Nomads
-
బీసీ జాబితాలో మరో 30 కులాలు!
సాక్షి, హైదరాబాద్ : సంచార జాతులకు చెందిన 30 కులాలను బీసీ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ రాసిన ‘బీసీ కులాలు-సంచార జాతులు’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటివరకు గుర్తించని సంచార జాతులను వెనుకబడిన తరగతులుగా గుర్తించలేదని అన్నారు. ఈ 30 కులాలను బీసీ జాబితాలో చేర్చవల్సిన ఆవశ్యకత ఉందని జూలూరు గౌరీశంకర్ సీఎం దృష్టికి తీసుకురాగా.. కేసీఆర్ స్పందించి.. సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చే విషయంపై అధ్యయనం చేయవల్సిందిగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకి బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగేళ్లుగా బీసీలు, సంచార జాతులకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయనాన్ని జూలూరు తన పుస్తకంలో వివరించారు. ఈ కార్యక్రమంలో కేకే, ఎంపీ వినోద్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సంచారజాతులపై చిన్నచూపు
► ఆదివాసీలుగా గుర్తించాలి కలెక్టరేట్ ► ఎదుట నక్కలవారి ధర్నా సిరిసిల్ల : మధ్య మానేరు ప్రాజెక్టు లో ముంపునకు గురవుతున్న సం చార జాతులపై సర్కారు చిన్నచూ పు చూస్తోందని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యుడు భూతం వీ రయ్య విమర్శించారు. వేములవా డ మండలం రుద్రవరం గ్రామాని కి చెందిన నక్కలవారు(కోతులో ళ్లు) సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ 62 కుటుంబాలు మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్నాయని, వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు. సంచార జాతులను ఆదివాసీలుగా గుర్తించి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేశా రు. మొత్తం 22 కుటుంబాలు నిర్వాసితుల జా బితా గెజిట్ రాక సాయం అందడం లేదన్నారు. అంతకుముందు ఏఐఎఫ్టీయూ, తెలంగాణ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జేసీ షేక్ యాస్మిన్ బాషా, డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్‌కు వినతిపత్రం అందించారు. కార్మిక సంఘాల నాయకులు సోమిశెట్టి దశరథం, కొలిపాక కిషన్, పని వెంకటేశం, సమాని రమేశ్, వీరస్వామి, సుగుణ, బారి కమల, నేరెళ్ల నారాయణ, రేగుల రాములు, మల్లేశం, శ్రీనివాస్, చంద్రయ్య, నిర్వాసితులు పాల్గొన్నారు.