కొత్తగూడెం నియోజకవర్గం
కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంలో నాలుగోసారి విజయం సాదించారు. గతంలో ఆయన 1989, 1999, 2004లలో గెలుపొందారు. ఈసారి ఆయన టిఆర్‌ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావుపై 4139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాని ఆ తర్వాత వనమా కూడా టిఆర్‌ఎస్ లోకి మారిపోయారు. వనమాకు 81118 ఓట్లు రాగా, జలగం వెంకటరావుకు 76979 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎల్ ఎఫ్ అభ్యర్దిగా పోటీచేసిన యడవల్లి కృష్ణకు 5400 ఓట్లు వచ్చాయి.
ఖమ్మం జిల్లాలో 2014లో టిఆర్‌ఎస్ తరపున గెలిచిన ఏకైక నేతగా జలగం వెంకట్రావు ఉన్నారు. కొత్తగూడెం నుంచి ఆయన ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి 26521 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. సత్తుపల్లిలో ఒకసారి గెలుపొందిన ఆయన తర్వాత పరిణామాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అనతరం టిఆర్‌ఎస్‌లో చేరి విజయం సాధించారు. ఇక్కడ టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన కోనేరు సత్యనారాయణకు 28363 ఓట్లు, సిపిఐ పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు 20,994 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన అడవల్లి కృష్ణకు 22989 ఓట్లు వచ్చాయి.
వెంకటరావు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును ఓడిరచారు. 2018లో వనమా కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి జలగం వెంకటరావును ఓడిరచారు. తదుపరి టిఆర్‌ఎస్‌లోకి వనమా కూడా మారిపోయారు. వనమా నాలుగు సార్లు కొత్తగూడెంకు ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల నాటికి వై.ఎస్ క్యాబినెట్‌లో మంత్రిగా వనమా ఉన్నారు. ఆయన 1989, 1999, 2004లలో గెలుపొంది, 2009, 2014లలో ఓడిపోయారు. 2018లో గెలిచారు.
కొత్తగూడెం నియోజకవర్గానికి కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి నాలుగుసార్లు, జనతా ఒకసారి, టిడిపి మూడుసార్లు, టిఆర్‌ఎస్ ఒకసారి గెలు పొందింది. గతంలో ఉన్న పాల్వంచ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మూడుసార్లు గెలిస్తే, అవిభక్త సిపిఐ ఒకసారి గెలిచాయి. వనమా కొత్తగూడెంలో నాలుగుసార్లు గెలిస్తే, టిడిపి నేత కోనేరు నాగేశ్వరరావు మూడుసార్లు గెలిచారు. 2009లో సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు ఒకసారి గెలిచారు. ప్రముఖనేత చేకూరి కాశయ్య కొత్తగూడెంలో ఒకసారి, పాల్వంచలో ఒకసారి గెలిచారు. ఈయన జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
టిడిపి నేత కోనేరు నాగేశ్వరరావు కొంతకాలం ఎన్.టి.ఆర్ క్యాబినెట్‌లో ఉన్నారు. కొత్తగూడెంలో ఎనిమిదిసార్లు కమ్మ సామాజికవర్గంం,నాలుగుసార్లు మున్నూరు కాపు, ఒకసారి వెలమ, ఒకసారి బ్రాహ్మణ సామాజికవర్గం గెలుపొందింది. వనమా వెంకటేశ్వరరావు మున్నూరు కాపువర్గానికి చెందినవారు. జలగం వెంకటరావు వెలమ సామాజికవర్గానికి చెందినవారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment