Madhira Assembly Constituency
-
రాష్ట్రంలో కాంగ్రెస్‌దే విజయం: భట్టి
మధిర: రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు కావాలని, ప్రజాస్వామ్యయుత సామాజిక నిర్మాణం జరగాలనే ఆకాంక్షతో ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేశారని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సంపద ప్రజలకు పంచాలని.. సక్రమంగా అన్ని వర్గాలకు అందాలని బలంగా కోరుకుంటున్నానని చెప్పారు. పదేళ్ల కాలంలో వనరులు, సంపద రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా దోపిడీకి గురైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేశారని భట్టి వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ తూ.చ. తప్పక అమలు చేస్తామని చెప్పారు. -
మా పైసలేవీ?.. ప్రచార రథం అడ్డగింత
సాక్షి, ఖమ్మం: మధిర నియోజకవర్గ పరిధిలో ఇవాళ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అధికార బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాన్ని కొందరు అడ్డుకున్నారు. ప్రచారానికి పిలిచి తమకు డబ్బులు ఇవ్వలేదని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వాహనాన్ని తగలబెడతామని హెచ్చరించడం స్వల్ఫ ఉద్రిక్తతలకు దారి తీసింది. మధిర నుంచి బీఆర్ఎస్ తరఫున జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ పోటీ చేస్తున్నారు. ఇవాళ చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారాయన. ఆ ప్రచారంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది పాల్గొన్నారు. ఎండలో బీఆర్ఎస్, కమల్‌రాజ్ అనుకూల నినాదాలతో ఊరంతా కలియతిరిగారు. ఆఖర్లో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్లు. సర్పంచ్, జెడ్పీటీసీలే డబ్బులు పంచుకున్నారని.. తమకు పైసలు ఇవ్వకుండా గ్రామంలో వాహనం తిరిగితే తగలబెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో స్వల్ఫ ఉద్రిక్తత చోటు చేసుకోగా.. స్థానికులు వాళ్లను సముదాయించడంతో ప్రచార రథం అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
TS Election 2023: మరింత బలంగా కాంగ్రెస్..! కారుకు మరోసారి బ్రేక్..!!
ఖమ్మం: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రోడ్లు, ప్రభుత్వ నూతన కార్యాలయాలు, 100 పడకల హాస్పిటల్, జాలిముడి ప్రాజెక్టు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎర్రుపాలెం, ముదిగొండ మండలాల్లో అధిక సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి చేరటంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారింది. భట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడనేది అభిప్రాయం ఉంది. ఏదేమైన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రభావితంగా మారటంతో బీఆర్ఎస్ గెలుపొందటం అంత ఈజీ కాదు అంటున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. వరుసగా మల్లు భట్టి విక్రమార్క మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి ఎన్నికైన మొదట సారి 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. ఆ సమయంలో నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి రోడ్లు, జాలిముడి ప్రాజెక్టు ఇతర ప్రజా అవసరాలను తీర్చుతూ అభివృద్ధి పథంలో నడిపారు. అదే అభివృద్ధితో గత రెండుసార్లు గెలుపును వరించింది. ఈసారి అభివృద్ధితో కాకపోయినా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు నియోజకవర్గంలో అత్యధికంగా వీళ్లంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చింతకాని, మధిర మండలాల్లో దళిత బంధు పథకం ద్వారా ఎంతో మంది లబ్ధిదారులకు ఉపాధి కల్పించారు. వ్యవసాయదారిత ప్రాంతం కావడంతో రైతు సంక్షేమ పథకాలు నుండి ఎక్కువగా లబ్ధి పొందారు. అదేవిధంగా మధిర మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఎక్కువ నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ నే గెలిపిస్తారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
మధిర నియోజకవర్గం 'రాజకీయం' ఈ సారి ఎవరి వైపు..?
మధిర (ఎస్సి) నియోజకవర్గం మధిర రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క మూడోసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది లింగాల కమల్‌రాజ్‌పై 3567 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత అయ్యారు. కాని మెజార్టీ కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో విలీనం అవడంతో భట్టి ప్రతిపక్ష నేత హోదా కోల్పోవలసి వచ్చింది. మల్లు భట్టి విక్రమార్కకు 80598 ఓట్లు రాగా, కమల్ రాజ్‌కు 77031 ఓట్లు వచ్చాయి. బిఎల్ఎఫ్ తరపున పోటీచేసిన కోట రాంబాబుకు 23వేల ఓట్లు రావడం విశేషం. మధిర నియోజకవర్గంలో 2014లో మల్లు భట్టి విక్రమార్క 12329 ఓట్ల ఆధిక్యతతో తన సమీప సిపిఎం ప్రత్యర్ధి కమల్ రాజ్‌ను ఓడిరచారు. ఇక్కడ నుంచి పోటీచేసిన టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సమీప ప్రత్యర్ధిగా కూడా రాలేకపోయారు. మోత్కుపల్లికి 46044 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ అభ్యర్ధి బి.రామ్మూర్తికి 1446 ఓట్లు వచ్చాయి. మల్లు భట్టి గతంలో శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. 2009లో మధిర నుంచి కూడా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఛీఫ్ విప్, తదుపరి డిప్యూటి స్పీకర్ పదవులు పొందారు. మధిర సిపిఎంకు బలమైన కేంద్రం అయినా 2009 నుంచి గెలవలేక పోయింది. కమల్‌రాజ్ కూడా సిపిఎంను వీడి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసినా ఇక్కడ గెలవలేకపోయారు. నల్లగొండ జిల్లాలో ఆరుసార్లు గెలుపొందిన సీనియర్ టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు 2014లో మధిరకు మారినా గెలవలేకపోయారు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి తొమ్మిది సార్లు, సిపిఎం ఐదుసార్లు, టిడిపి ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన ప్రముఖులలో దుగ్గినేని వెంకయ్య రెండుసార్లు, బోడేపూడి వెంకటేశ్వరరావు మూడుసార్లు గెలు పొందారు. దుగ్గినేని వెంకయ్య తర్వాత ఆయన భార్య వెంకట్రావమ్మ ఒకసారి గెలిచారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శీలం సిద్ధారెడ్డి ఇక్కడ నుంచి ఒకసారి గెలిచారు. నాలుగుసార్లు ఓడిపోయారు. శీలం ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా వున్నప్పుడు కాసు, పి.వి నరసింహారావుల క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు.సిపిఎం నేత బోడేపూడి మరణం తర్వాత 1998 ఉప ఎన్నికలో గెలిచినసిపిఎం నేత కట్టా వెంకటనర్సయ్య 2004లో కూడా గెలిచారు. అయితే 2009 నాటికి ఆయన సిపిఎంకు దూరం అవడం విశేషం. జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు పదకుండుసార్లు కమ్మ,ఒకసారి రెడ్డి గెలుపొందారు. మధిర (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..