Khammam Common Districts
-
తొలిసారి ఉమ్మడి జిల్లాకు రానున్న ప్రియాంకగాంధీ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అసెంబ్లీఎన్నికల బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ప్రచారం చేస్తారు. తొలిసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రియాంకాగాంధీ రానుండడంతో రోడ్‌షోలను విజయవంతం చేసేందుకు గాను నాయకులు భారీ జనసమీకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ పినపాక నియోజకవర్గానికి సంబంధించి మణుగూరులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌కు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రియాంకాగాంధీ వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఆమె ప్రచా రం చేయనుండగా, శనివారం ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ప్రచారానికి హాజరవుతారు. రెండు రోజులు ఉమ్మడి జిల్లాలోనే.. కొత్తగూడెంలో శుక్రవారం సాయంత్రం 3.25గంటల నుంచి 4.20 గంటల వరకు జరిగే సభలో ప్రియాంక పాల్గొంటారు. ఆ తర్వాత హెలీకాప్టర్‌లో ఖమ్మం చేరుకుని ఇక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 11.30 గంటలకు జెడ్పీ సెంటర్ నుంచి వైరా రోడ్, మయూరిసెంటర్, కాల్వొడ్డు, పెదతండా మీదుగా నాయుడుపేట వరకు జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు. దీంతో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ప్రచారం చేసినట్లవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.05 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరుకు చేరుకుంటారు. అక్కడ 1.30నుంచి 2.30 గంటల వరకు జరిగే కార్నర్ మీటింగ్‌లో పార్టీ అభ్యర్థి మట్టా రాగమయితో కలిసి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 3నుంచి 4గంటల వరకు మధిరలో భట్టి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటుచేసే సభలో ప్రియాంకాగాంధీ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవి కూడా చదవండి: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం..! పవన్ కల్యాణ్ -
ఖమ్మంలో ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే..
ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం 3,11,000 ఓటర్లు ఉన్నారు...ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఏక్కువగా ఉన్నాయి. వీరిలో రెండు సామాజిక వర్గాలు ఎటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్-బీఆర్ఎస్లు పోటాపోటీగా బరిలో నిలిచాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ఎన్నికల కోసం సీపీఐ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. సీపీఎం మాత్రం ఒంటరిపోరుకే సై అంది. ఇక ఖమ్మంలో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాల్ని గమనిస్తే.. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? ఖమ్మం నియోజకవర్గంలో శరవేగంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి...ఖమ్మం సీటు పై కీలక నేతలు గురిపెట్టారు...దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ రసవత్తరమైన ఫైట్ నెలకోనే అవకాశం ఉంది..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ బరిలో నిలవనున్నారు...వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు...ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమంను ప్రారంభించారు...ప్రత్యర్థి బలమైన వ్యక్తి వచ్చిన ఢీకొనడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు . అటు వచ్చే ఎన్నికల్లో పువ్వాడ కు చెక్ పెట్టేందుకు బీజేపీ,కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు ప్రారంభించింది.. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి పేరు కూడ వినిపిస్తోంది..అటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు .. ఇప్పటికే ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు పొంగులేటి..పొంగులేటి కొత్తగూడెం నియోజకవర్గంలో పోటి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆయన అనుచరులు మాత్రం పట్టుపట్టి ఖమ్మం నియోజకవర్గంలోనే పోటి చేయాలని పొంగులేటి పై ఒత్తిడి తెస్తున్నారట. అటు కాంగ్రెస్ నుంచి జావిద్, బీజేపీ నుంచి గల్లా సత్యనారయణ, ఉప్పల శారద ఖమ్మం నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలున్నాయి? ఎన్ని మండలాలున్నాయి? రెండు మండలాలు ఉన్నాయి.. ఖమ్మం అర్బన్, రఘనాథపాలెం మండలాలు.. అతి పెద్ద మండలం ఏది? అత్యంత ప్రభావం చూపే పంచాయతీ ఏది? ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం అర్బన్ పెద్దది.. ఇక్కడే 2,50,000 ఓట్లుపైనే ఉన్నాయి.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? మొత్తం ఓటర్లు- 3,11,693 పురుషులు- 1,50,552 స్త్రీలు- 1,61,095 వృత్తిపరంగా ఓటర్లు? పట్టణ ప్రాంతం కావడంతో ఉద్యోగులు,వ్యాపారులు ఎక్కువగా ఉంటారు.. రఘనాథపాలెం మండలంలో రైతులు ఎక్కువగా ఉంటారు.. ఇక్కడ వ్యవసాయమే జీవానధరంగా చేసుకోని బతుకుతూ ఉంటారు.. కావున ఇక్కడ రైతుల ఓట్లే కీలకంగా ఉంటాయి.. మతం/కులం పరంగా ఓటర్లు? యాదవులు 45,000 ఓట్లు, కమ్మ 48,000 ఓట్లు, మైనార్టీ ఓట్లు 30,000 ఓట్లు.. మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు వీరివే ఉంటాయి.. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు..? ఖమ్మం పట్టణంలో ప్రధాన కాలనీల గుండా మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఖమ్మంలో ప్రముఖంగా శ్రీ స్తంభాధ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు. ఇక్కడికి భక్తులు ఖమ్మం నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి తరలి వస్తూ ఉంటారు. పర్యాటకం పరంగా ఖమ్మం నగరంలోని మమత రోడ్డు లో ఉన్న లకారం ట్యాంక్ బండ్, చూపరులను ఆకట్టుకునేలా నిర్మించిన తీగల వంతెన ఉన్నది. ఖమ్మం ఖిల్లా ఖమ్మం నియోజకవర్గానికి ప్రాముఖ్యతగా నిలుస్తుంది. నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు ఉంటే? ఖమ్మం నగరం ఒకవైపు అభివృద్ధి చెందుతుండగా మరో వైపు ట్రాఫిక్ సమస్య ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ ఉంది. అంతే కాదు వర్షాకాలంలో ఖమ్మం నగరాన్ని వర్షపు నీరు ముంచేత్తుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నగరవాసులు అంటున్నారు. త్రీ టౌన్ ప్రజలకు ప్రధానమైన సమస్య రైల్వే మధ్య గేట్ నిర్మాణం ఇంతవరకు చేపట్టలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. అర్హులకు అందటం లేదన్న విమర్శలున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో గల ఏకైక మండలం రఘునాథపాలెం. ఈ మండలం విషయానికొస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తన మార్క్ చూపించుకున్నారనే చెప్పాలి. ఖమ్మం టౌన్ తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్ల రోడ్ తో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు . రఘునాధపాలెం మండలం వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో వ్యవసాయానికి నీటి సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టును ప్రారంభించారు.కానీ, ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది.. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ. 22 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ ,8 కోట్ల రూపాయలతో తీగల వంతెనను నిర్మించారు. రూ. 21కోట్లతో నూతన బస్టాండ్,రూ. 25కోట్లతో ఐటీ హబ్,రూ.110 కోట్ల రూపాయల తో గొల్లపాడు చానల్ ఆధునికరించారు. ధంసలాపురం ఆర్ఓబి 14 కోట్ల రూపాయలతో నిర్మించారు.నూతన కార్పొరేషన్ భవనాన్ని నిర్మించారు.దీంతో పాటుగా సమీకృత నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో అజయ్ కుమార్ కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపోందగా.. 2004లో సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసి గెలుపోందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలుపోందగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లో పోటి చేసి గెలుపోందారు. నాలుగు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం వచ్చే ఎన్నికల్లో హాట్ సీట్ గా మారనుంది. బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్షాలు సైతం బలంగా ఉండగా.. బీజేపీ మాత్రం బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో రసవత్తరమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల కన్ను ఖమ్మం పైనే పడింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని సామ భేద దండోపాయలను ఉపయోగిస్తున్నాయి. -
తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులకు ప్లాన్ రెడీ: పొంగులేటి వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చే తామే అంటూ కామెంట్స్ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఎన్నికల వేళ తెలంగాణలో ఐడీ, ఈడీ దాడులు జరుగుతాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి. దీంతో, ఆయన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. పొంగులేటి శ్రీనివాస్ బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు జరుగుబోతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై దాడికి సిద్దమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే దాడులకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత బీఆర్ఎస్ సూచనల మేరకు కేంద్ర సంస్థలు నామీద, నా కుటుంబ సభ్యుల మీద, నాకు మద్దతిచ్చే వారిపై దాడులు చేసేందుకు రెడీ అవుతున్నారు. కాళేశ్వరం ఖేల్ ఖతం.. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. కానీ, కాళేశ్వరం నిజ స్వరూపమేంటో కేంద్రం నివేదికల్లో వెల్లడించింది. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతికి పాల్పడినట్టు అర్థం అవుతోంది. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల ఏదో ఒకరోజు కూలిపోతాయి. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని చెప్పిన బీజేపీ.. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. కేసీఆర్‌ను ఎందుకు విచారించడం లేదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను మాయం చేసే అవకాశం ఉంది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రియాంక, రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారు. తెలంగాణలో దొరల పాలన వద్దు. ప్రజల పాలన కావాలి. ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారు. తెలంగాణ పోలీసులు వారి పరిధిలో పార్టీలకు అతీతంగా నడుచుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: తప్పు చేసిన వారిని వదలం.. మోదీ ఫైర్ -
TS Election 2023: మరింత బలంగా కాంగ్రెస్..! కారుకు మరోసారి బ్రేక్..!!
ఖమ్మం: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రోడ్లు, ప్రభుత్వ నూతన కార్యాలయాలు, 100 పడకల హాస్పిటల్, జాలిముడి ప్రాజెక్టు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎర్రుపాలెం, ముదిగొండ మండలాల్లో అధిక సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి చేరటంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారింది. భట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడనేది అభిప్రాయం ఉంది. ఏదేమైన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రభావితంగా మారటంతో బీఆర్ఎస్ గెలుపొందటం అంత ఈజీ కాదు అంటున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. వరుసగా మల్లు భట్టి విక్రమార్క మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి ఎన్నికైన మొదట సారి 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. ఆ సమయంలో నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి రోడ్లు, జాలిముడి ప్రాజెక్టు ఇతర ప్రజా అవసరాలను తీర్చుతూ అభివృద్ధి పథంలో నడిపారు. అదే అభివృద్ధితో గత రెండుసార్లు గెలుపును వరించింది. ఈసారి అభివృద్ధితో కాకపోయినా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు నియోజకవర్గంలో అత్యధికంగా వీళ్లంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చింతకాని, మధిర మండలాల్లో దళిత బంధు పథకం ద్వారా ఎంతో మంది లబ్ధిదారులకు ఉపాధి కల్పించారు. వ్యవసాయదారిత ప్రాంతం కావడంతో రైతు సంక్షేమ పథకాలు నుండి ఎక్కువగా లబ్ధి పొందారు. అదేవిధంగా మధిర మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఎక్కువ నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ నే గెలిపిస్తారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి ఎవరిది పైచేయి ..?
భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గం భద్రాచలం గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో పొడెం వీరయ్య మూడోసారి విజయం సాదించారు .గతంలో ఆయన ములుగు నియోజకవర్గంలో 1999,2004లలో కాంగ్రెస్ ఐ పక్షాన గెలవగా,ఈసారి భద్రాచలం నుంచి విజయం సాదించడం విశేషం. ములుగు సీటును మరో నేత సీతక్కకు కేటాయించి వీరయ్యకు భద్రాచలం సీటు ఇవ్వగా ఇద్దరూ గెలిచారు. వీరయ్య తన సమీప టిఆర్ ఎస్ ప్రత్యర్ది తెల్లం వెంకటరావుపై 11785 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు.వీరయ్యకు 47746 ఓట్లు రాగా,వెంకటరావుకు 35961 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి మిడియం బాబూరావుకు 12400 ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు భద్రాచలం సిపిఎం కంచుకోటగా ఉండేది. కాని వివిధ పరిణామాలలో ఆ పార్టీ బలహీనపడిపోయింది. భద్రాచలంలో 2014లో సిపిఎం నేత సున్నం రాజయ్య గెలుపొందారు. 2009లో ఆయన ఓటమి చెందినా, తిరిగి 2014లో తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఫణీశ్వరమ్మను 1815ఓట్ల తేడాతో ఓడిరచారు. రాజయ్య అంతకు ముందు రెండుసార్లు గెలిచారు. 2014లో తెలంగాణలో సిపిఎం పక్షాన గెలిచిన ఏకైక నేతగా కూడా ఈయన ఉన్నారు. 2018లో రాజయ్య పోటీచేయలేదు. 2009లో మిర్యాలగూడలో సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఒక్కరే గెలిచారు. 2014లో ఆయన ఓడిపోయారు. 2018లో సిపిఎంకు తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిద్యం లేకుండా పోయింది. భద్రాచలంలో 2014లో అప్పటి కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కుంజా సత్యవతి పరా జయం చెందారు. భద్రాచలం 1952, 55 ఎన్నికల వరకు ఆంధ్రప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోకి వెళ్ళింది. భద్రాచలం 52,55లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1952లో కెఎమ్‌పిపి గెలిస్తే, 1955లో సిపిఐ గెలిచింది. అయితే గెలిచిన వారిలో సీతారామయ్య ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పడంతో జరిగిన ఉప ఎన్నికలో పి.విరావు గెలిచారు. ఈ ఉప ఎన్నికతోపాటు మొత్తం నాలుగుసార్లు కాంగ్రెస్ గెలిచింది. సిపిఎం ఎనిమిదిసార్లు గెలిచింది. ఇక్కడ టిడిపి ఒకసారి కూడా గెలవలేదు. సిపిఎం నేతలు కుంజా బొజ్జి మూడుసార్లు, ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు, సున్నం రాజయ్య మూడుసార్లు గెలిచారు. సిపిఐ మాజీ ఎం.పి సోడే రామయ్య ఆ తర్వాత కాలంలో టిడిపిలో చేరి భద్రాచలంలో పోటీచేసినా ఓడిపోయారు. భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
అశ్వారావుపేట (ఎస్టి) నియోజకవర్గంలో ప్రజల ఓట్లను ఎవరు గెలుస్తారు?
అశ్వారావుపేట (ఎస్టి) అశ్వారావుపేట గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలంగాణ లో ఈ పార్టీ గెలిచిన రెండు సీట్లలో ఇది ఒకటి. మరొకటి సత్తుపల్లి. నాగేశ్వరరావు తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై 13117 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నాగేశ్వరరావుకు 61124 ఓట్లు రాగా, తాటి వెంకటేశ్వర్లుకు 48007 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన సిపిఎం అభ్యర్ధి రవీందర్ కు సుమారు ఐదు వేల ఓట్లు వచ్చాయి. సత్తుపల్లిలో గెలిచిన సండ్ర వెంకట వీరయ్య టిడిపికి ముందుగా గుడ్ బై చెప్పగా, ఆ తర్వాత మరి కొంతకాలానికి నాగేశ్వరరావు కూడా అదే బాట పట్టి టిఆర్ఎస్లో కలిసిపోయారు. 2014లో అశ్వారావుపేటలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. గతంలో ఈయన బూర్గంపాడు నుంచి తెలుగుదేశం తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. రెండోసారి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి పోటీచేసి తనసమీప ప్రత్యర్ధి టిడిపి అభ్యర్ధి ఎమ్.నాగేశ్వరరావును 930 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా 2014లో సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ ఎమ్మెల్యే మిత్రసేనకు 15101 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ అభ్యర్ధి ఆదినారాయణకు 13247 ఓట్లు లభించాయి. తాటి వెంకటేశ్వర్లు తెలంగాణ శాసనసభలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతగా ఎంపికయ్యారు. ఆ తర్వాత కాలంలో టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసినా గెలవలేకపోయారు. అశ్వారావుపేట (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!
కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంలో నాలుగోసారి విజయం సాదించారు. గతంలో ఆయన 1989, 1999, 2004లలో గెలుపొందారు. ఈసారి ఆయన టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావుపై 4139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాని ఆ తర్వాత వనమా కూడా టిఆర్ఎస్ లోకి మారిపోయారు. వనమాకు 81118 ఓట్లు రాగా, జలగం వెంకటరావుకు 76979 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎల్ ఎఫ్ అభ్యర్దిగా పోటీచేసిన యడవల్లి కృష్ణకు 5400 ఓట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 2014లో టిఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక నేతగా జలగం వెంకట్రావు ఉన్నారు. కొత్తగూడెం నుంచి ఆయన ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి 26521 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. సత్తుపల్లిలో ఒకసారి గెలుపొందిన ఆయన తర్వాత పరిణామాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అనతరం టిఆర్ఎస్లో చేరి విజయం సాధించారు. ఇక్కడ టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన కోనేరు సత్యనారాయణకు 28363 ఓట్లు, సిపిఐ పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు 20,994 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన అడవల్లి కృష్ణకు 22989 ఓట్లు వచ్చాయి. వెంకటరావు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును ఓడిరచారు. 2018లో వనమా కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి జలగం వెంకటరావును ఓడిరచారు. తదుపరి టిఆర్ఎస్లోకి వనమా కూడా మారిపోయారు. వనమా నాలుగు సార్లు కొత్తగూడెంకు ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల నాటికి వై.ఎస్ క్యాబినెట్లో మంత్రిగా వనమా ఉన్నారు. ఆయన 1989, 1999, 2004లలో గెలుపొంది, 2009, 2014లలో ఓడిపోయారు. 2018లో గెలిచారు. కొత్తగూడెం నియోజకవర్గానికి కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, జనతా ఒకసారి, టిడిపి మూడుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి గెలు పొందింది. గతంలో ఉన్న పాల్వంచ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మూడుసార్లు గెలిస్తే, అవిభక్త సిపిఐ ఒకసారి గెలిచాయి. వనమా కొత్తగూడెంలో నాలుగుసార్లు గెలిస్తే, టిడిపి నేత కోనేరు నాగేశ్వరరావు మూడుసార్లు గెలిచారు. 2009లో సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు ఒకసారి గెలిచారు. ప్రముఖనేత చేకూరి కాశయ్య కొత్తగూడెంలో ఒకసారి, పాల్వంచలో ఒకసారి గెలిచారు. ఈయన జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. టిడిపి నేత కోనేరు నాగేశ్వరరావు కొంతకాలం ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో ఉన్నారు. కొత్తగూడెంలో ఎనిమిదిసార్లు కమ్మ సామాజికవర్గంం,నాలుగుసార్లు మున్నూరు కాపు, ఒకసారి వెలమ, ఒకసారి బ్రాహ్మణ సామాజికవర్గం గెలుపొందింది. వనమా వెంకటేశ్వరరావు మున్నూరు కాపువర్గానికి చెందినవారు. జలగం వెంకటరావు వెలమ సామాజికవర్గానికి చెందినవారు. కొత్తగూడెం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
సత్తుపల్లి నియోజకవర్గంలో ఈసారి పైచేయి ఎవరిది ..?
సత్తుపల్లి (ఎస్సి) నియోజకవర్గం సత్తుపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో టిడిపి పక్షాన సండ్ర వెంకట వీరయ్య మరోసారి గెలిచారు. దీంతో ఆయన నాలుగోసారి గెలిచినట్లయింది. గతంలో ఒకసారి సిపిఎం తరపున, ఆ తర్వాత టిడిపి పక్షాన ఆయన గెలిచారు.2018లో తెలంగాణలో టిడిపి రెండు సీట్లు గెలిస్తే వాటిలో ఒకటి సత్తుపల్లి. మరొకటి అశ్వారావుపేట. కాగా గెలిచిన కొద్ది నెలలకు సండ్ర టిఆర్ఎస్ లో చేరిపోతున్నట్లు ప్రకటించారు. సండ్ర వెంకట వీరయ్య తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి పిడమర్తి రవిపై 19002 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వీరయ్యకు 100044 ఓట్లు రాగా, పిడమర్తి రవికి 81042 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన కె.స్వామికి 7300 పైగా ఓట్లు వచ్చాయి. సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లిలో 2014లో తన సమీప ప్రత్యర్ధి ఘట్టా దయానంద్‌పై 2485 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.వీరయ్య మొదట సిపిఎం తరపున గెలిచారు.ఆ తర్వాత కాలంలో ఆయన టిడిపిలోకి మారి సత్తుపల్లి నుంచి మూడుసార్లు గెలుపొందారు. ఇక్కడ నుంచి 2014లో టిఆర్ఎస్ తరపున పోటీచేసిన విద్యార్ధి నేత పిడమర్తి రవి ఓటమి చెందారు. రవికి 6666 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో కూడా గెలవలేకపోయారు. 2014లో ఇక్కడ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి ఎమ్.డి.విజయకుమార్ రెండో స్థానంలో ఉంటే, మాజీ మంత్రి,కాంగ్రెస్ ఐ అభ్యర్ధి సంభాని చంద్రశేఖర్ 30105 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం 2009లో ఎస్సిలకు రిజర్వు అయింది. సంభాని చంద్రశేఖర్ నాలుగుసార్లు పాలేరు నియోజకవర్గంలో గెలిచారు. అలాగే సండ్ర వెంకటవీరయ్య పాలేరులో ఒకసారి గెలిచారు. 2009లో పాలేరు జనరల్ కావడంతో వీరిద్దరూ రిజర్వు అయిన సత్తుపల్లికి మారారు. సత్తుపల్లిలో గతంలో జలగం కుటుంబం ఎక్కువ కాలం ఆధిపత్యం వహించింది. 1957లో జలగం కొండలరావు, 1962, 1967,1972లలో వేంసూరు నుంచి జలగం వెంగళరావు గెలిస్తే, 1978 నుంచి ఏర్పడిన సత్తుపల్లిలో కూడా వెంగళరావే గెలుపొందారు. ఆయన కాసు,పివి మంత్రివర్గాలలో ఉండి, ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయన ఖమ్మం లోక్‌సభస్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలో మంత్రి బాధ్యతలుకూడా నిర్వహించారు. పిసిసి అధ్యకక్షునిగా కూడా పనిచేశారు. జలగం వెంగళరావు పద్ద కుమారుడు ప్రసాదరావు సత్తుపల్లిలో రెండుసార్లు గెలిచి కొంతకాలం మంత్రిగా కూడా వున్నారు. వెంగళరావు చిన్న కుమారుడు వెంకటరావు 2004లో సత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించారు. 2009లో టిక్కెట్ రాకపోవడంతో ఖమ్మంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. కొంతకాలం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో ఉండి, తదుపరి టిఆర్ఎస్ లో చేరి కొత్త గూడెం నుంచి 2014 లో పోటీచేసి గెలుపొందారు. కాని 2018లో ఓటమి చెందారు. వెంగళరావు సోదరుడు కొండలరావు ఎమ్.పిగా కూడా ఎన్నికయ్యారు. సత్తుపల్లిలో మరో ప్రముఖ నేత తుమ్మల నాగేశ్వరరావు. ఆయన 1983 నుంచి అక్కడ టిడిపి అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. 1985, 1994, 1999లలో సత్తుపల్లిలోను, 2009లో ఖమ్మంలోను పోటీచేసి గెలిచారు. 2014 లో ఓటమిచెందారు. తదుపరి తుమ్మల టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు.ఆ తర్వాత పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఐదోసారి గెలిచారు. కాని 2018 సాధారణ ఎన్నికలో ఓటమి చెందడంతో మంత్రి పదవి కోల్పోయారు. తుమ్మల గతంలో ఎన్టిఆర్ క్యాబినెట్‌లోను, చంద్రబాబు క్యాబినెట్‌లోను,తదుపరి కెసిఆర్ మంత్రివర్గంలోను పనిచేశారు. 1978లో జరిగిన ఎన్నికలలో ప్రముఖ సాహితీవేత్త కాళోజీ సత్తుపల్లిలో వెంగళరావుతో పోటీపోడి ఓడిపోయారు. అయితే జలగం ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికారం రాకపోవడంతో ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామాచేశారు. సత్తుపల్లి జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు తొమ్మిదిసార్లు వెలమ, మూడుసార్లు కమ్మ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. సత్తుపల్లి (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వచ్చే ఎన్నికల్లో వైరా (ఎస్టి) నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు..!
వైరా (ఎస్టి) నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో సుజాతనగర్ నియోజకవర్గం రద్దై వైరా నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. వైరా గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీచేసిన లావుడ్యా రాములు విజయం సాదించారు. ఆయన సిటింగ్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ది మదన్ లాల్‌పై 2013 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. 2014 లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన మదన్ లాల్ ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరి 2018లో ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీచేసినా ఫలితం దక్కలేదు.రాములు నాయక్‌కు 52650 ఓట్లు రాగా, మదన్ లాల్ కు 50637 ఓట్లు వచ్చాయి. సిపిఐ పక్షాన పోటీచేసిన బానోతు విజయకు 32757 ఓట్లు వచ్చాయి. 2018లో కేవలం రెండు సీట్లలో మాత్రమే ఇండిపెండెంట్లు,లేదా గుర్తింపు లేని పార్టీలవారు గెలిచారు. వాటిలో ఒకటి వైరా కాగా, మరొకటి రామగుండం. రెండుచోట్ల గెలిచిన వారు తదుపరి టిఆర్ఎస్లో చేరిపోయారు. 2014లో ఖమ్మం జిల్లాలో మాత్రమే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తన ఉనికిని నిలబెట్టుకుంది. తెలంగాణలో మూడు నియోజకవర్గాలలో ఆ పార్టీ గెలిస్తే అందులో ఒకటి వైరా నియోజకవర్గం కావడం విశేషం. వైరాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్ధి మదన్ లాల్ తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బాలాజీ నాయక్‌ను 10583 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. ఎన్నికల తర్వాత కొంతకాలానికి మదన్ లాల్ అదికార టిఆర్ఎస్ లో చేరిపోయారు. 2009లో వైరాలో సిపిఐ తరపున గెలిచిన చంద్రావతి బిజెపి లోకి వెళ్లి అక్కడ నుంచి టిఆర్ఎస్లోకి మారి పోటీచేసినా ఫలితం దక్కలేదు. సుజాతనగర్ (2009లో రద్దు) 1978లో ఏర్పడిన ఈ శాసనసభ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా ఎనిమిదిసార్లు ఎన్నికలు జరగ్గా, నాలుగుసార్లు సిపిఐ, నాలుగుసార్లు కాంగ్రెస్ (ఐ)లు గెలుపొందాయి. సిపిఐ నాయకుడు మహమ్మద్ రజబ్అలీ ఇక్కడ నాలుగుసార్లు గెలవగా, అంతకుముందు ఖమ్మంలో రెండుసార్లు గెలుపొందారు. జిల్లాలోనే ఆరుసార్లు గెలిచిన నేతగా ఈయన నమోదయ్యారు. ఖమ్మంలో ఒకసారి సిపిఎం పక్షాన, మరోసారి సిపిఐ తరపున గెలిచారు. 1994 ఎన్నికల తర్వాత కొంతకాలానికి రజబ్ అలీ మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఐ అభ్యర్ది రాంరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. 1999లో, 2004లో మళ్లీ వెంకటరెడ్డి గెలుపొందారు. తదుపరి ఈ నియోజకవర్గం రద్దు కావడంతో పాలేరుకు మారి మరో రెండుసార్లు గెలిచారు. 2014 లో గెలిచిన కొంతకాలానికి ఆయన కన్నుమూశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. రామిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు దామోదర్‌రెడ్డి నల్గొండ జిల్లా తుంగుతుర్తిలో నాలుగుసార్లు గెలుపొందారు. సూర్యాపేటలో మరోసారి గెలుపొందారు. దామోదరరెడ్డి కూడా గతంలో మంత్రి పదవి నిర్వహించారు. సుజాతనగర్లో మూడుసార్లు రెడ్డి, ఒకసారి కమ్మ, మూడుసార్లు ముస్లింలు ఎన్నికయ్యారు. వైరా (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మధిర నియోజకవర్గం 'రాజకీయం' ఈ సారి ఎవరి వైపు..?
మధిర (ఎస్సి) నియోజకవర్గం మధిర రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క మూడోసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది లింగాల కమల్‌రాజ్‌పై 3567 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత అయ్యారు. కాని మెజార్టీ కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో విలీనం అవడంతో భట్టి ప్రతిపక్ష నేత హోదా కోల్పోవలసి వచ్చింది. మల్లు భట్టి విక్రమార్కకు 80598 ఓట్లు రాగా, కమల్ రాజ్‌కు 77031 ఓట్లు వచ్చాయి. బిఎల్ఎఫ్ తరపున పోటీచేసిన కోట రాంబాబుకు 23వేల ఓట్లు రావడం విశేషం. మధిర నియోజకవర్గంలో 2014లో మల్లు భట్టి విక్రమార్క 12329 ఓట్ల ఆధిక్యతతో తన సమీప సిపిఎం ప్రత్యర్ధి కమల్ రాజ్‌ను ఓడిరచారు. ఇక్కడ నుంచి పోటీచేసిన టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సమీప ప్రత్యర్ధిగా కూడా రాలేకపోయారు. మోత్కుపల్లికి 46044 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ అభ్యర్ధి బి.రామ్మూర్తికి 1446 ఓట్లు వచ్చాయి. మల్లు భట్టి గతంలో శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. 2009లో మధిర నుంచి కూడా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఛీఫ్ విప్, తదుపరి డిప్యూటి స్పీకర్ పదవులు పొందారు. మధిర సిపిఎంకు బలమైన కేంద్రం అయినా 2009 నుంచి గెలవలేక పోయింది. కమల్‌రాజ్ కూడా సిపిఎంను వీడి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసినా ఇక్కడ గెలవలేకపోయారు. నల్లగొండ జిల్లాలో ఆరుసార్లు గెలుపొందిన సీనియర్ టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు 2014లో మధిరకు మారినా గెలవలేకపోయారు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి తొమ్మిది సార్లు, సిపిఎం ఐదుసార్లు, టిడిపి ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన ప్రముఖులలో దుగ్గినేని వెంకయ్య రెండుసార్లు, బోడేపూడి వెంకటేశ్వరరావు మూడుసార్లు గెలు పొందారు. దుగ్గినేని వెంకయ్య తర్వాత ఆయన భార్య వెంకట్రావమ్మ ఒకసారి గెలిచారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శీలం సిద్ధారెడ్డి ఇక్కడ నుంచి ఒకసారి గెలిచారు. నాలుగుసార్లు ఓడిపోయారు. శీలం ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా వున్నప్పుడు కాసు, పి.వి నరసింహారావుల క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు.సిపిఎం నేత బోడేపూడి మరణం తర్వాత 1998 ఉప ఎన్నికలో గెలిచినసిపిఎం నేత కట్టా వెంకటనర్సయ్య 2004లో కూడా గెలిచారు. అయితే 2009 నాటికి ఆయన సిపిఎంకు దూరం అవడం విశేషం. జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు పదకుండుసార్లు కమ్మ,ఒకసారి రెడ్డి గెలుపొందారు. మధిర (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
పాలేరు నియోజకవర్గం గొప్ప రాజకీయ చరిత్ర
పాలేరు నియెఓజకవర్గం పాలేరు నియెఓజకవర్గంలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన కందాళ ఉపేందర్ రెడ్డి తొలిసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై సంచలన విజయం సాదించారు. అంతకు ముందు ఉప ఎన్నికలో ఇక్కడ తుమ్మల భారీ ఆదిక్యతతో గెలుపొందగా, జనరల్ ఎన్నికలో ఓడిపోయారు. ఉపేందర్ రెడ్డికి 7669 ఓట్ల ఆదిక్యత వచ్చింది. ఉపేందర్ రెడ్డికి 89407 ఓట్లు రాగా, తుమ్మల నాగేశ్వరరావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన బత్తుల హైమవతికి సుమారు 5800 ఓట్లు వచ్చాయి. ఉపేందర్ రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. ఎన్నికల తర్వాత ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి 2014లో ఐదోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి స్వర్ణకుమారిని 21863 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. సిపిఎం అభ్యర్ధిగా పోటీచేసిన పోతినేని సుదర్శరావుకు 44245 ఓట్లు రాగా, టిఆర్ఎస్ అభ్యర్ధి ఆర్.రవీంద్రకు 4041 ఓట్లు వచ్చాయి. గతంలో వెంకటరెడ్డి సుజాతనగర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచారు. పునర్విభజనలో ఆ నియోజకవర్గం రద్దవడంతో వెంకటరెడ్డి పాలేరుకు మారి రెండుసార్లు గెలిచారు. వై.ఎస్. రాజశేఖరరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిల మంత్రివర్గాలలో సభ్యుడిగా రామిరెడ్డి పనిచేశారు. 2014లో గెలిచిన తర్వాత వెంకటరెడ్డి అనారోగ్యానికి గురై కన్నుమూశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో అప్పటికే కెసిఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పోటీచేసి దివంగత వెంకటరెడ్డి సతీమణి సుచరిత రెడ్డిపై 21,863 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2018 ఎన్నికలలో తుమ్మల పాలేరులో మరోసారి పోటీచేసి ఓటమి చెందారు. తుమ్మల సత్తుపల్లి నుంచి మూడుసార్లు, ఖమ్మం నుంచి ఒకసారి గెలిచారు. మొత్తం ఐదుసార్లు ఆయన గెలిచారు. టిడిపి నుంచి టిఆర్ఎస్లోకి మారి ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. కాని 2018లో ఓటమి చెందడంతో మంత్రి పదవి కోల్పోయారు. రామిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రామిరెడ్డి దామోదరరెడ్డి నల్లగొండ జిల్లాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిపనిచేశారు. 2014, 2018 ఎన్నికలలో సూర్యాపేట నుంచి ఓడిపోయారు. పాలేరులో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు పదకుండుసార్లు, సిపిఎం రెండుసార్లు సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి గెలిచాయి. 2009లో పునర్విభజన తర్వాత పాలేరు జనరల్ సీటుగా మారింది. 2004 వరకు రిజర్వుడుగా ఉంది ఇక్కడి నుంచి అత్యధిక సార్లు సంభాని చంద్రశేఖర్ నాలుగుసార్లు గెలిచారు. చంద్రశేఖర్ గతంలో కోట్ల, వై.ఎస్.క్యాబినెట్లోకూడా వున్నారు. 1994లో సిపిఎం పక్షాన గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ఆ తర్వాత టిడిపిలో చేరారు. 2009లో తిరిగి 2014, 2018లలో సత్తుపల్లిలో టిడిపి అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు. పాలేరు జనరల్‌గా మారిన తర్వాత మూడుసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, ఒకసారి కమ్మ నేత గెలిచారు. పాలేరు నియెఓజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...మరి నెక్స్ట్ రానున్నది ఎవరు..?
ఖమ్మం నియోజకవర్గం ఖమ్మంలో జరిగిన ప్రతిష్టాత్మక పోరులో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పువ్వాడ అజయ్ కుమార్ టిడిపి అభ్యర్ది, మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరావుపై 10991 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. అజయ్ కుమార్ గతసారి కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి ఆ తర్వాత కాలంలో టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ టిక్కెట్ పై మరోసారి గెలిచారు. అజయ్‌కుమార్‌కు 102760 ఓట్లు రాగా, నామా నాగేశ్వర రావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన మిగిలిన అభ్యర్దులకన్నా నోటాకు 3500 ఓట్లు రావడం విశేషం. అజయ్ కుమార్ 2018లో గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. కాగా నామా నాగేశ్వరరావు టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరి 2019లో ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీచేసి గెలిచారు. తదుపరి లోక్ సభలో టిఆర్ఎస్ పక్ష నేత అయ్యారు. ఖమ్మం నియోజకవర్గంలో 2014లో సీనియర్ టిడిపి నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరాజయం చెందారు. కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసిన పువ్వాడ అజయ్ చేతిలో 5609 ఓట్ల తేడాతో ఓడిపోవడం విశేషం. పువ్వాడ అజయ్ ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరావు కుమారుడు. ఆయన కొంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత అజయ్ కాంగ్రెస్ ఐలో చేరి ఖమ్మం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి 2018లో కూడా గెలిచారు. తుమ్మల గతంలో సత్తుపల్లి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. సత్తుపల్లి రిజర్వుడ్ కావడంతో ఖమ్మంకు మారి రెండువేల తొమ్మిదిలో విజయం సాధించారు. కాని 2014లో ఓడిపోయారు. తదుపరి తుమ్మల టిఆర్ఎస్లోకి మారి ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టారు. తదుపరి పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. 2018లో పాలేరులో ఓటమి చెందారు. తుమ్మల గతంలో ఎన్.టి.ఆర్., చంద్రబాబుల క్యాబినెట్లలో, కెసిఆర్ క్యాబినెట్‌లోను మంత్రిగా ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా ఉన్న ఖమ్మంలో10సార్లు వామపక్షాలు గెలుపొందాయి. 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. పిడిఎఫ్, సిపిఐ కలిసి ఐదుసార్లు, సిపిఎం నాలుగుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ నాలుగుసార్లు టిడిపి ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి గెలుపొందాయి. 2009లో ఖమ్మం నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్ ఐ టిక్కెట్ కోసం ప్రయత్నించిన సత్తుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటుచేసి ఇండిపెండెంటుగా పోటీచేశారు. 2014లో టిఆర్ఎస్ టిక్కెట్‌పై కొత్తగూడెంలో పోటీచేసి గెలుపొందారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం ఒకసారి శాసనసభకు, మరోసారి లోక్ సభకు గెలుపొందారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పనిచేసిన ప్రముఖ నేత నల్లమల గిరిప్రసాద్ ఖమ్మంలో ఒకసారి గెలుపొందారు. ఆయన ఒకసారి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు రెండుసార్లు గెలిచారు. ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 1967,72లలో ఖమ్మంలో గెలిచిన మహ్మద్ రజబ్ అలీ, ఆ తర్వాత సుజాతనగర్లో నాలుగుసార్లు గెలిచి జిల్లాలో ఆరుసార్లు గెలుపొందిన నేతగా నమోదయ్యారు. 1957లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తేళ్ళ లక్ష్మీకాంతమ్మ 1978లో హైదరాబాద్ నగరంలో మరోసారి గెలిచారు. ఆమె ఖమ్మం నుంచి మూడుసార్లు లోక్‌సభకు కూడా నెగ్గారు. టిడిపి 1983 నుంచి ఆయా సందర్భాలలో మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చినప్పటికీ స్వయంగా మొదటిసారిగా 2009లో ఖమ్మంలో గెలిచింది. ఆ తర్వాత రెండు ఎన్నికలలో ఓటమి చెందింది. మంచికంటి రామకిషన్రావు సిపిఎం పక్షాన రెండుసార్లు గెలిచారు. ఖమ్మంలో తొమ్మిది సార్లు కమ్మ, ఒకసారి రెడ్డి, రెండుసార్లు బ్రాహ్మణ, మూడుసార్లు ముస్లింలు గెలుపొందారు. ఖమ్మం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఇల్లెందు (ఎస్టి) నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!
ఇల్లెందు (ఎస్టి) నియోజకవర్గం ఇల్లెందు గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన బానోత్ హరిప్రియ నాయక్ గెలుపొందారు. ఆమెకు 2907 ఓట్ల ఆదిక్యత వచ్చింది. ఇల్లెందు సిటింగ్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ది కోరం కనకయ్యపై ఆమె విజయం సాదించారు. గతంలో కనకయ్య కూడా కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి టిఆర్ఎస్లో చేరగా, ఈసారి కూడా హరిప్రియ కూడా కాంగ్రెస్ ఐకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరిపోయారు. హరిప్రియకు 70259 ఓట్లు రాగా, కోరం కనకయ్యకు 67352 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు 12900 ఓట్లు వచ్చాయి. నరసయ్య గతంలో ఐదుసార్లు ఇల్లెందులో గెలిచారు. కాని ఇప్పుడు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. చాలాకాలం తర్వాత 2014లో ఇల్లందులో కాంగ్రెస్ ఐ అభ్యర్ధి విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీచేసిన కోరం కనకయ్య తన సమీప టిడిపి ప్రత్యర్ధి బాణోత్ హరిప్రియను 11507 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. కాని ఆ తర్వాత కొద్ది కాలానికే కనకయ్య అదికార టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 2014లో టిఆర్ఎస్ అభ్యర్ధి ఊకే అబ్బయ్యకు 20865 ఓట్లు వచ్చాయి. 2018లో హరిప్రియ కాంగ్రెస్ ఐ పక్షాన గెలవడం విశేషం. 1972 తర్వాత ఇల్లందులో అంటే నలభై రెండు ఏళ్ల తర్వాత 2014లో కాంగ్రెస్ ఐ గెలవడం విశేషం. 2009లో టిడిపి పక్షాన ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఊకే అబ్బయ్యకు 2014లో టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన టిఆర్ఎస్లో చేరారు. అంతకుముందు అబ్బయ్య సిపిఐ పక్షాన రెండుసార్లు (బూర్గంపాడు, ఇల్లందు)లలో గెలిచి, తదుపరి టిడిపి పక్షాన గెలిచారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీచేసిన శంకర్ నాయక్ 2014లో టిఆర్ఎస్ తరపున పినపాకలో పోటీచేసి ఓడిపోయారు. ఇల్లెందులో అత్యధికంగా సిపిఎం ఎమ్ఎల్ న్యూడెమొక్రసి నేత గుమ్మడి నరసయ్య ఐదుసార్లు గెలుపొందారు. ఇల్లెందు నియోజకవర్గం 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. కమ్యూనిస్టు నాయకుడు కె.ఎల్. నరసింహారావు ఆ రెండుసార్లే కాక, 1962లో కూడా గెలిచారు. 1978 నుంచి రిజర్వు అయిన తర్వాత ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు.తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారి 2014, 2018లలో గెలిచింది. కానీ గెలిచినవారు కాంగ్రెస్‌ను వదలి టిఆర్ఎస్లో చేరిపోయారు. ఆరుసార్లు ఇండిపెండెంట్లు గెలవడం కూడా ఒక రికార్డుగానే తీసుకోవాలి. జనరల్ నియోజక వర్గంగా ఉన్నప్పుడు ఒక కమ్మ, నాలుగుసార్లు బ్రాహ్మణ సామాజికవర్గం గెలుపొందింది. పదకుండుసార్లుగా గిరిజనులు గెలుస్తున్నారు. ఇల్లెందు (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
పినపాక (ఎస్టీ) నియోజకవర్గంలో తదుపరి ఎన్నికల్లో అధికారంలో ఉండేది ఎవరు..?
పినపాక (ఎస్టి) నియోజకవర్గం పినపాక రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ పార్టీ తరపున పోటీచేసిన రేగ కాంతరావు రెండోసారి విజయం సాదించారు. ఆయన 2009లో తొలిసారి గెలవగా, 2018లో తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై 18567 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికి కాంతారావు టిఆర్ఎస్లో చేరిపోయారు. కాంతారావుకు 72283 ఓట్లు రాగా, పాయం వెంక టేశ్వర్లుకు 52718 ఓట్లు వచ్చాయి. 2009కి ముందు బూర్గంపాడు నియోజకవర్గం ఉండేది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన పి.దుర్గకు 5700 ఓట్లు వచ్చాయి. 2014లో తెలంగాణలో కేవలం ఖమ్మం జిల్లాలోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తన ఉనికిని నిలబెట్టుకుని ఒక ఎమ్.పి సీటును, మూడు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా గిరిజన సీట్లు కావడం ప్రత్యేకత. పినపాకను పరిగణనలోకి తీసుకుంటే 2009, 2018లలో కాంగ్రెస్ ఐ మళ్లీ గెలిచింది. 2014లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన పాయం వెంకటేశ్వర్లు గతంలో సిపిఐ పక్షాన ఒకసారి గెలిచారు. 2009లో కూడా ఆ పార్టీ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. తదుపరి 2014లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసి తన సమీప ప్రత్యర్ధి టిఆర్ఎస్ నేత శంకర్ నాయక్‌ను 14065 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లోకి మారిపోయారు. 2014లో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య పోటీచేసి 28195 ఓట్లు తెచ్చుకుని ఓడిపోయారు. సిపిఐ పక్షాన పోటీచేసిన టి.రమేష్‌కు 19313 ఓట్లు వచ్చాయి. 1985 తర్వాత బూర్గుంపాడులో కాంగ్రెస్ ఐ గెలవలేదు. అయితే బూర్గుంపాడు బదులు పినపాకను పరిగణనలోకి 2009లోనే కాంగ్రెస్ ఐ ఇక్కడ గెలిచింది. గతంలో ఈ నియోజకవర్గం స్థానే బూర్గంపాడు ఉండేది. బూర్గుంపాడుకు ఎన్నికలలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి ఒకసారి, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. బూర్గుంపాడులో కొమరం రామయ్య 1967లో గెలిచాక, ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పడంతో, మళ్ళీజరిగిన ఉప ఎన్నికలో ఈయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కుంజా భిక్షం ఆ తర్వాత కాలంలో ఈయన సిపిఐని వదలి టిడిపిలోకి, తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్ళారు. తదుపరి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1983లో ఇక్కడ గెలిచిన ఊకే అబ్బయ్య 1994లో, 2009లో ఇల్లెందులో గెలుపొందారు. 1985లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా గెలిచిన చందాలింగయ్య 2001లో ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేశారు. పినపాక (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..