VEERAIAH
-
నాన్న మాటల్లోని జీవిత సత్యం.. బోధపడిన ప్రవీణ్ ఆనాటి నుంచి..
వీరయ్య ఒక పేదరైతు. తనకున్న రెండెకరాల పొలంలో రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్. కొడుకును బాగా చదివించి, వాడిని ఉన్నతస్థాయిలో చూడాలని వీరయ్య ఆశ. తనలా తన కొడుకు కష్టాలు పడకూడదు అనుకునేవాడు. చదువుకు తన పేదరికం అడ్డుకాకూడదని తల తాకట్టుపెట్టయినా కొడుకును చదివించాలని దృఢనిశ్చయానికి వచ్చాడు వీరయ్య. కొడుకును పట్నంలో మంచి బడిలో చేర్పించాడు. మొదటి సంవత్సరం బాగానే చదువుకుని మంచి మార్కులు సంపాదించాడు ప్రవీణ్. స్నేహితులు కూడా పెరిగారు.వాళ్లంతా చెప్పుల నుంచి బట్టల వరకు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులనే వాడేవారు. వారిని చూసి ప్రవీణ్ కూడా తనకూ అలాంటి బ్రాండెడ్ వస్తువులు కావాలని తండ్రిని వేధించసాగాడు. దానికి వీరయ్య ‘చూడు నాయనా.. వారు ధనవంతుల బిడ్డలు. ఎలాగైనా ఖర్చుపెట్టగలరు. నీ చదువుకే నా తలకు మించి ఖర్చుపెడుతున్నాను. మనకు అటువంటి కోరికలు మంచివికావు. మన స్థాయిని బట్టి మనం నడుచుకోవాలి’ అని నచ్చజెప్పాడు. అయినా కొడుకు చెవికెక్కించుకోలేదు. పైపెచ్చు స్నేహితుల తల్లిదండ్రులు.. వాళ్లకేది కావాలంటే అది కొనిస్తున్నారు, పుట్టినరోజులు బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. తనకు మాత్రం తన తండ్రి ఏ సరదా తీర్చడం లేదని అలిగాడు ప్రవీణ్. ఫలితంగా చదువు మీద దృష్టిపెట్టక వెనుకబడిపోయాడు.ఒకసారి.. దసరా సెలవులకు ప్రవీణ్ వాళ్ల అక్క పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారు. ఒకరోజు ఆ పిల్లలు మట్టితో బొమ్మరిల్లు కట్టి ఆడుకోసాగారు. ఆ ఇల్లు మీద సూట్‌కేసులు పెద్దపెద్ద బరువైన వస్తువులు పెడదామని చూసింది చిన్నమ్మాయి. పెద్దమ్మాయేమో ‘వద్దు.. మనం అలాచేస్తే బొమ్మరిల్లు కూలిపోతుంది’ అని వారించింది. అయినా చిన్నమ్మాయి వినకుండా ‘ఏమీ కాదు.. తాతగారింటి డాబా మీద పెద్దపెద్ద వస్తువులు పెట్టడం లేదా.. అలాగే ఈ ఇంట్లోనూ పెట్టుకోవచ్చు’ అంటూ మొండికేసింది. ఇదంతా గమనించిన ప్రవీణ్ ‘మీరు కట్టుకుంది బొమ్మరిలు.్ల ఇది ఆడుకోవడానికే కానీ వాడుకోవడానికి కాదు. అందుకే ఇది పెద్ద వస్తువులను మోయలేదు. తాతగారిల్లు రాళ్లు, ఇటుకలు, ఇనుముతో గట్టిగా కట్టినిల్లు. ఆ ఇల్లు మోసే బరువులను ఈ బొమ్మరిల్లు మోయలేదు. కావాలంటే నీకు బొమ్మ సూట్‌కేసులు, బ్యాగులు చేసిస్తాను చూడు..’ అని చెప్పాడు. చెప్పినట్టుగానే వెంటనే మట్టితో ఆ బొమ్మలను చేసిచ్చాడు కూడా! వాటిని చూసి చిన్నపిల్ల భలే ముచ్చటపడింది.ఈ తతంగమంతా చూసిన వీరయ్య.. కొడుకుని మెచ్చుకున్నాడు. తర్వాత కొడుకుతో ‘మన పేద బతుకులు కూడా బొమ్మరిల్లు లాంటివే. ఏమాత్రం బరువెక్కువైనా కూలిపోతాయి. మన స్థాయికి తగ్గట్టు నడుచుకోకపోతే చితికిపోతాం. ఆ చిన్నపిల్ల తెలియక మారాం చేసింది. నీవు తెలిసి తప్పటడుగులు వేస్తున్నావు’ అంటూ జ్ఞానదోయం చేశాడు. నాన్న మాటల్లోని జీవిత సత్యం బోధపడిన ప్రవీణ్ .. ఆనాటి నుంచి బుద్ధిగా చదువుకోసాడు. – జయరామ్ నాయుడు -
వీరయ్యకు పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీపీఎం పర్యవేక్ష ణ బాధ్యతలు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్యకు అప్పగించారు. రాష్ట్ర రాజధాని హై దరాబాద్‌లో ఉంటూ పార్టీని నడిపించాల్సిన బాధ్య తను ఆయనకు అప్పగిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9, 10 తేదీల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ సమావే శాలు జరిగాయి. ఆ భేటీల్లో ఈ నిర్ణయం తీసుకు న్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఏఐజీలో ఆయన చికిత్స పొందారు. ఆయనకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో రెండ్రోజులు జరిగిన పార్టీ సమావే శాలకు కూడా తమ్మినేని కొద్దిసేపు మాత్రమే హాజర య్యారు. కాగా తమ్మినేని సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వంలోనే వీరయ్య పనిచేయాలని స్ప ష్టం చేస్తూ రాష్ట్ర కమిటీ తీర్మానించింది. అవసరాన్ని బట్టి తమ్మినేని హైదరాబాద్‌లో, అలాగే ఖమ్మంలోనూ ఉంటారు. మూడు నెలల పాటు వీరయ్య ఈ బాధ్యతలు నిర్వర్తించాలని సీపీఎం నిర్ణయించింది. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీని నడిపించాల్సిన బాధ్యత వీరయ్యపై పడింది. ఈయన గతంలో ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా, నవ తెలంగాణ ఎడిటర్‌గా పనిచేశారు. రెండు ఎంపీ సీట్లలో పోటీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తమ్మినేని ఒక ప్రకటనలో తెలిపారు. స్ధానిక జిల్లా కమిటీలతో చర్చించిన అనంతరం త్వరలో సీట్లను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఏవో రెండింటిలో పోటీ చేయాలని సీపీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నేతల గురి ప్రధానంగా మహబూబాబాద్, భువనగిరి స్థానాలపై ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక స్థానమే ఇస్తాననడంతో పొత్తు కుదరలేదు. ఇక రెండ్రోజులు జరిగిన సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, లోక్‌సభ ఎన్నికలు, తదితర అంశాలపై సీపీఎం చర్చించింది. కాంగ్రెస్‌తో అవగాహన చేసుకొని ఉంటే సానుకూల ఫలితాలు వచ్చేవన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఒక స్థానంలో సీపీఐ పోటీ! సీపీఐ కనీసం ఒక లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికలకు మద్దతు కోరి ఎమ్మెల్సీలు లేదా రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించవచ్చని అనుకుంటున్నారు. 16న సమ్మెకు మద్దతు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌కు పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, ప్రజలంతా పాల్గొనాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు. -
భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి ఎవరిది పైచేయి ..?
భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గం భద్రాచలం గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో పొడెం వీరయ్య మూడోసారి విజయం సాదించారు .గతంలో ఆయన ములుగు నియోజకవర్గంలో 1999,2004లలో కాంగ్రెస్ ఐ పక్షాన గెలవగా,ఈసారి భద్రాచలం నుంచి విజయం సాదించడం విశేషం. ములుగు సీటును మరో నేత సీతక్కకు కేటాయించి వీరయ్యకు భద్రాచలం సీటు ఇవ్వగా ఇద్దరూ గెలిచారు. వీరయ్య తన సమీప టిఆర్ ఎస్ ప్రత్యర్ది తెల్లం వెంకటరావుపై 11785 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు.వీరయ్యకు 47746 ఓట్లు రాగా,వెంకటరావుకు 35961 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సిపిఎం పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి మిడియం బాబూరావుకు 12400 ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు భద్రాచలం సిపిఎం కంచుకోటగా ఉండేది. కాని వివిధ పరిణామాలలో ఆ పార్టీ బలహీనపడిపోయింది. భద్రాచలంలో 2014లో సిపిఎం నేత సున్నం రాజయ్య గెలుపొందారు. 2009లో ఆయన ఓటమి చెందినా, తిరిగి 2014లో తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఫణీశ్వరమ్మను 1815ఓట్ల తేడాతో ఓడిరచారు. రాజయ్య అంతకు ముందు రెండుసార్లు గెలిచారు. 2014లో తెలంగాణలో సిపిఎం పక్షాన గెలిచిన ఏకైక నేతగా కూడా ఈయన ఉన్నారు. 2018లో రాజయ్య పోటీచేయలేదు. 2009లో మిర్యాలగూడలో సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఒక్కరే గెలిచారు. 2014లో ఆయన ఓడిపోయారు. 2018లో సిపిఎంకు తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిద్యం లేకుండా పోయింది. భద్రాచలంలో 2014లో అప్పటి కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కుంజా సత్యవతి పరా జయం చెందారు. భద్రాచలం 1952, 55 ఎన్నికల వరకు ఆంధ్రప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోకి వెళ్ళింది. భద్రాచలం 52,55లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1952లో కెఎమ్‌పిపి గెలిస్తే, 1955లో సిపిఐ గెలిచింది. అయితే గెలిచిన వారిలో సీతారామయ్య ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పడంతో జరిగిన ఉప ఎన్నికలో పి.విరావు గెలిచారు. ఈ ఉప ఎన్నికతోపాటు మొత్తం నాలుగుసార్లు కాంగ్రెస్ గెలిచింది. సిపిఎం ఎనిమిదిసార్లు గెలిచింది. ఇక్కడ టిడిపి ఒకసారి కూడా గెలవలేదు. సిపిఎం నేతలు కుంజా బొజ్జి మూడుసార్లు, ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు, సున్నం రాజయ్య మూడుసార్లు గెలిచారు. సిపిఐ మాజీ ఎం.పి సోడే రామయ్య ఆ తర్వాత కాలంలో టిడిపిలో చేరి భద్రాచలంలో పోటీచేసినా ఓడిపోయారు. భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
‘గట్టు’ కోసం గొడ్డళ్లతో దాడి..
అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో భూ వివాదం భగ్గుమంది. రెండెకరాల భూమి గట్టు పంచాయితీ సోదరుల మధ్య చిచ్చురేపడంతో ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడి చేసుకోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మానాయికుంటకు చెందిన మార్త బుచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు వీరయ్య, సైదులు కుమారులు. గ్రామ శివారులో తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని సోదరులిద్దరూ చెరో ఎకరం పంచుకుని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గట్టు పంచాయితీ నడుస్తోంది. అరకతో అచ్చుతోలుతుండగా.. వీరయ్య తన కుమారుడు ప్రభాస్‌తో కలసి బుధవారం ఉద యం పొలంలో అరకతో అచ్చుతోలుతున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు సైదులు, తన కు మారుడు శేఖర్‌తో కలసి భూమి వ ద్దకు వెళ్లి వీరయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో నలుగురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుండగా సైదులు కుమారుడు శేఖర్ గొడ్డలితో పెదనాన్న కుమారుడు ప్రభాస్‌పై దాడి చేశాడు. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో సైదులు ఎడమచెయ్యి తెగిపోవడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు దాడిని అడ్డుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
ఆ ఊళ్లో అందరూ ‘లచ్చుమమ్మను చూసి నేర్చుకోవాలె’ అంటుంటారు
‘ఏ వయసులో అయినా సరే ఎవ్వరిపైనా ఆధారపడకూడదు’ అని టైలరింగ్ చేస్తూ తన రెక్కల కష్టం మీదే బతుకుతోంది 70 ఏళ్ల లచ్చుమమ్మ. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంధర్మారావు పేట గ్రామంలో ఉండే లచ్చుమమ్మ ఐదు దశాబ్దాలుగా పాత కాలం నాటి రవికల నుంచి నేటి మోడ్రన్ డ్రెస్సుల వరకు తన కుట్టుపనితనంతో మెప్పిస్తోంది. ఆ ఊళ్లో అందరూ ‘లచ్చుమమ్మను చూసి నేర్చుకోవాలె’ అని అంటుంటారు. ఏడు పదుల వయసులో కూడా లచ్చుమమ్మ ఆధునిక డిజైన్లలో బ్లౌజులు, డ్రెస్సులు కుట్టడం చూసి కాలానికి తగినట్టు పని తనాన్ని మెరుగుపరుచుకుంటుంది అని కూడా అంటుంటారు. యాబై ఏళ్లుగా అలుపెరగకుండా బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్న లచ్చుమమ్మ అసలు పేరు గజవాడి లక్ష్మి. ధర్మారావుపేట గ్రామంలో అందరూ లచ్చుమమ్మ అని పిలుస్తారు. లచ్చుమమ్మకు 14వ ఏట ధర్మరావుపేటకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిగింది. వాళ్లకు ఐదుగురు కూతుళ్లు. ఉన్న ఊళ్లో ఉన్నంతలో చదివించారు. వాళ్లను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి, అత్తవారిళ్లకు పంపించారు. వాళ్లకు పిల్లలు. లచ్చుమమ్మకు పన్నెండు మంది మనుమలు, మనుమరాళ్లు. వాళ్లు కూడా పెద్దోళ్లయ్యారు. నాటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ‘ఐదుగురు ఆడపిల్లల్ని పెంచి, పెళ్లిళ్లు చేయడం అంటే సవాలే..’ అంటూ తమ కష్టాన్ని వివరిస్తుంది. లచ్చుమమ్మ భర్త బాలవీరయ్య చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. భర్త కష్టానికి చేదోడుగా ఉంటుందని యాబై ఏళ్ల కిందటే లచ్చుమమ్మ సొంతంగా బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ ఊళ్లోకి ఇంకా టైలరింగ్ మిషన్లు రాలేదు. దాంతో బట్టలు కత్తిరించి సూదీదారంతోనే కుట్టేది. గ్రామంలో నాటి తరం మహిళలు ధరించే రవికలను బాగా కుడుతుందనే పేరు లచ్చుమమ్మకి. ఆడపిల్లలకు గౌన్లు, లంగా, జాకెట్లు కుట్టడమూ సొంతంగానే నేర్చుకుంది. అందరి ఇళ్లల్లోనూ ఆమె కుట్టిన బట్టలు ఉంటాయి. ఆధునిక డిజైన్లు సైతం లచ్చుమమ్మ చేతికుట్టు బాగుంటుందని చాలా మంది ఆమె దగ్గరే కుట్టించుకునేవారు. నిన్న మొన్నటి వాళ్లే కాదు, ఈ తరం అమ్మాయిలు కూడా లచ్చుమమ్మ దగ్గరకు వచ్చి బ్లౌజులు కుట్టించుకుంటారు. మొదట్లో సాదా రవిక కుట్టడానికి 30 పైసలు, గుండీల రవిక కుట్టడానికి 50 పైసలు తీసుకునేదట. ఇప్పుడు సాధారణ బ్లౌజ్‌కు రూ. 65, లైనింగ్ బ్లౌజ్‌కు రూ.130 తీసుకుంటుంది. ‘అప్పట్లో రోజుకు పది నుంచి ఇరవై దాకా బ్లౌజులు, గౌన్లు కుట్టేదాన్ని. పండుగల సీజన్లో అయితే రాత్రి, పగలు తేడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా రోజూ రెండు మూడు బ్లౌజులు కుడతా’ అని చెబుతోంది లచ్చుమమ్మ. పదేళ్ల క్రితం భర్త వీరయ్య చనిపోయాడు. ఇప్పుడు లచ్చుమమ్మ ఒక్కత్తే ఉంటుంది. తన పోషణార్థం కుట్టుపనినే నమ్ముకుంది. ఏళ్లుగా ఆమె దగ్గర రవికలు కుట్టించుకున్న నాటి తరం వాళ్లంతా ఇప్పటికీ లచ్చుమమ్మ దగ్గరికే వస్తుంటారు. వయసు మీద పడి, నెమ్మదిగా కుట్టినా చెప్పిన మాట ప్రకారం కుట్టి ఇస్తుందని నమ్మకం ఎక్కువ. ఏ సమయంలో ఆమె ఇంటికి వెళ్లినా.. కూర్చుని బట్టలు కత్తిరించడమో, లేదంటే మిషన్ మీద కుట్టడమో చేస్తూ కనిపిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. యాబై ఏళ్లుగా కుడుతున్నా.. పద్నాలుగేళ్ల వయసులో పెళ్లయ్యి ఈ ఇంటికి వచ్చా. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తరువాత కుటుంబ అవసరాల కోసం ఏదైనా పని చేయాలనుకున్నా. మా అమ్మ మాకు చిన్నప్పుడు చేతితోనే బట్టలు కుట్టేది. ఇంటి అవసరాలు పెరిగిన ప్పుడు నేను కూడా బట్టలు కుట్టాలని, చేతికుట్టుతో రవికలు కుట్టడం మొదలుపెట్టాను. ఒక్కొక్కరుగా రావడం మొదలై ఊళ్లో ఉన్న ఆడవాళ్లందరూ రవికలు కుట్టించుకునేవారు. ముప్పయి ఏళ్ల పాటు చేతికుట్టుతోనే కుట్టేదాన్ని. కుట్టు మిషన్లు వచ్చిన తరువాత ఓ మిషన్ తీసుకున్నా. కొన్ని రోజుల్లోనే మిషన్ కుట్టు నేర్చుకొని, సొంతంగానే కుట్టడం మొదలుపెట్టిన. పిల్లలు వద్దంటరు కానీ, చేతనైనన్ని రోజులు పనిచేసుకొని బతకాలి, ఎవరి మీదా ఆధారపడవద్దని ఈ పని వదలడం లేదు. – గజవాడ లక్ష్మి – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి -
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫేస్ టు ఫేస్ వార్నింగ్
-
Rega Kantha Rao Vs Podem Veeraiah: స్టేజీపైనే బాహాబాహీ.. నీకు మైండ్ ఉందా.. నువ్వు నోర్మూసుకో..!
దుమ్ముగూడెం: తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఒకరిపైకి ఒకరు దూసుకురావడంతో పాటు గల్లాలు పట్టుకునేందుకు రెడీ అయ్యారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో అక్కడే ఉన్న కలెక్టర్, ఎస్పీ, అటవీ అధికారులు సర్దిచెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడులో బుధవారం తునికాకు బోనస్ చెక్కుల పంపిణీకి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ కాంతారావు, ఎమ్మెల్యే వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ మూడో సారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని, రాబోయే ఎన్నికల్లో భద్రాచలం నుంచి గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థేనంటూ తన ప్రసంగం కొనసాగించారు. దీనికి వేదికపై ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య(కాంగ్రెస్) జోక్యం చేసుకుని ఇది ప్రభుత్వ కార్యక్రమమని..ఇక్కడ రాజకీయాలెందుకంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కాంతారావు మరింత దూకుడుగా ప్రసంగం కొనసాగిస్తూ ప్రతిపక్షాలనుద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రసంగం ముగించి తన సీట్లో కూర్చునే సమయంలోనూ ప్రభుత్వ పథకాల గురించి చెబుతుంటే బాధెందుకు అంటూ పోదెంను ఉద్దేశించి అన్నారు. ఇందుకు వీరయ్య ‘నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి ఇష్టం వచ్చి నట్టు మాట్లాడితే కుదరదంటూ’హెచ్చు స్వరంతో బదులిచ్చారు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నీకు మైండ్ ఉందా అంటూ పోదెం అనగా.. నువ్వు నోర్మూసుకో అంటూ విప్ అన్నారు. ఇలా అభ్యంతరకమైన పదాలతో దూషించుకుంటూనే ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. వేదికపై ప్రసంగించేందుకు సిద్ధమైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిశ్చేషు్టడై చూస్తుండిపోయారు. ఇద్దరూ భౌతికదాడులకు దిగే విధంగా పరిస్థితి నెలకొనడంతో అక్కడే ఉన్న కలెక్టర్ అనుదీప్, పీసీసీఎఫ్ డోబ్రియల్ కల్పించుకుని రేగా చేయి పట్టుకుని వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టగా ఎస్పీ వినీత్ ఎమ్మెల్యే పొదెంను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. -
Birthday Politics: ఆ బర్త్‌డే వేడుకల వెనుక రహస్యం ఏంటి?
ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పొలిటికల్ బర్త్‌డే పార్టీలు జోరందుకున్నాయి. రెండు పార్టీలు..ఇద్దరు గిరిజన నేతలు..మరో బీసీ నేత పుట్టిన రోజు వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించుకున్నారు. గిరిజన నేతలిద్దరూ స్వపక్షంలోనే ప్రతిపక్షంలా మారిపోయారు. సొంత పార్టీలోని ప్రత్యర్థులపై పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు గజమాలల బర్త్‌డే వేడుకల వెనుక రహస్యం ఏంటి? మానుకోటలో ఏం జరిగింది? పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లులో పార్టీల మధ్య..ఒకే పార్టీలోని ప్రత్యర్థుల మధ్య పోరు తీవ్రమవుతోంది. అంతర్గత విభేదాలతో రగిలిపోతున్న కొందరు నేతలు రాజకీయంగా పంతం నెగ్గించుకునేందుకు.. ఎదుటివారిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ సత్తా చాటేందుకు సరికొత్త వ్యూహాలతో జనంలోకి వెళ్తున్నారు. అవకాశం దొరికితే చాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు బర్త్ డే వేడుకలను వేదికగా చేసుకొని బలనిరూపణకు దిగుతున్నారు. మానుకోటలో అధికార పార్టీ ఎంపీ మాలోతు కవిత, ములుగు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య నిర్వహించిన బర్త్ డే వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇద్దరు నేతలు సృష్టించిన హంగామా చర్చనీయాంశంగా మారింది. చదవండి: (TS: కాంగ్రెస్‌లో ఎవరిగోల వారిదే.. ఠాక్రే ముందున్న సవాళ్లేంటీ?) గజమాల వెనక రాజకీయం పోటాపోటీ కార్యక్రమాలకు అధికార, విపక్ష పార్టీలనే తేడా లేదు. కొత్త సంవత్సరం తొలిరోజున మహబూబాబాద్ ఎంపీ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత పుట్టినరోజు. ఆరోజు కవిత, ఆమె అనుచరులు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. భారీ క్రేన్ సహాయంతో గజమాల వేసుకుని మానుకోటలో జనసందోహంతో ఊరేగింపు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అనుచరులతో రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. కవిత ఆమె అనుచరులు సృష్టించిన హంగామా వెనుక అసలు రాజకీయం వేరే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న కవిత సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే బర్త్ డే వేడుకలతో సత్తా చాటే ప్రయత్నం చేశారని ప్రచారం సాగుతోంది. రైతు దీక్ష, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎంపీ కవిత నుంచి మైక్ లాక్కుని అవమానపరిచేలా వ్యవహరించారు. ఈ వ్యవహారంతో రగిలిపోతున్న కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. నేనూ లైన్లో ఉన్నాను..! రాజకీయాల్లోకి వచ్చాక ఏనాడూ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోని భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ లో జనవరి 2న బర్త్ డే వేడుకలతో హంగామా చేశారు. భారీ క్రేన్ సహాయంతో గజమాల ధరించి వెంకటాపూర్‌లో ఊరేగింపు మొదలుపెట్టి నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో పర్యటించారు. పోదెం వీరయ్య పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన నిర్వహించుకున్న బర్త్‌డే వేడుకలు జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తున్నాయని అంటున్నారు. వీరయ్య హస్తానికి హ్మాండిచ్చి కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కారు ఎక్కడానికి సిద్ధమవుతున్న వీరయ్య, అక్కడా ఉంటా.. ఇక్కడ ఉంటా అంటున్నారట. భద్రాచలం, ములుగు రెండు నియోజకవర్గాలు తనవే అని నిరూపించుకునేందుకు బల ప్రదర్శన నిర్వహించినట్లు ప్రచారం సాగుతుంది. వీరయ్య వ్యూహమేంటీ? ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీతక్కకు చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన పోదెం వీరయ్యకు గులాబీ పార్టీ గాలం వేసినట్లు తెలుస్తుంది. ముందుగా సీతక్కనే గులాబీ గూటిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు యత్నించినప్పటికీ రేవంత్ రెడ్డి నమ్మిన బంటులా ఉన్న సీతక్క పార్టీ మారేందుకు ససేమిరా అనడంతో పోదెం వీరయ్యతో సీతక్కకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే వీరయ్య గులాబీ బాస్ ముందు కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్లో చేరి ములుగులో తాను పోటీలో నిలిచినా.. భద్రాచలంలో మాత్రం తాను సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నడు లేని విధంగా బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో ములుగు నియోజకవర్గంలో భారీ ఊరేగింపు నిర్వహించి అక్కడా ఉంటా.. ఇక్కడ ఉంటానని చాటి చెప్పినట్లు జనం భావిస్తున్నారు. వీరయ్య వ్యూహం జనానికి అవగతం అవుతున్నా.. గులాబీ బాస్ మదిలో ఏముందో తేట తెల్లం కావాలంటే మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. తగ్గేదేలే..! బర్త్ డే రాజకీయం ములుగు, మహబూబాబాద్‌లోనే కాదు అటు భూపాలపల్లిలో సైతం సాగుతోంది. మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బర్త్ డే సందర్భంగా ఇటీవల గ్రాండ్ గా వేడుకలు నిర్వహించి అనుచరుల్లో కొత్త ఊపును తీసుకొచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడమే లక్ష్యంగా చారీ సాబ్ బర్త్ డే పార్టీతో సత్తా చాటే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బర్త్ డే వేడుకలు.. విందు భోజనాలతో రాజకీయాలను మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓరుగల్లు నేతలు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఎన్నికల ఎత్తుగడలతో నాయకులంతా ముందుకు సాగుతున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కడవరకూ కాంగ్రెస్‌లోనే..: ఎమ్మెల్యే వీరయ్య
మణుగూరు టౌన్: బతికున్నంత కాలం తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టంచేశారు. మణుగూరులో శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ భద్రాచలం ప్రజలే తనకు దేవుళ్లని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం, దేశంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్లో బీజేపీ గెలిచినంత మాత్రాన ఆ ప్రభావం అంతటా ఉండదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘రాముడూ.. మేమెలా బతకాలిరా...’
సాక్షి, ఒంగోలు: మూడు కుటుంబాలకు జీవనాధారం ఆ గంగిరెద్దు. కుటుంబంలో ఒకరిగా ఉండే ఆ ఎద్దుకు ముద్దుగా వారు పెట్టుకున్న పేరు రాముడు. కాస్త గడ్డి వేస్తే తన కడుపు నింపుకొంటూ.. ఏడేళ్లుగా మూడు లంబాడీ కుటుంబాల ఆకలి తీరుస్తోంది. ఎవరు చెయ్యెత్తినా ఆగి విశ్వాసాన్ని ప్రదర్శించేది. అయితే ఏమైందోగానీ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో హఠాత్తుగా ‘రాముడు’ మరణించాడు. దీంతో యజమాని వీరయ్యతో పాటు మూడు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యారు. 33వ డివిజన్ కార్పొరేటర్ నియంతారెడ్డి, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి ద్వారా సమాచారం అందుకున్న పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జేడీ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాలిచ్చే జంతువులు చనిపోయినపుడు మాత్రమే పరిహారం అందుతుందన్నారు. అయితే ఎద్దు మరణంతో మూడు కుటుంబాలకు జీవనాధారం పోయిన నేపథ్యంలో పరిహారం వచ్చేందుకు కృషి చేస్తానని హాబీ ఇచ్చారు. గుండెపోటు వల్లే ఎద్దు మరణించిందని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. గంగిరెద్దు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ సిబ్బందికి కమిషనర్ వెంకటేశ్వరరావు సూచించారు. చదవండి: (Egg Prices: కొండెక్కిన కోడిగుడ్డు.. సామాన్యుల బెంబేలు) -
నూజివీడులో ఘోరం
నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో ఘోరం చోటుచేసుకుంది. జీవితాంతం తోడుండాల్సిన భర్తే, భార్య పాలిట యముడయ్యాడు. స్థానికంగా నివాసం ఉంటున్న వీరయ్య, తన భార్య సత్యవాణీని హత్య చేశాడు. చున్నీతో ఊపిరాడకుండా చేసి చంపాడు. అనంతరం ఆ చున్నీని అత్తమామల ముఖం మీద కొట్టి మీ కూతురిని చంపేశానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లుగా తెలిసింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన వీరయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
త్వరలో ఇండియాకు.. ‘ఎడారిలో బందీ’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దేశం కాని దేశంలో ఒంటెల యజమాని వద్ద బందీగా దుర్భర జీవితం గడుపుతున్న కరీంనగర్ జిల్లా వాసి పాలేటి వీరయ్య స్వదేశం రావడానికి మార్గం సుగమమైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామం నుంచి వీరయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. రియాద్‌లోని ఎడారిలో ఒంటెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒంటెల యజమాని పెట్టే బాధలను తాళలేక పోయాడు. ఎలాగోలా తాను పడుతున్న బాధలను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశాడు. ఈ మేరకు గురువారం ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఎడారిలో బందీ’శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది. వీరయ్య పడుతున్న బాధలను తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తక్షణం స్పందించారు. వీరయ్య సమస్యను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సుష్మాస్వరాజ్ సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. వీరయ్య ఆచూకీ తెలుసుకొని ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం వేగంగా స్పందించింది. వీరయ్య ఎక్కడ ఉన్నాడో గంటల్లోనే పూర్తి సమాచారాన్ని సేకరించింది. రియాద్ ఎంబసీ కార్యాలయంలో హైదరాబాద్ వాసి ఉండటంతో వీరయ్య ఆచూకీ తెలుసుకోవడం సులభమైంది. ఈ మేరకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ ద్వారా కేటీఆర్, ప్రశాంత్ పటేల్, దేశ్‌రాజ్‌కుమార్ తదితర 9 మందికి సమాధానం ఇస్తూ ట్వీట్ చేసింది. వీరయ్య ఇండియా వెళ్లడానికి ఎగ్జిట్ వీసా కూడా సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. వీరయ్య రాకపై కేటీఆర్ హర్షం సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలో కష్టాలు పడుతున్న వీరయ్య సొంత ఇంటికి చేరుతుండటంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వీరయ్య భారత్‌కు వచ్చేందుకు సహకరించిన రియాద్‌లోని భారత రాయబారి, నగరానికి చెందిన ఆసఫ్ సయీద్‌తోపాటు ఎంబసీ అధికారులకు ట్విట్టర్లో కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా వీరయ్య కోసం ఆయన కుటుంబసభ్యులు బుధవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బృం దంలో ఒకరిగా తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న భారతరత్న అబ్దుల్ కలాం స్మారకాన్ని సందర్శించినట్లు కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. -
ఎడారిలో బందీ
అల్గునూర్: ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్ బాట పట్టిన కరీంనగర్ వాసి ఒకరు దేశం కాని దేశంలో బందీగామారి నరకయాతన అనుభవిస్తున్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య ఏజెంట్ చేసిన మోసం.. యజమాని (కఫిల్) కర్కశత్వంతో సౌదీలో బందీ అయ్యాడు. వీరయ్యకు భార్య, ఇద్దరు కుమా రులున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడం తో భార్య, బిడ్డలను వదిలి గల్ఫ్ వెళ్లాడు. రెండేళ్లుగా యజమాని చెప్పిన పనులు చేస్తున్నాడు. అయితే.. ఇటీవల వీరయ్య తల్లి చనిపోయింది. దీంతో ఊరికి వెళ్తానని బతిమాలుకున్నా షేక్ పంపించలేదు సరికదా వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు తన ఆవేదనను.. అక్కడ పడుతున్నకష్టాలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి వెల్లడించాడు. ఉపాధి నిమిత్తం గతంలో ఖతార్ వెళ్లిన వీరయ్య.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి వచ్చాడు. తర్వాత కూడా సొంతూల్లో పనేమీ దొరక్కపోవడంతో సుమారు రూ.1.50 లక్షలు అప్పు చేసి రెండేళ్ల క్రితం మళ్లీ గల్ఫ్ ఏజెంట్ యాదగిరి ద్వారా చిగురుమామిడికి చెందిన తిరుపతితో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు. వ్యవసాయం అని చెప్పిన ఏజెంట్ వీరయ్య, తిరుపతి గల్ఫ్ వెళ్లేందుకు చిగురుమామిడి మండలం ఓగులాపూర్‌కు చెందిన ఏజెంట్ యాదగిరిని సంప్రదించారు. దీంతో ఆయన పని ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. సౌదీ అరేబియాలో ఖర్జూర తోట లు చూసుకోవాలని తెలిపాడు. దీనికి అంగీకరించిన వీరిద్దరి వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్ల క్రితం తనతోపాటు ఇద్దరినీ సౌదీకి తీసుకెళ్లాడు. అక్కడకి వెళ్లిన తర్వాత షేక్ ఇద్దరినీ అబుదాబికీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖాకా ప్రాంతంలో సుమా రు వంద ఒంటెలకు కాపలా ఉండాలని, వాటి బాగోగులు చూసుకోవాలని ఆదేశించారు. ఇందుకు నెలకు రూ.20 వేలు ఇస్తానని చెప్పాడు. లక్షన్నర అప్పు చేసి సౌదీ వెళ్లిన ఇద్దరూ ఇండియాకు తిరిగి రాలేక షేక్ చెప్పిన పనికి అంగీకరించారు. రెండేళ్లుగా ఒంటెల బాగోగులు చూసుకుంటున్నారు. షేక్ ఎప్పుడు టిఫి న్ పంపిస్తే అప్పుడే తింటుండేవారు. ఎంత కష్టమైనా వీసా గడువు ముగిసేవరకు పని చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ కూడా బాగానే ఉంటున్నామని చెప్పేవారు. తల్లికి కొరివిపెట్టేందుకు రాలేక.. వీరయ్య తల్లి వీరమ్మ 45 రోజుల క్రితం స్వగ్రామం మక్తపల్లిలో చనిపోయింది. కుటుంబసభ్యులు ఫోన్ లో వీరయ్యకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని వీరయ్య తన షేక్‌కు వెళ్లి చెప్పాడు. తన తల్లికి తలకొరివి పెట్టాలని, ఇండియా పంపించాలని వేడుకున్నాడు. షేక్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నా డు. దీంతో వీరయ్య తల్లి కోసం ఇండియా వెళ్లాలని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వీసా గడువు కూడా దగ్గర పడుతుందని తెలిపాడు. తనను షేక్ ఇంటికి పంపించడంలేదని తన ఆవేదనను ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. వీరయ్య వస్తాడని కుటుంబ సభ్యులు రెండు రోజులు వీరమ్మకు అంత్యక్రియలు నిర్వహించకుం డా ఎదురు చూశారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు షేక్‌ను పిలిపించి ఇండియా పంపాలని సూచించారు. పది రోజుల్లో పంపిస్తానని ఆ షేక్ పోలీసుల ముందు అంగీకరించాడు. ఒంటె చనిపోయిందని దాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే వీరయ్య కాపలా ఉండేచోట ఓ ఒంటె చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న షేక్ వీరయ్యపై దాడి చేశాడు. ఒంటె నిర్లక్ష్యంతోనే చనిపోయిందని పళ్లు రాలిపోయేంతలా తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని కూడా వీరయ్య తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనను ఇండియా పంపేందుకు షేక్ అంగీకరించడంలేదని, ఒంటె చనిపోతే తనపై దాడి చేశాడని అం దులో తెలిపాడు. వీరయ్య సెల్ఫీ వీడియో విషయం తెలవడంతో ఆగ్రహించిన షేక్ వెంటనే వీరయ్య సెల్‌ఫోన్ లాక్కున్నాడు. ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. దీంతో నెల రోజులుగా కుటుంబ సభ్యులతో కూడా వీరయ్య మాట్లాడడంలేదు. ఈ క్రమంలో వీరయ్య గతంలో సోషల్ మీడియాలో చేసిన సెల్ఫీ వీడియో పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వీరయ్యను కాపాడాలంటూ.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర మంత్రి మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరయ్య వీడియో చూసిన పలువురు దానిని షేర్ చేయడంతో ఈ విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్లింది. అధికారులు వీరయ్య కుటుంబం గురించి తెలుసుకుని కొడుకు హరీశ్‌కు ఫోన్ చేశారు. వివరాలు తెలుసుకున్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా సౌదీలోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. వీరయ్యను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భారత దౌత్య కార్యాలయం అధికారులు బాధితుడితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. వీరయ్యనుంచి స్పందన రాలేదు. కాగా.. వీరయ్య ఆచూకీ కనుక్కునేందుకు సహకరించాలని సౌదీలోని ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మా నాన్నను తీసుకురండి.. ప్లీజ్! మా నాన్న ఏజెంట్‌ను నమ్మి సౌదీఅరేబియా వెళ్లాడు. వీసా గడువు కూడా రెండేళ్లే. గడువు ముగిసి ఇప్పటికే నెల రోజులైంది. అయినా ఇండియాకు పంపేందుకు షేక్ నిరాకరిస్తున్నాడు. ఈ విషయాన్ని తిరుపతి ఫోన్ నుంచి మాకు ఫోన్ చేసి చెప్పాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మా నాన్నను ఎలాగైనా ఇండియాకు క్షేమంగా తీసుకురావాలి. నెల రోజులుగా మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎలా ఉన్నాడో తెలియదు. రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. – హరీశ్, వీరయ్య కొడుకు, మక్తపల్లి -
కారెక్కుతున్న మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అయిదు నెలలు అవుతున్నా టీఆర్ఎస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సగం ఖాళీ అవగా...తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో కారెక్కనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 24న వీరంతా టీఆర్‌ఎస్‌లోచేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. తాజా చేరికలతో తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. ఈ ముగ్గురు చేరికతో ఇక కాంగ్రెస్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా చేరికలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104కు చేరనుంది. -
కథువా ఘటనలో రాజకీయ కోణం
దేశంలో గతంలో మహిళలపై అత్యాచారాలు, దళితులపై హత్యాయత్నాలు జరిగాయి కానీ ఒక పథకం ప్రకారం, నిర్దిష్ట రాజకీయ లక్ష్యం కోసం, భయోత్పాత వాతావరణాన్ని కల్పించటం కోసం జరగటం ఇటీవలే చూస్తున్నాం. గతంలో సామాజిక అవలక్షణాల్లో భాగంగా ఇటువంటి దురాగతాలు జరిగేవి. కేంద్రంలో అధికారానికి వచ్చిన కొత్తలో మోదీ హరియాణాలో జరిగిన ఒక ర్యాలీలో ఆడపిల్లలను బతికించండి, చదివించండి అన్న పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే హరియాణా ఖాప్ పంచాయత్ పేరుతో మహిళలపై సాగించే అకృత్యాలకు కేంద్రంగా మారిన సమయంలో ఆడపిల్ల లను రక్షించే కార్యక్రమ ప్రారంభానికి హరి యాణాను కేంద్రంగా చేసుకోవటం ద్వారా ప్రజల దృష్టినాకర్షించింది బీజేపీ. కానీ ఈ కొత్త మురిపెం ఎంతో కాలం నిలవలేదు. రానురానూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు కనీస భద్రత కూడా కరువవుతూ వచ్చింది. కథువా బాలిక ఉదంతం ప్రాధమిక హక్కులను సైతం స్వమతం అన్యమతం అని చీల్చి అమలు జరిపేబీజేపీ పరిపాలనా తీరుకు నిదర్శనంగా నిలిచిపోతుంది. జమ్ము కశ్మీర్ నేడు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే కథువా బాలిక అత్యాచార సంఘటనకు కేంద్రమైంది. ప్రపంచ దేశాల ముందు భారతదేశం సిగ్గుతో తలొంచుకునేలా జరిగిన కథువా బాలిక బలాత్కారం, హత్య నుండి దేశం ఇంకా కోలుకోలేదు. మరింత హేయమైన చర్య ఏమిటంటే ఈ బలాత్కారానికి, హత్యకు స్థానిక దేవాలయాన్ని కేంద్రంగా చేసుకోవటం.. చివరకు ఈ హేయమైన ఘటనకు కారణమైన వారిని చట్టం శిక్షించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కార్యాలయం కూడా డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. దేశంలో గతంలో మహిళలపై అత్యాచారాలు, దళితులపై హత్యాయత్నాలు జరిగాయి కానీ ఒక పథకం ప్రకారం, నిర్దిష్ట రాజకీయ లక్ష్యం కోసం, భయోత్పాత వాతావరణాన్ని కల్పించటం కోసం జరగటం గత మూడు నాలుగేళ్లల్లోనే చూస్తున్నాము. గతంలో సామాజిక అవలక్షణాల్లో భాగంగా ఇటువంటి దురాగతాలు అడపాదడపా జరిగేవి. కానీ ఇప్పుడు ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి. గతంలో అటువంటి దురాగతాలకు పాల్పడిన వ్యక్తులను సమాజం చీదరించుకునేది. సాధ్యమైతే వెలివేసేది. లేదా చట్టం పరిధిలో శిక్షించేది. అటువంటి ఆగంతకులు రాజకీయ పార్టీలకు చెందిన వారైతే ప్రజల నుండి ఎక్కడ దూరమవుతామో అనే వెరపుతో బహిష్కరించేవి. కానీ ఇప్పుడు జరుగుతుంది దీనికి భిన్నం. మంత్రులు, ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు, చట్టాన్ని కాపాడాల్సిన న్యాయవాదులు మొత్తంగా రేపిస్టులకు అండగా నిలుస్తున్నారు. కథువా సంఘటనలో దోషులైన వారికి అండగా నిలవటానికి ఏకంగా సంకీర్ణ ప్రభుత్వం నుండి బయటకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎందువల్ల?ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఆరెస్సెస్ అవగాహనలో, విస్తరణ వ్యూహంలో, ప్రజలను నిట్టనిలువునా చీల్చటంలో మహిళలపై అత్యాచారం కూడా ఒక సాధనంగా ఎలా మారిందో తెలుసుకోవాలి. కథువా సమీప గ్రామాల్లో సంచార తెగలకు చెందిన ముస్లింలు నివశిస్తున్నారు. వీరిని ఆ ప్రాంతం నుండి శాశ్వతంగా పారదోలటానికి, ఈ గ్రామాలన్నీ ఆక్రమించుకోవటానికి అభం శుభం తెలీని పాప తేలికైన లక్ష్యంగా మారిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఖలేజా సినిమా కథకు కథువా ఘటన వెనకున్న లక్ష్యానికి మధ్య తేడా లేదు. ‘భారతదేశ చరిత్రలో ఆరు మహత్తర అధ్యాయాలు’ అన్న సావర్కార్ రచనను చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. ముస్లిం రాజులు ఆ రోజుల్లో హిందూ మహిళల మానప్రాణాలు తీశారు. ‘‘హిందువులు పూర్తి స్థాయి అధికారాన్ని సంపాదిస్తే ముస్లిం మహిళలకు కూడా అదే శాస్తి జరుగుతుందని వారికి అర్థం అవ్వాలి. అప్పుడు కానీ హిందు మహిళల జోలికి రాకుండా ఉండరు’’ అని అందులో ఆయన వివరిస్తారు. ఆరెస్సెస్ కార్యకర్తలు సావర్కార్ మాట జవదాటరన్న విషయం తెలిసిందే. కథువా అఘాయిత్యాన్ని ఈ కోణంలో చూస్తే తప్ప దేశంలో ముస్లింలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలు, చీకటి జీవితాల్లోకి నెట్టడం వంటి పరిణామాల లక్ష్యం ఏమిటో అర్థం కాదు. అంతేకాదు. హిందూ రాజులు నాటి నుంచీ ఇటువంటి వ్యూహాన్ని అనుసరించి ఉంటే ముస్లింలు హిందూ మహిళలవైపు కన్నెల్తైనా చూసేవారు కాదు అని కూడా నిర్ధారణకొచ్చాడు. ముస్లిం మహిళల పట్ల ఏ రకమైన సౌభ్రాతృత్వాన్నయినా సరే ప్రదర్శించాలని ప్రయత్నించి వారిపై అత్యాచారాలకు పాల్పడకుండా వదిలేస్తే అది ఇస్లాం మతం స్వీకరిం చినంత పాపం అని కూడా హెచ్చరిస్తాడు సావర్కార్. లవ్ జీహాద్ అసలు లక్ష్యం ఏమిటో ఈ వాక్యాలు చదివితే అర్థమవుతుంది. సావర్కారే ఆరాధ్యదేవుడుగా మారిన ఆరెస్సెస్ కార్యకర్తల చేతుల్లో గుజరాత్లో, ముజఫర్‌నగర్‌లో ఎంత మంది మహిళలు మాన ప్రాణాలు కోల్పోయారో తేల్చేందుకు కేంద్రం సాహసిస్తుందా? సావర్కార్‌ను, ఆయన ఆలోచనలను, వాటిని ఆచరించేవారిని ఈ దేశం నుండి బహిష్కరించకుండా, వారికి చట్టబద్ధత కల్పించే రాజ్యాధికారం నుండి దూరం చేయకుండా దేశంలో హిందూయేతర మహిళల మానప్రాణాల భద్రతకు హామీ ఇవ్వటం సాధ్యం కాదు. వేరుకు పుట్టిన చెదలు కొమ్మలు నరికితే పోదు. వేళ్లతో సహా చెట్టును పీకేస్తేనే పోతుంది. కొండూరి వీరయ్య వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ 98717 94037 -
ఫ్రంట్‌తోనే ఆధిపత్యానికి చెక్!
సందర్భం కేంద్రం లేదా జాతీయ పాలక పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేయటానికి సిద్ధపడే ఏ కూటమైనా.. ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్న ఆర్థిక స్వాతంత్య్రం సార్వభౌమత్వాన్ని ఎజెండాగా మార్చకపోతే ఫలవంతం కాదు. రాజకీయాలు కూడా ఉపాంత ప్రయోజనం సూత్రానికి అతీతం కాదన్న విషయం గత నాలుగేళ్లుగా సాగుతున్న మోదీ పర్వం చూస్తే అర్థమవుతుంది. 2014లో కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో అధికారానికి వచ్చిన బీజేపీ నేడు ప్రతిపక్ష ముక్త భారత్ నినాదమిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విధానపరంగా చూసినపుడు బీజేపీకి నికరమైన ప్రతిపక్షంగా ఉన్నది వామపక్షం మాత్రమే. సాధారణ ప్రతిపక్షాలను ఎదుర్కోవటానికి అనుసరించే వ్యూహానికి విధానపరమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటానికి అనుసరించే వ్యూహానికి మధ్య తేడా ఉంటుంది. అందుకే బీజేపీ మోదీ నేతృత్వంలో ముప్పేట వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొదటి వ్యూహం కాంగ్రెస్ తిరిగి కోలుకోకుండా చేసే ప్రయత్నం. రెండో వ్యూహం విధానపరమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వామపక్షాల పాత్రను కుదించే యత్నం. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఆరెస్సెస్‌లు అనుసరించిన వ్యూహం ఈ కోవకే వస్తుంది. మూడోది అవసరమైన మిత్రులను కూడదీసుకుని, అవసరం లేని మిత్రులను సాగనంపే వ్యూహం. తాజాగా చర్చనీయాంశమవుతోంది ఈ మూడో వ్యూహమే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల సంఖ్యాబలం సమకూరటంతో సంకీర్ణ రాజకీయాలకు తెరపడనున్నదా అన్న ప్రశ్నను ముందుకు తెచ్చారు. నాలుగేళ్లు గడిచాక తిరిగి దేశం ఆ ప్రశ్నను గుర్తు తెచ్చుకొంటోంది. పార్లమెంట్లో ఉన్న సంఖ్యాబలం పొందికను పరిశీలిస్తే గత పాతికేళ్లుగా ప్రాంతీయ పార్టీలు కనీసం సగం స్థానాలు గెల్చుకుంటూ వచ్చాయి. దేశవ్యాప్తంగా పోటీ చేసే కాంగ్రెస్ బీజేపీలు ఉమ్మడిగా సగం స్థానాలకు మాత్రమే పరిమితమ వుతూ వచ్చాయి. బీజేపీ తన రాజకీయాధిపత్యాన్ని కొనసాగించుకోవాలంటే ప్రాతీయ పార్టీల కోటలకు గండి కొట్టకుండా సాధ్యంకాదు. ప్రతిపక్ష రహిత పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. గత మూడేళ్లుగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల బీజేపీ అనుసరించిన వైఖరి, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని (దుర్) వినియోగిస్తున్న తీరు గమనిస్తే రాజకీయ రంగంలో బీజేపీ అనుసరిస్తున్న పెత్తందారీ పోకడలు ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ అథారిటేరియనిజంకి వ్యతిరేకంగా నాటి ప్రతిపక్షాలు జట్టుకట్టాయి. భారత రాజకీయాల్లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంగా గుర్తింపు పొందింది. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం సాగించే రాజకీయ పోరాటం రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న వ్యూహంతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల హక్కుల కోసం వివిధ రాష్ట్రాలు గొంతెత్తుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి నడుం కడితే రాష్ట్రాల ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల పరిరక్షణ నినాదం ముందుకొచ్చినపుడు గత మూడు దశాబ్దాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయం వెతక్కుండా రాష్ట్రాల హక్కులు పరిరక్షించుకోవటం సాధ్యం కాదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం నేపథ్యంలోనే రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సంఘటితం చేస్తూ సర్కారియా కమిషన్ తెరమీదకు వచ్చింది. అది కల్పించిన ప్రత్యేకతలన్నీ ఆర్థిక విధానాల నేపథ్యంలో కుదించుకుపోతూ వచ్చాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నియమించే ఆర్థిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక ద్రవ్య సంబంధాలను ఉదారవాద విధానాల చట్రం పరిధి దాటిపోకుండా చూస్తున్నాయి. రాష్ట్రాల హక్కుల కోసం, కేంద్రం లేదా జాతీయ పాలక పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేయటానికి సిద్ధపడే ఏ కూటమైనా.. ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్న ఆర్థిక స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని ఎజెండాగా మార్చకపోతే ఫలవంతం కాదు. ప్రాంతీయ పార్టీల కూటమి గానీ లేదా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ గానీ రాజ్యాంగ స్ఫూర్తి, కేంద్ర ప్రభుత్వాల పెత్తందారీ పోకడలు, లౌకికతత్వ పరిరక్షణ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక స్వావలంబన విధానాలు అమలు జరపగలిగే స్వేచ్ఛ, అంతిమంగా రాజ్యాంగంలోని సమాఖ్యస్ఫూర్తి పరిరక్షణ లక్ష్యాలుగా పెట్టుకోవాలి. బీజేపీ పెత్తందారీ పోకడలను నిలువరించటమే నేటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం లక్ష్యంగా మారాలి. - కొండూరి వీరయ్య వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ 98717 94037 -
బడ్జెట్ ఓ కురవని మేఘం
గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్ర బడ్జెట్లో నాలుగు శాతం నామమాత్రపు కేటాయింపులు చేశారు. వీటితో ఆరున్నర లక్షల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అంటే 21వ శతాబ్దపు మయసభను ఊహించుకోవటం తప్ప మరో మార్గం లేదు. గత మూడేళ్లుగా గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న దుర్భిక్షం నేపథ్యంలో 2018 బడ్జెట్ గ్రామీణ ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తుందని భావించారు. బడ్జెట్ ఉపన్యాసం కూడా అదే ధోరణిని ధ్వనించింది. అయితే ఆర్థికమంత్రి చూస్తున్న గ్రామీణ భారతం, ప్రజలనుభవిస్తున్న గ్రామీణ భారతం ఒక్కటేనా అన్నది ఇప్పుడు మనముందున్న సమస్య. గత 3 బడ్జెట్లలో మాట వరుసకన్నా ఉపాధి, నైపుణ్యం, గ్రామీణ ఉపాధి, ఉత్పత్తి వంటి పదాలు వినిపించాయి. ఈ బడ్జెట్లో అవి కూడా కరువయ్యాయి. గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య బీమా ఈ బడ్జెట్ ప్రాధాన్యతలుగా ముందుకొచ్చాయి. 2008 బడ్జెట్లో యూపీఏ ప్రతిపాదించిన రుణమాఫీ పథకం 2009 ఎన్నికల్లో ఫలితాన్నిచ్చినట్లుగా ఈ ఆరోగ్యబీమా ఎన్డీయేకు 2019లో అచ్చొస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ రెండు పథకాల మధ్య మౌలికమైన తేడా ఉంది. రైతు రుణమాఫీ పథకం ఎన్ని పరిమితులతోనైనా రైతుల చేతుల్లో రొక్కం మిగి ల్చింది. కానీ మోదీ ప్రభుత్వ ఆరోగ్యబీమా పథకం కార్పొరేట్ ఆసుపత్రుల ఖజానాను నింపే పథకమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యబీమా పథకాన్ని ముందుకు తేవటంతో 2014 ఎన్నికల్లో గ్రామీణ ప్రజల ఆదాయాలు రెట్టింపు చేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, అవినీతిని అంతమొందిస్తామని బీజేపీ వాగ్దానాలు నీటిమీద రాతలయ్యాయన్న అంగీకరించినట్లైంది. విత్తనాలు వేయటానికి ముందు రైతు ఆకాశంలో కనపడే ప్రతి మేఘమూ కురవటానికే వచ్చిందా అన్నట్లు చూస్తాడు. మోదీ మాయాజాలం కూడా ప్రజలకు కురవని మేఘాలు చూపించి కాలక్షేపం చేస్తోంది. బడ్జెట్ ప్రసంగానికి, కేటాయింపులకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోటానికి ఒక్క గ్రామీణ మౌలిక రంగం గురించి ప్రస్తావనను చూస్తే సరిపోతుంది. గ్రామీణాభివృద్ధికి క్లస్టర్ విధానాన్ని అనుసరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే పాతిక ముప్పై గ్రామాలకు ఉపయోగపడేలా మౌలికసదుపాయాల కల్పన వ్యూహం. కానీ గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయింపులు 4 శాతానికి మించి పెరగలేదు. మరి ఆరున్నర లక్షల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించటం అంటే 21వ శతాబ్దపు మయసభను ఊహించుకోవటం తప్ప మరో మార్గం లేదు. ప్రభుత్వానికి ప్రాణప్రదమైన పథకాలు స్వచ్ఛభారత్ అభియాన్, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన, ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయి. ఆవాస్ యోజన కేటాయింపులు 9 శాతం తగ్గితే ఉపాధి హామీ కేటాయింపులు యథాతథంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు రెండు కోట్ల పాయఖానాలు, యాభై లక్షల నివాసాలు నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించింది. కానీ కేటాయింపులు తగ్గట్టుగా లేవు. ఒక్క ఏపీలోనే 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని డిసెంబరులో హూంకరించిన టీడీపీ తన విజ్ఞప్తిని కనీసం ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం కూడా చేయకపోవటం గమనిస్తే రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల ఆగ్రహావేశాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నమే తప్ప మరోటి కాదని తేటతెల్లమవుతుంది. ఇక ఆరోగ్య బీమా పథకంపై ఆర్థిక మంత్రి ప్రకటన రెండు కీలక అంశాలు చర్చకు పెడుతోంది. మొదటిది దేశంలో పేదలెందరు అన్న ప్రశ్న. దావోస్ మొదలు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, ప్రపంచ వాణిజ్య సంస్థలకిచ్చిన లెక్కల్లో దేశ జనాభాలో పేదలు 20 శాతంలోపే అన్న వాదన వినిపించిన ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న యాభై కోట్ల ప్రజానీకం కోసం ఆరోగ్య బీమా పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఏది మోసం, ఏది వాస్తవం అన్నది ప్రజలే నిర్ణయిం చుకోవాలి. పైగా 2008లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు (ఆరెస్బీవై) నేడు మోదీ రంగు మార్చి చెప్పుకుంటున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకానికి మధ్య పేర్లలో తప్ప తేడా లేదు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పదుల కొద్దీ పథకాలకు పేర్లు మార్చటం తప్ప మోదీ గ్రామీణ ప్రజలకు కొత్తగా ఇచ్చిన వరాలు ఏమీ లేవు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు పునాది నాటి ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఆరెస్బీవై అమలు కొన్ని రాష్ట్రాల్లో తప్ప విజయవంతం కాలేదు. ప్రజల్లో ఈ పథకం, దాని ప్రయోజనం పట్ల సరైన అవగాహన లేకపోవటం ఒక కారణమైతే ప్రాథమిక వైద్యసేవలను పటిష్టం చేయకపోవటం మరో కారణం. చివరిగా 2018 బడ్జెట్లో ప్రతిపాదించిన ఆరోగ్యబీమా పథకం నేరుగా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరవేయటం కాకుండా బీమా కంపెనీల ద్వారా చేరవేయటానికి సంకల్పించింది. నేరుగా అందించాల్సిన సేవల విషయంలోనే ప్రభుత్వ వైఫల్యం బట్టబయలవుతుంటే మార్కెట్ నియంత్రిత సేవలు ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కల్గిస్తాయని నమ్మటం ఎలా? ప్రైవేటు వైద్య, ఇంజ నీరింగ్ కళాశాలలనే నియంత్రించలేని మనదేశంలో లక్షల కోట్ల రూపాయలతో కూడిన ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలను నియంత్రించి ప్రజల ఆరోగ్యానికి బీమా హామీ కల్పిస్తుందని ఆశించటం ఎలా? వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు కొండూరి వీరయ్య 98717 94037 -
క్రిష్, వెంకీల సినిమా లేనట్టేనా..?
గౌతమిపుత్ర శాతకర్ణితో అందరి దృష్టిని ఆకర్షించిన క్రిష్, తన తదుపరి చిత్రాన్ని కూడా సీనియర్ హీరోతోనే చేసేందుకు ప్లాన్ చేశాడు. గురు సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్ హీరోగా ఓ సక్సెస్ ఫుల్ నవల ఆధారంగా సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేశాడు. డాక్టర్ కేశవ రెడ్డి రాసిన 'అతడు అడవిని జయించాడు' నవల ఆధారంగా 'వీరయ్య' పేరుతో సినిమాను తెరకెక్కించాలని భావించాడు. ఈ సినిమా వెంకటేష్ 75వ సినిమా కూడా కావటంతో మరో ట్యాండ్ మార్క్ సినిమా చేసిన క్రెడిట్ తన ఖాతాలో పడుతుందని ఈ ప్రాజెక్ట్ అంగీకరించాడు. అయితే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. సరైన కారణాలు వెల్లడించకపోయినా.. 'అతడు అడవిని జయించాడు' నవల విషయంలో కాపీ రైట్స్ ఇష్యూ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసిన క్రిష్, మరో స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నాడట. అదే సమయంలో 'అతడు అడవిని జయించాడు' నవల కాపీరైట్స్ ఇష్యూను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే క్రిష్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
సంచారజాతులపై చిన్నచూపు
► ఆదివాసీలుగా గుర్తించాలి కలెక్టరేట్ ► ఎదుట నక్కలవారి ధర్నా సిరిసిల్ల : మధ్య మానేరు ప్రాజెక్టు లో ముంపునకు గురవుతున్న సం చార జాతులపై సర్కారు చిన్నచూ పు చూస్తోందని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యుడు భూతం వీ రయ్య విమర్శించారు. వేములవా డ మండలం రుద్రవరం గ్రామాని కి చెందిన నక్కలవారు(కోతులో ళ్లు) సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ 62 కుటుంబాలు మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్నాయని, వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు. సంచార జాతులను ఆదివాసీలుగా గుర్తించి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేశా రు. మొత్తం 22 కుటుంబాలు నిర్వాసితుల జా బితా గెజిట్ రాక సాయం అందడం లేదన్నారు. అంతకుముందు ఏఐఎఫ్టీయూ, తెలంగాణ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జేసీ షేక్ యాస్మిన్ బాషా, డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్‌కు వినతిపత్రం అందించారు. కార్మిక సంఘాల నాయకులు సోమిశెట్టి దశరథం, కొలిపాక కిషన్, పని వెంకటేశం, సమాని రమేశ్, వీరస్వామి, సుగుణ, బారి కమల, నేరెళ్ల నారాయణ, రేగుల రాములు, మల్లేశం, శ్రీనివాస్, చంద్రయ్య, నిర్వాసితులు పాల్గొన్నారు. -
రేడియో ధార్మిక ఔషధాల పరిశోధనకు ప్రాధాన్యం
వీఎస్‌యూ వీసీ వీరయ్య నెల్లూరు (టౌన్): రేడియో ధార్మిక ఔషధాల పరిశోధనలకు ప్రాధన్యం ఇవ్వాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ వీరయ్య తెలిపారు. వర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం న్యూ క్లియర్ కెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్‌పై రెండు రోజుల జాతీయ వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పరిశోధనలను బాబా అటామిక్ రీసోర్స్ సెంటర్, ఇండియన్ అసోసియేషన్ ఫర్ న్యూక్లియర్ కెమిస్ట్రీ అండ్ అల్లైడ్ సైంటిస్ట్, ఇంధిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తల నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. న్యూ క్లియర్ కెమిస్ట్రీ ఆవిష్కరణకు హె న్రీ బెకరల్, క్యూరీ లాంటివారు గట్టి పునాదులు వేశారని చెప్పారు. పశ్చిమ దేశాల్లో వ్యవసాయంలో వస్తున్న పెనుమార్పులుకు పరిశోధనలే కారణమన్నారు. రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడుతూ నేడు ప్రాకృతిక శిలాజ వనరులను కాపాడుకోవాలంటే అసంప్రాదాయక శక్తి వనరులైన అణుధార్మిక శక్తిని వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అణుశక్తి ఉపయోగంతో తీవ్ర మానవ రుగ్మతల నివారణ, మానవ వికాసాన్ని పొందవచ్చన్నారు. ముంబైకు చెందిన బాబా అటామిక్ రీసోర్స్ సెంటర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ రమణారెడ్డి మాట్లాడుతూ అణుశక్తి ఆధునిక పరిశోధనలు క్యాన్సర్ నివారణకు, రోగ నిర్ధారణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ న్యూక్లియర్ కెమెస్ట్రీ అండ్ అల్లైడ్ సైంటిస్ట్ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణి రేడియోధార్మిక మూలకాలైన కోబాల్ట్, బిస్మత్ లాంటి పదార్థాలను పలు ప్రయోగాల్లో ఉపయోగిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటరావు, కెమిస్ట్రీ విభాగాధిపతి విజయ, త్రివేణి, వీరారెడ్డి, వర్సిటీ ఆచార్యులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
కూలి పనులకు సైకిల్ పై వెళ్తున్న భార్యా భర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద బుధవారం చోటుచేసుకుంది. మంగళాపురం గ్రామానికి చెందిన కొల్లూరి వీరయ్య, రాధ దంపతులు లక్ష్మీపురం వద్ద కూలి పనులకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో రాధ అక్కడికక్కడే మృతిచెందగా.. వీరయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
సంఘం డెయిరీ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఐటీ సోదాలు
పొన్నూరు: సంఘం పాల డెయిరీ మాజీ డైరెక్టర్, టీడీపీ నాయకుడు కుర్రా వీరయ్య ఇంట్లో బుధవారం ఐటీ దాడులు చేపట్టింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండల కేంద్రంలోని విద్యానగర్‌లో ఉన్న ఆయన నివాసంలో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్లేడుతో గొంతు కోశాడు
సూర్యాపేట (నల్లగొండ): ఓ మహిళ పై దాడి చేసి.. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన మేకల ఉపేంద్ర అనే మహిళపై అదే గ్రామానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి బ్లేడుతో దాడి చేశాడు. ఆమెను హతమార్చేందుకు బ్లేడుతో గొంతుకోశాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మళ్లీ గుచ్చాడు!
నగరంలో, నల్లగొండలో సైకో సూదిగాళ్ల హల్చల్ హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సైకో సూదిగాళ్ల కలకలం చెలరేగింది. ఇటీవలే మల్కాజిగిరిలో ఓ చిన్నారిపై సిరంజి దాడి జరుగగా... ఇప్పుడు ఎల్బీనగర్లో బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఎల్ఐసీ ఉద్యోగిపై దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లబైల్లి తం డాకు చెందిన స్వామినాయక్ (27) బీఎన్‌రెడ్డి నగర్లో నివాసవుుంటూ ఎల్ఐసీ వూర్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు.సోమవారం దిల్సుఖ్నగర్ నుంచి ఎన్జీవోస్ కాలనీ వైపు వెళుతున్న ఓ బస్సు ఎక్కాడు. ఆ బస్సు దిల్సుఖ్నగర్-చైతన్యపురి వుధ్య ఉన్న సమయంలో తెల్లషర్టు, తెల్లప్యాం టు ధరించిన వ్యక్తి స్వామినాయుక్ మోకాలి వెనుక భాగంలో సూది (ఇంజెక్షన్ సిరంజి)తో గుచ్చాడు. బస్సు నడుస్తుండగానే, బస్సులోనే చెప్పులు వదిలేసి దిగి పరారయ్యూడు. స్వామినాయుక్ పక్కనే ఉన్న ప్రయూణికులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. కొద్దిసేపటికే నొప్పి భరించలేక స్వామినాయక్ బస్సులో పడిపోయూడు. బాధితుడు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇంజెక్షన్ గుచ్చి ఆటోలో పరారీ కోదాడ రూరల్: నల్లగొండ జిల్లా కోదాడ మండలం కాపుగల్లు శివారులో సోమవారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి సూదిగుచ్చి.. ముగ్గురు యువకులు ఆటోలో పరారయ్యారు. కాపుగల్లుకు చెందిన కోపూరి వీరయ్య కోదాడకు వచ్చి పనిముగించుకుని సాయంత్రం తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. గ్రామశివారులోని మామిడితోటల వద్దకు రాగానే కాపుగల్లు నుంచి కోదాడ రోడ్డు వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వచ్చింది. వీరయ్య బైక్‌ను రోడ్డుకిందికి దించగా.. ఆటో కూడా అతనివైపే మలిపి ఒక్కసారిగా ఆపారు. వెంటనే ఆటోలో నుంచి ఓ వ్యక్తి దిగి వీరయ్య కుడి చెంపపై సూది గుచ్చాడు. దీంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే దుండగులు అదే ఆటోలో పరారయ్యారు. బాధితుడు కోదాడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అతను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, వీరయ్య బ్యాంక్‌లో పంట రుణం తీసుకునేందుకు వచ్చి వెళ్తుండగా ఈ ఘటన జరగడంతో డబ్బు కోసం దొంగలు ఈ పనిచేశారా..లేదా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కోదాడలో సూది సైకోగాళ్లు
-
కోదాడలో సూది సైకోగాళ్లు
నల్లగొండ: కొద్ది రోజులుగా సూది సైకో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.సూదిగాళ్ల కలకలం నల్లగొండ జిల్లాకు వ్యాపించింది. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కోదాడ మండల కాపుగల్లులో బైకుపై వెళ్తున్న వీరయ్య (55) గ్రామ శివారుకు రాగానే ఆటోలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనపై సూది విసరడంతో అది చెంపపై గుచ్చుకుంది. ఆయన వెంటనే కోదాడలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే, వీరయ్యకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. బాధితుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రమాదవశాత్తూ గీత కార్మికుడి మృతి
వరంగల్ జిల్లా: ప్రమాదవశాత్తు గీత కార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో శనివారం జరిగింది. వివరాలు.. ఇల్లంద గ్రామానికి చెందిన వీరయ్య (28) గీత కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తాటిచెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (వర్ధన్నపేట) -
అంగన్వాడీల సంక్షేమం పట్టదా?
సిద్దిపేట అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో అంగన్వాడీల సంక్షేమం కోసం, వారి వేతనాల పెంపు కోసం ఎలాంటి నిధులను కేటాయించకుండా వారిని విస్మరించిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభలను శనివారం సిద్దిపేట పట్టణంలోని శివమ్స్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. సభకు ముందు అంగన్వాడీలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మహాసభలకు ప్రవాహంలా తరలివచ్చారు. శివమ్స్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ, నవ తెలంగాణ నిర్మాణంలో కీలకమైన అంగన్వాడీల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. కార్మికుల సమస్యలపై చర్చించేందుకు కూడా సీఎం సిద్ధంగా లేరని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల యాజ మాన్యాలకు లాభం చేకూర్చేందుకు సమయం కేటాయిస్తున్న సీఎం, ప్రజలకు విశేష సేవలందిస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోకుండా, ఆత్మహత్యలపై అనుమానాలు వ్యక్తం చేయడం దారుణమన్నారు. అంగన్వాడీ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా తక్షణమే గు ర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. చరి త్ర పుస్తకాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం విరమించుకోవాలన్నారు. కార్మిక సంక్షేమాలకు, హక్కుల కోసం పోరాడి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ వ్యక్తుల కోసం రద్దు చేయాలని నేతలు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడి దారుల కోసం దేశంలో ఉత్పత్తి చేసుకోమని ప్రకటించి, ఎక్కడైనా అమ్ముకోండని పిలుపునివ్వడం దారుణమన్నారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం వల్ల సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడం జరుగుతుందన్నారు. మరో ఉద్యమానికి సిద్ధంగా కావాలి. ఉద్యమాల గడ్డగా నిలిచిన సిద్దిపేట ప్రాంతంలో అంగన్వాడీ సిబ్బంది మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. దేశంలో అనేక సంస్థలు ప్రతి కుటుంబానికి జీవించేందుకు కనీస వేతనం రూ. 15 వేలు ఉండాలని తెలియజేస్తున్నాయన్నారు. పాలకు లు మాత్రం అంగన్వాడీ సిబ్బందికి గౌరవ వేతనం ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికైన వారికి కనీస వేతనం అమలు చేయాలని డి మాండ్ చేశారు. గౌరవ వేతనం, పారితోషికాల పేరుతో కార్మికులు, సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందన్నారు. వాగ్ధానాలను అమలు చేయాలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. సిబ్బంది వేతనాల పెంపు కోసం ఈ నెల 18న నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభల్లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ. మల్లేషం, శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ఎస్. రమ, అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మ, నర్సమ్మ, డివిజన్ కార్యదర్శి రేవంత్‌కుమార్, నాయకులు జగన్, పుష్పలత, అనురాధ, రాజ్యలక్ష్మి, లక్ష్మి, అంజమ్మ, హేమలత, ఆనంద్, రాజు, బాల్‌రాజు, నాగరాజు, రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్ ముట్టడికి సిద్ధంకండి
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్:షెడ్యూల్ కులాల వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని కోరుతూ డిసెంబర్ 7న పార్లమెంట్ ముట్టడికి మాదిగలు సిద్ధం కావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ కోరారు. బుధవారం తాడేపల్లిగూడెంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఎన్జీవో హామ్లో నిర్వహించారు. వీరయ్య మాట్లాడుతూ వర్గీకరణను జాప్యం చేయటం వల్ల మాదిగ, మాదిగ ఉపకులాల వారు తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ చేయకపోతే మాదిగలకు భవిష్యత్ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడతామన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోబిల్లు ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళాలని, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీసీఐఎం పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై ఆంటోని కమిటీకి నివేదిక అందజేస్తామని, పరిష్కారం చూపకపోతే కమిటీని ఆంధ్రా ప్రాంతానికి రానివ్వమని హెచ్చరించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. పలివెల చంటి మాదిగ, ముప్పి డి మోషే మాదిగ, పెనుమాక గాంధీ, మాండ్రు ప్రభాకర్, బైపా రాజేశ్వరరావు, లంకా మోహనబాబు, దూలపల్లి శ్రీను, రాపాక వెంకటేశ్వర్లు, డి.చిన్నజాన్, మర్రి వెంకటేశ్వరరావు, ఉండ్రాజవరపు పెంటయ్య, తొమ్మండ్రు వెంకటేశ్వరరావు, పెదమూర్తి రాజు, విద్యార్థి, యువసేన నాయకులు పాల్గొన్నారు.