పినపాక (ఎస్టి) నియోజకవర్గం
పినపాక రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ పార్టీ తరపున పోటీచేసిన రేగ కాంతరావు రెండోసారి విజయం సాదించారు. ఆయన 2009లో తొలిసారి గెలవగా, 2018లో తన సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై 18567 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికి కాంతారావు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కాంతారావుకు 72283 ఓట్లు రాగా, పాయం వెంక టేశ్వర్లుకు 52718 ఓట్లు వచ్చాయి. 2009కి ముందు బూర్గంపాడు నియోజకవర్గం ఉండేది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన పి.దుర్గకు 5700 ఓట్లు వచ్చాయి.
2014లో తెలంగాణలో కేవలం ఖమ్మం జిల్లాలోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తన ఉనికిని నిలబెట్టుకుని ఒక ఎమ్.పి సీటును, మూడు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా గిరిజన సీట్లు కావడం ప్రత్యేకత. పినపాకను పరిగణనలోకి తీసుకుంటే 2009, 2018లలో కాంగ్రెస్ ఐ మళ్లీ గెలిచింది. 2014లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన పాయం వెంకటేశ్వర్లు గతంలో సిపిఐ పక్షాన ఒకసారి గెలిచారు. 2009లో కూడా ఆ పార్టీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. తదుపరి 2014లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసి తన సమీప ప్రత్యర్ధి టిఆర్‌ఎస్ నేత శంకర్ నాయక్‌ను 14065 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు.
ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్‌ఎస్‌లోకి మారిపోయారు. 2014లో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య పోటీచేసి 28195 ఓట్లు తెచ్చుకుని ఓడిపోయారు. సిపిఐ పక్షాన పోటీచేసిన టి.రమేష్‌కు 19313 ఓట్లు వచ్చాయి. 1985 తర్వాత బూర్గుంపాడులో కాంగ్రెస్ ఐ గెలవలేదు. అయితే బూర్గుంపాడు బదులు పినపాకను పరిగణనలోకి 2009లోనే కాంగ్రెస్ ఐ ఇక్కడ గెలిచింది. గతంలో ఈ నియోజకవర్గం స్థానే బూర్గంపాడు ఉండేది. బూర్గుంపాడుకు ఎన్నికలలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి ఒకసారి, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు.
బూర్గుంపాడులో కొమరం రామయ్య 1967లో గెలిచాక, ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పడంతో, మళ్ళీజరిగిన ఉప ఎన్నికలో ఈయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కుంజా భిక్షం ఆ తర్వాత కాలంలో ఈయన సిపిఐని వదలి టిడిపిలోకి, తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్ళారు. తదుపరి టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1983లో ఇక్కడ గెలిచిన ఊకే అబ్బయ్య 1994లో, 2009లో ఇల్లెందులో గెలుపొందారు. 1985లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా గెలిచిన చందాలింగయ్య 2001లో ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేశారు.
పినపాక (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment