
సాక్షి, హైదరాబాద్ : సంచార జాతులకు చెందిన 30 కులాలను బీసీ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ రాసిన ‘బీసీ కులాలు-సంచార జాతులు’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటివరకు గుర్తించని సంచార జాతులను వెనుకబడిన తరగతులుగా గుర్తించలేదని అన్నారు. ఈ 30 కులాలను బీసీ జాబితాలో చేర్చవల్సిన ఆవశ్యకత ఉందని జూలూరు గౌరీశంకర్ సీఎం దృష్టికి తీసుకురాగా.. కేసీఆర్ స్పందించి.. సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చే విషయంపై అధ్యయనం చేయవల్సిందిగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకి బాధ్యతలు అప్పగించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగేళ్లుగా బీసీలు, సంచార జాతులకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయనాన్ని జూలూరు తన పుస్తకంలో వివరించారు. ఈ కార్యక్రమంలో కేకే, ఎంపీ వినోద్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment