భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గం
భద్రాచలం గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో పొడెం వీరయ్య మూడోసారి విజయం సాదించారు .గతంలో ఆయన ములుగు నియోజకవర్గంలో 1999,2004లలో కాంగ్రెస్ ఐ పక్షాన గెలవగా,ఈసారి భద్రాచలం నుంచి విజయం సాదించడం విశేషం. ములుగు సీటును మరో నేత సీతక్కకు కేటాయించి వీరయ్యకు భద్రాచలం సీటు ఇవ్వగా ఇద్దరూ గెలిచారు. వీరయ్య తన సమీప టిఆర్ ఎస్ ప్రత్యర్ది తెల్లం వెంకటరావుపై 11785 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు.వీరయ్యకు 47746 ఓట్లు రాగా,వెంకటరావుకు 35961 ఓట్లు వచ్చాయి.
ఇక్కడ సిపిఎం పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి మిడియం బాబూరావుకు 12400 ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు భద్రాచలం సిపిఎం కంచుకోటగా ఉండేది. కాని వివిధ పరిణామాలలో ఆ పార్టీ బలహీనపడిపోయింది. భద్రాచలంలో 2014లో సిపిఎం నేత సున్నం రాజయ్య గెలుపొందారు. 2009లో ఆయన ఓటమి చెందినా, తిరిగి 2014లో తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఫణీశ్వరమ్మను 1815ఓట్ల తేడాతో ఓడిరచారు. రాజయ్య అంతకు ముందు రెండుసార్లు గెలిచారు. 2014లో తెలంగాణలో సిపిఎం పక్షాన గెలిచిన ఏకైక నేతగా కూడా ఈయన ఉన్నారు. 2018లో రాజయ్య పోటీచేయలేదు. 2009లో మిర్యాలగూడలో సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఒక్కరే గెలిచారు.
2014లో ఆయన ఓడిపోయారు. 2018లో సిపిఎంకు తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిద్యం లేకుండా పోయింది. భద్రాచలంలో 2014లో అప్పటి కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కుంజా సత్యవతి పరా జయం చెందారు. భద్రాచలం 1952, 55 ఎన్నికల వరకు ఆంధ్రప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోకి వెళ్ళింది. భద్రాచలం 52,55లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది.
1952లో కెఎమ్‌పిపి గెలిస్తే, 1955లో సిపిఐ గెలిచింది. అయితే గెలిచిన వారిలో సీతారామయ్య ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పడంతో జరిగిన ఉప ఎన్నికలో పి.విరావు గెలిచారు. ఈ ఉప ఎన్నికతోపాటు మొత్తం నాలుగుసార్లు కాంగ్రెస్ గెలిచింది. సిపిఎం ఎనిమిదిసార్లు గెలిచింది. ఇక్కడ టిడిపి ఒకసారి కూడా గెలవలేదు. సిపిఎం నేతలు కుంజా బొజ్జి మూడుసార్లు, ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు, సున్నం రాజయ్య మూడుసార్లు గెలిచారు. సిపిఐ మాజీ ఎం.పి సోడే రామయ్య ఆ తర్వాత కాలంలో టిడిపిలో చేరి భద్రాచలంలో పోటీచేసినా ఓడిపోయారు.
భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment