Rega Kanta Rao
-
పినపాక (ఎస్టీ) నియోజకవర్గంలో తదుపరి ఎన్నికల్లో అధికారంలో ఉండేది ఎవరు..?
పినపాక (ఎస్టి) నియోజకవర్గం పినపాక రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ పార్టీ తరపున పోటీచేసిన రేగ కాంతరావు రెండోసారి విజయం సాదించారు. ఆయన 2009లో తొలిసారి గెలవగా, 2018లో తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై 18567 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికి కాంతారావు టిఆర్ఎస్లో చేరిపోయారు. కాంతారావుకు 72283 ఓట్లు రాగా, పాయం వెంక టేశ్వర్లుకు 52718 ఓట్లు వచ్చాయి. 2009కి ముందు బూర్గంపాడు నియోజకవర్గం ఉండేది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన పి.దుర్గకు 5700 ఓట్లు వచ్చాయి. 2014లో తెలంగాణలో కేవలం ఖమ్మం జిల్లాలోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తన ఉనికిని నిలబెట్టుకుని ఒక ఎమ్.పి సీటును, మూడు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా గిరిజన సీట్లు కావడం ప్రత్యేకత. పినపాకను పరిగణనలోకి తీసుకుంటే 2009, 2018లలో కాంగ్రెస్ ఐ మళ్లీ గెలిచింది. 2014లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన పాయం వెంకటేశ్వర్లు గతంలో సిపిఐ పక్షాన ఒకసారి గెలిచారు. 2009లో కూడా ఆ పార్టీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. తదుపరి 2014లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసి తన సమీప ప్రత్యర్ధి టిఆర్ఎస్ నేత శంకర్ నాయక్‌ను 14065 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లోకి మారిపోయారు. 2014లో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య పోటీచేసి 28195 ఓట్లు తెచ్చుకుని ఓడిపోయారు. సిపిఐ పక్షాన పోటీచేసిన టి.రమేష్‌కు 19313 ఓట్లు వచ్చాయి. 1985 తర్వాత బూర్గుంపాడులో కాంగ్రెస్ ఐ గెలవలేదు. అయితే బూర్గుంపాడు బదులు పినపాకను పరిగణనలోకి 2009లోనే కాంగ్రెస్ ఐ ఇక్కడ గెలిచింది. గతంలో ఈ నియోజకవర్గం స్థానే బూర్గంపాడు ఉండేది. బూర్గుంపాడుకు ఎన్నికలలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి ఒకసారి, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. బూర్గుంపాడులో కొమరం రామయ్య 1967లో గెలిచాక, ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పడంతో, మళ్ళీజరిగిన ఉప ఎన్నికలో ఈయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కుంజా భిక్షం ఆ తర్వాత కాలంలో ఈయన సిపిఐని వదలి టిడిపిలోకి, తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్ళారు. తదుపరి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1983లో ఇక్కడ గెలిచిన ఊకే అబ్బయ్య 1994లో, 2009లో ఇల్లెందులో గెలుపొందారు. 1985లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా గెలిచిన చందాలింగయ్య 2001లో ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేశారు. పినపాక (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు ప్రయత్నించిన ముగ్గురూ చేసిన ఫోన్ కాల్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరికి ఫోన్ చేశారు? అనే అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు సాగిన వీరి మంతనాలను నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేశారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర? హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్న సింహయాజులు స్వామి, రామచంద్ర భారతి, నంద కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి, ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్ వేశారు. రోహిత్ రెడ్డి ద్వారానే ఈ సమావేశం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో ఉన్న అతడి ఫామ్ హౌస్‌లో జరిగేలా కథ నడిపారు. బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారు. వేచి చూసి దాడి చేశారు..: ఎమ్మెల్యేల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రమే ఫామ్ హౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్‌తో పాటు ఆరుచోట్ల అత్యాధునికమైన రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు, నిఘా వర్గాలు మారు వేషాల్లో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నా.. సాయంత్రం ఈ సమావేశం మొదలైన వెంటనే దాడి చేయలేదు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగేవరకు, వారి మాటలతో పాటు అక్కడ జరిగే ప్రతి వ్యవహారం రికార్డు కావడం కోసం వేచి చూశారు. ఆపై దాడి చేసి ముగ్గురితో పాటు డ్రైవర్ తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు!: సమావేశం జరిగిన హాలులోని ఓ పక్కగా ఉన్న డైనింగ్ టేబుల్ వద్ద ఆ ముగ్గురూ, సోఫాల్లో ఎమ్మెల్యేలు నలుగురూ కూర్చున్నారు. ఈ మీటింగ్ నేపథ్యంలో రామచంద్ర భారతి మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అవతలి వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో వీలు కాలేదు. అలాగే ఆ ముగ్గురూ ఢిల్లీలో ఉన్న ఓ కేంద్ర పెద్దతో మాట్లాడించాలని ప్రయతి్నంచారని, అయితే ఆయన అందుబాటులో లేరని సహాయకుడు చెప్పిన అంశాలు రికార్డు అయినట్లు తెలిసింది. 3 రోజులు..70 మంది పోలీసులు: ఈ ఆపరేషన్ కోసం నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది 3 రోజులు పని చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 84 సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గంటన్నర పాటు సాగిన భేటీ ఈ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పీఠాధిపతిగా ప్రకటించుకున్న సింహయాజులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వంలో కీలకంగా వ్యవహరించిన సింహయాజులు స్వామి తిరుపతి వాసి. అన్నమయ్య జిల్లా చిన్న మండ్యం మండలంలో శ్రీమంత్రరాజ పీఠం ఏర్పాటు చేసుకొని, తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు. అది లక్ష్మీ నరసింహ స్వామికి చెందిన పీఠంగా చెబుతూ పలుకుబడి పెంచుకున్నాడు. ఇతడికి తిరుపతిలో సొంత ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు తెచ్చింది నందూయేనా..?: రామచంద్ర భారతి ఢిల్లీ ఫరీదాబాద్‌లోని ఓ ఆలయ పూజారి కాగా.. కర్ణాటకకు చెందిన నందకుమార్ నగరానికి వలసవచ్చి చైతన్యపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్ ప్రాంతంలో సదరన్ స్పైస్ పేరుతో ఓ రెస్టారెంట్ నడిపాడు. ఫిల్మీ జంక్షన్ అనే రెస్టారెంట్ నిర్వహణ సమయంలో దాని స్థల యజమాని అయిన సినీ ప్రముఖుడితో విభేదాలు తలెత్తాయి. ఆపై అవినాష్ అనే వ్యక్తితో కలిసి మాణిక్‌చంద్ పాన్ మసాలా వ్యాపారం చేశాడు. తర్వాత మాణిక్ చంద్ బ్రాండ్‌ను తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీలోనూ సౌత్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. వీటితో పాటు నగరంలోని అనేక పబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో భాగస్వామ్యం ఉంది. పలువురు ప్రముఖులు ఇతడి వద్ద పెట్టుబడులు పెట్టారని, కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులతో ఇతడికి స్నేహం ఉందని, హవాలా ఆపరేటర్ అని కూడా తెలిసింది. బుధవారం నందు పుట్టిన రోజు కావడంతో ఈ ఫామ్ హౌస్‌లో పార్టీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హవాలా ఆపరేటర్ కావడంతో డబ్బు తీసుకువచ్చింది నందూయేనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా నిందితులు ముగ్గుర్నీ పోలీసులు ఫామ్‌హౌస్ నుంచి తరలించారు. -
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర?
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించేలా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నికను ప్రభావితం చేసేలా ఓ జాతీయ పార్టీ అండదండలతో వ్యూహాత్మక బేరసారాలు జరిగినట్టు ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ టీఆర్ఎస్ ఆరోపించడం.. ఆ నలుగురు హార్డ్‌కోర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తామేం చేసుకుంటామంటూ బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొట్టిపారేయడం చర్చనీయాంశంగా మారాయి. అజీజ్ నగర్ ఫామ్‌హౌజ్ వేదికగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), రేగ కాంతారావు (పినపాక)లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం రాత్రి ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే భారీ ఎత్తున డబ్బులిస్తామని.. పదవులు, కాంట్రాక్టులు అప్పగిస్తామని ఆ ముగ్గురు ఎర వేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ ప్రలోభాలకు వేదిక అయిన రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్ పరిధిలో ఉన్న పీవీఆర్ ఫామ్‌హౌజ్‌పై దాడి చేసి.. ఫరీదాబాద్‌కు చెందిన రాంచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు, కేంద్ర మంత్రికి సన్నిహితుడని చెప్తున్న నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ ప్రలోభాలకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే తాము దాడి చేశామన్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్‌హౌజ్‌కు చేరుకుని.. ముగ్గురు వ్యక్తులతో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపినట్టు సమాచారం. తర్వాత సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) దాడులు జరిగాయి. ఈ సందర్భంగా భారీగా నగదు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాదీనం చేసుకున్నట్టు ప్రచారం జరిగినా.. పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.వంద కోట్లతోపాటు పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల్లో గువ్వల బాలరాజు మినహా మిగతా ముగ్గురు కాంగ్రెస్ తరఫున గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరినవారే. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో..: స్టీఫెన్ రవీంద్ర దాడి అనంతరం ఫామ్‌హౌజ్ వద్ద సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ‘‘తమను కొందరు ప్రలోభపెడుతున్నారని ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు దాడులు చేశాం. ఫరీదాబాద్ పీఠాధిపతి ఈ మొత్తం వ్యవహారంలో కీలక మంతనాలు సాగించారు. డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టినట్టు ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ప్రలోభాలకు ప్రయతి్నంచారు, ఇతర అంశాలు ఏమిటన్నది దర్యాప్తు చేస్తాం. డబ్బు ఇచ్చారా? ఇస్తే ఎంత ఇచ్చారు? ఎక్కడి నుంచి వచి్చంది? ఎవరు తీసుకువచ్చారనే వివరాలు సేకరిస్తాం..’’ అని తెలిపారు. ఆ ముగ్గురూ ఎవరు? ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో ఓ దేవాలయంలో ఉండే రాంచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, తిరుపతిలో ఓ పీఠానికి అధిపతిగా చెప్పుకొనే సింహయాజులు, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో దక్కన్ ప్రైడ్, అంబర్‌పేటలో సెలబ్రేషన్స్ పేరిట హోటళ్లను నిర్వహిస్తున్న నందకుమార్.. ఈ ముగ్గురూ ఎమ్మెల్యేల ప్రలోభం కేసులో నిందితులుగా ఉన్నారు. వారు కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో నందకుమార్‌కు చెందిన హోటళ్లు, ఫామ్‌హౌజ్‌లలో ఉంటున్నట్టు సమాచారం. నందకుమార్ ఓ కేంద్ర మంత్రికి సన్నిహితుడని.. ఈ ముగ్గురూ కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. మూడు రోజులుగా స్కెచ్ వేసి.. పార్టీ ఫిరాయించాలంటూ సంప్రదించిన ముగ్గురు వ్యక్తులను పట్టించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారని.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రెడహ్యాండెడ్గా పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారని రాజకీయ, పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాల మేరకు.. ప్రలోభాల అంశంపై నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారమిచ్చారు. తాము పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.100 కోట్లు, కాంట్రాక్టులు, కేంద్రం ఆధీనంలోని పదవులు ఇస్తామంటూ ఎర వేశారని వివరించారు. అయితే నేరుగా ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే అసలు విషయం బయటపడదని భావించిన పోలీసులు.. బేరసారాలు సాగిస్తూ, అడ్వాన్సులు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం నిఘావర్గాలతోపాటు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల సూచన మేరకు.. సదరు ముగ్గురితో ఎమ్మెల్యేలు సంప్రదింపులు కొనసాగించారు. అడ్వాన్స్ ఇచ్చేందుకు ఆ ముగ్గురు వ్యక్తులు సిద్ధమవడంతో బుధవారం అజీజ్‌నగర్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌజ్‌కు రావాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని చిత్రీకరించేందుకు పోలీసులు రహస్య కెమెరాలు, ఇతర నిఘా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నుంచే ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో కాపు కాశారు. కూలీలు, చిన్న వ్యాపారులు, స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా మారువేషాలు వేసుకుని నిఘా పెట్టారు. నలుగురు ఎమ్మెల్యేలు సాయంత్రం 5 గంటల సమయంలో, కాసేపటి తర్వాత ముగ్గురు వ్యక్తులు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. సమావేశం మొదలైందని, డబ్బుతో కూడిన రెండు సంచులు లోపలికి వచ్చాయని ఎమ్మెల్యేల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడి చేసిన అధికారులు సింహయాజులు, రాంచంద్రభారతి, నందకుమార్లతోపాటు తిరుపతి అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ.15 కోట్లు స్వాదీనం? పోలీసులు తమదాడి సందర్భంగా ఓ కారును, రెండు బ్యాగుల్లో రూ.15 కోట్ల నగదు, సెల్ఫోన్లు, ఇతర పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సింహయాజులు, రాంచంద్రభారతి, నందకుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారితో వచ్చిన తిరుపతి అనే వ్యక్తి తాను కారు డ్రైవర్‌నని చెప్పడంతో వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు స్వా«దీనం చేసుకున్న కారు గంధవరం దిలీప్‌కుమార్ పేరిట ఉందని.. ఆయన ఎవరు? ఆ ముగ్గురితో సంబంధంలు ఏమిటన్నది ఆరా తీస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పరిచయాలే పెట్టుబడిగా వ్యాపారాలతో..! అంబర్‌పేట: నందకుమార్ కుటుంబం కర్ణాటక నుంచి వచ్చి అంబర్‌పేట డీడీ కాలనీలో స్థిరపడ్డారని.. ఆయన తండ్రి శంకరప్ప హైదరాబాద్ నగర పీస్ కమిటీ సభ్యులని స్థానికులు చెబుతున్నారు. ఆయనకు పోలీసుశాఖలో ఉన్న పరిచయాలను కుమారుడు నందకుమార్ వినియోగించుకుని పలు వ్యాపారాల్లో అడుగుపెట్టారని అంటున్నారు. ప్రధానంగా హోటల్ రంగంలో ఉన్న నందకుమార్‌పై పలు ఆరోపణలూ ఉన్నాయని పేర్కొంటున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నందకుమార్‌కు పరిచయమని.. తన హోటళ్ల ప్రారంభోత్సవాలకు కిషన్‌రెడ్డిని ఆహ్వానించారని చెబుతున్నారు. నందకుమార్ స్థానికంగా పెద్దగా కనిపించరని.. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల అంశం అంబర్‌పేటలో చర్చనీయాంశంగా మారిందని పేర్కొంటున్నారు. ఎవరా ముగ్గురు? ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో ఓ దేవాలయంలో పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ.. తిరుపతిలో ఓ పీఠానికి అధిపతిగా చెప్పే సింహయాజులు.. హైదరాబాద్‌లో హోటల్స్ వ్యాపారం చేసే నందకుమార్ ఎలా ఆపరేషన్? ఎమ్మెల్యేల సమాచారం మేరకు పక్కాగా ప్లాన్ వేసిన పోలీసులు. కూలీలు, చిన్న వ్యాపారులు, స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ వేషాల్లో నిఘా. అంతా ఫామ్‌హౌజ్‌లోకి చేరుకున్నాక, డబ్బు సంచులు వచ్చాయని ఎమ్మెల్యేలు సమాచారమిచ్చాక దాడి. రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు. ఏం ఇస్తామన్నారు? పార్టీ మారితే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని పదవులు ఇస్తామంటూ ప్రలోభపెట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దాడి సందర్భంగా పోలీసులు రూ.15 కోట్లు పట్టుకున్నట్టు ప్రచారం జరిగింది. దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. -
రెచ్చగొట్టొద్దు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్
సాక్షి, ఖమ్మం : పోడుభూముల వ్యవహారంలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ చిఫ్ విఫ్ రేగా కాంతరావుకు అటవీ శాఖ అధికారులకు మధ్య వార్ నడుస్తుంది. అధికారుల తీరును తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే ఫైర్ అవుతున్నారు. ఆదివాసులని రెచ్చగొట్టొద్దని, మాటలు తగ్గించుకుంటే మంచిదని తక్షణమే కందకాలు తవ్వడం ఆపేయండంటూ పోస్ట్ పెట్టారు. ఫారెస్ట్ అధికారుల తీరును విమర్శించిన ఆదివాసీలు నేడు గుండాల మండలం, శంభునిగూడెంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారికి బసటగా నిలిచిన ఎమ్మెల్యే..ఆదివాసీ యువకులు గ్రామానికొక్కరు తరలిరండి అని పిలుపునిచ్చారు. కొమరం భీంలా గర్జించండి.కదిలిరండి...పోడుపోరులో చేతులు కలపండి అని పేర్కొన్నారు. పోలీసుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరిస్తే పోరు తగ్గదు ఏస్సై గారు..విసిరిన బంతి అదే వేగంతో తిరిగి వస్తుంది మర్చిపోయావా గతంలో పరిస్థితి అంటూ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. కాగా కొన్నాళ్లుగా పోడు భూములకు సంబందించి అటవిశాఖ అధికారులకు,ఆదివాసులకు మద్య పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. పోడు భూములలో అటవిశాఖ అధికారులు కందకాలు తోవ్వడాన్ని ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు. ఏన్నో ఏళ్ల నుంచి పోడు భూములలో వ్యవసాయం చేస్తున్నామని ఇప్పుడు కందకాలు తోవ్వితే ఏలా అని అటవిశాఖ అధికారులపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. -
ఎమ్మెల్యేను చేస్తే.. పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేస్తారా?
సాక్షి, ఖమ్మం: ఒక ద్రోహి మరో ద్రోహితో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు నిప్పులు చెరిగారు. మణుగూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యే రేగా కాంతారావు రాత్రికి రాత్రే రంగులు మార్చేసి టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చడంపై భట్టి విక్రమార్క మల్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మణుగూరులో కాంగ్రెస్ నాయకుల చేపట్టిన నిరాహార దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మల్లుతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, పీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. ఎక్కడో టీచర్‌గా పని చేస్తున్న రేగా కాంతారావును.. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చి ఎమ్మెల్యేను చేస్తే.. పార్టీ ఫిరాయించి పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ద్రోహి రేగా కాంతారావు.. తెలంగాణ ఇస్తే.. పార్టీని విలీనం చేస్తానని చెప్పి మోసం చేసిన మరో ద్రోహి కేసీఆర్‌తో కలిసి స్వాంతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించిన వారికి చట్టపరంగానే బుద్ధి చెవుతామని మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. (‘మూడు విభాగాలుగా విభజించి వైద్యం’) ప్రజాస్వామ్యం ఖూనీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నయా రాచరికంతో పాలన చేస్తోంది. ఇందుకు తాజా నిదర్శనం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జంపింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా కబ్జా చేశారు. దీనిని నిరసిస్తూ.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలొని కాంగ్రెస్ బృందం మణుగూరు బయల్దేరింది. పోలీసు పహారాలో... సీఎల్పీనేత భట్టి విక్రమార్క నేత్రుత్వంలోని కాంగ్రెస్ బ్రుందం ఖమ్మంలో ఉదయం 9 గంటలకు బయలు దేరినప్పటి నుంచీ ప్రతిక్షణం పోలీసులు నిఘా కళ్లతో వెంబడించారు. అడుగడుగునా.. చెకింగ్‌ల పేరుతో ఆపుతూ.. భట్టి బృందాన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా సీఎల్పీ నేత ముందుకే సాగారు. తల్లాడ, కొత్తగూడెం, పాల్వంచ,భద్రాచలం క్రాస్ రోడ్, అశ్వాపురం తదితర ప్రాంతాల్లో పోలీసులు భట్టి బృందాన్ని చెకింగ్‌ల పేరుతోనూ, అనుమతులు పేరుతోనూ, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు. మణుగూరులో సాధారణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకన్నా.. అధిక సంఖ్యలో పోలీసులను ప్రభుత్వం మొహరించింది. (కరోనా : ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేకపోవడంతో..) నేనేం చేయలేను... వద్దంటే వెళ్లిపోతా: మునిసిపల్ కమిషనర్ పార్టీ కార్యాలయ్ వివాదంపై నేనేం చేయలేను.. నా మీద అధికార పార్టీ ఒత్తిడి తీవ్రంగా.. ఉందని మునిసిపల్ కమిషనర్.. వెంకటస్వామి మీడియా ముఖంగా ప్రకటించారు. రికార్డులు నా వద్ద లేవు.. గతంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో రికార్డులను ఉన్నతాధికారులు తీసుకెళ్లారు.. ఇప్పుడు నేనేం చేయలేను.. వద్దంటే ఇంకోచోటకు బదిలీ చేయించుకుని.. లేదంటే సెలవుపై వెళ్లిపోతాను.. అంతకుమించి నేనేం చేయలేనని మీడియా ముఖంగా ప్రకటించారు. -
‘సీతారామ’ ప్రాజెక్ట్ పరిశీలనకు సీఎం కేసీఆర్?
సాక్షి, కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలో భద్రాద్రి జిల్లాలో పర్యటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంను జిల్లాకు తీసుకొచ్చేలా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయినట్లేనని రేగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకే. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.13,884కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఆయకట్టును 9.36 లక్షల ఎకరాలకు పెంచాలని సైతం ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కెనాల్ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏన్కూర్ వద్ద ఒక లింక్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్ ద్వారా సాగునీటి సరఫరాలో ఇబ్బంది వచ్చినా ఆయకట్టుకు ఎలాంటి సమస్య లేకుండా సీతారామతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 372 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించనున్నారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీజీకొత్తూరు వద్ద ఫేస్–1 పనులను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశముంది. ఇక తాజాగా దుమ్ముగూడెం వద్ద రూ.3,400 కోట్లతో మరో ఆనకట్ట నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు నీటి కొరత లేకుండా 30 టీఎంసీలా నీరు నిల్వ ఉండేలా దీనికి రూపకల్పన చేశారు. గోదావరిలో ప్రతిఏటా వస్తున్న వరద నీరంతా వృథాగా సముద్రంలోకి వెళుతోంది. మరోవైపు గత వేసవిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో అశ్వాపురం మండలంలోని భారజల కర్మాగారంలో రెండురోజుల పాటు ఉత్పత్తి నిలిపేశారు. దుమ్ముగూడెం హైడల్ ప్లాంట్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మరో ఆనకట్ట నిర్మించేలా కార్యాచరణ రూపొందించారు. రూ.300 కోట్లతో త్రీఫేస్ విద్యుత్.. ఏజెన్సీ ఏరియాలో సాగునీటి కోసం రూ.300 కోట్లతో త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే గత నెల 21న నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి మణుగూరు సబ్‌డివిజన్‌లో పర్యటించారు. 30వ తేదీన మంత్రి అజయ్‌కుమార్ పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పర్యటించిన సీఎం.. సీతారామ ప్రాజెక్టు వద్దకు రానున్నారు. అలాగే జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పడంతో పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. సీఎం పర్యటన ఖాయమైనట్లే పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన మొదట పినపాక నియోజకవర్గంలో ఉండేలా కృషి చేశాను. సీఎం అంగీకారంతో ఇది సాధ్యమవుతోంది. పోడుభూముల సమస్య పరిష్కారానికి కూడా కేసీఆర్ అంగీకరించారు. సీఎం పర్యటన తరువాత ఈ సమస్య కొలిక్కి వస్తుంది. – రేగా కాంతారావు, ప్రభుత్వ విప్ -
ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు!
సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటీన హైదరాబాద్ బయల్దేరారు. మంత్రివర్గ విస్తరణకు ఇంకా జాప్యం జరిగే అవకాశం నేపథ్యంలో ఎమ్మెల్యే కాంతారావును ప్రభుత్వ విప్‌గా నియమించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ విప్‌గా క్యాబినెట్ హోదాలో నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతుండగా.. శాసనసభ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాసన మండలి, శాసనసభ చీఫ్ విప్ పదవుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా శాసనసభ కమిటీల వివరాలతోపాటు, చీఫ్ విప్, విప్ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ ఏర్పాటై ఎనిమిది నెలలు దాటినా.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మినహా ఇతర కమిటీల నియామకం జరగలేదు. శాసనసభ నిబంధనల ప్రకారం ఆర్థిక, సంక్షేమ, ఇతర రంగాలకు సంబంధించి 19 రకాలైన కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా పబ్లిక్ అకౌంట్స్, అంచనాలు, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలున్నాయి. సంక్షేమ, ఇతర రంగాల కమిటీలను స్పీకర్ నామినేట్ చేస్తారు. ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులకుగాను తొమ్మిది మంది శాసనసభ, నలుగురు శాసన మండలి నుంచి ఎన్నిక అవుతారు. అయితే పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వడం ఆనవాయితీ. 119 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్కు 103 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా, 12 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. ఏడుగురు సభ్యులున్న ఏఐఎంఐఎం అసెంబ్లీలో అతిపెద్ద రెండో పార్టీగా అవతరించింది. ఎంఐఎంకు అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కక పోయినా.. ఆ పార్టీ ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. మండలి చీఫ్ విప్‌గా పల్లా రాజేశ్వర్‌రెడ్డి? గంగుల కమలాకర్, వినయభాస్కర్, గంప గోవర్దన్, బాజిరెడ్డి గోవర్దన్‌ల పేర్లు చీఫ్ విప్ పదవి కోసం వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, హనుమంతు షిండే, పద్మా దేవేందర్‌రెడ్డి, రేఖా నాయక్, బాల్క సుమన్ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. మండలి విప్‌గా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని చీఫ్ విప్‌గా నియమించి, మరో ఎమ్మెల్సీకి విప్‌గా అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న ఎమ్మెల్యేలతో పాటు, సామాజిక వర్గాల సమతుల్యత పాటిస్తూ చీఫ్ విప్, విప్ల నియామకంపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చీఫ్ విప్, విప్ పదవుల కోసం పోటీ గత అసెంబ్లీలో చీఫ్ విప్‌గా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ప్రస్తుతం సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. గత శాసనసభలో గంప గోవర్దన్ (కామారెడ్డి), గొంగిడి సునీత (ఆలేరు), నల్లాల ఓదెలు (చెన్నూరు) విప్‌లుగా వ్యవహరించారు. ఓదెలు మినహా మిగతా ఇద్దరూ మరోమారు శాసనసభకు ఎన్నికయ్యారు. కాగా శాసన మండలిలో చీఫ్ విప్‌గా వ్యవహరించిన పాతూరు సుధాకర్‌రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. 2016 ఆగస్టులో మండలి విప్‌లుగా నియమితులైన బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి నేటికీ కొనసాగుతున్నారు. -
‘పదో షెడ్యూల్ ప్రకారమే పార్టీ మారాం’
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ బద్ధంగానే తాము టీఆర్ఎస్లో చేరామని పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్రూపిజంతో సతమతమవుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని వీడటానికి గల కారణాలను లేఖ ద్వారా స్పష్టంగా వివరించామని తెలిపారు. అవసరమైతే రాజీనామా చేస్తామని కూడా లేఖలో పేర్కొన్నామన్నారు. రాజ్యాంగ బద్ధంగా తమకున్న హక్కుతోనే సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయమని స్పీకర్‌కు వినతి పత్రం ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ విలీనం గురించి పదో షెడ్యూల్లో స్పష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలకు చదువురాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని రేగా మండి పడ్డారు. తమ మీద అనవసర ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. పరిషత్ ఎన్నికల్లో ఉత్తమ్, భట్టి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసిందని ఆయన విమర్శించారు. అమ్ముడుపోవడానికి జంతువులం కాదు : గండ్ర ప్రలోభాలకు లొంగిపోవడానికి.. పదవులకు అమ్ముడుపోవడానికి మేం గొర్రెలు, బర్రెలం కాదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై తమకున్న అసంతృప్తిని చాలాసార్లు అధిష్టానానికి తెలియజేశామన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారమే టీఆర్ఎస్లో చేరామని తెలిపారు. ఎవరూ పాలన చేసినా రాజ్యాంగం ప్రకారమే చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చేరికలు జరుగుతున్నాయన్నారు. తన నిర్ణయాన్ని ప్రజలు సమర్థించారని.. అందుకే జడ్పీ ఎన్నికల్లో తన భార్య జ్యోతి 10 వేల మెజార్టీతో గెలిచిందన్నారు. రాష్ట్ర సంక్షేమమే తన మొదటి ప్రాధాన్యమన్నారు గండ్ర. -
పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా 420లే
-
ఆ ఎమ్మెల్యేలపై 420 కేసు పెట్టాలి
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, డబ్బుకు అమ్ముడుపోయి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను శిక్షించాలని, ఎమ్మెల్యేలపై 420 కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర బుధవారం కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక సూపర్‌బజార్ సెంటర్లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పార్టీ మారనని ప్రమాణం చేసి, కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలిచారని, ఇప్పుడు డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారుతున్నారని విమర్శించారు. వనమా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అక్రమాలను బట్టబయలు చేసేందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నామని చెప్పారు. ఇంటర్ ఫలితాల అవకతవక లపై న్యాయ విచారణ చేపట్టిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పోట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. భట్టికి వడదెబ్బ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భట్టి విక్రమార్క బుధవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా నాలుగు రోజులుగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సుజాతనగర్లో బుధవారం యాత్ర నిర్వహించిన అనంతరం ఆయన వడదెబ్బకు గురయ్యారు. అక్కడ నుంచి ఖమ్మం చేరుకున్న భట్టి అస్వస్థతకు గురికావడంతో పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎండదెబ్బ తగలడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు. -
‘రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి పోటీచేస్తా’
సాక్షి, ఖమ్మం: తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఇంకా ఏ పార్టీలో చేరలేదని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు స్పష్టం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని, త్వరలోనే టీఆర్ఎస్లో చేరడం కాయమన్నారు. టీఆర్ఎస్లో చేరేముందు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్తానని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ బీ ఫాం మీద తిరిగి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తనపై ఆంక్షలు విధించడం తనకు నచ్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు రేగా, ఆత్రం సక్కులు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి భారీషాకిచ్చిన విషయం తెలిసిందే. వీరితో పాటు నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య కూడా పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. -
కాంగ్రెస్‌కు ఝలక్.. టీఆర్ఎస్లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకునే దిశగా టీఆర్ఎస్ దూకుడు పెంచింది. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్‡్షకు తెరలేపింది. ఐదు ఎమ్మెల్సీ సీట్లు, 16 లోక్‌సభ స్థానాలు దక్కించుకునే ద్విముఖ వ్యూహాన్ని అమలుపరుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక) అధికార పార్టీలో చేరడం ఖాయమై పోయింది. టీఆర్ఎస్లో చేరికపై వీరు అధికారిక ప్రకటన కూడా చేశారు. కేసీఆర్ సమక్షంలో వీరిద్దరూ ఆదివారం గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్తోనే తమ ప్రయాణం సాగుతుందని వీరు చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామని కూడా వెల్లడించారు. రేగా, ఆత్రం బాటలోనే మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరనున్నారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలలోపు కనీసం 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని భావిస్తున్నాయి. అటు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి) శనివారం మధ్యాహ్నం కేసీఆర్‌ను కలిశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో అయోమయం! శనివారం నాటి పరిణామాలతో కాంగ్రెస్ షాక్‌కు గురైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఆ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైన ఈ ఇద్దరు ఒక్కరోజులోనే పార్టీ మారడంతో ఆ పార్టీ నాయకత్వంలో నైరాశ్యం నెలకొంది. అటు, శనివారం రాత్రి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఇచ్చిన విందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్) సహా పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని సమాచారం. దీంతో.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోని వలసలు భారీగానే ఉన్నాయనే చర్చ మొదలైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి కాంగ్రెస్ శాసనసభపక్షం మొత్తం టీఆర్ఎస్లో విలీనమైనా ఆశ్చర్యపోవద్దని అధికార పార్టీ ముఖ్యనేతలు అంటున్నారు. ఐదు ఎమ్మెల్సీలు ఖాయం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజా మార్పులతో శాసనసభ కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ కూటమి ఏకపక్ష విజయం ఖాయమైపోయింది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి అసెంబ్లీలో టీఆర్ఎస్కు 91మంది, మిత్రపక్షం మజ్లిస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే కలిపి అధికార కూటమి బలం 101కి చేరనుంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ఆ పార్టీలో ఆశలు సన్నగిల్లాయి. అందుకే టీఆర్ఎస్లోకి: రేగా, ఆత్రం రాష్ట్రంతోపాటు తమ జిల్లాలు, నియోజకవర్గాలు, ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు వెల్లడించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫునన పోటీ చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్లో చేరడంపై స్పష్టతనిస్తూ.. రేగా కా>ంతరావు, ఆత్రం సక్కు శనివారం ఓ లేఖ విడుదల చేశారు. ‘ఇటీవలే మేం సీఎం కేసీఆర్‌ను కలిశాం. ఎస్టీలు, ముఖ్యంగా ఆదివాసీల సమస్యలను వారి దృష్టికి తెచ్చాం. పోడు భూముల సమస్యలను, ఇప్పటికే గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే అంశం, అధికారుల వేధింపులు, ఆదివాసీల ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి సమస్యలతోపాటు ఇతర అంశాలను కేసీఆర్‌తో చర్చించాం. ఈ సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తానని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారులను వెంటబెట్టుకుని తానే ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కరిస్తామని మాట ఇచ్చారు. ఓటాన్ అకౌంట్‌పై బడ్జెట్‌పై చర్చ సందర్భంలోనూ అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ నాయకత్వంలో ఆదివాసీలు, ఇతర గిరిజనుల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ఉన్నాం. త్వరలోనే న్యాయనిపుణులతోనూ సంద్రిస్తాం. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ తరుఫున పోటీచేస్తాం. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయి. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాలతోపాటు పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీతో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో దాదాపు 70 వేల ఎకరాలు సాగునీరు ఇతర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని శాసించే స్థాయిలో కేసీఆర్‌కు బలం చేకూరాలి. అందుకోసమే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో చేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, ఆయనకు అండగా ఉండాలని మేం నిర్ణయించుకున్నాం’అని లేఖలో వీరిద్దరు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. -
భద్రాద్రిలో రేగ కాంతారావు ప్రచారం
-
మాజీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష భగ్నం
ఖమ్మం జిల్లా మణుగూరులో రెండు రోజులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆమరణ దీక్షను పోలీసులు బుధవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. మణుగూరు ఓపెన్ కాస్ట్‌కు సంబంధించి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతూ రేగా కాంతారావు సోమవారం నుంచి దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు తెల్లవారుజామున రంగ ప్రవేశం చేసి దీక్షను భగ్నం చేశారు. ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పోలీసుల చర్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. నాయకులు, కార్యకర్తలు విద్యా సంస్థలను, దుకాణాలను బంద్ చేయించారు. -
రేగా కాంతారావు రాజీనామా, తిరస్కరించిన పొన్నాల
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కని ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. అసంతృప్తితో ఉన్న కాంతారావుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేసిన ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. ఖమ్మం డీసీసీ పదవి లంబాడాలకు ఇవ్వడమే న్యాయమంటూ పొన్నాలకు ఎంపీ రేణుకాచౌదరి సూచించారు. అయితే తనకు డీసీసీ అధ్యక్ష పదవి వద్దంటూ రాజీనామా లేఖ ఇవ్వబోయిన కాంతారావును పొన్నాల, కేంద్రమంత్రి బలరాం నాయక్ లు వారించారు. కాంతారావును మీడియాతో మాట్లాడనివ్వకుండా బలవంతంగా పొన్నాల వద్దకు బలరాంనాయక్ తీసుకెళ్లారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.