సంచారజాతులపై చిన్నచూపు | bhutam veeraiah Criticized about nomads | Sakshi
Sakshi News home page

సంచారజాతులపై చిన్నచూపు

Published Tue, Jan 3 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

సంచారజాతులపై చిన్నచూపు

సంచారజాతులపై చిన్నచూపు

ఆదివాసీలుగా గుర్తించాలి కలెక్టరేట్‌
ఎదుట నక్కలవారి ధర్నా

సిరిసిల్ల : మధ్య మానేరు ప్రాజెక్టు లో ముంపునకు గురవుతున్న సం చార జాతులపై సర్కారు చిన్నచూ పు చూస్తోందని  సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కమిటీ సభ్యుడు భూతం వీ రయ్య విమర్శించారు. వేములవా డ మండలం రుద్రవరం గ్రామాని కి చెందిన నక్కలవారు(కోతులో ళ్లు) సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ 62 కుటుంబాలు మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్నాయని, వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు.

సంచార జాతులను ఆదివాసీలుగా గుర్తించి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశా రు. మొత్తం 22 కుటుంబాలు నిర్వాసితుల జా బితా గెజిట్‌ రాక సాయం అందడం లేదన్నారు. అంతకుముందు ఏఐఎఫ్‌టీయూ, తెలంగాణ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జేసీ షేక్‌ యాస్మిన్ బాషా, డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్‌కు వినతిపత్రం అందించారు. కార్మిక సంఘాల నాయకులు సోమిశెట్టి దశరథం, కొలిపాక కిషన్, పని వెంకటేశం, సమాని రమేశ్, వీరస్వామి, సుగుణ, బారి కమల, నేరెళ్ల నారాయణ, రేగుల రాములు, మల్లేశం,  శ్రీనివాస్, చంద్రయ్య, నిర్వాసితులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement