు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని 108 ద్వారా పినపాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కొవ్వాసి నందయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పినపాక ప్రభుత్వం వైద్యాధికారి సుధీర్‌నాయక్ మాట్లాడుతూ కలుషిత నీరు తాగడం వల్లే వారు డయేరియాతో అస్వస్థతు గురయ్యారని అన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి : సీపీఎం వలస గొత్తికోయాల గ్రామం అశ్వాపురంపాడులో ప్రభుత్వం వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి నిమ్మల వెంకన్న డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు వైద్యులు శిబిరం నిర్వహించాలని ఆయన కోరారు. అదే విధంగా గ్రామంలో వలస గిరిజనులు తోగు నీరు తాగుతున్నారని, వారి కోసం బోరు ఏర్పాటు చేయాలని అన్నారు. -
‘ఆదివాసీ’ స్వయం పాలన ప్రకటించాలి
పినపాక, న్యూస్‌లైన్: ఆదివాసీ ప్రాంతాలకు స్వయం పాలన ప్రకటించాలని మన్యసీమ రాష్ట్ర సాధన సమితి జేఏసీ చైర్మన్ చందా లింగయ్య దొర డిమాండ్ చేశారు. ఆయన మంగవారం ఇక్కడ కొమరం భీం 73వ వర్థంతి సభలో మా ట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతికి కొమరం భీం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. నాడు ఆయన పోరాటాల ఫలితంగానే నేడు గిరి జన చట్టాలు అమలవుతున్నాయన్నారు. మన్యసీమ రాష్ట్రం సాధిం చేంత వరకు ఆదివాసీలంతా అవిశ్రాంతంగా పోరాడాలని కోరారు. మన్యసీమ రాష్ట్రం సాధిస్తే ఆదివాసీ ప్రాంతాలలో సమగ్రాభివృద్ధి జరుగుతుందని, నిరుద్యోగ సమస్య ఉండదని అన్నారు. గిరిజన చట్టాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని వనరులపై ఆదాయాన్ని ఇక్కడి అభివృద్ధికే వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. తొలుత, కొమరం భీం చిత్రపటానికి చందా లింగయ్య దొర పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం, ఆదివాసీ స్వయం పాలన జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకుడు వట్టం నారాయణ, జిల్లా నాయకులు వాసం రామకృష్ణ, చందా రాఘవులు, వర్సా శ్రీనివాస్, వజ్జానర్సింహారావు, గుమ్మడి గాంధీ, పి.లక్ష్మినారాయణ, కె.రాజేశ్వరరావు, నాగేంద్రబాబు, ఎ.శ్రీనివాస్, జి.గోపాలకృష్ణ, కె..లక్ష్మణరావు పాల్గొన్నారు. -
మృత్యుపిడుగుతో నలుగురు రైతులు దుర్మరణం
పినపాక, న్యూస్‌లైన్: ‘రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి..’ పోడుకొట్టుకుంటే గానీ పూటగడవని దయనీయం వారిది. అందుకే రెక్కలుముక్కలు చేసుకొని పోడుకొట్టుకున్నారు. ఒక్కొక్కరు రెండెకరాల చొప్పున పత్తి సాగుచేస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా చేలకు వెళ్లారు. సాగుచేస్తున్న చేలల్లో కలుపుతీస్తున్నారు. ఇంతలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవసాగింది. రైతులు, కూలీలు ఇలా మొత్తం పదిమంది సమీపంలోని ఓ పూరిపాక కిందకు వెళ్లారు. దురదృష్టం వెంటాడింది.. మృత్యువు తరుముకొచ్చింది..భారీ శబ్ధంతో ఉరుము ఉరిమింది. పిడుగు వచ్చి రైతులు, కూలీలు తలదాచుకున్న ఆ పూరిపాకపై పడింది. అంతే తాటి లకిష్మ(35), శర్పా సత్యనారాయణ (25), చందా యశోద(50), చందా లకిష్మ(60) అనే గిరిజన రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. శర్పా రాంబాయి, శర్పా సత్యం, శర్పా ఆదిలకిష్మ, చందా సుభం, మైపతి విజయలకిష్మ, చందా సీతారాములమ్మ అనే ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ మండలంలోని చిరుమళ్ల గ్రామానికి చెందినవారే. పైగా సమీప బంధువులు కావడంతో ఆ గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది. పిడుగు వార్తవిని... గ్రామశివారున ఉన్న మీదిచెరువు వద్ద పిడుగుపడి నలుగురు మృతిచెందారన్న వార్త తెలియగానే ఊరుఊరంతా అటువైపుగా పరుగులు తీసింది. ‘అయ్యో బిడ్డలారా...ఎంత ఘోరం జరిగిపోయిందే..’అంటూ గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఓవైపు తీవ్రగాయాలు...మరోవైపు కుమారుడి మరణం...శర్ప సత్యనారాయణ తల్లి ఆదిలకిష్మ పరిస్థితి హృదయవిదారకంగా మారింది. గాయాలతో సతమతమవుతూ ఆమె ఏడుస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ఈ ఘటనలో మృతిచెందిన మరో ఇద్దరు చందా లకిష్మ, చందా యశోద కుటుంబాలకు ప్రధాన ఆదరువు కావడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. రెక్కలు ముక్కలు చేసుకుని కుటుంబాలను పోషిస్తున్న వీరి మరణం వారి కుటుంబాలను ఏకాకులను చేసింది. చిరుమళ్ల గ్రామంలో పిడుగుపడి నలుగురు మృతిచెందిన విషయం తెలిసి సమీపంలోని కరకగూడెం, మోతె, అనంతారం, సమత్‌భట్టుపల్లి, భట్టుపల్లి గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి మృతులు, బాధితులను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాలను కావడిలో తీసుకెళ్లి గ్రామస్తులు దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పందించిన గ్రామీణ వైద్యులు చిరుమళ్ల గ్రామంలో పిడుగుపడి నలుగురు మృతిచెందారని, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారనే విషయం తెలిసిన వెంటనే పినపాక మండలం గ్రామీణ వైద్యుల సంఘం స్పందించింది. హుటాహుటిన వైద్యులు ఆ గ్రామానికి వెళ్లి క్షతగాత్రులకు వైద్యసేవలు అందిస్తున్నారు. బీపీ పరీక్షించి సెలైన్ ఎక్కిస్తున్నారు. పిడుగుపాటుకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో గ్రామంలో అంధకారం నెలకొంది. అయినా దీపాలు, టార్చీలైట్ల వెలుతురులో ఆర్ఎంపీలు వైద్యసేవలు అందించారు. రెండుగంటలపాటు వైద్యసేవలందించిన అనంతరం క్షతగాత్రులను కరకగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన గ్రామీణ వైద్యులను పలువురు అభినందించారు.