మధిర (ఎస్సి) నియోజకవర్గం
మధిర రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క మూడోసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్ది లింగాల కమల్‌రాజ్‌పై 3567 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత అయ్యారు. కాని మెజార్టీ కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో విలీనం అవడంతో భట్టి ప్రతిపక్ష నేత హోదా కోల్పోవలసి వచ్చింది. మల్లు భట్టి విక్రమార్కకు 80598 ఓట్లు రాగా, కమల్ రాజ్‌కు 77031 ఓట్లు వచ్చాయి. బిఎల్‌ఎఫ్ తరపున పోటీచేసిన కోట రాంబాబుకు 23వేల ఓట్లు రావడం విశేషం.
మధిర నియోజకవర్గంలో 2014లో మల్లు భట్టి విక్రమార్క 12329 ఓట్ల ఆధిక్యతతో తన సమీప సిపిఎం ప్రత్యర్ధి కమల్ రాజ్‌ను ఓడిరచారు. ఇక్కడ నుంచి పోటీచేసిన టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సమీప ప్రత్యర్ధిగా కూడా రాలేకపోయారు. మోత్కుపల్లికి 46044 ఓట్లు వచ్చాయి. టిఆర్‌ఎస్ అభ్యర్ధి బి.రామ్మూర్తికి 1446 ఓట్లు వచ్చాయి. మల్లు భట్టి గతంలో శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. 2009లో మధిర నుంచి కూడా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఛీఫ్ విప్, తదుపరి డిప్యూటి స్పీకర్ పదవులు పొందారు.
మధిర సిపిఎంకు బలమైన కేంద్రం అయినా 2009 నుంచి గెలవలేక పోయింది. కమల్‌రాజ్ కూడా సిపిఎంను వీడి టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసినా ఇక్కడ గెలవలేకపోయారు. నల్లగొండ జిల్లాలో ఆరుసార్లు గెలుపొందిన సీనియర్ టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు 2014లో మధిరకు మారినా గెలవలేకపోయారు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి తొమ్మిది సార్లు, సిపిఎం ఐదుసార్లు, టిడిపి ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఇక్కడ నుంచి పోటీచేసిన ప్రముఖులలో దుగ్గినేని వెంకయ్య రెండుసార్లు, బోడేపూడి వెంకటేశ్వరరావు మూడుసార్లు గెలు పొందారు.
దుగ్గినేని వెంకయ్య తర్వాత ఆయన భార్య వెంకట్రావమ్మ ఒకసారి గెలిచారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శీలం సిద్ధారెడ్డి ఇక్కడ నుంచి ఒకసారి గెలిచారు. నాలుగుసార్లు ఓడిపోయారు. శీలం ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీగా వున్నప్పుడు కాసు, పి.వి నరసింహారావుల క్యాబినెట్‌లలో మంత్రిగా ఉన్నారు.సిపిఎం నేత బోడేపూడి మరణం తర్వాత 1998 ఉప ఎన్నికలో గెలిచినసిపిఎం నేత కట్టా వెంకటనర్సయ్య 2004లో కూడా గెలిచారు. అయితే 2009 నాటికి ఆయన సిపిఎంకు దూరం అవడం విశేషం. జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు పదకుండుసార్లు కమ్మ,ఒకసారి రెడ్డి గెలుపొందారు.
మధిర (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment