
సాక్షి, ఖమ్మం: తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఇంకా ఏ పార్టీలో చేరలేదని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు స్పష్టం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని, త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరడం కాయమన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేముందు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తానని ఆయన వెల్లడించారు. టీఆర్‌ఎస్ బీ ఫాం మీద తిరిగి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తనపై ఆంక్షలు విధించడం తనకు నచ్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు రేగా, ఆత్రం సక్కులు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి భారీషాకిచ్చిన విషయం తెలిసిందే. వీరితో పాటు నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య కూడా పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment