Kothagudem Assembly Constituency
-
లెఫ్ట్‌తో పొత్తు ఇంకా ఖరారు కాలేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు వామపక్షాలకు మధ్య ఎన్నికల పొత్తు కుదిరిందన్న వార్తల్లో వాస్తవం లేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సోమవారం విస్తృత ప్రచారం జరిగింది. ఢిల్లీ స్థాయిలో ఈ పొత్తు కుదిరిందని, సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం, సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం నియోజకవర్గాలను కేటాయించారని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశాన్ని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సున్నితంగా తోసిపుచ్చారు. వామపక్షాలతో పొత్తు చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, వామపక్షాలకు నాలుగు స్థానాలు కేటాయించినట్లు జరిగిన ప్రచారం కేవలం ఊహాగానమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం త్వర లోనే అధికారికంగా ప్రకటిస్తుందని, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలపై పార్టీ శ్రేణులు ఆందోళనకు గురికావద్దని సోమవారం ఆయన వెల్లడించారు. కాగా, వామపక్షాలు అడుగుతున్న నియోజకవర్గా లకు సంబంధించిన సమాచారాన్ని టీపీ సీసీ, అధిష్టానికి పంపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల ఒకటో తేదీన సమావేశమై ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేస్తా మని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పినా.. అలాంటి సమావేశం ఏదీ జరగకపోగా, చెరో రెండు స్థానాలు ఖరారైనా ఏయే నియోజకవర్గాలన్న అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్లు కామ్రేడ్లు చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్తో ఇప్పుడు కాంగ్రెస్‌తో.. ‘ఇండియా’కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కీలకంగా ఉన్నాయి. తెలంగాణలోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి బ్రేక్ వేసేందుకు ఆనాటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో వామపక్షాలు చేతులు కలిపాయి. ఆ ఎన్నికలో బీజేపీ గెలవకుండా అడ్డుకోవడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్తో కలసి సాగాలని లెఫ్ట్ పార్టిలు భావించాయి. కానీ వివిధ రాజకీయ కారణాలతో అది సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్రంలో బీజేపీని, బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలవాలని కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే పలు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల ఓట్లు కాంగ్రెస్‌కు కలసి వస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనే జాతీయ నేతల భేటీ.. తెలంగాణలో పొత్తుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు గతంలోనే భేటీ అయినట్లు తెలంగాణ లెఫ్ట్ నేతలు వెల్లడించారు. మూడు జాతీయ పార్టిల అధినేతలు తెలంగాణలో పొత్తుకు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారని చెపుతున్నారు. పొత్తుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా పార్టిల రాష్ట్ర నేతలకు అగ్ర నాయకత్వాలు సూచించాయని సమాచారం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలసి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, కమ్యూనిస్టులు కోరుతున్న స్థానాల్లోని కాంగ్రెస్ ఆశావహుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందోనన్న ఆందోళన హస్తం నేతల్లో నెలకొని ఉంది. -
TS Election 2023: ఎప్పుడు విలక్షణ తీర్పే.. కొత్తగూడెంలో ఉత్కంఠ!
ఖమ్మం: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విలక్షణమైన తీర్పు వచ్చేది కొత్తగూడెం నియోజకవర్గంలోనే. కొత్త పార్టీల తరుపున పోటీచేసే అభ్యర్థులకు ఎప్పుడు భారీగానే ఓట్లు వచ్చేవి. ఆది నుండి ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో కొత్తగూడెం నియోజకవర్గం జిల్లా కేంద్రం. దాంతో ఇక్కడ జనరల్ స్థానం కావటంతో కొత్తగూడెం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ సీటుగా మారిపోయింది. జనరల్ సీటు కావటంతో కీలకమైన నేతల చూపుంతా కొత్తగూడెంపైనే దృష్టి సారించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకే అధిష్టానం మరోసారి బీఆర్ఎస్ టికెట్ కట్టబెట్టింది. మరోవైపు కాంగ్రెస్ నుండి ఎడవల్లి క్నష్ణ, మాజీ ఎంఎల్సీ పోట్ల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి కచ్చితంగా పోటీ చేసేది, అందరిని సమన్వయం చేసుకుని నిలిచి గెలిచేది ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని తెలుస్తోంది. శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొదటి స్థానం కొత్తగూడెం అవుతుంది అని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగా చెబుతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం కావడంతో పల్లె ఓటర్లతో పాటు కొత్తగూడెం, పాల్వంచ లాంటి పట్టణాలు ఉండడంతో పట్టణ ఓటర్లు కూడా అధికంగానే ఉంటారు. సింగరేణి, కేటిపిఎస్, స్పాంజ్ ఐరన్, నవభారత్ లాంటి పరిశ్రమల ఉద్యోగులు ఎక్కువ శాతం పట్టణాల్లో నివసిస్తూ ఉంటారు. కాబట్టి కొత్తగూడెం, పాల్వంచ మండలాలు అత్యధికంగా ఓటింగ్ ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా పంచాయతీ పరంగా చూసుకుంటే సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం గ్రామపంచాయతీ ఓట్ల పరంగా ప్రభావితం చేస్తుంది. కిన్నెరసాని ప్రాజెక్టు అత్యంత రమణీయం.. కొత్తగూడెం నియోజకవర్గం ముఖ్యంగా అధిక బొగ్గునిక్షేపాలు కలిగి ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో సింగరేణికి సంబంధించి ప్రధాన కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అంతేకాకుండా నవభారత్, స్పాంజ్ ఐరన్, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు కూడా కొత్తగూడెం పాల్వంచ పట్టణాల్లో ఉన్నాయి. పర్యాటక పరంగా చూసుకుంటే పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు అత్యంత రమణీయంగా చుట్టూ కొండల మధ్య ఉంటుంది ఈ ప్రాజెక్టు ద్వారానే కొత్తగూడెం,పాల్వంచ పట్టణాలకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ.. గడచిన కొంతకాలంగా కొత్తగూడెంలో రాజకీయ పరిస్థితులు మారాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు కూడా కొత్తగూడెం నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. జీఎస్ఆర్ ట్రస్టు ద్వారా పలు కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన జలగం వెంకట్రావు తాను కూడా కేసీఆర్ వెంటే ఉంటూ పార్టీలో పనిచేస్తానని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో కొత్తగూడెంలో రాజకీయ పరిస్థితులు మరికొంత కాలంలో ఇంకా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. దాంతో ఎవరి క్యాడర్ని వాళ్లు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
ఆ ‘మూడు’పై కాంగ్రెస్ గురి.. లెక్క కుదిరిందా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ మూడు జనరల్ స్థానాలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. మూడు చోట్ల బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడానికి యాక్షన్ మొదలు పెట్టింది. ఇప్పటికే ఖమ్మంకు లెక్క కుదిరింది. ఇక వారికి కావాల్సింది కొత్తగూడెం, పాలేరులోనే.. దీంతో బీఆర్ఎస్లో ఉన్న ఆ రెండు నియోజకవర్గాల్లోని కీలక నేతలను హస్తం గూటికి చేర్చుకునేందుకు చర్చలు మొదలు పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంతకీ ఎవరు ఆ నేతలు.. చర్చలు ఎంత వరకు వచ్చాయి. కాంగ్రెస్ గురిపెట్టిన ఆ మూడు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాలు టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మొదలు పెట్టింది. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మూడు నియోజకర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అయితే ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని దింపడం దాదాపు ఖారారు అయినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన రెండు నియోజకవర్గాలైన పాలేరు, కొత్తగూడెంలో ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నా.. ఇంకా బలమైన అభ్యర్థుల కోసం వేచి చూస్తోంది. దీనిలో భాగంగానే పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్పించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలోకి వస్తే పాలేరు టికెట్ ఇస్తామని హమీ ఇస్తున్నారు. మరోవైపు తుమ్మల సైతం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పాలేరు నుంచి పోటీ చేయాల్సిందేనని డిసైడ్ అయిపోయారు. అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ కందాలకు టికెట్ ఇస్తే అప్పుడు తుమ్మల పార్టీలో ఉంటారా లేక ఆప్షన్ ఇస్తున్న కాంగ్రెస్‌లో జంప్ అవుతారా అన్నది క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుమ్మల మాత్రం పార్టీ మారే ఆలోచనలో లేకపోయిన అనుచరుల ఒత్తిడి ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్న టాక్ సైతం లోకల్‌గా వినిపిస్తుంది. మరోవైపు కొత్తగూడెం జనరల్ స్థానంలో సైతం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నంలో ఉంది. పార్టీలోకి వస్తే కొత్తగూడెం టికెట్ ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు జలగంతో సంప్రందిపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌తో జలగం చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని త్వరలోనే జలగం పార్టీ మార్పుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. అటు బీఆర్ఎస్ అధిష్టానం సైతం జలగంకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడంలేదు. అదే విషయంపై జలగంకు సైతం ఇటివలే ఒక క్లారిటీ వచ్చిందన్న ప్రచారం ఉంది. దీంతో జలగం ఏ సమయంలోనైన హస్తం గూటికి చేరిపోయే అవకాశాలు ఉన్నాయి. చదవండి: సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి! కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నట్లు జరిగితే ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఖమ్మం రాజకీయాలు మాత్రం హట్ హట్‌గా మారుతున్నాయనే చెప్పాలి. -
కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!
కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంలో నాలుగోసారి విజయం సాదించారు. గతంలో ఆయన 1989, 1999, 2004లలో గెలుపొందారు. ఈసారి ఆయన టిఆర్ఎస్ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావుపై 4139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాని ఆ తర్వాత వనమా కూడా టిఆర్ఎస్ లోకి మారిపోయారు. వనమాకు 81118 ఓట్లు రాగా, జలగం వెంకటరావుకు 76979 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎల్ ఎఫ్ అభ్యర్దిగా పోటీచేసిన యడవల్లి కృష్ణకు 5400 ఓట్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 2014లో టిఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక నేతగా జలగం వెంకట్రావు ఉన్నారు. కొత్తగూడెం నుంచి ఆయన ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి 26521 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. సత్తుపల్లిలో ఒకసారి గెలుపొందిన ఆయన తర్వాత పరిణామాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అనతరం టిఆర్ఎస్లో చేరి విజయం సాధించారు. ఇక్కడ టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన కోనేరు సత్యనారాయణకు 28363 ఓట్లు, సిపిఐ పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు 20,994 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన అడవల్లి కృష్ణకు 22989 ఓట్లు వచ్చాయి. వెంకటరావు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును ఓడిరచారు. 2018లో వనమా కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి జలగం వెంకటరావును ఓడిరచారు. తదుపరి టిఆర్ఎస్లోకి వనమా కూడా మారిపోయారు. వనమా నాలుగు సార్లు కొత్తగూడెంకు ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల నాటికి వై.ఎస్ క్యాబినెట్లో మంత్రిగా వనమా ఉన్నారు. ఆయన 1989, 1999, 2004లలో గెలుపొంది, 2009, 2014లలో ఓడిపోయారు. 2018లో గెలిచారు. కొత్తగూడెం నియోజకవర్గానికి కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, జనతా ఒకసారి, టిడిపి మూడుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి గెలు పొందింది. గతంలో ఉన్న పాల్వంచ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మూడుసార్లు గెలిస్తే, అవిభక్త సిపిఐ ఒకసారి గెలిచాయి. వనమా కొత్తగూడెంలో నాలుగుసార్లు గెలిస్తే, టిడిపి నేత కోనేరు నాగేశ్వరరావు మూడుసార్లు గెలిచారు. 2009లో సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు ఒకసారి గెలిచారు. ప్రముఖనేత చేకూరి కాశయ్య కొత్తగూడెంలో ఒకసారి, పాల్వంచలో ఒకసారి గెలిచారు. ఈయన జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. టిడిపి నేత కోనేరు నాగేశ్వరరావు కొంతకాలం ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో ఉన్నారు. కొత్తగూడెంలో ఎనిమిదిసార్లు కమ్మ సామాజికవర్గంం,నాలుగుసార్లు మున్నూరు కాపు, ఒకసారి వెలమ, ఒకసారి బ్రాహ్మణ సామాజికవర్గం గెలుపొందింది. వనమా వెంకటేశ్వరరావు మున్నూరు కాపువర్గానికి చెందినవారు. జలగం వెంకటరావు వెలమ సామాజికవర్గానికి చెందినవారు. కొత్తగూడెం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
జలగం రూటే సపరేటు !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జలగం కుటుంబానిది ప్రత్యేక స్థానం. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక రంగం పురోగతికి వెంగళరావు ఎంతో కృషి చేశారు. ఆయన వారసుడిగా జలగం వెంకట్రావు రాజకీయాల్లో ప్రవేశించారు. సమకాలీన నాయకులతో పోల్చితే వెంకట్రావు వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. మాటలు తక్కువ.. చేతలు ఎక్కువ అన్నట్టుగా ఉంటారాయన. ఎప్పుడూ ప్రశాంతంగానే.. ఎమ్మెల్యే పదవిలో ఉన్నా, ఓడిపోయినా వెంకట్రావు ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తారు. ఆవేశపూరిత ప్రంసగాలకు దూరంగా ఉంటారు. ప్రత్యర్థులు తనపై చేసే విమర్శలకు సైతం పెద్దగా స్పందించరు. ప్రజా స్వామ్యంలో అది వారి హక్కు అన్నట్టుగా ఉంటారు. అవసరమైతే తప్ప ప్రజలతో కలిసేందుకు కూడా సుముఖంగా ఉండరు. అనవసరంగా షో చేయడం ఎందుకని అనుచరులతో అంటుంటారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత క్యాంప్ ఆఫీసు కేంద్రంగా రాజకీయ వ్యూహాలు రచించిన సందర్భాలు తక్కువే. అయినా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని వెంకట్రావు కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకోగలిగారు. మాటలు తక్కువైనా పని చేయడంలో దిట్ట అనే నమ్మకాన్ని కల్పించారు. అందుకే జలగం ఉన్నా లేకున్నా ఆయన కోసం పని చేసే కార్యకర్తలను తయారు చేసుకోగలిగారు. ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి పనులు.. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలోనే కొత్తగూడెం భవిష్యత్ కోసం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. సింగరేణి బొగ్గు గనులు తగ్గుతున్న తరుణంలో ‘గూడెం’ ప్రాభవం తగ్గకుండా పనులు చేశారు. పోలీస్ బెటా లియన్, ఏకలవ్య పాఠశాల, ఇంగ్లిష్ మీడి యం స్కూల్, అక్షయపాత్ర భోజనం, మైక్రోసాఫ్ట్‌తో విద్యార్థులకు ట్యాబులు వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా రు. జిల్లాను టూరిజం హబ్‌గా చేసేందుకు సెంట్రల్ పార్క్, హరిత హోటల్, కిన్నెరసాని రిసార్ట్స్, కిన్నెరసాని హౌజ్‌బోట్ థీమ్‌లను తెర మీదకు తెచ్చారు. ఎయిర్‌పోర్టు విషయంలో కదలిక తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అంతేకాదు మూత పడిన స్పాంజ్ ఐరన్ కర్మాగారం రేపో మాపో పునఃప్రారంభం అవుతుంది అన్నంతగా పని చేశారు. వరంగల్, ఖమ్మం వంటి నగరాలకు దీటుగా కొత్తగూడెంలో పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మా ణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. పక్కా ప్రణాళికతో.. ఏ అంశాన్ని చేపట్టినా లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేయడం, ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకోవడం వెంకట్రావుకు వెన్నతోపెట్టిన విద్య. దీన్ని అన్ని విషయాల్లోనూ అమలు చేస్తుంటారు. ఎన్నికల అఫిడవిట్లో తెలిపిన అంశాలను మిగిలిన రాజకీయ నాయకులు చూసీ చూడనట్టుగా వదిలేస్తారు. కానీ జలగం అలా కాకుండా అందులోని అంశాలన్నీ పరిశీలించారు. చివరకు నీటి బిల్లు, ట్రాఫిక్ చలాన్ వంటి అంశాలనూ పక్కాగా పొందు పరిచి కేసు ఫైల్ చేశారు. చివరకు అనుకున్న ఫలితం సాధించారు. -
కలసిరాని మంత్రి పదవి... ఎమ్మెల్యేగా గెలిచినా తప్పని తలనొప్పులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వనమా వెంకటేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. ఆయన జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే మంత్రి పదవి రాక ముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా స్పష్టమైన విభజన రేఖ గీయొచ్చు. ప్రజల మధ్యే ఉంటూ.. పాల్వంచ పారిశ్రామికంగా ఎదుగుతున్న తరుణంలో వార్డు సభ్యుడిగా వనమా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రజల్లోనే ఉండేవారు. ప్రతిరోజూ ద్విచక్ర వాహనంపై పంచాయతీ పరిధిలో అన్ని వార్డులు, గ్రామాలకు వెళ్లి వచ్చేవారు. ఆ తర్వాత సర్పంచ్‌గా ఎన్నికై న వనమా చేస్తున్న కృషిని అప్పటి కలెక్టర్లు ఈమని పార్థసారధి, పీవీఆర్కే ప్రసాద్ మెచ్చుకున్నారు. ఆ రోజుల్లోనే మూడుసార్లు ఉత్తమ సర్పంచ్‌గా నాటి గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పరకాల శేషాచలం చే తులమీదుగా బంగారుపతకాలను అందుకున్నారు. ఆ తర్వాత అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రో త్సాహంతో చిన్న వయసులోనే భూ తనఖా (ల్యాండ్ మార్టిగేజ్) బ్యాంక్‌కు చైర్మన్‌గా ఎన్నికై ప్రతిభ చూపారు. 1989లో కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. రికార్డుస్థాయిలో ఇళ్ల మంజూరు.. పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు రికార్డు స్థాయిలో కొత్తగూడెం నియోజకవర్గానికే 18 వేల ఇళ్లు మంజూరు చేయించి రికార్డు సృష్టించారు. ఇది చూసి అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైతం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ మంత్రి వర్గంలో వైద్య విధాన పరిషత్ మంత్రిగా పని చేశారు. పాల్వంచ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశారు. నియోజకవర్గ ప్రజల తలలో నాలుకగా ఉంటూ వచ్చారు. మంత్రిగా పోటీ చేసి ఓటమి.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హోదాలో పోటీ చేసిన వనమా ఓడిపోయారు. ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా పోటీ చేయగా సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చేతిలో వనమా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వనమాకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. వరుసగా రెండు ఓటముల తర్వాత చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో 2018లో ఇవే తనకు చివరి ఎన్నికలంటటూ హస్తం గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికే కరోనా కారణంగా ప్రజల్లో ఎక్కువగా తిరగలేకపోయారు. ఆ వెంటనే వనమా కుమారుడు రాఘవపై పోలీస్ కేసులు నమోదు కావడం ఆయనకు ఇబ్బందులు తెచ్చింది. ఇటీవల కాలంలో కొత్తగూడెం టికెట్ కోసం గులాబీ పార్టీలోనే ఆశావహుల నుంచి పోటీ ఎక్కువైంది. తీవ్రమైన పోటీని తట్టుకుంటూ మరోసారి కొత్తగూడెం నుంచి కారు గుర్తుపై పోటీ చేసేది తానేనంటూ వనమా ధీమా ప్రకటించారు. ఈ తరుణంలో అనూహ్యంగా అనర్హత వేటుకు గురయ్యారు.