ఖమ్మం: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రోడ్లు, ప్రభుత్వ నూతన కార్యాలయాలు, 100 పడకల హాస్పిటల్, జాలిముడి ప్రాజెక్టు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎర్రుపాలెం, ముదిగొండ మండలాల్లో అధిక సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి చేరటంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారింది. భట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడనేది అభిప్రాయం ఉంది. ఏదేమైన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రభావితంగా మారటంతో బీఆర్‌ఎస్ గెలుపొందటం అంత ఈజీ కాదు అంటున్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా..
వరుసగా మల్లు భట్టి విక్రమార్క మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి ఎన్నికైన మొదట సారి 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో డిప్యూటీ స్పీకర్గా పని చేశారు. ఆ సమయంలో నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి రోడ్లు, జాలిముడి ప్రాజెక్టు ఇతర ప్రజా అవసరాలను తీర్చుతూ అభివృద్ధి పథంలో నడిపారు. అదే అభివృద్ధితో గత రెండుసార్లు గెలుపును వరించింది.
ఈసారి అభివృద్ధితో కాకపోయినా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు నియోజకవర్గంలో అత్యధికంగా వీళ్లంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చింతకాని, మధిర మండలాల్లో దళిత బంధు పథకం ద్వారా ఎంతో మంది లబ్ధిదారులకు ఉపాధి కల్పించారు. వ్యవసాయదారిత ప్రాంతం కావడంతో రైతు సంక్షేమ పథకాలు నుండి ఎక్కువగా లబ్ధి పొందారు. అదేవిధంగా మధిర మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఎక్కువ నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ నే గెలిపిస్తారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment