సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీపీఎం పర్యవేక్ష ణ బాధ్యతలు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్యకు అప్పగించారు. రాష్ట్ర రాజధాని హై దరాబాద్‌లో ఉంటూ పార్టీని నడిపించాల్సిన బాధ్య తను ఆయనకు అప్పగిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9, 10 తేదీల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ సమావే శాలు జరిగాయి. ఆ భేటీల్లో ఈ నిర్ణయం తీసుకు న్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఏఐజీలో ఆయన చికిత్స పొందారు.
ఆయనకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో రెండ్రోజులు జరిగిన పార్టీ సమావే శాలకు కూడా తమ్మినేని కొద్దిసేపు మాత్రమే హాజర య్యారు. కాగా తమ్మినేని సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వంలోనే వీరయ్య పనిచేయాలని స్ప ష్టం చేస్తూ రాష్ట్ర కమిటీ తీర్మానించింది. అవసరాన్ని బట్టి తమ్మినేని హైదరాబాద్‌లో, అలాగే ఖమ్మంలోనూ ఉంటారు. మూడు నెలల పాటు వీరయ్య ఈ బాధ్యతలు నిర్వర్తించాలని సీపీఎం నిర్ణయించింది. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీని నడిపించాల్సిన బాధ్యత వీరయ్యపై పడింది. ఈయన గతంలో ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా, నవ తెలంగాణ ఎడిటర్‌గా పనిచేశారు.
రెండు ఎంపీ సీట్లలో పోటీ
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తమ్మినేని ఒక ప్రకటనలో తెలిపారు. స్ధానిక జిల్లా కమిటీలతో చర్చించిన అనంతరం త్వరలో సీట్లను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఏవో రెండింటిలో పోటీ చేయాలని సీపీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నేతల గురి ప్రధానంగా మహబూబాబాద్, భువనగిరి స్థానాలపై ఉన్నట్లు సమాచారం.
అయితే ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక స్థానమే ఇస్తాననడంతో పొత్తు కుదరలేదు. ఇక రెండ్రోజులు జరిగిన సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, లోక్‌సభ ఎన్నికలు, తదితర అంశాలపై సీపీఎం చర్చించింది. కాంగ్రెస్‌తో అవగాహన చేసుకొని ఉంటే సానుకూల ఫలితాలు వచ్చేవన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.
ఒక స్థానంలో సీపీఐ పోటీ!
సీపీఐ కనీసం ఒక లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికలకు మద్దతు కోరి ఎమ్మెల్సీలు లేదా రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించవచ్చని అనుకుంటున్నారు.
16న సమ్మెకు మద్దతు
కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌కు పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, ప్రజలంతా పాల్గొనాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment