ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పినపాక మండలం గొట్టేళ్ల వద్ద ఆదివారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కూలీలను ఎక్కించుకుని వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బోల్తాపడిన ఆటో: 10 మందికి గాయాలు
Published Sun, Jan 24 2016 12:15 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM
Advertisement
Advertisement