Juluri Gowri sankar
-
ఒక సంకల్పం పుట్టిన రోజు
పధ్నాలుగేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహింసా మార్గంలో పోరాడిన కేసీఆర్‌ను జనం అక్కున చేర్చుకుని ముఖ్యమంత్రిని చేశారు. అహరహం తెలం గాణ అభివృద్ధి కోసం ఆయన సీఎంగా శ్రమిస్తూ ఉన్నారు. జనగామ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. మనందరం కలిసి పోరాడిన ఉద్యమ గెలుపు కథలను జనం మధ్యకు వెళ్లి విప్పారబోస్తున్నారు. ఆయన ఒక్క పిలుపునిస్తే అందరి ఇళ్లపై పోరు జెండాలు ఎగిరాయి. ఆయన ఒక్క నినాదమిస్తే ఆ«ధిపత్యం వణికిపోయింది. చెప్పిన మాటమీదనే, తాను పట్టిన పంతం మీదనే చివరిదాకా నిలిచాడు. తను పోరాడుతూ లక్ష్య సాధనవెంట నడిచే లక్షలాది యోధుల్ని నడిపించుకుంటూ ప్రపంచీకరణ కాలంలో అస్తిత్వ ఉద్యమాలకు పురుడు పోసి అస్తిత్వ ఉద్యమ పొద్దుపొడుపు అయ్యాడు కేసీఆర్. స్వరాష్ట్ర ఉద్యమాల అస్తిత్వ జెండా పట్టిన వాళ్లకు, రేపు జరుగ బోయే అస్తిత్వ సంఘర్షణల ఉద్యమాలకు మార్గ దర్శిగా నిలిచాడు. రాష్ట్రం సాధించాక తిరిగి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే పాలనా పగ్గాలు పట్టి ఈ మట్టిని ఒంటికి రాసుకుని వినమ్రంగా తెలంగాణ మళ్లకు నీళ్లు పడుతున్న రైతుకూలీ కేసీఆర్. పురుగుల మందులు తాగి పానాలు భూమితల్లి ఒడిలోనే వదులుతున్న వేలమంది పత్తిరైతుల మరణాలను చూసి దుఃఖించి, ఆ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు కాళేశ్వరం ప్రాజెక్టునే కట్టి, మహానదినే తన రెండు చేతులతో ఎత్తి పోస్తు న్నాడు. తెలంగాణ హరితవిప్లవానికి ఒక కొత్త దారి చూపిన వ్యవసాయ పంచాంగం అతడు. తెలంగాణ వచ్చాక కూడా పత్తిచేలో పచ్చ పురుగులుంటాయని ఆయనకు తెలుసు. పంటను కాపాడటానికి ఆయన పచ్చపురుగుల్ని ఏరేస్తున్నాడు. ఈనేల అభివృద్ధికి ఈ పంటల చీడలేకుండా చేయటానికి మళ్లీ పరిశోధక విద్యార్థి అయి తపిస్తున్నాడు. చదవండి: (దేశానికి నూతన దిశ కేసీఆర్) ‘పల్లెప్రగతి’తో పల్లెలు ఎంత పరిమళిస్తున్నాయో ఊరూరా తిరిగి చూస్తూ పసిపిల్లగానిలా పరవ శిస్తున్నాడు. ‘పట్టణప్రగతి’తో నగరాల ముఖ చిత్రా లను మార్చుతూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఏ ఊరు చూసినా పచ్చగా ఉండాలే, ఏ టౌన్ కెళ్లినా సోబరుగా ఉండాలే. ప్రతి ఒక్కరీ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలే. మన బడి బాగుపడాలే. బస్తీ దవాఖానాలు పేదలకు వైద్యం అందించాలే. చదువులు బాగుపడాలే. అందరి బతుకులు బాగు పడాలే... ఇదే అతడి తపన. అందుకే నిరంతరం శ్రమిస్తున్నాడు. నర్సాపూర్ అడవుల్లోకి పోయి మొక్కలు నాటి పర్యావరణానికి కాపలాదారునిగా కాపలా కాస్తున్నాడు. ఇంతగా ఈ నేల కోసం కృషి చేసిన అతడి కాలంలో ఉన్నాం. ఇపుడు తెలంగాణ 33 జిల్లాల సమాహారం. పాలన గడప గడపల దాకా పోవటానికి ఎంతో కృషిచేస్తున్నాడు. ‘పుట్టినరోజు పండుగే అందరికీ. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ అని ఒక తెలుగు సినీ కవి ప్రశ్నించాడు. ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు. ఆయన ఎందుకు పుట్టాడో ఆయనకు బాగా తెలుసు. లేకపోతే కొన్ని దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎందరో అసువులు బాసినా... ఫలితం దక్కని ఉద్యమాన్ని మళ్లీ భుజానికెత్తుకుని రాష్ట్రాన్ని సాధించేవాడా! తన కలకు మెరుగులు అద్ది ఒక మహా స్వప్నంగా మార్చి తెలంగాణ ప్రజల కళ్ళ ఎదుట ఆవిష్కరించిన ధన్యుడు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నా స్వప్నం’’ ఇదే ఇదే నా జెండా, ఎజెండా... అంటూ ఒక సుదీర్ఘ ఉద్యమ యాత్ర చేశాడు కేసీఆర్. ఇందుకోసమే ఎన్నో బాధలు పడ్డాడు. కష్టాలను ఎదుర్కొన్నాడు. అధికా రాలు, పదవులు గడ్డిపోచతో సమానమని అనేకసార్లు నిరూపించాడు. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మా ణంలో అలుపెరగక పోరాడుతున్నాడు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు! జూలూరి గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ -
పలు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 5 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేశ్, తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరిశంకర్, ‘తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ నియమితులయ్యారు. కీలకంగా పనిచేసిన వాళ్లకు.. తెలంగాణ మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్‌గా నియమితులైన ఆకుల లలిత గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినా చివరి నిమిషంలో చేజారింది. తాజాగా నామినేటెడ్ పదవి లభించింది. బీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా నామినేట్ అయిన గజ్జెల నగేశ్.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తండటాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్‌గా పనిచేస్తున్న పాటిమీది జగన్మోహన్రావు యువజన విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చారు. గతంలో జీహెచ్ఎంసీ యువజన విభా గం ఇన్చార్జిగా పనిచేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితులైన జూలూరు గౌరి శంకర్ పాత్రికేయుడు. రచయితగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా చేసిన శంకర్‌కు ప్రస్తుతం నామినేటెడ్ పదవి లభించింది. విద్యార్థి దశ నుంచే వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐలో పనిచేసిన డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమంలో 150కి పైగా కేసు లు ఎదుర్కొని 50 రోజులు జైలు జీవితం గడిపారు. కాగా యువ గాయకుడు సాయిచంద్‌ను రెండ్రోజుల క్రితం తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, విద్యార్థి నాయకులుగా ఉద్యమంలో పాల్గొన్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
ఒక్కగానొక్కడు
ఎన్నికల వేళల్లో నాయకులు మాట్లాడే మాటలపై అస్సలు నమ్మకముండదు. అసలు పార్టీల మ్యానిఫెస్టోలనే కాలం మరిచిపోయి చాలా కాలమైంది. కానీ, 2014 ఎన్నికల సమయంలో రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ ఉపన్యాసాలన్నీ వినీ వినీ వాటిని అందరూ మోహించినట్లుగానే మోహించి, వాటిని భద్రపరచాలని ప్రయత్నంచేస్తే అది ‘జయుడు’ అన్న పెద్ద పుస్తకమయ్యింది. అట్లనే 2019 చివర్లో జరి గిన రెండోవిడత ఎన్నికల్లో కేసీఆర్ సభల్లో ఉపన్యాసాలన్నీ రికార్డుచేస్తే ‘సమ్మోహనాస్త్రం’ అన్న మహాగ్రంథమైంది. కానీ ఆ రెండు పుస్తకాలలో కేసీఆర్ చేసిన ఉపన్యాసాలన్నీ ఓట్లకోసం మాట్లాడినవి మాత్రమేకావు. అవి భవిష్యత్ తెలంగాణ కాలజ్ఞానంగా నిలుస్తాయి. కేసీఆర్ మాట్లాడే ప్రతిమాటను ఆచరణాత్మకంగా చేసి చూపిస్తాడు. తను అనుకున్నది సాధించడానికి ఎక్కడిదాకైనా వెళతాడు. ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదుర్కుంటాడు. అతడు అనుకున్నది సాధిస్తాడు. అందుకే కేసీఆర్‌ను పట్టువదలని మొండోడు అంటారు. ఈ వొంటూపిరి బక్కప్రాణమేనా ఇన్ని అద్భుత ఆవిష్కరణలు తెలంగాణ నేలమీద చేసి చూపించింది అనిపిస్తుంది. అవును, ఇది నిజం. తెలంగాణతో ఆయన చేసిన ప్రయోగాలు, ఆయన ప్రయాణాలు, ఆయన ఆచరణలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రతిపనిని ఒక తపస్సులాగా చేసినోడు. ‘రైతు వేదిక’ను ప్రారంభిం చిన సందర్భంలో జనగామ జిల్లా కొడకండ్లలో ఆయన మాట్లాడిన ఉపన్యాసం చరిత్రాత్మకమైనది. రైతుల కోసం రైతు సంక్షేమంకోసం ఆయన రైతు వేదికలను ప్రారంభించి ప్రపంచంలో ఎక్కడాలేని రైతు ఆలోచనల ఆవిష్కరణలుచేసి ఆయన చేసిన ఉపన్యాసమది. ఆయన ఆలోచనలకు, ఆచరణకు మొత్తం రైతులోకం నాగళ్లెత్తి స్వాగతిస్తుంది. ఇంతగా రైతుల గురించి ఆలోచించి వాళ్ల జీవితాల్లో కొత్తవెలుగులు రావాలని తపించిన రైతునాయకుడు, రైతుబిడ్డ కేసీఆర్. కొడకండ్ల రైతువేదిక ప్రారంభంలో ఆయన మాట్లాడిన మాటలు రైతు చేతుల సంఘటిత పిడికిలిగా మారింది. ఈ దేశంలో రైతాంగమంటే అసంఘటిత రంగ ఆవేదన. కానీ రైతు వేదిక నిర్మాణం ద్వారా దాన్ని కేసీఆర్ రైతుల ఆత్మగౌరవ చిహ్నంగా, రైతాంగం మహాశక్తిగా మార్చేశారు. కొడకండ్ల రైతు వేదిక ప్రారంభంలో కేసీఆర్ మాట్లాడిన సుదీర్ఘ ఉపన్యాసం మట్టిమనుషుల మహాసందేశంగా నిలుస్తుంది. అంబేడ్కర్ కులనిర్మూలనా ఉపన్యాసం భారత రాజ్యాంగం అయితే మార్టిన్ లూథర్‌కింగ్ ఉపన్యాసం నల్లజాతిని మేల్కొలి పింది. మండేలా విముక్తి గీతం దక్షిణాఫ్రికా విముక్తి గీతం. మహాత్మాగాంధీ ఉపన్యాసం భారతదేశం అహిం సామార్గంలో సాధించిన స్వాతంత్య్రం సమరగీతం. తెలంగాణలో పునర్నిర్మాణ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలన్నింటినీ చేసుకుంటూపోతున్నాడు. కేసీఆర్ తెలంగాణ తల్లి భాషలో మాట్లాడుతూ అవసరాన్ని సందర్భాన్ని బట్టి ఆయన గద్దిస్తాడు, బుజ్జగి స్తాడు, ఆగ్రహిస్తాడు, జనుల కోసం దేన్నైనా శాసిస్తాడు, శోకిస్తాడు, శోధిస్తాడు, చివరకు సర్వజన సంక్షేమమే తనమతంగా నిలిచిపోతాడు. సమయసందర్భాలను లెక్కగట్టి అనేక సమయాల్లో కేసీఆర్ చేసిన ఉపన్యాసాలన్నీ సుప్రసిద్ధ ప్రముఖుల ఉపన్యాసాల జాబి తాలో చేరిపోతాయి. చెప్పిన మాటలను ఆచరణలో చేతలుగా చూపించిన స్థితే తెలంగాణ పునర్నిర్మాణం. కేసీఆర్ మాట తెలంగాణ ఉగ్గుపాలపాట. ఏడ్చేబిడ్డకు అందించే తల్లి పాలు. ఈ నేలమీద ఎక్కువమందికి మేలుచేసే పని ఎవరుచేసినా అది ఏ వాదమైనా శిరోధార్యమే. తెలంగాణలోని సబ్బండవర్ణాలకు నిజంగా ఏదైనా మేలు ఆచరణాత్మకంగా జరుగుతూ ఉందంటే రాష్ట్ర అవతరణ తర్వాతే ఆ పని నిర్విఘ్నంగా వేగవంతంగా జరుగుతుంది. నీళ్లనుంచి నిధులదాకా, నిధుల నుంచి వ్యవస్థ పునర్నిర్మాణం దాకా ఒక పెద్ద కృషి జరుగుతుంది. సబ్బండవర్ణాల వాకిళ్లముందు సంకురాతిరి ముగ్గులాగా వ్యవసాయం నూతనోత్సాహంతో వెల్లివిరియాలన్న తలంపుతో కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ‘తెలంగాణ నా స్వప్నం’ అన్న లక్ష్యాన్ని సాధించాడు. అన్నార్తులు, అనా«థలులేని గ్రామరాజ్యాల్ని నిర్మించే పనిలో మునిగిపోయాడు. ఆయన చెప్పినవన్నీ ఆచరణాత్మక అడుగులై తెలంగాణ తనను తాను నిర్వచించుకుంటుంది. కేసీఆర్ అంటే భూమిని దున్నే నాగలి, రైతాంగం పిడికిలి. ఆయన మాటలు పొట్టమీదికొచ్చిన పంట. ఆయన తెలంగాణ ధాన్యాగారం. కేసీఆర్ తెలంగాణకు ఒక్కగానొక్కడు. -జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త కవి, విమర్శకుడు ‘ 94401 69896 -
గురువును మరువని కాలం
గురుశిష్యుల మధ్య సంబంధాలు మృగ్యమై పోయాయని, వీళ్ల మధ్య సంబంధాలు చాప్టర్‌లెక్చరర్స్, మార్కెట్ సంబంధాలని చర్చలు చేస్తున్న సందర్భంలో గురువును గురువుగా ప్రతిష్టించడం మొత్తం సమాజం గర్వించతగింది. గురువుకు ఉన్న మహోన్నత స్థానం నేటికీ చెక్కుచెదరలేదనే సంఘటనలు అరుదుగా జరుగుతాయి. ఉపాధ్యాయులను విద్యార్థులు నేటికీ తమ గుండెల్లో దాచుకుంటూనే ఉన్నారు. తన బోధనతో భావితరాన్ని సాధకులుగా మార్చగల శక్తి ఒక్క ఉపాధ్యాయునిలోనే ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువుదే ఉత్తమ స్థానమని నిర్వచనాలు చెప్పటం, ఉపాధ్యాయ దినోత్సవాల నాడు మననం చేసుకోవటం మాత్రమే కాదు, పిల్లలకోసం తపించి, పిల్లల కోసం తమ జీవితాలను అర్పించి, తరగతి గదే దేవాలయంగా భావించిన ఉపాధ్యాయులను ఏ తరమూ మర్చిపోదని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సోషల్వెల్ఫేర్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఆదివారం పదవీ విరమణ చేసిన పసుపులేటి విద్యాసాగర్‌రావు సన్మానసభలో కళ్లకు కట్టినట్లు కనపడింది. గురుకుల విద్యావ్యవస్థలో తన సర్వీసు కాలం చదువుకుని వివిధ రంగాలలో స్థిరపడ్డ విద్యార్థులంతా తమ గురువును బండి మీద నిలుచోబెట్టి ఊరేగింపుగా ఆ స్కూల్ ప్రాంగణంలోకి బండిలాగుతూ తీసుకుపోవటం ఒకింత ఆశ్చర్యంగా, పరమానందంగా అనిపించింది. ఈ అత్యాధునిక మార్కెట్ సమాజంలో ప్రతిదానిని వినిమయ వస్తువుగా మార్చి, అమ్మకాలు కొనుగోళ్లు చేస్తున్న కాలంలో తమ గురువు పదవీ విరమణ సభలో గురువుకు కృతజ్ఞతగా దంపతులను బండిమీద కూర్చోబెట్టి బండిని విద్యార్థులు వేదికదాకా తీసుకొని పోయే సంఘటనను ఈ కాలంలో చూస్తాననుకోలేదు. ఇది మంచి ఉపాధ్యాయుడు విద్యాసాగర్‌కు దక్కిన గౌరవం మాత్రమేకాదు, తమను కంటిపాపలా చూసుకుని జ్ఞానబోధన చేసిన గురువులను ఏ విద్యార్థులూ మర్చిపోరనడానికి నిదర్శనం. ఇది ఒక్క గురువుకు చేసిన సన్మానం మాత్రమేకాదు మొత్తం గురుకుల విద్యావ్యవస్థకు ఉపాధ్యాయలోకానికి అత్యంత ఘనంగా జరిగిన సన్మానంగా భావించాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మద్రాసులో రైలు దిగగానే, ఆయన విద్యార్థులు ఇదే రీతిలో బండిపై కూర్చోబెట్టి విద్యాసంస్థదాకా తీసుకుపోయారని పాఠంగా చదువుకున్నాంకానీ, అదే సన్నివేశం ఈ కాలంలో కూడా చూడగలగటం ఒక విశేషం. ఇది మంచి పరిణామం. ఇది విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉండే అనుబంధానికి తార్కాణంగా నిలుస్తుంది. తమ విద్యార్థులు ఉన్నతస్థాయికి వెళ్లాలని ప్రతి టీచర్ కోరుకుంటారు. ఎదుగుతున్న సమాజ పురోభివృద్ధి వెనుక ఉపాధ్యాయులు, తరగతి గది పాత్రే ప్రముఖంగా ఉంటుంది. దేశాన్ని సుభిక్షంగా ఉంచేది, అత్యున్నతంగా తీర్చిదిద్దేది తరగతిగదేనన్నది గుర్తించే తరగతి గదిలో ప్రపంచం రూపొందుతుందని కొఠారి కమిషన్ చెప్పింది. తెలంగాణను తీర్చిదిద్దటానికి గురుకుల పాఠశాలలు గొప్ప కృషిచేస్తున్నాయి. పీవీ గురుకులవిద్యావ్యవస్థను తెలంగాణలో ప్రారంభించి, మానవవనరుల శాఖా మంత్రి అయ్యాక∙దేశవ్యాపితంగా జిల్లాకొక గురుకుల పాఠశాలను నెలకొల్పారు. లక్షమంది బీసీ కుటుంబాలకు చెందిన పిల్లలు నేడు గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన చదువును పొందగలుగుతున్నారు. తెలంగాణ గురుకులాల నుంచి రాబోయే విద్యార్థులు రేపటి బంగారు తెలంగాణకు పునాదులుగా నిలుస్తారు. సంచారజాతుల పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా దేశ సంపదగా మారటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. శక్తిమంతమైన సమాజనిర్మాణం చేయటానికి పునాదులుగా నిలిచి సేవలందిస్తున్న ఉపాధ్యాయుల కృషి మరువలేనిది. మొత్తం సమాజం ఉపాధ్యాయులు చేస్తున్న సేవకు వారిని గొప్పగా సత్కరించుకోవాలి. ప్రతి ఊరులో దేవాలయాన్ని చూసినంత పవిత్రమైన భావనను పాఠశాలలపై చూపి ఆ పాఠశాలల రక్షణ కోసం, వాటి ఉన్నతి కోసం అందరూ సహకరించాలి. గుడిలోకి పోతే ముక్తి లభిస్తే, బడిలోకి పోతే సమాజ విముక్తి లభిస్తుంది. అందరికీ చదువు అందాలన్న మహాత్మాజ్యోతిబాపూలే, అంబేడ్కర్ ఆలోచనలకు రూపంగా తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యలభిస్తోంది. ఇది శుభతరుణం. వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్సభ్యులు ‘ 94401 69896 జూలూరు గౌరీశంకర్ -
ప్రగతికి పనిముట్టు పుస్తకం
సందర్భం తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అనేక రంగాల్లో వినూత్నమైన మార్పులు, ప్రతిరంగాన్ని తీర్చిదిద్దుకునే పునర్నిర్మాణపనులు శరవేగంతో జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ బుక్‌ఫెయిర్ పరిస్థితి ఎలా ఉంటుంది అని వాదన చేసిన వారుకూడా లేకపోలేదు. కానీ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ పుస్తకప్రదర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. హైదరాబాద్‌లోని ‘తెలంగాణ కళాభారతి’ (ఎన్టీఆర్ స్టేడియం) స్థలాన్ని డిసెంబర్ 18 నుంచి 29 వరకు మాకు ఉచితంగా, ఇచ్చింది. గత 30 ఏళ్ల పుస్తకప్రదర్శనలకు ఏ ప్రభుత్వము కూడా ఉచితంగా ఇవ్వలేదు. పుస్తకాలు చదివే ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు అన్నిరకాల సహాయసహకారాలు అందించటం వల్ల గత ఐదేళ్లుగా దేశంలోనే అతిపెద్ద బుక్‌ఫెయిర్‌గా నిలిచింది. రాష్ట్రప్రభుత్వం చేసిన మరోసహాయం జిల్లా కేంద్రాలలో మేం నిర్వహించే బుక్ఫెయిర్స్కు కూడా సహకారం అందించటం మరో విశేషం. హైదరాబాద్ లాంటి మహానగ రాలకే పరిమితమైన పుస్తకప్రదర్శనలను గ్రామీణ ప్రాంతాలదాకా మట్టి కాళ్లపాదాల దాకా తీసుకుపోవాలన్న మా సంకల్పాన్ని కేసీఆర్ సహకారంతో నెరవేరింది. దీంతో ఏ జిల్లాకు వెళ్లినా మాకు సహకారం లభిస్తుంది. జూన్ 2 నుంచి జూన్ 9 వరకు ఖమ్మంలో తెలంగాణ అవతరణ దినోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శన నిర్వహించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ కోరారు. ఇది నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కల్గించింది. ఒక రకంగా ఆయనే మా వెంటపడి మరీ బుక్‌ఫెయిర్ పెట్టించారు. ఎండలు మండిపోతున్నాయి. రోకళ్లు పగిలే రోహిణీకార్తెలో జనం రావటం కష్టమౌతుందన్నా కలెక్టర్ కర్ణన్ పట్టుబట్టి మరీ ఖమ్మంలో పుస్తక ప్రదర్శన పెట్టించారు. ఊహించని విధంగా పుస్తక ప్రియులనుంచి కదలిక వచ్చింది. తెలంగాణ అవతరణోత్సవాల సందర్భంగా ఈ పుస్తక ప్రదర్శన జరపాలన్న కర్ణన్ ప్రతిపాదనను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సమర్థించటమే కాదు, ఇక ప్రతిఏడాది ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. పుస్తక ప్రదర్శనకు ప్రతిరోజూ సాయంత్రం ఓ రెండు గంటలు కర్ణన్ స్వయంగా వచ్చి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది జిల్లా పాలనాయంత్రాంగానికి, ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించిన మంచి ప్రేరణనిచ్చింది. అనేకమంది కలెక్టర్లు పుస్తకప్రదర్శనకు మాకు సహ కరించారు. కానీ కర్ణన్లాగా ఇలా పూర్తిగా సహకరిస్తూ తానే నిర్వాహకునిగా మారటం మాత్రం ఆశ్చ్యర్యానందాలను కలిగించింది. ఇదే కాకుండా ఖమ్మం పట్టణంలోని జనం కూడళ్లదగ్గరకు, అపార్ట్ట్మెంట్ల వరకు ఈ పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేయాలంటున్నారు. మారుమూల గ్రామాలదాకా పుస్తకాలను తీసుకుపోయి జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి మా వంతుగా చేయబోయే ఈ చిన్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కర్ణన్ ఎంతోసహాయం చేస్తున్నారు. తనేకాకుండా తన తండ్రిని, తనకుటుంబ సభ్యులను, తన పిల్లలను తీసుకుని రోజూ బుక్ఫెయిర్కొచ్చి ప్రేరణ కల్గిస్తున్నారు. పుస్తకాలమీద తనకు ప్రేముండటమేకాదు, ఆ ప్రేమ అందరి మనసుల్లోకి పోవాలన్నది ఆయన తపన. కర్ణన్ పుస్తకప్రేమికుడుగా మారటానికి ఆయన తండ్రి లైబ్రేరియన్ కావటం కూడా ఒక కారణం. కర్ణన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఖమ్మం జిల్లా వ్యాపితంగా పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేయబోతున్నాం. ఖమ్మంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కర్ణన్పుస్తక ప్రదర్శనగా మారింది. పుస్తకాలు వర్ధిల్లాలన్న పుస్తక ప్రేమికుల కోరిక ఇలా నెరవేరుతుంది. భవిష్యత్తులో పుస్తక ప్రదర్శనలను సంచార గ్రంధాలయాలుగా మార్చాలి. ఊరూరుకు పుస్తక సంతలను ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహంతో ప్రతిఊరుకు పుస్తక సంతలను నెలకొల్పేందుకు కృషిచేస్తాం. సమాజమార్పుకు, సంఘ ప్రగతికి పుస్తకాలు కూడా పనిముట్లుగా ఉపయోగపడతాయన్న అనేకమంది విజ్ఞుల ఆలోచనకు పుస్తక ప్రదర్శనలు దర్పణాలుగా నిలుస్తాయి. జూలూరీ గౌరీ శంకర్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
బీసీ జాబితాలో మరో 30 కులాలు!
సాక్షి, హైదరాబాద్ : సంచార జాతులకు చెందిన 30 కులాలను బీసీ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ రాసిన ‘బీసీ కులాలు-సంచార జాతులు’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటివరకు గుర్తించని సంచార జాతులను వెనుకబడిన తరగతులుగా గుర్తించలేదని అన్నారు. ఈ 30 కులాలను బీసీ జాబితాలో చేర్చవల్సిన ఆవశ్యకత ఉందని జూలూరు గౌరీశంకర్ సీఎం దృష్టికి తీసుకురాగా.. కేసీఆర్ స్పందించి.. సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చే విషయంపై అధ్యయనం చేయవల్సిందిగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకి బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగేళ్లుగా బీసీలు, సంచార జాతులకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయనాన్ని జూలూరు తన పుస్తకంలో వివరించారు. ఈ కార్యక్రమంలో కేకే, ఎంపీ వినోద్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రారండోయ్
నిజం కవితా సంపుటి ‘నివురు’ ఆవిష్కరణ ఏప్రిల్ 18న ఉదయం 10:30కు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. వక్తలు: పి.అంజయ్య, కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్, దేవిప్రియ, ఎన్.వేణుగోపాల్. కవిరాజ్ స్వర్ణోత్సవ(1968–2018) కవి సమ్మేళనం ఏప్రిల్ 21న సాయంత్రం 5 గంటలకు సాయి బృందావన్ ఫంక్షన్ హాలు, సూర్యాపేటలో జరగనుంది. ఇందులోనే కవిరాజ్ సాహితీ పురస్కారాన్ని జూలూరి గౌరీశంకర్‌కు ప్రదానం చేస్తారు. జి.జగదీశ్ రెడ్డి, వేణు ఊడుగుల అతిథులు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు శతకం ‘కోనసీమ శతకం’ ఆవిష్కరణ ఏప్రిల్ 21న సాయంత్రం 5:30కు అమలాపురంలోని ఎస్.కె.బి.ఆర్. కళాశాల ప్రాంగణంలో జరగనుంది. నిర్వహణ: త్రివేణి నృత్య గీత సాహిత్య కళావేదిక, అమలాపురం. శ్రీరామకవచం సాగర్ రచన ‘యాతన’ ఆవిష్కరణ ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు విజయవాడ బందరు రోడ్‌లోని టాగూర్ స్మారక గ్రంథాలయంలో జరగనుంది. మల్లెతీగ కార్టూన్ల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం కూడా జరగనుంది. తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతున్న ‘హైదరాబాద్ ఫెస్ట్’లో భాగంగా మఖ్దూం మొహియుద్దీన్ వేదిక మీద ‘సృజన స్వరం’ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21 వరకు ప్రతిరోజూ సాయంత్రం 5:30కు సాహిత్య సమావేశం, 7 గంటలకు కవి సమ్మేళనం జరగనున్నాయి. పోతులూరి వీరబ్రహ్మం జీవిత సాహిత్యాలపై రచనలను వెలువరిస్తున్నామనీ, మే 10లోపు వ్యాసాలు పంపమనీ కోరుతున్నారు ‘ప్రజాశక్తి’ జనరల్ మేనేజర్ కె.లక్ష్మయ్య. ఫోన్: 9490099057. ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా 1996 నుండి ఇస్తున్న ‘సహృదయ సాహితీ పురస్కారం’ కోసం 2017 సంవత్సరానికిగానూ 2013–17 మధ్య ముద్రించబడిన స్వీయ కథాసంపుటాలను ఆహ్వానిస్తున్నారు. కథకులు మూడు ప్రతులను 15 జూన్ లోగా కుందావజ్జల కృష్ణమూర్తి, ప్లాట్: 207, ఇం.నం. 2–7–580, సెంట్రల్ ఎక్సయిజ్ కాలనీ, హన్మకొండ– 506001 చిరునామాకు పంపవచ్చు. ఫోన్: 9849366652 -
కర్ణాటక కమిషన్ ఆదర్శనీయం
విశ్లేషణ బీసీల రిజర్వేషన్లు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం కోసం కర్ణాటక బీసీ కమిషన్ చేసిన కృషి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయంగా నిలుస్తోంది. బీసీ జనాభా గణనలో పూర్తి పారదర్శకతను ప్రదర్శించిన దాని పనితీరు తెలంగాణ బీసీ కమిషన్‌కు కూడా మార్గదర్శకమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయవలసిందిగా బీసీ కమిషన్‌ను ఆదేశించింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తమిళనాడు తరహాలో తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న దృఢనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే బీసీ(ఇ) గ్రాఫ్‌లో ఉన్న ముస్లింలకు 12% రిజ ర్వేషన్లను ప్రకటించారు. అలాగే బీసీలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలన్న తలంపులో ఉన్నారు. కర్ణాటకలో బీసీ కమిషన్ చేస్తున్న పనివిధానాన్ని, బీసీల రిజర్వేషన్ల కోసం చేస్తున్న కృషిని అధ్యయనం చేసేందుకు సెప్టెంబర్ 11,12 తేదీలలో బీసీ కమిషన్ కర్ణాటకకు వెళ్లింది. కర్ణాటక బీసీ కమిషన చైర్మన్ కాంతా రాజాతో, కమిటీ సభ్యులతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించింది. ఆ రాష్ట్ర కమిషన్ అనుభవాలు, వాళ్లకెదురైన సవాళ్లను తెలంగాణ బీసీ కమిషన్ తెలుసుకుంది. కర్ణాటక బీసీ కమిషన్ ఆ రాష్ట్రంలోని అన్ని వర్గాల, కులాల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ఎంతో శ్రమించింది. ఇందుకోసం ఆ రాష్ట్ర కమిషన్ మునుపటి బీసీ కమిషన్లు చేసిన కృషిని, పురోగతిని సమీక్షించింది. ప్రధానంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు కమిషన్ వేసే ప్రతి అడుగులో జాగ్రత్తలు తీసుకుంది. బీసీ కమిషన్ చేసే అధ్యయనాన్ని సవాల్ చేస్తూ కొందరు విమర్శలు చేశారు. కానీ కూడా దీక్షతో కర్ణాటక బీసీ కమిషన్ తన నివేదికను పూర్తిచేసింది. కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ సామాజిక, విద్యారంగాలలో మొత్తం కర్ణాటకలోని అన్ని కుటుంబాల దగ్గరకు వెళ్లి సర్వే చేసింది. ఈ సర్వేని 2015లో చేపట్టారు. ఈ సర్వేలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికపరంగా బీసీల స్థితిగతులు ఎలాగున్నాయో సమగ్రంగా సమాచారాన్ని సేకరించింది. మొత్తం సమగ్ర కుటుంబ సర్వేకు కమిషన్ తయారుచేసిన ధరఖాస్తుఫామ్ల రూపకల్పనకు ఎంతో శ్రమించారు. జనాభా గణనకు ఈ సర్వే ఫామ్ ప్రాణంలాంటిది. ఇందులో 55 ప్రశ్నలతో ఫామ్ 3ను తయారు చేశారు. ఈ ఫామ్‌లో సర్వేకు సంబంధించి కులాల వారీగా కోడ్‌నెంబర్లు ఇచ్చారు. ఒక వేళ కమిషన్ దృష్టికి రాని కులాలు ఉంటే వాటిపేర్లను ఆ ధరఖాస్తు ద్వారా ఆ లిస్టులో రాతపూర్వకంగా రాయిం చారు. ఫామ్ 3లో 55 ప్రశ్నలను ఆ నేపథ్యంలోనే తయారు చేశారు. సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయపరమైన వెనుకబాటుతనాలపైన కూడా ప్రశ్నలున్నాయి. ఫామ్ 3లో 1 నుంచి 30 ప్రశ్నల వరకు వ్యక్తిగత సమాచారం, చదువు, వృత్తి, ఉద్యోగం, ఓటర్‌కార్డు, ఆధార్‌కార్డు, వ్యవసాయం, రాజకీయం, సామాజిక అంశాలపై ప్రశ్నలున్నాయి. 40% నుంచి 55% వరకు కుటుంబ వివరాలు, ఏ కుటుంబానికి ఎంత ఆస్తి ఉంది? తదితర వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ సర్వే అంతా ఎన్యుమరేటర్స్ ద్వారా చేశారు. వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి దానిపై సంతకం చేయాలి. ఆ వ్యక్తిగత సమాచారంతో పాటు ల్యాండ్‌ఫోన్, సెల్ నెంబర్లను కూడా ఈ దరఖాస్తుపై రికార్డు చేశారు. ఇలా తీసుకున్న సమాచారం సరైనదని రూఢీగా చెప్పగలగాలి. అందుకే ఫామ్ 3ను తయారు చేయటం జరిగింది. ఈ సర్వే ద్వారా సమాజాన్ని విభజిస్తున్నారని, కమిషన్ చేపట్టిన జనాభాగణన సక్రమంగా లేదని కూడా కొందరు ఆరోపణలు చేశారు. వీటన్నింటికీ సమాధానంగా కమిషన్ ఫామ్ 3ను ఆధారంగా నిలిపింది. 3 దశల్లో పని విస్తరణ: జనాభా గణనకు, గడపగడప సర్వేను చేపట్టడం కర్ణాటక కమిషన్‌కు కత్తిమీద సాముగా మారింది. దీనికోసం అపాయింట్మెంట్, ట్రైనింగ్, ఫీల్డ్ వర్క్ అన్న మూడు దశలలో పనిచేశారు జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్లు, కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈఓలు జిల్లాల్లో జరిగే సమగ్ర కుటుంబ సర్వేకు అగ్రభాగాన నిలిచారు. ఎన్యుమరేటర్లకు ప్రత్యేక శిక్షణ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిం చిన జనాభాలెక్కల సమాచార సేకరణలో అనుభవమున్న వ్యక్తులను ఎన్యుమరేటర్లుగా నియమించుకోవటంతో పాటు వీరికి ప్రత్యేక శిక్షణనివ్వాలి. వీరిని గైడ్ చేసేందుకు రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో శిక్షణాకార్యక్రమాలు చేపట్టారు. జనాభా గణనలో టీచర్లే కీలకం: మనదేశంలో జనాభాగణన విషయంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. ఒక ఎన్యుమరేటర్‌కు 120 నుంచి 130 కుటుంబాల వరకు సర్వే చేయాలి. కర్ణాటకలో మొత్తం 1 కోటి 33 లక్షల కుటుంబాలున్నాయి. వీరి కుటుంబాల నుంచి సమాచారం సేకరించేందుకు 1.60 లక్షల మంది ఎన్యుమరేటర్లను ఎంచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన కులగణనను 2015 ఏప్రిల్ 11 నుంచి 30 వరకు కర్ణాటకలో 20 రోజుల్లోనే పూర్తి చేశారు. గ్రామాల్లో కులవృత్తి ద్వారా చేస్తున్న పని, కులానికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఈ వర్గాలవారు ఉత్సాహంగా ముందుకొచ్చారు. బెంగుళూరు, మైసూరు, వంటి ప్రధాన పట్టణాలల్లో 3 సార్లు ప్రత్యేకంగా సర్వేచేశారు. సర్వే ఫామ్‌ల కోసం నిపుణుల కమిటీ: 1,2,3 సర్వేఫామ్లు తయారు చేయటానికి కమిషన్ మేధావులతో సమావేశాలు జరిపి నిపుణుల కమిటీలను వేసింది. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏఏ కులాలు ఎలా వెనుకబడివున్నాయో సమగ్ర సమాచారం సేకరించాలని నిపుణుల కమిటీ కర్ణాటక కమిషన్‌కు సూచిం చింది. అర్బన్స్లమ్లు, రూరల్ స్లమ్లతో పాటు బాగా వెనుకబడిన వర్గాలు, సంచారజాతులపై 7 నుంచి 8 వరకు ప్రశ్నలు రూపొందిం చారు. ఈ సూచనలతోపాటు వెనుకబాటుతనాన్ని ఎలా తేల్చిచెప్పాలన్న దానిపై కర్ణాటక కమిషన్ ప్రజాభిప్రాయసేకరణను కూడా చేపట్టింది. ప్రాథమిక డేటా, సెకండరీ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ డేటా ఈ రెండిం టిని క్రాస్‌చెక్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ డేటా కోసం పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు సమగ్ర సమాచారం తీసుకోవాలి. సెక్రటేరియట్ దగ్గర నుంచి వివిధ ప్రభుత్వశాఖల నుంచి అన్ని రకాల ఉద్యోగుల సమాచారాన్ని సేకరించాలి. ఇలా సేకరించిన సమాచారంతో ప్రాథమిక డేటాను సెకండరీ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ డేటాతో లెక్కకట్టి చూడాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో జరిపిన సర్వేకు బలం చేకూరుతుంది. ఇలా కర్ణాటక బీసీ కమిషన్ చేసిన కృషికి తుది రూపం వచ్చింది. 2015లో దేవరాజ్ ఆర్స్ జయంతి సందర్భంగా కర్ణాటక బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికనిచ్చింది. ఇపుడు బీసీల కోసం చేసిన సమగ్రమైన నివేదికను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. కర్ణాటక బీసీ కమిషన్ బీసీల జనగణనకోసం చేసిన సర్వే తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలకూ శాస్త్రీయ ప్రాతిపదికను కల్పిస్తోంది. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
నవ నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలెవరు?
తెలంగాణ రాష్ట్రం భవిష్యత్‌ను కలగంటున్న చారిత్రక సందర్భమిది. కొత్త ఆలోచనలకు పురుడు పోసుకుంటున్న తరుణంలో బంగారు తెలంగాణను విద్యార్థి యువజనుల చేతులతోనే నిర్మించాలి. అందుకు యువతను మహా సైన్యంగా మార్చాలి. గ్లోబల్ సంస్కృతి గూట్లో చిక్కుకొంటున్న యువతను తన మట్టిపై గౌరవం కలిగించటం కంటే మించినది మరొకటి లేదు. ప్రతివారిలో వ్యక్తిత్వ వికాసం వెల్లివిరియాలి. కానీ అది సామా జిక వికాసానికి దోహదపడాలి. వ్యక్తులు శక్తివంతులు కావాలి. అది సమాజాన్ని సుసంపన్నం చేసే శక్తిగా మారాలి. ఏ నేల తనను పెంచి పెద్ద చేసిందో, ఏ నేల తనను ఇంత వాణ్ణిగా తీర్చిదిద్దిందో, ఆ మట్టిపై ప్రజలు పడే బాధలను పార ద్రోలటమే ఆ నేల బిడ్డలుగా తాము చేయాల్సిన కర్తవ్యం అన్నది మరువరాదు. అదే సామాజికమైన జ్ఞానం. ఈ సామాజికమైన చింతన యువతరంలో ఎంత విస్తృతంగా వాపిస్తే ఆ ప్రాంతం తద్వారా దేశం అంత వేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. కొత్త సమాజ నిర్మా ణాలు యువత పిడికిళ్ల నుంచే పురుడు పోసుకుంటాయి. ఉరవళ్లు పరవళ్లు తొక్కే యువతరంలోని మహత్తర శక్తిని నవ నిర్మాణానికి మళ్లించగలిగితే 29వ రాష్ట్రంగా తెలంగాణ మహోజ్వలంగా వెలుగొందుతుంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎగిసిపడ్డ ఉద్యమ చైతన్యం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా అదే స్ఫూర్తి కొనసాగాలి. వెనుకబడిన ప్రాంతం, దారిద్య్రం, పేదరికం తాండవిస్తున్న తెలంగాణను సంపన్న రాష్ట్రంగా మార్చాలి. తెలంగాణ భూముల్లో సాంకేతిక పరిజ్ఞానం వెల్లివిరిసి సాంకేతిక తెలంగాణగా మారాలి. అందరికీ విద్య, ప్రతి వ్యక్తి ఉద్యోగం పొందే విధంగా శక్తివంతమైన తెలంగాణ నిర్మించబడాలి. ఆకలికేకలు వినిపించని మరో కొత్త తెలంగాణను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వూరు పసిడి పచ్చని సంపదల పాన్పుగా మారాలి. ప్రతి పట్టణం ప్రతి నగరం అన్ని వసతులతో తులతూగాలి. ఇప్పటి వరకు చూసిన కాలానికి భిన్నంగా భవిష్యత్‌ను కలగంటున్న చారిత్రక సందర్భమిది. కొత్త ఆలోచనలకు పురుడు పోసుకుంటున్న తరుణంలో బంగారు తెలంగాణను విద్యార్థి యువజనుల చేతులతోనే నిర్మించాలి. అందుకు యువతను మహా సైన్యంగా మార్చవలసి ఉంది. గ్లోబల్ సంస్కృతి గూట్లో చిక్కుకొంటున్న యువతను తన మట్టిపై గౌరవం కలిగించటం కంటే మించినది మరొకటి లేదు. తెలంగాణ యువత, విద్యార్థులు ఉద్యమంలో సివంగుల్లా దూసుకుపోయారు. ఇదే చైతన్యపు దూకుడు ను నవ తెలంగాణ నిర్మాణంలోనూ కొనసాగించాల్సి ఉంది. యువత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంది. తొలి తెలంగాణ ప్రభుత్వం కూడా అందుకు కార్యరంగ భూమిక కోసం కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం ఉద్యమ నెలబాలుని దశ నుంచి పాలనా పగ్గాలను అందుకుని కొత్త రచనకు శ్రీకారపు అడుగులు వేస్తుంది. కొత్త అంశాలు ముందుకు వస్తున్నాయి. కొత్త సవాళ్లు ముందుకొస్తున్నాయి. ఈ కష్టాల బండిని నడిపించేందుకు పాలకుల చిత్త శుద్ధి, పాలనా యంత్రాంగం నిమగ్నతలకు తోడుగా తెలం గాణ యువ చైతన్యసైన్యం అండగా నిలవాలి. ఈ యవ్వ న తేజం ఉట్టిపడే విద్యార్థి యువజనులు నవ తెలంగాణ నిర్మాణానికి నడుంకట్టే సాహస యోధులుగా మారాలి. తమ చదువులు తాము చదువుకుంటూ విద్యారంగంలో దూసుకుపోతూనే సమాజ నిర్మాణ పనుల్లో పని చేసే విధంగా వారు తయారు కావాలి. ఆ విద్యార్థి యువజ నులు సామాజిక చింతనతో ముందుకు సాగినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో అన్నీ చక్కబడతాయి. తాము పుట్టి పెరిగిన మట్టిపై మమకారాన్ని రేకెత్తిస్తూ సిలబస్‌లో లేని పాఠాలను పిల్లలకు చెప్పే మహత్తర కర్తవ్యాన్ని ఉపాధ్యా యులు, అధ్యాపకులు తమ భుజస్కంధాలపై వేసుకోవా లి. సిలబస్‌లో పాఠ్యాంశాలు చెప్పటం వాటికి స్థానిక విషయాలను జోడించి బోధనలు చేయాలి. ఆ స్కూలు ఉన్న ప్రాంగణం దగ్గర నుంచి, ఊరు, మండలం, డివిజ న్, ఆ జిల్లాకు సంబంధించిన వక్తృత్వ వ్యాసరచనల పోటీ లు నిర్వహించాలి. ‘పుట్టుకనీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అన్న కాళోజీ కవిత్వ పంక్తుల సారాన్ని కొత్తతరం పిల్లలకు ప్రాథమిక దశ నుంచే నూరిపోయాలి. తెలంగాణ సంస్కృతిని, ఈ నేల కోసం పోరాడిన వీరుల చరిత్రను చెప్పి విద్యార్థుల్లో సృజనను రగిలించాలి. పాఠ్యాంశాలతో పాటుగా తను పుట్టి పెరిగిన మట్టిపై మమకారం పెంచగలిగితే కొత్తతరాన్ని తెలంగాణ పునర్నిర్మాణానికి పునరంకితం అయ్యేలా చేయవచ్చును. అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కొనే యువతే ఇది తమ పనికాదను కుని వదిలేస్తే ఎన్నెన్నో దుర్మార్గాలు జరుగుతాయి. ఒక ఊర్లో, ఒక పట్టణంలో యువత కలిసికట్టుగా చేసే మంచి పనులు ఇతర ప్రాంతాలకు ప్రేరణగా మారుతాయి. ఊర్లో ఉన్న వేల యువ పిడికిళ్లు ఒక్కటైతే బండలను సైతం పిండిచేయగలరు. పూడిపోయిన చెరువును పూడిక తీయ టానికి యువత శపథం చేస్తే ఊరు ఊరంతా కదలి వస్తుంది. యువత తమ చేతులతో పచ్చని మొక్కలు నాటి తే దానికి ఊరంతా నీరు పోసి పెంచుతుంది. తాగటానికి నీళ్లులేకపోతే జలవృద్ధి చేయటానికి ఏం చేయాలో? ఉన్న జలాలను ఎలా సంరక్షించుకోవాలో? నీళ్లను మళ్లించటా నికి ప్రజలంతా ఎలా నడుంగట్టాలోనన్న వెంటాడే సమ స్యలకు కూడా తమ చేతులతో చేయగలిగిన పరిష్కార మార్గాలను యువత చేసే చూపించగలదు. ఈ తరం విద్యార్థులు చేసే పునర్నిర్మాణ పనులకు పూర్వ విద్యార్థులు సంపూర్ణ చేయూతనివ్వాలి. దేశ దేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులంతా తీమ తమ ఊళ్లలో చేపట్టే పనులకు సంపూర్ణ సహకారం అందించాలి. విదేశా ల్లో ఉన్న తెలంగాణ పూర్వ విద్యార్థులు దేశ దేశాల్లో స్థిర పడ్డవాళ్లు ఆర్థిక, హార్ధిక చేయూతనందిస్తే ఊహించనంత అభివృద్ధి జరుగుతుంది. ఈ క్రమంలోనే చితికిపోతున్న పల్లెలను, కన్నీరు పెడుతున్న అభివృద్ధి దశ వైపునకు తీసుకుపోగలుగుతాం. సర్వరంగాలను ప్రక్షాళన చేసేందు కు చైతన్యవంతమైన యువతరం ముందుకు సాగితే మొత్తం ప్రజాక్షేత్రాలను చైతన్యవంతం చేయగలుగుతారు. అన్యా యాలని ప్రతిఘటిస్తూ.. అక్రమాలను తరిమి కొడుతూ.. మనిషిని మనిషి గౌరవించే మానవీయ సమాజ నవ నిర్మా నానికి యువతరమా.. అదను ఇదే కదలిరమ్ము. యువతరం లక్ష్యాల పిడికిళ్లనించే నవ సమాజ నిర్మాణం జరగాలి. (వ్యాసకర్త, కవి, సీనియర్ జర్నలిస్టు) -
దప్పిక తీర్చే జలమార్గం వాటర్‌గ్రిడ్
చెరువులు, మంచినీటి వ్యవస్థ, రోడ్లు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల వంటి సామూహిక ప్రయోజనాలను పాలకులు నిర్లక్ష్యం చేయటం వల్లనే పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. ఇంతకాలం నీళ్లొదులుకున్న మంచినీళ్ల అంశాన్ని జలమార్గం పట్టిస్తానని కేసీఆర్ ప్రకటించడం కోట్లాది మంది హర్షించే అంశం. ఎక్కడైనా నదులు లేని చోట కూడా వంతెనలు నిర్మిస్తామని రాజకీయ నేతలు హామీ ఇస్తార న్నది జనసామెతగా మా రింది. కానీ రాజకీయ నేతలు ఎలా ఉండాలో ఆచరణాత్మకంగా చూపిన దార్శనిక నాయ కులు కూడా అనేక మంది ఉన్నారు. ప్రజలకు సాగు, తాగునీరు అందించిన రాజులు కూడా మనకు చరిత్ర పుటల్లో కనిపిస్తారు. కాకతీయుల కాలంలో, నిజాం పాలనలో నీటి వనరుల విని యోగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కాకతీయుల కాలంలో తవ్విన చెరువులే ఇప్ప టికీ తెలంగాణలో ప్రజల దప్పిక తీర్చు తున్నాయి. వరంగల్‌లో పాకాల చెరువు, రామప్ప చెరువు, ఇబ్రహీంపట్నం చెరువు వంటి అనేక పెద్ద చెరువులకు లింకు చెరువుల వ్యవ స్థను నెలకొల్పి, చెరువులను తవ్వించి సాగు తాగునీటి వసతులు తీర్చారు. తెలంగాణకు గుండెకాయగా ఉన్న చెరువు ల వ్యవస్థ క్రమంగా ధ్వంసమయ్యింది. ఇప్పు డు తెలంగాణ సాగు, తాగునీటి విషయంలో కటకటలాడుతోంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో కూడా వరి పంట ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు తెలంగాణ అన్నపూర్ణ కరీంనగర్ జిల్లాలో కూడా మంచినీటి సమస్య ఉంది. మొత్తం 10 జిల్లాల్లో మంచినీటి దాహార్తిని తీర్చటం అతి ముఖ్య తక్షణ కర్తవ్యం గా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసి గడప గడపకూ మంచి నీటి సౌకర్యం కల్పిస్తాననే పనిని భుజం మీద వేసుకున్నారు. హైదరాబాద్‌లో మంచినీటి సమస్య తీర్చటానికి నిజాం ప్రభుత్వంలో నాటి ఇంజ నీర్ అలీనవాబ్జంగ్ బహుదూర్ ఎంతో కృషి చేశారు. 1908లో హైదరాబాద్‌ను వరదలు ముంచేసినప్పుడు మోక్ష గుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ నీటి వసతిపై ప్రత్యేక ప్రణాళిక తయారు చేశాడు. అలీన వాబ్ జంగ్ కృషితో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, జలాశ యాలను నిర్మించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ను నిర్మించారు. ఇప్పటికీ హైదరాబాద్ దాహార్తిని ఆ రెండు సాగరాలే తీరుస్తున్నాయి. నిజాం పాలన తర్వాత మొత్తం తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించి దాహార్తి తీర్చేందుకు కేసీఆర్ మంచినీటిని అందించే వాటర్‌గ్రిడ్ పథకానికి రచన చేశారు. విప్లవ పోరాటాలకు, కమ్యూనిస్టు ఉద్య మాలకు ఎర్రగడ్డగా చరిత్రకెక్కిన పోరాటాల పోతుగడ్డ నల్లగొండ ఇప్పుడు ఫ్లోరోసిస్ పెను భూతం వల్ల వంకర్లు కొంకర్లు తిరిగింది. ఫ్లోరోసిస్‌తో మరుగుజ్జుగా మారింది. అంగ వైకల్యానికి గురైంది. లక్షలాది మంది ప్రజలు దీనావస్థ పాలయ్యారు. ఈ సమస్యపై నాటి ఉద్యమకారుడు దుశ్చర్ల సత్యనారాయణ తన జీవితాన్నే అంకితం చేసి పోరాడాడు. అయినా పాలకుల మనసు కరుగలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా పాదయాత్ర చేపట్టిన కేసీఆర్ నల్లగొండ పర్యటనల్లో ఫ్లోరో సిస్ బాధితులను చూసి చలించిపోయాడు. కలం బట్టి పాట రాశాడు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని 2014 ఎన్నికల పర్యటనల్లో గర్జించాడు. అందులో భాగంగానే తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాలకు నీటి సరఫరా విభాగం ద్వారా కోట్ల మందికి నీళ్లందిస్తున్నారు. 9 జిల్లాల్లో 146 సమగ్ర నీటి పథకాలు, 15,040 రక్షిత మంచి నీటి పథకాలు, 9019 మినీవాటర్ సప్లయ్ స్కీములు 6,506 నేరుగా నీటి పంపిణీ పథకం స్కీములు, 1,59,312 చేతి పంపుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. వేలాది గ్రామాల్లో లక్షలాది మం ది ప్రజలకు ఈ నీటి సరఫరాను నిత్యం చేస్తున్నారు. అయినా అందరికీ తాగునీరు అందటంలేదని ప్రభుత్వ లెక్కలే తేల్చి చెబుతున్నాయి. అందుకే మొత్తం తెలం గాణ రాష్ట్రానికి నీటిని అందించేందుకు 1 లక్ష కిలోమీటర్ల మేరకు వాటర్ సప్లయ్ గ్రిడ్ పథకం ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టబోతున్నారు. తెలం గాణ వాటర్ గ్రిడ్ పథకాన్ని నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభించారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించి తీరు తామన్న దానికి సిద్ధిపేటలో నీటి పారుదల ప్రాజెక్టును కేసీఆర్ 16 నెలల్లో పూర్తి చేయటమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. 20 ఏళ్ల క్రితమే ఆనాటి సిద్ధిపేట శాసనసభ్యుడు కేసీఆర్, సిద్ధిపేటకు చెందిన ఇంజనీర్లు కలసి శ్రమించి 185 గ్రామాలకు దాహార్తి తీర్చగలిగారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో గడపగడపకూ నీరందించే భగీరథ యత్నానికి నేడు శ్రీకారం చుట్టారు. గతంలో తాను పూర్తి చేసిన సిద్ధిపేట నీటి పారు దల ప్రాజెక్టు విషయాన్ని గుర్తు చేసి అధికార యంత్రాంగంలో స్ఫూర్తి కలిగించారు. కేసీఆర్ దార్శనికత నుంచి పుట్టుకొచ్చిన వాటర్ గ్రిడ్ పథకం నాలుగేళ్లలో రూపుదాల్చి దోసిళ్లలోకి మంచినీళ్లు రావటాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. వాటర్ గ్రిడ్ నిర్మాణంలో పాలు పంచుకునే ఇంజనీర్లకు, మొత్తం పాలనా యం త్రాంగానికి, తోటి శాసనసభ్యులకు తన ఆచర ణాత్మక అనుభవాన్ని సీఎం చెబుతున్నారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా ఏ నాయకుడూ చేయని ప్రకటనను కూడా కేసీఆర్ ప్రకటిం చారు. రాబోయే నాలుగేళ్లలో గడపగడపకూ మంచినీళ్లు అందించలేకపోతే మాకు ఓట్లెయ్య కండి అని ధైర్యంగా ప్రకటన చేశారు. ఇది సామాన్యమైన ప్రకటన కాదు. పని చేయకపోతే ఓట్లు వెయ్యకండని చెప్పిన నాయకుడిగా కూడా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతాడు. ఈ సంకల్పం నెరవేరితే ఫ్లోరోసిస్ పెనుభూతాన్ని పారదోల వచ్చును. బంగారు తెలంగాణకు ఈ వాటర్ గ్రిడ్ పథకమే తొలిబాటలు వేయాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల విద్య కేసీఆర్ దగ్గరుంది. వాటర్‌గ్రిడ్ పథకం విజయవం తమైతే ప్రజల దోసిళ్లలోకి మంచినీళ్లు వస్తాయి. పథకాలు ప్రజల గొంతులో మంచినీళ్లు కావటం కంటే మించినది మరొకటి లేదు. (వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్టు) -
అమ్మలాంటి చెరువు ఊరికి ఊపిరి
చెరువు ఒక సామాజిక జీవన విధానం. అది దెబ్బతిన్న తర్వాతనే గ్రామాలు కథ తప్పాయి. కాకతీయుల కాలం నాటి చెరువులను పునరుద్ధరించే పనికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టటాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నా యి. ‘‘మన ఊరు - మన చెరువు’’ ప్రభుత్వ నినాదం కాదు, ఇది మనందరి తల్లి రుణం తీర్చుకునే కర్తవ్యం. చెరువుల పునర్నిర్మా ణం అన్నది మహాసం కల్పం. దీన్ని కేవలం ప్రభుత్వ పనిగా చూడ రాదు. చెరువుకు తిరి గి ప్రాణం పోయట మంటే అది ఊరికి ప్రాణం పోసినట్లే.. ఊరికి జవసత్త్వాలను అందించిన చెరువుకు ఇప్పు డు సమాజమంతా సత్తువనిచ్చి మళ్లీ నిండా నీళ్లతో కలువపూలతో, మత్తడికాడ నీళ్ల అలుగుల దుము కులతో కళకళలాడే టట్లు చేయాలి. ప్రజలందరూ కలసి పనిచేసే మహాద్భుత ఆవిష్కరణ ఇది. ప్రభు త్వ పని అంటే ప్రజల పనే అయినప్పటికీ అది ప్రభుత్వమే చేసుకుపోతుందనే భావనను పాలకు లే కల్పించారు. మార్కెట్ సమాజంలో వ్యక్తిత్వ వికాసాలు హైబ్రీడ్ పంటగా మహా ఏపుగా పెరిగి పోయి సామాజిక వికాసం బాగా పలుచబడేటట్లు చేసింది. మార్కెట్ సమాజం కానరాని శత్రువు. అది సామాజిక చింతనను, సామాజిక జీవనాన్ని చిద్రం చేస్తుంది. విశేషమేమిటంటే మార్కెట్ సమా జాన్ని మన పాలకులే పెంచి పోషించారు. అందుకే అది చివరకు పాలకులకు కూడా శాపంగా మారిం ది. మార్కెట్ సమాజ మత్తు నుంచి ప్రజలను బైట పడేసే ప్రజాప్రభుత్వాలే విజయం సాధిస్తాయి. చెరువుల పునర్నిర్మాణం చేయటం అంటే మ న ఊరిని మనం బాగు చేసుకోవటమే అవుతుంది. మన ఊరి చెరువును బతికించి తిరిగి దానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సమాజమంతా కదలివెళ్లి పనికి శ్రీకారం చుట్టడాన్ని రాజకీయాలకు అతీత మైన మంచి పనిగా ప్రజలు భావిస్తున్నారు. చెరు వుల పునర్నిర్మాణానికి ప్రతి ఒక్క మనిషి తన శక్తికొద్దీ సాయం చేసే దిశగా ఆలోచనలు సాగిం చటం, గడపగడప ఇందులో పాలు పంచుకునేం దుకు ముందుకు రావటంతో ఇది ప్రజలందరి ఉమ్మడి పనిగా మారింది. సకల పనులు కలిసి సామూహిక గీతంగా మారటం కంటే ఉన్నతమై నది మరేముంటుంది. కన్నతల్లి లాగా ఊరును పెంచి పెద్ద చేసిన చెరువుకు ఇప్పుడు తన బిడ్డలే సేవ చేసే మహత్తర అవకాశం అపురూపమైనది. చెరువు సర్వసమగ్రంగా రూపుదిద్దుకునే విధంగా అన్ని పనులూ చేపట్టాలి. విద్యార్థులం దరికీ చెరువు పునర్నిర్మాణం అన్నది సిలబస్‌లోని పాఠ్యాంశం చేయాలి. తెలంగాణలోని విద్యాలయా లు చెరువుల పునర్నిర్మాణంలో సంపూర్ణంగా భాగ స్వామ్యం అయితే మరిన్ని మంచి ఫలితాలు వస్తా యి. చెరువుకు సంబంధించిన చరిత్రనంతా విద్యా ర్థులకు ఉపాధ్యాయ లోకం బోధించి ప్రేరకులుగా నిలవాలి. విద్యార్థుల ఒంటికి మట్టి రాసుకోకపోతే నవ నిర్మాణం జరగదు. అందుకే తొలి మెట్టుగా చెరువుల నిర్మాణంలో యువత పాల్గొనాలి. తెలంగాణలో ఉన్న ప్రతి విద్యాసంస్థ తమకున్న స్థోమ తను బట్టి ఈ పునర్నిర్మాణంలో పాలు పంచుకుం టామని ప్రమాణం చేయటంతో పాటుగా, చెరువు లను దత్తత తీసుకునేందుకు ముందుకురావాలి. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందు కు వస్తే చాలా చెరువులకు పునర్జన్మను కలిగించి నట్లవుతుంది. ప్రభుత్వం తన పని తాను చేసుకు పోతుంది. ప్రజల భాగస్వామ్యం ఉంటే దానికి తిరుగుండదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తట్టమోసి, మట్టి ఎత్తి ఈ పనికి శ్రీకారం చుట్టేందు కు సిద్ధమవుతున్నారు. చెరువుల పునర్నిర్మాణంలో ప్రజా ప్రతినిధులే స్వచ్ఛందంగా పాల్గొంటే ప్రజలు తప్పకుండా వాళ్ల కు అండగా నిలుస్తారు. ఒకపూట తట్టమోసి రావ టం కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ఆ పని పూర్తయ్యే వరకు అందులో పూర్తిగా భాగస్వాము లు కావాలి. చెరువు పునర్నిర్మాణం జరిగి చెరువు నిండా నీళ్లు వస్తే ఎండిన ఊరు పచ్చగా మారుతుం ది. హరిత తెలంగాణకు చెరువే పునాది. గ్రామ స్వ రాజ్యం విలసిల్లాలంటే చెరువే పునాది. మన చెరు వుల్ని సచ్చుపడేటట్లు చేశాకే ఊరికి జవ సత్వాలు పోయాయి. తెలంగాణ గ్రామీణ జీవనం మళ్లీ కళకళలాడాలంటే చెరువు సజీవంగా నిలబడాలి. చెరువు ఒక సామాజిక జీవన విధానం. ఆ సామాజిక జీవన విధానం దెబ్బతిన్న తర్వాతనే గ్రామాలు కథ తప్పాయి. చెరువు నిండా నీళ్లు ఉన్న ప్పుడు ఊరు ఆర్థికంగా శక్తివంతంగా ఉండేది. మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా జీవనా ధానం చెరువు నిలబడింది. చెరువు వర్షాకాలం పంటలకు నీళ్లనందించి, భూముల్లో జలాలను సంరక్షించేది. చెరువుల ద్వారా పంటలు మాత్రమే గాక ఊరిని హరిత వనంగా మార్చేది. చెరువుల్లో తీరొక్క చేపలతో జలసంపదగా తులతూగేది. ఎ న్నో పక్షులకు నివాస కేంద్రమిది. ఎండాకాలం ఎండిపోయిన తర్వాత కూడా చెరువు మట్టిగా తిరి గి పొలానికి ఉపయోగపడేది. మళ్లీ వర్షాకాలంలో సంపూర్ణంగా నీళ్లతో నిండి గ్రామ నిర్వహణ దారుడుగా నిలబడేది. అలాంటి చెరువులు, ఊర్లను కలిపే గొలుసు కట్టు చెరువులు పూడిపోయాక దానిపై ఆధారపడ్డ వ్యవసాయరంగం తీవ్రంగా దెబ్బతిని ఊరు కళ తప్పింది. కాకతీయుల కాలం నాటి 13వ శతాబ్దపు చెరువులను పునరుద్ధరించే పనికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టటాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమం చెరువుల పునర్నిర్మాణం. అమ్మలాంటి చెరువును కాపాడు కోవటం ప్రతిపౌరుని విధి. ఇప్పుడు మన చెరువుల్ని తిరిగి గంగాళాలుగా మార్చుకుందాం. ప్రతి పౌరుణ్ణి, పౌరురాలిని ఇందులో భాగస్వామి ని చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన, విద్యార్థి సంఘాలు, ప్రచార ప్రసార సాధనాలు నడుం బిగించాలి. ‘‘మన ఊరు - మన చెరువు’’ అన్నది కేవలం ప్రభుత్వ నినాదం కాదు, ఇది మనందరి తల్లి రుణం తీర్చుకునే కర్తవ్యంగా మారాలి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) -
పాఠ్యాంశాలుగా తెలంగాణ చరిత్ర
తెలంగాణ యాస, సంస్కృతిని సిలబస్‌లో పెట్టాలి: టీ-రచయితల వేదిక తీర్మానం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మట్టిపోరు చరిత్రను పాఠ్యాంశాలుగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రచయితల వేదిక(తెరవే) అభిప్రాయపడింది. పాలకులు తమ అధికార గద్దెలకు ప్రమాదాలు వాటిల్లే అంశాలను సిలబస్‌లో చేర్చేందుకు ఒప్పుకోరని, అందుకోసం అవసరమైతే మరో పోరాటం సాగించాల్సి ఉంటుందని పలువురు విద్యావేత్తలు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యా య సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటయోధుడు భీంరెడ్డి నరసింహారెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకొని ‘పాఠ్యాంశాలలో పోరువీరుల చరిత్ర’ అనే అంశంపై గురువారం హిమాయత్ నగర్లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. తెరవే అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏ దిక్కుగా ప్రయాణం చేయాలన్న అంశంపై ఉపాధ్యాయ లోకమే దిశానిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యాస, సంస్కృతిని సిలబస్‌లో పెట్టాలన్నారు. భీంరెడ్డి నరసింహారెడ్డితో పాటు వీర తెలంగాణ పోరాటయోధుల చరిత్రను, 1969, ఇప్పటి మలిదశ పోరు ఘట్టాలను విద్యార్థులకు బోధించాలన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ ఎం.వేదకుమార్, ఇంటర్ విద్యాజాక్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.