అశ్వారావుపేట (ఎస్టి)
అశ్వారావుపేట గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలంగాణ లో ఈ పార్టీ గెలిచిన రెండు సీట్లలో ఇది ఒకటి. మరొకటి సత్తుపల్లి. నాగేశ్వరరావు తన సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై 13117 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నాగేశ్వరరావుకు 61124 ఓట్లు రాగా, తాటి వెంకటేశ్వర్లుకు 48007 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన సిపిఎం అభ్యర్ధి రవీందర్ కు సుమారు ఐదు వేల ఓట్లు వచ్చాయి.
సత్తుపల్లిలో గెలిచిన సండ్ర వెంకట వీరయ్య టిడిపికి ముందుగా గుడ్ బై చెప్పగా, ఆ తర్వాత మరి కొంతకాలానికి నాగేశ్వరరావు కూడా అదే బాట పట్టి టిఆర్‌ఎస్‌లో కలిసిపోయారు. 2014లో అశ్వారావుపేటలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. గతంలో ఈయన బూర్గంపాడు నుంచి తెలుగుదేశం తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. రెండోసారి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి పోటీచేసి తనసమీప ప్రత్యర్ధి టిడిపి అభ్యర్ధి ఎమ్.నాగేశ్వరరావును 930 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు.
గతంలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా 2014లో సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ ఎమ్మెల్యే మిత్రసేనకు 15101 ఓట్లు వచ్చాయి. టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఆదినారాయణకు 13247 ఓట్లు లభించాయి. తాటి వెంకటేశ్వర్లు తెలంగాణ శాసనసభలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతగా ఎంపికయ్యారు. ఆ తర్వాత కాలంలో టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018లో టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసినా గెలవలేకపోయారు.
అశ్వారావుపేట (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment