అమ్మలాంటి చెరువు ఊరికి ఊపిరి | Ammalanti the pond in order to breathe | Sakshi
Sakshi News home page

అమ్మలాంటి చెరువు ఊరికి ఊపిరి

Published Mon, Nov 24 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

అమ్మలాంటి చెరువు ఊరికి ఊపిరి

అమ్మలాంటి చెరువు ఊరికి ఊపిరి

చెరువు ఒక సామాజిక జీవన విధానం. అది దెబ్బతిన్న తర్వాతనే గ్రామాలు కథ తప్పాయి. కాకతీయుల కాలం నాటి చెరువులను పునరుద్ధరించే పనికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టటాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నా యి. ‘‘మన ఊరు - మన చెరువు’’ ప్రభుత్వ నినాదం కాదు, ఇది మనందరి తల్లి రుణం తీర్చుకునే కర్తవ్యం.
 
చెరువుల పునర్నిర్మా ణం అన్నది మహాసం కల్పం. దీన్ని కేవలం ప్రభుత్వ పనిగా చూడ రాదు. చెరువుకు తిరి గి ప్రాణం పోయట మంటే అది ఊరికి ప్రాణం పోసినట్లే.. ఊరికి జవసత్త్వాలను అందించిన చెరువుకు ఇప్పు డు సమాజమంతా సత్తువనిచ్చి మళ్లీ నిండా నీళ్లతో కలువపూలతో, మత్తడికాడ నీళ్ల అలుగుల దుము కులతో కళకళలాడే టట్లు చేయాలి. ప్రజలందరూ కలసి పనిచేసే మహాద్భుత ఆవిష్కరణ ఇది. ప్రభు త్వ పని అంటే ప్రజల పనే అయినప్పటికీ అది ప్రభుత్వమే చేసుకుపోతుందనే భావనను పాలకు లే కల్పించారు.

మార్కెట్ సమాజంలో వ్యక్తిత్వ వికాసాలు హైబ్రీడ్ పంటగా మహా ఏపుగా పెరిగి పోయి సామాజిక వికాసం బాగా పలుచబడేటట్లు చేసింది. మార్కెట్ సమాజం కానరాని శత్రువు. అది సామాజిక చింతనను, సామాజిక జీవనాన్ని చిద్రం చేస్తుంది. విశేషమేమిటంటే మార్కెట్ సమా జాన్ని మన పాలకులే పెంచి పోషించారు. అందుకే అది చివరకు పాలకులకు కూడా శాపంగా మారిం ది. మార్కెట్ సమాజ మత్తు నుంచి ప్రజలను బైట పడేసే ప్రజాప్రభుత్వాలే విజయం సాధిస్తాయి.
 
చెరువుల పునర్నిర్మాణం చేయటం అంటే మ న ఊరిని మనం బాగు చేసుకోవటమే అవుతుంది. మన ఊరి చెరువును బతికించి తిరిగి దానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సమాజమంతా కదలివెళ్లి పనికి శ్రీకారం చుట్టడాన్ని రాజకీయాలకు అతీత మైన మంచి పనిగా ప్రజలు భావిస్తున్నారు. చెరు వుల పునర్నిర్మాణానికి ప్రతి ఒక్క మనిషి తన శక్తికొద్దీ సాయం చేసే దిశగా ఆలోచనలు సాగిం చటం, గడపగడప ఇందులో పాలు పంచుకునేం దుకు ముందుకు రావటంతో ఇది ప్రజలందరి ఉమ్మడి పనిగా మారింది. సకల పనులు కలిసి సామూహిక గీతంగా మారటం కంటే ఉన్నతమై నది మరేముంటుంది. కన్నతల్లి లాగా ఊరును పెంచి పెద్ద చేసిన చెరువుకు ఇప్పుడు తన బిడ్డలే సేవ చేసే మహత్తర అవకాశం అపురూపమైనది.
 
చెరువు సర్వసమగ్రంగా రూపుదిద్దుకునే విధంగా అన్ని పనులూ చేపట్టాలి. విద్యార్థులం దరికీ చెరువు పునర్నిర్మాణం అన్నది సిలబస్‌లోని పాఠ్యాంశం చేయాలి. తెలంగాణలోని విద్యాలయా లు చెరువుల పునర్నిర్మాణంలో సంపూర్ణంగా భాగ స్వామ్యం అయితే మరిన్ని మంచి ఫలితాలు వస్తా యి. చెరువుకు సంబంధించిన చరిత్రనంతా విద్యా ర్థులకు ఉపాధ్యాయ లోకం బోధించి ప్రేరకులుగా నిలవాలి. విద్యార్థుల ఒంటికి మట్టి రాసుకోకపోతే నవ నిర్మాణం జరగదు. అందుకే తొలి మెట్టుగా చెరువుల నిర్మాణంలో యువత పాల్గొనాలి.

తెలంగాణలో ఉన్న ప్రతి విద్యాసంస్థ తమకున్న స్థోమ తను బట్టి ఈ పునర్నిర్మాణంలో పాలు పంచుకుం టామని ప్రమాణం చేయటంతో పాటుగా, చెరువు లను దత్తత తీసుకునేందుకు ముందుకురావాలి. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందు కు వస్తే చాలా చెరువులకు పునర్జన్మను కలిగించి నట్లవుతుంది. ప్రభుత్వం తన పని తాను చేసుకు పోతుంది. ప్రజల భాగస్వామ్యం ఉంటే దానికి తిరుగుండదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తట్టమోసి, మట్టి ఎత్తి ఈ పనికి శ్రీకారం చుట్టేందు కు సిద్ధమవుతున్నారు.
 
చెరువుల పునర్నిర్మాణంలో ప్రజా ప్రతినిధులే స్వచ్ఛందంగా పాల్గొంటే ప్రజలు తప్పకుండా వాళ్ల కు అండగా నిలుస్తారు. ఒకపూట తట్టమోసి రావ టం కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ఆ పని పూర్తయ్యే వరకు అందులో పూర్తిగా భాగస్వాము లు కావాలి. చెరువు పునర్నిర్మాణం జరిగి చెరువు నిండా నీళ్లు వస్తే ఎండిన ఊరు పచ్చగా మారుతుం ది. హరిత తెలంగాణకు చెరువే పునాది. గ్రామ స్వ రాజ్యం విలసిల్లాలంటే చెరువే పునాది. మన చెరు వుల్ని సచ్చుపడేటట్లు చేశాకే ఊరికి జవ సత్వాలు పోయాయి. తెలంగాణ గ్రామీణ జీవనం మళ్లీ కళకళలాడాలంటే చెరువు సజీవంగా నిలబడాలి.
 
చెరువు ఒక సామాజిక జీవన విధానం. ఆ సామాజిక జీవన విధానం దెబ్బతిన్న తర్వాతనే గ్రామాలు కథ తప్పాయి. చెరువు నిండా నీళ్లు ఉన్న ప్పుడు ఊరు ఆర్థికంగా శక్తివంతంగా ఉండేది. మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా జీవనా ధానం చెరువు నిలబడింది. చెరువు వర్షాకాలం పంటలకు నీళ్లనందించి, భూముల్లో జలాలను సంరక్షించేది. చెరువుల ద్వారా పంటలు మాత్రమే గాక ఊరిని హరిత వనంగా మార్చేది. చెరువుల్లో తీరొక్క చేపలతో జలసంపదగా తులతూగేది. ఎ న్నో పక్షులకు నివాస కేంద్రమిది. ఎండాకాలం ఎండిపోయిన తర్వాత కూడా చెరువు మట్టిగా తిరి గి పొలానికి ఉపయోగపడేది. మళ్లీ వర్షాకాలంలో సంపూర్ణంగా నీళ్లతో నిండి గ్రామ నిర్వహణ దారుడుగా నిలబడేది.
 
అలాంటి చెరువులు, ఊర్లను కలిపే గొలుసు కట్టు చెరువులు పూడిపోయాక దానిపై ఆధారపడ్డ వ్యవసాయరంగం తీవ్రంగా దెబ్బతిని ఊరు కళ తప్పింది. కాకతీయుల కాలం నాటి 13వ శతాబ్దపు చెరువులను పునరుద్ధరించే పనికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టటాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమం చెరువుల పునర్నిర్మాణం. అమ్మలాంటి చెరువును కాపాడు కోవటం ప్రతిపౌరుని విధి. ఇప్పుడు మన చెరువుల్ని తిరిగి గంగాళాలుగా మార్చుకుందాం. ప్రతి పౌరుణ్ణి, పౌరురాలిని ఇందులో భాగస్వామి ని చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన, విద్యార్థి సంఘాలు, ప్రచార ప్రసార సాధనాలు నడుం బిగించాలి. ‘‘మన ఊరు - మన చెరువు’’ అన్నది కేవలం ప్రభుత్వ నినాదం కాదు, ఇది మనందరి తల్లి రుణం తీర్చుకునే కర్తవ్యంగా మారాలి.

(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement